వెనుతిరగని వెన్నెల(భాగం-24)

-డా|| కె.గీత 

(ఆడియో ఇక్కడ వినండి)

వెనుతిరగని వెన్నెల(భాగం-24)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు  పెద్దవాళ్ల అనుమతితో పెళ్లి జరుగుతుంది. విశాఖపట్నం లో కొత్త కాపురం ప్రారంభిస్తారు. పెళ్లయిన సంవత్సరం లోనే అబ్బాయి పుడతాడు. తన్మయి యూనివర్శిటీ లో ఎమ్మే చదువుతూ ఉంటుంది.

***

తెల్లారగట్ల రైలుకి నెల్లూరు వచ్చేరు జ్యోతి, భాను మూర్తి.

మీ ఆయనకి ఇంతకంటే మంచి ఇల్లు దొరకలేదా?” వస్తూనే సణిగింది జ్యోతి.

తన్మయికి అక్కడి ఇల్లు అప్రస్తుతమన్న విషయం భానుమూర్తి గమనించినట్లుఅమ్మాయిని, అల్లుడిని  తిరపతి తీసుకు వెళ్లడానికి వచ్చేం కానీ, ఇక్కడ ఉండిపోవడానికి కాదుగాఅన్నాడు.

మధ్యాహ్నం భోజనాలయ్యేక జ్యోతి మనవణ్ణి జోకొడుతూ నిద్రలోకి జారుకుంది.

తన్మయి కూచున్న మెట్ల దగ్గిరికి వచ్చిఏంటి తల్లీ! అలా దిగులుగా ఉన్నావు?” అన్నాడు భానుమూర్తి.

ఏం లేదు నాన్నాఅంది గద్గదంగా తన్మయి ఎటో చూస్తూ.

అలా బాధ పడ్తూ ఉండకు. అన్నీ అవే సర్దుకుంటాయి. మీ అమ్మతో నేను పడడంలే ఇన్ని సంవత్సరాల నించీ?! బాబుని చూడమ్మా, బంగారం లాంటి పిల్లోడు. నువ్వు హుషారుగా ఉంటేనే కదా, వీడు కూడా ఆరోగ్యంగా ఉంటాడు. అంతగా నీకు ఇక్కడ ఉండాలనిపించకపోతే మాతో వచ్చేయి. కొన్ని రోజులుండి మళ్లీ వద్దువు గాని.” అన్నాడు మరింత అనునయంగా.

అలాగే నాన్నా!” అంది తన్మయి.

అన్నదే కానీ, ఎటూ తేల్చుకోలేనితనం తన్మయిని  పిరికిపందని చేస్తూంది.

శేఖర్ ని కాదని వెళ్తే, జరిగే రాద్ధాంతం అంతా ఇంతా కాదు. అలాగని ఒప్పించడమూ గగనమే.

 ఏదో ఆకాశవాణి  తన్మయి మొర ఆలకించినట్లు, శేఖర్ బయటి నించి వస్తూనేసమయానికి బానే వచ్చేరు మావయ్యా! తిరపతికి నేను రావడం పడదు కానీ, మీ అమ్మాయిని తీసుకు వెళ్లండి. మా ఇంటికి పిఠాపురం నించి సాములోరు వస్తన్నారంట. అమ్మ బాబుని చూపించాలంటూ ఫోను చేసింది.” అన్నాడు.

ముందు అక్కణ్ణించి వెళ్లగలిగితే చాలన్నట్లు తన్మయి వెంటనే బట్టలు సర్దుకుంది.

ఇంటావిడ బెంగగాత్వరగా వచ్చేయి తన్మయీ! చంటాడు అలవాటు అయిపోయాడు కదా, వీణ్ని తల్చుకుంటే నాకు బెంగొచ్చుద్ది.” అంది వాడి బుగ్గలు పుణుకుతూ.

ధవళేశ్వరం మళ్లీ వెళ్లడం గురించి ఏం ఆలోచించడం లేదు తన్మయి.

తల్లిదండ్రుల తో తిరుపతి లో అడుగుపెట్టిందిఎత్తైన శిఖరాల్ని చేరడానికి వంపుల రహదారిలో బస్సు ప్రయాణం బాబుని బెంబేలెత్తించినట్లుంది. ఒకటే పేచీ మొదలు పెట్టేడు. తీరా పైకి చేరగానే ఎక్కడా నిలవకుండా ఎటుపడితే అటు తుర్రుమని పరుగులెట్టడం మొదలు పెట్టేడు.

