ప్రమద

తోరుదత్

సి.వి.సురేష్ 

“For women, poetry is not a luxury. It is a vital necessity of our existence. It forms the quality of the light within which we predicate our hopes and dreams toward survival and change, first made into language, then into idea, then into more tangible action.” -Audre Lorde
..
“మహిళలకు కవిత్వం విలాసం కాదు. అది మన మనుగడకు కీలకమైన అవసరం. అది ఒక విశిష్ట మైన కాంతి ని ప్రసరింప చేస్తుంది. ఆ కాంతి లో మనం మన మన నమ్మకాలను, మన కలలను బహిర్గతం చేస్తూ, మన మనుగడ, మార్పు ను చూడవచ్చు. మొదట భాష లోకి, తర్వాత ఆలోచన లలోకి , అటు తర్వాత ఒక పరిగణించే చర్యలోకి మనల్నిమారుస్తుంది.”
-‘ఆడరే లోర్డే’, అమెరికారచయత్రి !!!
 
***
భారత దేశం లోని చాల పాఠశాలల్లో సిలబస్ గా ఉన్న ఈ OUR CASUARINA TREE కవిత బెంగాల్ కు చెందిన ఒక అద్బుత మహిళా రచయత్రి తారులత దత్ @ తోరు దత్  రాసారు.
1856లో కలకత్తా లో పుట్టిన తోరుదత్ కేవలం ఇరవై సంవత్సరాల ఆరు నెలలు మాత్రమే బ్రతికారు.  కొలోనియల్ పరిపాలన లో,  ఆంగ్ల పండితులు… ఏ ఒక్క రచయతనూ ముఖ్యంగా మహిళా రచయత్రులను లెక్క చేయని  పరిస్థితుల్లో ఇంగ్లీష్, ఫ్రెంచ్ లల్లో కవితలు రాసి, అంతర్జాతీయ ఖ్యాతి ని గడించిన తోరు దత్  జీవిత విశేషాలు మహిళా రచయత్రులకు  స్ఫూర్తి దాయకం. ఆంగ్లం లో ప్రోస్ అండ్ పోయెట్రీ రాసిన మైకేల్ మధుసూధన దత్త తర్వాత, అంత కంటే అద్వితీయ స్థాయిలో ఫ్రెంచ్, మరియు ఆంగ్ల భాషల్లో తోరు దత్ తన రచనలను అందించింది. 
 
తన తండ్రి  గోవింద్ చందర్ దత్ ప్రభుత్వ ఉద్యోగి. అతడు కూడా అనేక కవితల్ని రాసారు.  తల్లి  ‘క్షేత్ర మోని మిట్టర్’ హిందూ పురాణాలను ఇంగ్లీష్ లోకి అనువదించారు.  ఈమె THE BLOOD OF CHRIST  అనే పుస్తకాన్ని బెంగాలీబాష లోకి అనువదించారు. చిన్న తనం నుండే తోరు దత్ కు సాహిత్యం తన చుట్టూ కనిపించింది. వారి కుటుంబం లో తోరు దత్ పెద్ద అన్న కిషెన్ మరణం తర్వాత,  వారి కుటుంబం క్రిష్టియానిటి లోకి మారినారు. తన తండ్రి తీవ్రంగా కలత చెందటం తో, ‘తోరు దత్’ , ఆమె చెల్లి  ‘అరు దత్’ లు తండ్రి దగ్గరే ఉంటూ, ఆయను ను ఆ వేదన నుంచి దూరం ఉంచారు.  
 
