“నెచ్చెలి మాట

 “అభినందన మందారమాల”

-డా|| కె.గీత 

“నెచ్చెలి” మొదటి వారంలోనే దాదాపు మూడువేల వ్యూలతో అత్యంత ఆదరణ పొందింది. 

విలక్షణమైన రచనలతో పఠనాసక్తి కలిగిస్తోందని మెసేజీలు, ఉత్తరాలతో అభినందనలు, శుభాకాంక్షలు అందజేసి ఆశీర్వదించిన పాఠకులైన మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. 

ప్రతినెలా 10 వ తారీఖున తప్పనిసరిగా మీముందుకు వచ్చే “నెచ్చెలి” వనితా మాస పత్రికలో ఆసక్తిదాయకమైన ధారావాహికలు, కాలమ్స్ తో బాటూ కథలు, కవిత్వమూ, ఇంకా అనేకానేక శీర్షికలూ మీ సాహిత్యపూదోటలో ఎప్పటికీ దాచుకునే అపురూప కుసుమాలై  ప్రత్యక్షమవుతాయి.  

నెచ్చెలిలో  లబ్దప్రతిష్టులతో బాటూ  చక్కని అభివ్యక్తి కలిగిన కొత్త వారికీ స్థానం కల్పిస్తున్నాం. ఇందులో భాగంగా ఈ నెల నుండీ వసుధారాణి రాస్తున్న “ఇట్లు మీ వసుధారాణి” కాలమ్ ప్రారంభం అవుతూంది.   

“నెచ్చెలి” ఇంగ్లీషు లోనూ  పేరున్న వారితో బాటూ, యువరచయిత(త్రు)లు  రాస్తున్న చక్కని కాలమ్స్, కథలు, కవితలూ ఉన్నాయి. 

నెచ్చెలిని అద్భుతంగా ఆదరిస్తున్న సాహిత్య ప్రేమికులైన మీ అందరికీ  నెచ్చెలి అందిస్తూన్న రచనాభినందనమందారమాల ఇది-

కాలమ్స్

చంద్ర లత – ఉనికి పాట – మనిషికి ప్రకృతికీ మధ్యన నిరంతరం సాగే అనివార్య ఉనికిపాట్ల ఆకళింపు 

సి.రమణ -రమణీయం- అందాల జీవితంలోరమణీయాంశాల పరిచయం 

డా|| గోగు శ్యామల – పునాది రాళ్ళు – తెలంగాణా దళిత స్త్రీల చరిత్రలు  

షర్మిల కోనేరు -షర్మిలాం”తరంగం” – అంతరంగాన్వేషణ 

జగద్ధాత్రి -ప్రమద – నెలానెలా ప్రపంచవ్యాప్త సాహితీమణుల  పరిచయం

గణేశ్వరరావు-చిత్రం – ఫోటో కథలు

వసుధారాణి- “ఇట్లు మీ వసుధారాణి”- నెచ్చెలితో ప్రత్యేకంగా రాణమ్మ కబుర్లు 

డి.కామేశ్వరి -జ్ఞాపకాల సందడి- సరదా జ్ఞాపకాల గల్పికలు 

ధారావాహికలు 

జ్యోతిర్మయి మళ్ల -గజల్ జ్యోతి – నెలానెలా ఒక సచిత్ర గజల్ 

నాగరాజు రామస్వామి -క’వన’ కోకిలలు- నెలానెలా ప్రపంచవ్యాప్త కవితామణుల  పరిచయం

ఆర్టిస్ట్ అన్వర్ -చిత్రలిపి- బొమ్మల కథలు

ఎన్. వేణుగోపాల్ (అనువాదం)- మా కథ (దొమితిలా చుంగారా ఆత్మకథ)

జగద్ధాత్రి – కథా మధురం – నెలనెలా ఒక మంచి తెలుగు కథ – పరిచయం

ఆర్. శాంతసుందరి – అనుసృజన – అనువాద సాహిత్యశీర్షిక

కె.వరలక్ష్మి – జీవనయానం (రెండవ భాగం) – ఆత్మకథ 

విమర్శ

కాత్యాయనీ విద్మహే – నారి సారించిన నవల- తెలుగులో స్త్రీల నవలల సమగ్ర పరిశీలన

వ్యాసాలు

డా||కె.గీత -కంప్యూటర్ భాషగా తెలుగు (నెలనెలా తెలుగు భాష ని కంప్యూటరీకరించడం వెనుక దాగున్న ఆసక్తికర అంశాల పరిచయం) 

ఆడియో& వీడియో

కిరణ్ ప్రభ -నారీ”మణులు”- ప్రసిద్ధ స్త్రీలపై టాక్ షో

డా||కె.గీత -వెనుతిరగని వెన్నెల (ఆడియో నవల) 

ట్రావెలాగ్స్

డా||కె.గీత -యాత్రాగీతం- ప్రపంచ వ్యాప్త యాత్రా కథనాలు

బాల నెచ్చెలి

అనసూయ కన్నెగంటి -చిన్నారులకు ప్రత్యేకంగా ”తాయిలం”కథలు

Neccheli-English

Varudhini- Diary of a New Age Girl (An Indo American High School girl’s experiences (K.Geeta’s Daughter & The third generation Author) 

Sahithi- Behind The Scenes Of “Time” Machines (Stories of an enthusiastic Photographer’s eye) 

Swatee Sripada- A Translated Story and  A Poem every month 

Jagadhatri- America Through My Eyes -Naa Kallatho America Translated Travelogs of DrK.Geeta

Dr Geeta Madhavi Kala- Monthly Essays- Telugu As A Computational Language (Interesting aspects behind the computerization of Telugu)

And many more specials- 

ఇంకా అనేక కథలు, కవితలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు, ప్రత్యేక కథనాలు నెల నెలా మీకోసం- 

మీ అభిప్రాయాలు  అందజేసి వీరందరినీ ఆశీర్వదించడం మరిచిపోకండేం! 

p.s: “నెచ్చెలి” కి పురుషులు కూడా నిరభ్యంతరంగా రాయవచ్చు. (వివరాలకు “రచనలు- సూచనలు” పేజీ చూడండి)

*****

Please follow and like us:

4 thoughts on “సంపాదకీయం-ఆగస్టు,2019”

  1. మహిళా లోకానికి సరికొత్త నెచ్చెలి మీ నెచ్చెలి అంతర్జాల మాసపత్రిక.వినోద,విజ్ఞానదాయకంగా ఉంది డాక్టర్ గీతగారు .అభినందనలు.

Leave a Reply

Your email address will not be published.