తన్మయి తలారా స్నానం చేసి కాటేజీ బాల్కనీ లోకి వచ్చింది.

తిరుమలలో తెల్లారి అతి మధురంగా చెట్లకీ, పుట్లకీ వ్యాపిస్తూ  అన్నమయ్య కీర్తనలు వినవస్తున్నాయి.

నునువెచ్చని ఎండ సుతారంగా మేను సోకి హాయైన అనుభూతి కలిగింది.

అబ్బ, ఎంత బావుంది తిరుమలఅంది అప్రయత్నంగా పైకి.

చిన్నప్పుడెప్పుడో వచ్చిన జ్ఞాపకం. ఆలయం మాడ వీధులకవతలగా స్వెట్టర్లు అమ్మే నేపాలీ వాళ్లు, పెద్ద పెడ్డ నేతి లడ్డూలు జ్ఞాపకం తన్మయికి.

వయసులో ఇలా గొప్ప సంగీతం విన్న జ్ఞాపకం లేదెందుకో.

ఎందుకో అంతగా జనం లేరు. దర్శనం పూర్తయ్యాక, ఆలయానికెదురుగా ఉన్న వెయ్యి కాళ్ల మంటపం ముందు కూచున్నారు.

బాబు కిందికి దిగి అటూ ఇటూ అడుగులేస్తూంటే, భానుమూర్తి మనవడిని కనిపెట్టుకుని చూస్తున్నాడు.

తన్మయి తల్లి ఒళ్లో తల వాల్చింది.

తల్లి జుట్టు నిమరగానే తన్మయికి అత్యంత హాయిగా జీవితం ఇలాగే గడిస్తే బావుణ్ణనిపించింది.

ఏం మొక్కుకున్నావమ్మా?” అంది తల్లి వైపు చూస్తూ.

నీ కానుపు కష్టమైనప్పుడు  అనుకున్న మొక్కు ఇప్పటికి తీరింది.” అంది ప్రశాంతంగా నిట్టూరుస్తూ జ్యోతి.

పరుగులెడ్తున్న చంటాడి వైపు చూస్తూ, “నీ చిన్నపుడు నువ్వూ అలాగే పరుగు తీసేదానివి. ఒకసారి తప్పిపోయావు కూడా. అప్పుడు అమ్మమ్మ, నేను, నాన్న గారు తలా వైపు పరుగు తీసేం. అప్పటికీ మాత్రం రద్దీ కూడా లేదు కాబట్టి, రెండు వీధులకవతల అదృష్టం కొద్దీ దొరికేవుఅంది.

నవ్వుతూ తల్లివైపు చూస్తున్న తన్మయి వైపు చూస్తూ, “ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండమ్మా, ఏవిటో దిక్కుమాలిన పెళ్లి ముహూర్తంలో చేసుకున్నావో గానీ నీ ముఖాన దిగులు తప్ప ఏవీ చూడడం లేదు.” అంది.

రాత్రి భోజనాలు చేసి మళ్లీ వచ్చి అక్కడే కూచున్నారు.

స్వామి వారి ఉయ్యాల సేవ జరుగుతూ ఉంది. అందంగా అలంకరించిన స్టేజీ మీద దీప తోరణాల మధ్య పూల ఉయ్యాలని నెమ్మదిగా ఊపుతూ ఉయ్యాల సేవ, పక్కనే మరో చిన్న స్టేజీ మీద అత్యంత శ్రావ్యంగాజో అచ్యుతానంద…” అంటూ ఆస్థాన గాయకుల గానం

అద్భుతమైన గానామృతం వల్లనో ఏమో అత్యంత ప్రశాంతంగా ఉన్న దృశ్యాన్ని చూస్తూ  ఉంటే అప్రయతంగా కళ్ళల్లోకి నీళ్లు వచ్చాయి తన్మయికి.

కళ్ళు మూసుకుని, “అజ్ఞాత మిత్రమా!   సృష్టిలో గొప్ప సంగీతం వల్ల జీవన సమస్యలు తీరగలిగితే ఎంత బావుణ్ణు! క్షణం లో అన్నీ మటుమాయమైపోయేవి కదా!!” లోపల్లోపల అనుకుంది.

