
ఓ కాలమా! (కవిత)
– శ్రీ సాహితి
కాలమా! నీకు గుర్తుందా?
నేను నాలో
తప్పిపోయిన రోజు.
నన్ను వెతికివ్వమని బ్రతిమాలిన రోజు.
నన్ను పట్టించుకోకుండా
నన్ను రెచ్చగొట్టేలా చూసిన రోజు నాకు బాగా గుర్తు
నన్ను చూసి నవ్వుతూ
చులకన చేస్తూ వెళ్ళిన నీవు
ఇన్నాళ్లకు
నా ఎదురుపడ్డావ్
నా చుట్టూ తిరుగుతూ
నన్ను చూసి ఈర్ష్య పడుతూ
నన్ను పొగుడుతూ
నాకు కష్టం తెలియని రోజుల్లో
ఏడిపించావ్.
నేను కష్టాన్ని గెలిచాక
నా పక్కన వచ్చి నిలబడ్డావ్
నన్ను వెతుక్కుంటూ
నా కాళ్ళ మీద నిలబడ్డకా
తెలిసింది.
నిజంగా నా మంచితనమే
నీ మంచితనాన్ని చూపించి
నన్ను నిన్ను కలిపింది.
నన్ను నాకు తెలిపింది.
*****

మా ఊరు అద్దంకి, ప్రకాశం జిల్లా, (ఆంధ్రప్రదేశ్.) నేను ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీ లో బి.ఫార్మసీ చదువుతున్నాను.నాకు చిన్నప్పటి నుండి తెలుగులో శతక పద్యాలు అంటే ఇష్టం. అలాగే మా నాన్నగారు పరిచయం చేసిన మహాకవి శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం నా జీవితంలో ఓ గొప్ప మలుపు. క్రమంగా వచన కవిత్వము పట్ల అభిమానము కలిగి, నాకు తోచిన భావాలను వచనంలో వ్రాయడం అలవాటుగా మారింది.
