వెనుకటి వెండితెర-4

చక్రపాణి (1954)

-ఇంద్రగంటి జానకీబాల

 

మనిషి జీవితంలో హాస్యరసానికి ఒక ప్రథానమైన పాత్రవుంది. రకరకాల సమస్యలతో బాధలతో, ఇబ్బందులతో విసిగిపోయినప్పుడు, కాస్తంత హాయిగా నవ్వుకుంటే బాగుండుననిపిస్తుంది వరికైనా, కానీ అది తెచ్చిపెట్టుకుంటే వచ్చేదికాదు. అలవోకగావచ్చి, ఆనందంగా నవ్వుకునేలా చెయ్యాలి. అలా సహజంగా వున్నప్పుడే అది మనసుల్ని తేలికపరుస్తుంది.

భరణీవారి మొదటి చిత్రం రత్నమాల. తర్వాత లైలామఙ్ను, ప్రేమ, చండీరాణీ లాంటి చిత్రాలనిర్మాణం అయ్యాక భానుమతికి హాస్యరసభరతమైన సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది. ఆమెకి స్వభావంగా హాస్యం, వ్యంగ్యం, వేళాకోళం చేసి పారేయిడం లాంటి సన్నివేశాలు యిష్టం. అందుకే ఆమె హాస్యం రచించటం లోనూ ఎంతో ప్రతిభ చూసారు. అతికొద్దిమంది తెలుగు హాస్య రచయిత్రులలో నెంబర్ వన్ గా నిలిచారు.

భానుమతి ప్రధానంగా గొప్ప సంగీతఙ్ఞురాలు, గొప్ప గాయకురాలు. తర్వాత నటి, అందగత్తె – మరీముందుకు నడిచాక దర్శకురాలు సంగీత దర్శకురాలు నిరామత కూడా అయ్యారు.

ఆమె భరణీ పిక్చర్ బ్యానర్మీద చక్కని హాస్య చిత్రం నిర్మించాలని నిర్ణయించుకున్నారు. దానిపేరు ‘చక్కపాణి’ ఈ సినిమాకి కథ, మాటలు ఎరావూరి సత్యనారాయణరావు వ్రాశారు. దర్శకత్వం స్క్రీన్ ప్లే పి.రామకృష్ణ తయారుచేసుకున్నారు. ప్రథాన పాత్రలు పి. భానుమతి. అక్కినేని నాగేశ్వరరావు, చక్రపాణి గా సి.ఎస్ ఆర్ ఆంజనేయలు నటించారు. ఇంకా ఇందులో వంగర, టి.జి. కమలాదేవి, అమర్ నాధ్, సూర్యకాంతం, ఛాయాదేవి, శివరామకృష్టయ్య మొదలైన ఆనాటి మేటి నటులందరూ వున్నారు. అంతా సినిమాలో నవ్వలు పువ్వులు పూయించారు. సంగీతం నిర్వహించిన భానుమతి చక్కని శాస్త్రీయ సంగీత కృతులు పాడారు. ఒకటి త్యాగరాజ కీర్తన ‘పక్కలనిలబడి’, రెండోది దీక్షితుల వారి కీర్తన ‘మీనాక్షీ మేముదం’

కథలో సమస్య కాస్త గంభారమైనదే అయినా కథనం నడిచేతీరు హాస్యంతో ఆహ్లాదంగా వుంటంది.

చక్రపాణి గారికి చెట్టంత కొడుకుపోయి, కొండలు, మగ్గురు మనవరాళ్ళు, ఒక మనవడు మిగులుతారు. వారి పోషణాభారం ఆ ముసలితాత మీద పడుతుంది. స్వభాగంగా డబ్బుకట్టి మనిషి మనవలు ఆయిన పిసినారితనం వల్ల చిరాకుపడుతూ వుంటారు. ఒక లక్ష రూపాయిలు కూడబెట్టి మునిమనవడికి ఇచ్చి ముక్తి పొందాలని ఆయన ఆశ. అయితే ఎవ్వరికీ వివాహాలు కాలేదు. పిల్లలు లేరు. రెండోపిల్ల మాలతి (భానుమతి) గడుసు, ధైర్యం, లెక్కలేని తనం గల అమ్మాయి. మొదటి పిల్లకి రెండోపెళ్లివాడినీ, మాలతికి డబ్బుగల మూగ వాడినీ నిశ్చయించి పెల్ళిచేయబోతే, మాలతి పెళ్ళికుతూరుగా పారిపోయి రైలెక్కిస్తుంది. అందులో ఛాయాదేవీ, భర్తా కలిసి, ఆమెని ఆదరించి వాని తీసుకుపోతారు. ఆ ఛాయాదేవి తమ్ముడిగా నాగేశ్వర్రావు పరిచయం – కథ నడుస్తుంది.

సినిమాలో చక్కని నవ్వు తెప్పించే మాటలు – చెవులకు ఇంపైన సంగీతం ప్రక్షకుల్ని అలరిస్తాయి.

ఎదురింటి పల్లాడ్ని చూపించి తను లక్షరూపాయిలు తీసుకుందామని ప్లాన్వేసిన మాలతి – ఆ ఎదురింటి పల్లాడు అన్నగారి కొడుకని గ్రహించి నాటకం వాణింపచేస్తుంది.

సినిమా టైటిల్స్కి‘రఘువంశసుధుంబుది’ వాయింపచేసి భానుమతి తనకుగల శాస్త్రీయ సంగీతాభిరుచి నిరూపించుకున్నారు.

ఇందులో – ఓ ప్రియురాల ఓ జవరాలా (ఎ.ఎం. రాజా)

నన్ను చూసి తజాలిఏలమామ (భానుమతి)

అన్నింటికీ మించి భానుమతి పాడిన ఉయ్యాల జంపాల లూగరావయాయ అద్భుతంగా అందాయి.

ఇందులో భానుమతి – సి.ఎస్.ఆర్. పోటాను పోటీగా నటించారు. ఏ.ఎన్.ఆర్. తో అందంగా వుంటారీ సినిమాలో. పి. భానుమతి గాయనిగా, నటిగా, రచయిత్రిగా, నిర్మాతగా దర్శకురాలిగా చక్కగా నిరూపించుకున్న చిత్రం ఇది. అయితే ఇందులో రచయిత్రిగా పాత్రలేక పోయినా, మంచి రచనను తీసుకోగలిగిన శక్తి కనిపిస్తోంది.

పి. రామకృష్ణ తన దర్శకత్వ ప్రఙ్ఞను నిరూపించుకున్నారు.

1954 లో ఇది వచ్చింది. ఇలాంటి చక్కని హాస్యంతో నవ్వుకునే చిత్రాలు ఇప్పుడు వస్తునానయా’’ అంటే జవాబు చెప్పడం కష్టమే.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.