అమ్మా, నాకు ఎమ్మే పూర్తి చెయ్యాలని ఉంది. రెండో సంవత్సరం కాలేజీ తెరిచేసేరు కూడా. ధవళేశ్వరం నాతో పాటూ వచ్చి, ఏదైనా చెప్పి నన్నూ, బాబునీ ఇంటికి తీసుకెళ్లు.” అంది తల్లితో ఏడుపు తన్నుకు వస్తున్న గొంతుతో తన్మయి.

ఇంత దానికి అలా కళ్ల నీళ్లెందుకమ్మా? వాళ్లు చెప్పిందల్లా చేస్తూనే ఉన్నాంగా. ఇంకా భయమెందుకు? నాన్నగారితో  చెప్పి మాట్లాడమని చెబుదాం.” అంది జ్యోతి అనునయంగా.

మర్నాడు సాయంత్రం ధవళేశ్వరంలో దిగినా, మర్నాటికేఅమ్మాయిని, బాబుని మాతో తీసుకెళ్లి, తర్వాత పంపిస్తాం వదినాఅంది జ్యోతి.

ఏదో అనబోతున్న దేవికి అడ్డం వచ్చి, “మాకూ పిల్లని, మనవణ్ని చూసుకోవాలని ఉంటుంది కదా! నేనొచ్చి తర్వాత దిగబెడతాలే చెల్లెమ్మా!” అన్నాడు భానుమూర్తి.

తన్మయి తలదించుకుని నేలలోకి చూస్తూ నిలబడింది.

సరే, మీ ఇష్టంపెడసరంగా అని దేవి లోపలికి వెళ్లిపోయింది.

అనడమే తరువాయి గబగబా సర్దుకుంది తన్మయి.

దారిలోనే తల్లితో హుషారుగా చెప్పింది.”అమ్మా, రేపే నేను విశాఖపట్నం బయలుదేరతాను. అక్కడ కాలేజీలో అన్ని క్లాసులూ మొదలయ్యిపోయి ఉంటాయి.” అంది తన్మయి.

వెళ్తూనే కాసిన్ని నోటు పుస్తకాలు, ఒక కొత్త పెన్ను కొనుక్కోవాలి.” హుషారుగా గలగలా మాట్లాడుతున్న తన్మయి వైపు సంతోషంగా చూసింది జ్యోతి.

***

మర్నాడు బస్సెక్కి సాయంత్రానికల్లా విశాఖపట్నానికి చేరింది తన్మయి.

తాళం తీస్తూనే దుమ్ము పట్టిన గదీ, వసారా తనని చూసి బెంగటిల్లినట్లనిపించింది.

బాబుని వదిలి వచ్చానన్న బెంగ తప్ప, తిరిగి విశాఖపట్నానికి  వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది తన్మయికి.

తలారా స్నానం చేసి, వాకిట్లో ముగ్గేసి, తీగెలకీ, మొక్కలకీ నీళ్లు పెట్టింది

తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా తనకోసమే ఎదురు చూస్తున్నట్లు అనిపించి ప్రతీ పువ్వునీ పలకరించింది.

ఆకులోఆకునైపువ్వులో పువ్వునైకొమ్మలో కొమ్మనై…” దేవుల పల్లి వారి గీతాన్ని లోపల్లోపల కూనిరాగం తీస్తూ 

మిత్రులారా! నేను తిరిగొచ్చేసేనుఅంది ఆకుల్ని తడుముతూ సంతోషంగా.

***

మర్నాడు కాంపస్ లోకి అడుగుపెట్టగానే ఎమ్మేలో  చేరిన మొదటి రోజు కంటే అత్యధికమైన ఆనందం కలిగింది.

మొదటి క్లాసు కాగానే అనంత వెనకే వచ్చి కళ్లు మూసింది.

మెడలో కొత్త పసుపుతాడుతో, ముఖంలో వెలుగుతున్న సంతోషంతో ఉన్న అనంతని చూడగానే  ఆశ్చర్యపోయింది తన్మయి.

సెలవులకు ముందు పెళ్లి కుదుర్చుకుంటున్నట్లు కదా చెప్పింది?” ప్రశ్నార్థకంగా చూసింది అనంత వైపు.