బ్రిటన్ లో మహిళా అక్షరాస్యత పై ఆంక్షలు ఉండటం తో, 1869 లో వీరి కుటుంబం ఫ్రాన్స్ కు చేరుకోవడం, అక్కడ వీరి తండ్రి మంచి చదువు ను ఇచ్చేందుకు చాల ప్రయత్నాలు చేసారు. ఫ్రెంచ్ భాష లో మంచి పట్టును సాధించారు. వీరికి, బ్రోంటే సిస్టర్స్, విక్టర్ హ్యూగో లు సాహిత్య పరిచయమయ్యారు. తర్వాత కొద్ది కాలానికి, వారి కుటుంబం బ్రిటన్ కు చేరి, అక్కడ కేంబ్రిడ్జి లో తమ చదువు ను కొనసాగించారు. 1873 లో వీరి కుటుంబం తిరిగి బెంగాల్ కు చేరుకొంది. అప్పటికే, బెంగాలీ, ఫ్రెంచ్, ఆంగ్ల భాషల్లో అప్పటికే దిట్ట అయిన తోరు దత్ సంస్కృత పరిజ్ఞానం కోసం చదవడం మొదలు పెట్టారు. 
 
18 ఏళ్ల వయసులోనే, మొదటి సారిగా, బెంగాల్ మగజైన్ లో  ఫ్రెంచ్ కవి, LECONTE DE LISLE పైన ఒక వ్యాసం , వెంటనే, josephin soulary అనే కవి పైన ఇంకో వ్యాసం ప్రచురిత మయ్యాయి. తన చెల్లెలు స్వయంగా ఆర్టిస్ట్ కావడం తో, తోరు దత్ తన మొదటి పుస్తకం The diary of  Mlle, D’Arvers ( mlle,D’arvers యొక్క శృంగారం ) కు అరుదత్ తన ఆర్ట్ ను అందించింది.  ఆ పుస్తకం 1881 వరకు పెద్దగ వేలుగు లోకి రాలేదు.  1874 లో తన చెల్లెలు అరుదత్ మరణించడం తో,   ఆమె ఈ కవిత ను రాసారు.  ఈ కవిత ఆమె సంతోష కరమైన బాల్య జ్ఞాపకాలు. 
 
కలకత్త కు చెందిన సప్తహిక్ సంబద్ ప్రెస్ వారు ఈమె A Sheaf Gleaned in French Fields సంకలనపు  మొదటి ప్రచురణ చేసారు. ఇందులో,  ఫ్రెంచ్ కవితల్ని అనువాదం చేసారు. చాలా నాసి రకపు పేపర్ వాడటం కారణంగా ఆ పుస్తకం నిలువ లేక పోయింది క్వాలిటీ లో… కానీ, ఈ రచన ఒక భారత దేశ మహిళ రచయత్రి చేసిందంటే, నమ్మే వారు కారు. ఆ రచన ఒక ఆంగ్లో-ఇండియన్ రాసినట్లు ప్రచారం చేసుకొంది. తన ఖ్యాతి ని పలువురి వద్దకు చేరుతుందనే ఉద్దేశ్యం తో…
అదృష్టం కొద్ది, ఆ పుస్తకం పై  M. Andre Theuriet అనే అద్బుత కవి సమీక్ష చేసారు.  అప్పుడు ఆ పుస్తకం  examiner అనే జర్నల్ కు ఎడిటర్ w.minto చేతిలో పడటం ఆమె కీర్తి ఒక్కసారిగా విశ్వ వ్యాప్త మయింది. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న తోరు దత్ తర్వాత తీవ్రంగా జబ్బు పడింది. మరణానికి దగ్గరయ్యానని ఆమె భావించడం మొదలు పెట్టింది. ప్రాచీన భారత దేశపు మహిళల పై ఫ్రెంచ్ రచయత clarisse barder రాసిన పుస్తకాన్ని అనువదించేందుకు ప్రయత్నించారు. కానీ, తాను ఇక ఎక్కువగా రాయలేనని తెలుసుకొంది. కానీ,ఆమె ఆ రచయత కు చివరి ఉత్తరం కూడా రాసింది. 1877 లో ఆమె మరణించారు. ఆమె మరననతరం ఆమె ఖ్యాతి అద్బుతంగా విస్తరిస్తూ వచ్చింది. కలకత్తా లో , ఆమెను సమాధి చేసిన ప్రదేశం పేరు ఇప్పుడు సౌత్ పార్క్ స్ట్రీట్ సెమెట్రీ గా పిలుస్తారు. 
   
