“నెచ్చెలి”మా

దివ్యౌషధం

-డా|| కె.గీత 

ఈ ప్రపంచములో
అన్ని బాధలకు
పనికి వచ్చు
ఔషధమేమైనా
ఉన్నదా?

మతిపోయిందా?
అన్ని బాధలకు
ఒక్క
మందు
ఎలా పనిచేస్తుంది?

బహు చక్కగా
పనిచేయు
ఒక్క
ఔషధమున్నది
ఒక్క
ఉపాయమున్నది

అయితే
అదేవిటో
తమరే
విన్నవించండి

బాధకు
మందు
కనిపెట్టవలెనన్న
బాధ
ఎందుకు
వచ్చునో
తెలియవలెను

ఆగండాగండి
అర్థమైంది
బాధకి
మూలం
బుద్ధుడే
కనిపెట్టలేకపోయాడు
మనమెంత!

అక్కడికీ
వచ్చుచున్నాను
బాధ
ఎందుకు
వచ్చునో
తెలియకపోయినచో
విడిచిపెట్టవలెను

దేన్ని?
విడవాలటా?
కాస్త
వివరంగా
చెబుతారా?
బాధను
తొలగించుకొనవలెనంటే
తలపు
విడిచిపెట్టవలెను
ఏదైనను
పనిలో
పడవలెను
అదియే
అన్ని బాధలకు
దివ్యౌషధము

ఆహా!
ఏం
సెలవిచ్చారు-
పనియే
ప్రత్యక్ష
దివ్యౌషధం!
ధన్యోస్మి!!

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణా త్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.

మరింకెందుకు ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.

వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి”లో వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

మే, 2026 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు:  సి. రాజేశ్వరి

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: ఆ కలం ఆగితే? (కథ) – అనసూయ ఉయ్యూరు

ఇరువురికీ  అభినందనలు!

****


Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.