అలా చూడకు తన్మయీ! ఎంగేజ్ మెంట్ కాస్తా పది రోజుల్లో పెళ్ళిగా మారింది. మన వాళ్లెవరికీ చెప్పే సమయం కూడా లేదు. రాజు వాళ్ల నాయనమ్మ చావుబతుకుల్లో ఉండి, మనవడి పెళ్ళి చూడాలని పట్టుబట్టడంతో మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోక తప్పింది కాదు.” అంది.

మరి చదువులు పూర్తవకుండా, ఉద్యోగాల్లేకుండా …..” అంది తన్మయి.

ప్రస్తుతానికి నేను రాజు హాస్టల్లోనే ఉంటున్నాను. నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా?’ అంది పైకి చూస్తూ , చిన్నగా నవ్వుతూ అనంత.

బోయ్స్ హాస్టల్లో నిన్నెలా..?”

అవన్నీ అడక్కు. గళ్స్ హాస్టల్లో ఉన్నట్లు ఉండదు బాయ్స్ హాస్టలు. ఎప్పుడైనా ఎవరైనా వొచ్చి పోవచ్చు. నేను ఏకంగా ఉండిపోతున్నా. అదే తేడా. వాళ్ల రూమ్మేట్లకి లేని ఇబ్బంది నాకెందుకు?..మా సంగతి సరే, నువ్వేవిటి? కాలేజీ తెరిచి నెల్లాళ్లయినా ఎక్కడికి మాయమైపోయేవు? అమ్మగారిల్లు వొదిలి రావాలనిపించలేదా?” అంది అనంత.

తన్మయి ఏదో అనేలోగా రాజు ఎప్పటిలానే సిగ్గుగా వచ్చి అనంత పక్కన నిలబడి, తన్మయి వైపు చూసి చిన్న పలకరింపు నవ్వు నవ్వేడు.

కంగ్రాట్స్అంది తన్మయి ఇద్దర్నీ ఆత్మీయంగా చూస్తూ.

దివాకర్ వెనకే వచ్చి, ….ఏవిటి ఇక్కడ దుకాణం పెట్టేరు, అక్కడ క్లాసు అవుతూంటే?” అన్నాడు.

తన్మయి వైపు తిరిగిఓహోమొదటి ము..మూడు రార్యాంకుల వాళ్ల మీటింగా ఇది?” అంటూ అక్కడి నించి వెళ్ళబోతున్నట్లు నటించేడు.

మా ముగ్గురికీ మొదటి మూడు ర్యాంకులు వస్తే, మరి కరుణకో?” ఆలోచనలో పడింది తన్మయి.  

అయినా మొదటి ర్యాంకు కరుణకి, తర్వాతి ర్యాంకులు రాజు, అనంతలకు వస్తాయని అనుకుంది కానీ అసలు రెండవ ర్యాంకు తనకు ఊహించనే లేదు తన్మయి.

తన్మయి కళ్లు వెనక ఎవరి కోసమో వెతుకున్నట్లుండడం గమనించి, “..కరుణ కోసమేనా చూస్తున్నారు?” అన్నాడు దివాకర్.

తన్మయి సమాధానంగా ఇంకా అటే చూస్తుండగానానాలుగవ ర్యాంకు వచ్చిందని బాధకో, మరేమో గానీ కాలేజీ తెరించిందగ్గర్నించీ  మా ఎవ్వరితో సరిగా మాట్లాడడమే లేదు ..కరుణ. పైగా ఇప్పుడు ..సెకండ్ ఇయర్ లో మ్ ..మనం ..ఆప్షనల్ క్లాసులు తీసుకుంటున్నాం కదా. ఎవరి క్లాసు వాళ్లదే అయిపోయింది. కరుణ పూర్తిగా కఠినమైన క్లాసులు తీసుకున్నాడు. ఇంతకీ మిమీరేం క్లాసులు ఎంచుకున్నారు?” అన్నాడు.

ఏం క్లాసులు తీసుకోవాలో మీరే చెప్పాలి నాకు. నేనా విషయం ఇప్పటివరకు ఆలోచించనేలేదు.” అంది సాలోచనగా తన్మయి.

మేమిద్దరం  తీసుకున్నవే తీసుకో తన్మయీ, నువ్వు క్లాసులకు రాలేకపోతే మేం సాయం చేస్తాం, నీ అందమైన చేతి రాతతో మాకు నోట్సులు చదువుకునే అదృష్టమూ కలుగుతుందిఅంది అనంత రాజు వైపు చూస్తూ.

