జవాబు

-రజిత కొండసాని

ఓ ఉషోదయాన ఎందుకో

సందేహం వచ్చి

భయం భయంగా లోలోపల ముడుచుక్కూర్చున్న 

గుండెను తట్టి అడిగా!

ప్రపంచాన్ని చూసే కన్నుల్లానో

ప్రాణ వాయువుల్ని పీల్చే ముక్కులానో

సప్త స్వరాల్ని దేహంలోకి ఒంపే చెవిలానో

సప్త స్వరాల్ని దేహంలోకి ఒంపే చెవిలానో

సిగ్గుతో ఎర్రబారే చెంపలానో

సాటి వారి మీద ప్రేమ ప్రకటించే నోరులాగనో

దేహం మీద

బాహాటంగా కనిపించక

ఎముకల గూడు మధ్య

ఏ మూలనో

చిమ్మ చీకట్లో

దాక్కున్నావెందుకని ?

నేనీ చీకటి కొట్టులో ఉంటేనే నాకు రక్ష

నేను బైటికి వేలాడితే 

నేనో నెత్తుటి ముద్దనౌతాను

చిరునవ్వే పెదాలు దాటుకుని దంతాలు చీరెయొచ్చు

దేహంలో అతి మెత్తని సున్నితమైన మాంసఖండం నేనే కదా

ఇక్కడి నుండి ప్రేమ ఆపేక్ష పుడతాయన్న విషయం తెలిసిన మనిషి కళ్ళల్లో కత్తులు పూయొచ్చు

ఈ చీకటి కొట్టే నాకు రక్షాస్థలం అని జవాబిచ్చింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.