A Sheaf Gleaned in French Fields  పుస్తకం నాలుగైదు సార్లు ప్రచురణ కు నోచుకుంది. 20 వ శతాబ్దం లో హరిహర దాస్ అనే రచయత ఈమె గురించి వివరాలు, ఆమె ప్రచురణలు, ఆమె కవిత్వం సాహిత్యం సేకరిస్తూ వచ్చారు. ఈ క్రమం లో తోరు దత్ స్నేహితురాలు మేరీ మార్టిన్ ద్వారా,  తోరు దత్  తండ్రి లైబ్రరీ లో సేకరించారు. ఆమె రాసిన Buttoo అనే కవిత ను మొదటి సారిగా పరిక్షల పుస్తకం లో ఉండటం తో హరిహర దాస్ ఆ కవిత ను చూసారు. ఆయన మంత ముగ్ధుడై, ఆమె గురించిన వివరాలు సేకరించేందుకు మొదలు పెట్టాడు. 
భారతీయ సాహిత్య చరిత్ర లో చిరస్మరణీయ స్థానం  “తోరు దత్ ” ది. 
 
 
అద్బుత మైన రచయత్రి  తోరు దత్ ఇవాల్టి మన  అతిధి
 
TORA DUTT ||  OUR CASUARINA  TREE ||
 
అనుసృజన : ||  మా సరుగుడు చెట్టు  ||
..
పెద్ద కొండచిలువ లాగ  
చుట్టలు చుట్టలు తిరుగుతూ 
రెండుగా చీలి, లోతైన మచ్చలతో 
కరుకు మొద్దు ఒకటి
నక్షత్రాలకు దగ్గరగా,  ఎత్తైన స్థానం లో ఉంది..
 
దాని నీడలో ఒక్క చెట్టు కూడా బ్రతకని  ప్రదేశం లో…
ఒక సన్నటి తీగ (క్రీపర్)
హీరో లాగా, తల రుమాలు చుట్టి, 
కాషాయిరంగు పూలు గుత్తులు గుత్తులు గా చెట్టంతా వ్యాపించి 
పైకి ఎగబ్రాకింది.
 
దానిపైన ఆ రోజంతా పక్షీ, తేనేటీగెలు కలిసాయి.
మగవాళ్ళంత బాగా విశ్రాంతిలో ఉండగా, 
రాత్రుళ్ళు తరచూ, మా చెట్టు నుండి 
నిరంత చీకటి ఆలాపనలతో 
 ఆ తోట అంతా పొంగి పోర్లేది.
..
ప్రభాతాన్నే
నా పొడవాటి కిటికి ఎప్పుడైతే బార్లా తెరుచుకుందో…అప్పుడు
నా కళ్ళు పరవశం తో విశ్రాంతి తీసుకొన్నాయి.
 
కొన్ని రోజులు, 
ముఖ్యంగా చలి కాలం లో…
దానిపైన ఒక ఊదారంగు బబూన్ కోతి 
ఒంటరి శిల్పంలా కూచొని 
సూర్యోదయాన్ని గమనిస్తూంటే 
ఆ చెట్టు కింద కొమ్మల్లో తన బక్కటి బిడ్డ కోతి 
గెంతుతూ ఆడుకొంటుంటుంది..
 
అక్కడక్కడా కోకిలలు 
వాటి గొంతుతో  పాటల జల్లులు కురుపిస్తూంటాయి
 
ఇంకా, 
నిద్రించే ఆవులకు పచ్చిక బయళ్ళు
చిన్నగా మార్గాన్ని చూపుతాయి.
ఇంకా, 
ఆ నీడల్లో, 
ఆ విశాల మైన టాంక్ పైన 
హోర్ చెట్టు తన తారాగణంతో అందంగా, విశాలంగా కనిపిస్తుంది.
 