అదుగో వొ..వొస్తున్నాడు మ్మమహానుభావుడుఅన్నాడు దివాకర్ తమవైపే వస్తున్న కరుణ వైపు చూస్తూ.

వాడిపోయిన ముఖంతో, మాసిన గెడ్డంతో  గుర్తుపట్టలేకుండా ఉన్న కరుణని చూసి ఆశ్చర్యపోయింది తన్మయి.

అతను తన్మయి వైపు సూటిగా చూడలేనట్లు కళ్లు దించుకునిఎప్పుడు వచ్చేరు?” అన్నాడు చిన్న గొంతుతో.

మీరు క్లాసులు తీసుకున్నారు?” అంది తన్మయి.

ప్రశ్నకు సమాధానం చెప్పకుండామనందరినీ డిపార్ట్మెంటు హెడ్డు పిలుస్తున్నారు.” అన్నాడు.

మొదటి సంవత్సరం పరీక్షల సమయంలో ఆయన అన్న మాటలు గుర్తొచ్చి తన్మయికిమళ్లీ ఏం ములిగిందోనని భయం వేసింది.

అనంత తన్మయి భుజమ్మీద చెయ్యి వేసి, “భయం లేదులే, నీకు చెప్పేనుగా, ఆయన స్వతహాగా మంచి వారే. బహుశా: నువ్వు సెకండ్ ఇయర్లో కనిపించడంలేదని పిలుస్తున్నట్లున్నారు. నేనూ వస్తాను పదఅంది.

కరుణ అనంత వైపు చూస్తూ, “మనందర్నీ రమ్మన్నారు ఎందుకోఅన్నాడు తన్మయి వైపు సాధ్యమైనంత వరకూ చూడకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ.

తన్మయికి అతనెందుకు అలా ప్రవర్తిస్తూన్నాడో అర్థం కాలేదు.

డిపార్టు మెంటు హెడ్డు గారి గది ప్రాంగణంలోకి అడుగుపెడ్తూనే లోపలి నించి పిలుపొచ్చింది అందరికీ.

కుర్చీలో గంభీరంగా కూచుని ఉన్న హెడ్డు చిదంబరంగారిని చూడగానే తన్మయికి భయం పుట్టుకు వచ్చింది.

అందర్నీ ఎంతో మర్యాదగారండి, కూర్చోండిఅని కుర్చీలు చూపించారాయన.

తన్మయి ఆశ్చర్యపో యింది. “స్టూ డెంట్స్ కి ఇంత మర్యాద ఇస్తారా ఈయన?”

ఇంకా అంతా నిలబడే ఉండడం చూసి నవ్వుతూ, “నన్ను చూసి మీరంతా భయపడడం సహజం. మిమ్మల్ని భయపడొద్దని చెప్పడానికే పిలిచాను. అంతేకాదు, మన డిపార్టుమెంటులోనూ, అన్ని అనుబంధ పీజీ కాలేజీలలోనూ మీరు నలుగురూ మొదటి నాలుగు ర్యాంకుల్లోనూ నిల్చారు. ముందుగా మీ అందరికీ కంగ్రాట్స్అన్నారు.

అప్పటి వరకూ తన్మయికి ర్యాంకింగు అంటే కేవలం యూనివర్శిటీ క్యాంపస్ కు మాత్రమే అని తెలుసు. అన్ని క్యాంపస్ లకు అని తెలిసేక కించిత్ గర్వంగా అనిపించింది

మొదటి సంవత్సరంలో తక్కువ ర్యాంకు వచ్చిన వారు అధైర్య పడకండి. రెండో సంవత్సరం చివర్న  కన్సాలిడేటెడ్ ర్యాంకు తీస్తాం కాబట్టి ఇప్పుడు తక్కువ ర్యాంకు వచ్చిన వారు, రెండో సంవత్సరంలో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ముందుకు వెళ్ళగలువుతారు.” అన్నారు ప్రత్యేకించి కరుణ వైపు చూస్తూ

కరుణ టాలెంట్ కి విద్యార్థులే కాదు, హెడ్డు కూడా ముగ్ధులయ్యారన్న మాటతనలో తాను అనుకుంటూ కరుణ వైపు చూసింది తన్మయి

అతనింకా కళ్ళు దించుకునే ఉన్నాడు.

