
వినోదమా? విషమా?
-శ్రీ శ్రేయ కూరెళ్ల
హీరో ఎవరైనా, ట్రెండ్ ఏదైనా..
మిరిమిట్లు గొలిపే వెండితెర వెలుగుల వెనుక..
వికృతమైన హింస దాగుంటే, ఆ వెలుగును స్వీకరించలేం!
ఆడపిల్లల్ని ఎలా ట్రాప్ చేయాలో నేర్పే శిక్షణలా..
మర్డర్లు ఎలా ప్లాన్ చేయాలో వివరించే పాఠంలా..
గుండెను చేతుల్లో పట్టుకుని, భయంతో చూడాల్సి రావడం..
కాలక్షేపమా? లేక మానవత్వానికే పట్టిన గ్రహణమా?
చుట్టూ విషమే ఎక్కువ శాతం ఉండొచ్చు..
అమృతం ఎక్కడో ఒక శాతమే దాగి ఉండొచ్చు!
అందరూ తాగుతున్నారని ఆ విషాన్ని స్వీకరిస్తే..
అది మెల్లగా నీ మెదడులోకి చేరి, నీ నరాల్లో ప్రవహిస్తూ ఉంటుంది!
చివరికి తప్పును కూడా ఒప్పుగా భ్రమించేలా చేస్తుంది.
వినోదం ముసుగులో వస్తోంది ఒక అదృశ్య విషం!
రక్తం చిందటం ఉల్లాసమా?
మనుషులను సంస్కరించడం, మనసును కదిలించడం..
కదా కళామ్మతల్లి బాధ్యత!
వెండితెర వెలుగులు.. మానవత్వాన్ని మేల్కొల్పే దివ్వెలు కావాలి..
కళ మనిషిని ఉద్ధరించాలి కానీ,
తెలియకుండానే మృగ ప్రవృత్తి వైపు నడిపించకూడదు!
*****

Full name is sri sreya kurella . Studying degree 2nd year. Started writing poetry in telugu language while studying 2nd class. Recently started writing English poetry too . Published a book in telugu during 10th class . Book name : entha bavuntundi oh . Living location is Vijayanagaram , Andhrapradesh.

వినోదమా? విషమా? -శ్రీ శ్రేయ కూరెళ్ల గారి కవిత నేటి చిత్ర సీమ లో కనిపిస్తున్న అరాచకపు ఆలోచనలను స్పష్టం గా , కళ్ళకు కట్టినట్టుగా చూపెడుతున్నది . కవయిత్రికి ధన్యవాదములు!
పద్మావతి నీలం రాజు