కలువ పూలన్నీ..
ఒక్కసారిగా మంచులా దుముకుతాయి.
దాని విశాల మనస్తత్వానికి కాదు కానీ,
ఆ సరుగుడు చెట్లు నా మనసుకు అతి ప్రియమైనవి.
దాని కింద మేమంతా ఆడుకొన్నాము. 
సంవత్సరాలు దాటి పోతున్నా…
నా ప్రియ నేస్తాల్లారా! మిమ్మల్ని ప్రాణాతిప్రాణంగా ప్రేమిస్తాను. 
 
నీ కోసం చెప్తున్నా!  
చెట్టెక్కడైనా ప్రియమైనది అవుతుందా?
నీ దృశ్యాలతో కలిపేస్తే , 
ఆ వేడి కన్నీళ్ళు  నన్ను అంధుడిని వేసే వరకు….
అది జ్ఞాపకాల్లో అలా పైపైకి లేస్తాయి.
నేను వింటున్న ఆ మృత్యు గీతాన్ని పోలిన చిన్నటి శబ్దం   
ఏమిటి?
పల్చటి తీరం పైన విరిగిన సముద్రమా? అది?
అది ఆ చెట్టు యొక్క విషాదం 
ఆ భయం పుట్టించే ప్రసంగం తో
ఒకవేళ ఒక అపరిచిత ప్రదేశానికి చేరుకోవచ్చు. 
..
తెలియక పోయినప్పటికీ..
అది నా నమ్మకపు చూపుకు బాగా తెలుసు.
ఆశ్రయం పొంది సముద్రం లో చొచ్చుకు పోయిన తీరాల ద్వారా..  
హ!. ఆ ఏడుపు నేను  చాల చాల దూరా ప్రాంతం నుండి విన్నాను.
 
అతడి గుహ లో అతడు విశ్రాంతి లో ఉండగా,
ఆ నీళ్ళు  చిన్నగా కనిపిస్థాయి.
ఇంకా, ఆ అలలు చాల సున్నితంగా  సుందర తీరాన్ని ముద్దాడతాయి.
చంద్రుడి కింద,…
అది ఫ్రాన్స్ కానీ, ఇటలీ కానీ, 
ఎలాంటి కలలు లేకుండా, భూమంతా…స్పృహ లేకుండా సొమ్మసిల్లిన ప్రతి సారీ,  
నా అంతః దృష్టి అద్బుత మైన స్థితి లోకి పూర్తిగా మార్పు చెందక ముందే… 
సంగీతం ఉబికి వస్తుంది.
..
నేను బాగా ప్రేమించే నా చల్లటి వాతావరణమున్న ప్రాంతం లో…
ఓ వృక్షమా! నా అత్యున్నత సంతోష సమయాల్లో
 నీ రూపాన్ని నేను చూసాను. 
..
అందువల్ల 
నీ గౌరవం ఉండే ప్రాంతం లో. 
నా ఇష్టం ఒక పవిత్రతను పరచింది.
చెట్టు అందరికి  ప్రేమ పాత్రమైనది.
 
అవును,.వాళ్ళ విశ్రాంతి సమయాల్లో…
నిద్ర ఒక వరం గా పరిణమించింది. 
అవన్నీ నాకు నా జీవితం కంటే ముఖ్యమైనవి.
అయ్యో! అవీ అలాగే ఉన్నాయా?
గడిచే నా రోజుల్ని నీవు లెక్క పెడుతూ ఉండొచ్చు.
బారో డేల్ ప్రదేశం లో ఉన్నవృక్షాలను పోలిన 
ఆ అమర వృక్షాలతో…
వాటి అద్బుత  కొమ్మల క్రింద,  
“భయమూ, 
వణికే నమ్మకము. 
మరణమూ 
ఆ అస్తిపంజరమూ, 
ఆ కాలపు నీడలూ…”
బాగా పాలిపోయి పయనిస్తాయి..
ఆ పాట బలహీనంగా ఉన్నప్పటికీ…
దాన్ని నీవు చాల అందంగా ఇష్టపదతావు.
 