చాలా థాంక్స్ మాస్టారూఅన్నారు అంతా.

 “నాకు మీలా శ్రద్ధగా చదివే వాళ్లని ఎంకరేజ్ చెయ్యడం ఇష్టం. రెండో సంవత్సరం పరీక్షలు కాగానే జరిగే జే.ఆర్.ఎఫ్ కు ఎవరైనా చదవదల్చుకుంటే నన్ను సంప్రదించండి. అన్నారు హెడ్డు.

కరుణ అందుకుని నెమ్మదిగా, “మాస్టారూ, గత పదమూడేళ్లుగా మన డిపార్టుమెంటు నించి ఎవరూ ఫెలోషిప్ కు సెలక్టు కావడం లేదు. మేం సాధించగలమంటారా?” అన్నాడు.

ఎందుకు సాధించలేరయ్యా? మీరు యువకులు. తల్చుకుంటే ఏదైనా సాధించే శక్తి మీకుందని నమ్మితే చాలు.” అని తన్మయి వైపు చూస్తూరెండో ర్యాంకు తెచ్చుకున్న అమ్మాయివి క్లాసులకు ఎందుకు రాలేకపోయావమ్మా?” అన్నారు.

తన్మయి తప్పు చేసినట్లు తల దించుకుంది.

అనంత వెంటనే కల్పించుకుని,”మీతో విషయం మాట్లాడాలి మాస్టారూఅంటూ మిగతా వాళ్ల వైపు చూసింది.

అందరూ లేచేరు

మిగతా అంతా వెళ్ళేకచెప్పండిఅన్నారు హెడ్డు

అనంత చెప్పిన తన్మయి కథ విని, ఒక్క క్షణం మౌనం తరవాత, “అయ్యో విషయం ఎప్పుడూ చెప్పలేదేవిటమ్మా, ముందుగా నువ్వు నన్ను క్షమించాలి. నీ పరిస్థితి అర్థం చేసుకోకుండా నిన్ను పరీక్షల్లో మనసు బాధించే మాటలన్నందుకు.” అన్నారు.

అయ్యో, ఫర్వాలేదు మాస్టారూఅంది తన్మయి మెల్లగా.

తన్మయి ఎన్ని అడ్డంకులెదురవుతున్నా ఎలా చదవగలుతూందో నాకు అర్థం కాదు మాస్టారూ. తన స్థానంలో నేనుంటే నాకు అసలు తనలా ర్యాంకు తెచ్చుకోవడం అసాధ్యంఅంది అనంత.

ఎలాగైనా బాగా చదువుకోవాలనే నీ పట్టుదల, దీక్ష నిన్ను తప్పకుండా ఉన్నత స్థితికి తీసుకు వస్తాయి.అధైర్య పడకు తన్మయీ.” అన్నారు హెడ్డు అనునయంగా.

మాస్టారూ, అసలు తెలుగుకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటారా?” అంది తన్మయి సందేహంగా.

తెలుగు చదువుకుంటే ఉద్యోగ అవకాశాలు ఉంటాయా, ఉండవా అనే సందేహం మొదట మనసులోకి రానివ్వకండి. చిన్న చిన్న టీచర్ ఉద్యోగాల నించి, నేను చెప్పినట్లు జే ఆర్ ఎఫ్, గ్రూప్-1, సివిల్ సర్వీసెస్ మొదలైన ఎన్నో గొప్ప అవకాశాలలో తెలుగు ఆప్షనల్ గా తీసుకున్నవాళ్లు మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. మీకు కావల్సిందల్లా మనసులో సాధించగలమన్న నమ్మకం, కష్టపడే తత్త్వం.” అన్నారు స్థిరంగా.

మాటలకు తన్మయికి గొప్ప ధైర్యం వచ్చింది. కృతజ్ఞతా పూర్వకంగా చూసింది ఆయన వైపు.

భుజం చుట్టూ చెంగు కప్పుకున్న తన్మయి వైపు చూస్తూమీ లాంటి మంచి అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారమ్మా కాలపు అబ్బాయిలకి?” అని నిట్టూర్చి, “ఇలా చూడమ్మా, ఇక మీదట నన్ను మీ నాన్నగారి తో సమానంగా అనుకో. నీకు మన యూనివర్శిటీలో విషయానికి సాయం కావాలన్నా నన్ను అడగొచ్చు. ఇక మీదట నీ దృష్టి అంతా జే ఆర్ ఎఫ్ సాధించడం మీదే ఉండాలి. ఎమ్మే కాగానే అది సాధించగలిగితే అయిదు సంవత్సరాల పాటు నీకు సెంట్రల్ గవర్నమెంటు స్కాలర్ షిప్పుతో పీ ఎచ్ డీ చేసే అవకాశం వస్తుంది. నీలాంటి వారు ఉన్నత స్థితికి వస్తే నీలా కష్టపడుతున్న ఎందరికో నువ్వు ఆదర్శ ప్రాయం అవుతావుఅన్నారు.

అయన మాటలకే సగం లక్ష్యం సాధించిన బలం కలిగింది తన్మయికి. రెండు చేతులూ జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించింది సెలవు తీసుకునేటప్పుడు

బయటికి రాగానేజె ఆర్ ఎఫ్జూనియర్ రిసెర్చి ఫెలోషిప్అంటే ఏవిటో ఇప్పటి వరకూ విననే లేదు నేను అంది సాలోచనగా తన్మయి అనంత తో.

అది ఆయన చెప్పినంత సులభం కాదు తన్మయీ, ఏటా అన్ని డిపార్టుమెంట్ల నించీ ఎందరో మొదట దాని కోసమే ప్రయత్నం చేస్తుంటారు. పైగా పరీక్షలో మన తెలుగు డిపార్టుమెంటు వాళ్లు విజయం సాధించలేకపోవడానికి ప్రధాన కారణం  పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షల్లో లాగా పరీక్ష లోనూ ఇంగ్లీషు, మాథ్స్ పేపర్లు కూడా ఉంటాయి. అంతే కాదు. అవి రెండూ పాసయ్యితేనే మూడవ పేపరైన తెలుగుని దిద్దుతారు. ఇక నాలుగవ పేపరు వ్యాస రూప పరీక్ష. అత్యంత కఠినంగా ఉండే పేపర్లో అత్యధిక మార్కులు సాధించిన వారికి మాత్రమే  ఫెలోషిప్ వచ్చే అవకాశం ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలలోనూ అత్యధిక మార్కులు వచ్చిన వారు కూడా పరీక్షలో విజయం సాధించలేక పోతున్నారు. రాజు వివరాలన్నీ ఇప్పటికే సేకరించేడు. కానీ నాకే నమ్మకం లేదుఅంది నిరాశగా అనంత.

బస్సు దిగి ఇంటి వైపు అడుగులేస్తున్నా ఇంకా మాస్టారి మాటలు, అనంత మాటలు వదలడం లేదు తన్మయికి

ఇంగ్లీషు, మాథ్సు అసలు ప్రాబ్లమే కాదు తనకి. ఎప్పుడూ ఫుల్ మార్కులే సబ్జెక్టుల్లో. ఇక తెలుగులో ఇంకా తను ఎన్నో చదవాల్సి ఉంది. పట్టు సాధించాల్సిన కోణాలెన్నో ఉన్నాయి. అయినా.. పట్టుదలగా జె ఆర్ ఎఫ్ కోసం ప్రయత్నం మొదలు పెట్టాలి…” తనలో తను ఆలోచించుకుంటూ, తల దించుకుని నడుస్తున్న తన్మయిని ఎవరో  పిలిచినట్లయ్యి వెనక్కి చూసింది.

దూరంగా కరుణ తన్మయి వైపే వస్తూ  కనిపించాడు.

దగ్గరకు రాగానే అతని చెమర్చిన కళ్లని చూస్తూఏమైంది కరుణా? ఏవిటీ అవతారం?” అంది తన్మయి అతని గెడ్డాన్నీ, లోతుకు పోయిన కళ్లనీ చూస్తూ.

అతనేదో చెప్పేలోగాముందు నన్ను థాంక్స్ చెప్పనివ్వండి కార్డు రాసినందుకు. మీకు నాలుగవ ర్యాంకు వచ్చిందని ఇంతలా కుమిలి పోతే ఎలా?” అంది తన్మయి.

అందరిలాగే మీకూ అంతే అర్థమైందన్న మాటఅన్నాడు ఉక్రోషంగా ముక్కుపుటాలు ఎగరేస్తూ కరుణ.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.