ఓహ్. మరోమారు నీవు దాన్ని పొందాలను కొంటావు.
నీవు పూర్తిగా మరిచిపోయే శాపంనుండి (oblivion curse) 
ప్రేమ నిను రక్షించు కోవచ్చు.
..
..
ఒరిజినల్ పోయెమ్ : 
TARA DUTT || OUR CASUARINA TREE ||
 
LIKE a huge Python, winding round and round 
The rugged trunk, indented deep with scars, 
Up to its very summit near the stars, 
A creeper climbs, in whose embraces bound 
No other tree could live. But gallantly 
The giant wears the scarf, and flowers are hung 
In crimson clusters all the boughs among, 
Whereon all day are gathered bird and bee; 
And oft at nights the garden overflows 
With one sweet song that seems to have no close, 
Sung darkling from our tree, while men repose. 
 
When first my casement is wide open thrown 
At dawn, my eyes delighted on it rest; 
Sometimes, and most in winter,—on its crest 
A gray baboon sits statue-like alone 
Watching the sunrise; while on lower boughs 
His puny offspring leap about and play; 
And far and near kokilas hail the day; 
And to their pastures wend our sleepy cows; 
And in the shadow, on the broad tank cast 
By that hoar tree, so beautiful and vast, 
The water-lilies spring, like snow enmassed. 
 
But not because of its magnificence 
Dear is the Casuarina to my soul: 
Beneath it we have played; though years may roll, 
O sweet companions, loved with love intense, 
For your sakes, shall the tree be ever dear. 
Blent with your images, it shall arise 
In memory, till the hot tears blind mine eyes! 
What is that dirge-like murmur that I hear 
Like the sea breaking on a shingle-beach? 
It is the tree’s lament, an eerie speech, 
That haply to the unknown land may reach. 
 
Unknown, yet well-known to the eye of faith! 
Ah, I have heard that wail far, far away 
In distant lands, by many a sheltered bay, 
When slumbered in his cave the water-wraith 
And the waves gently kissed the classic shore 
Of France or Italy, beneath the moon, 
When earth lay trancèd in a dreamless swoon: 
And every time the music rose,—before 
Mine inner vision rose a form sublime, 
Thy form, O Tree, as in my happy prime 
I saw thee, in my own loved native clime. 
 
Therefore I fain would consecrate a lay 
Unto thy honor, Tree, beloved of those 
Who now in blessed sleep for aye repose,— 
Dearer than life to me, alas, were they! 
Mayst thou be numbered when my days are done 
With deathless trees—like those in Borrowdale, 
Under whose awful branches lingered pale 
“Fear, trembling Hope, and Death, the skeleton, 
And Time the shadow;” and though weak the verse 
That would thy beauty fain, oh, fain rehearse, 
 thee from Oblivion’s curse. 
Toru Dutt
 
 
 

*****

Please follow and like us:

3 thoughts on “ప్రమద – తోరుదత్  ”

  1. ఒక అద్భుత స్త్రీని, కవిని, చారిత్రక వ్యక్తిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

  2. 👌👌👌,ప్రేమనిన్ను, రక్షించు కోవచ్చు.Cv సర్..అభివందనంలు!.

  3. చాలా మంచి కవితని తీసుకున్నారు. ఈమెని తెలుగు పాఠకులకి పరిచయం చెయ్యాలనుకోవడమే గొప్ప ఆలోచన. ఈ కవితని ఇంకా మన పాఠకులల్లోకి తిసుకెళ్లాలి. అభినందనలు సురేష్ గారూ

Leave a Reply

Your email address will not be published.