
చిత్రం-75
-గణేశ్వరరావు
వాల్ట్ డిస్నీకి నచ్చిన చిత్రం:
కార్టూనిస్ట్ అలీ రజా డచ్ చిత్రకారుడు విన్సెంట్ వాన్ గో ప్రేమలో పడి అతనిలోని ప్రతి సన్నివేశం కార్టూన్ గా చిత్రించడానికి ప్రయత్నించే వాడట! ఈ Fragonard బొమ్మని చూసి Disney ప్రేమలో పడ్డాడు: Some of the most famous Walt Disney animations looked to French 18th-century works of art for their source material!
Disney చిత్రం ‘Frozen’ వెనుక ఉన్న కథ చెప్పే ముందు కొన్ని విషయాలు.
సంకేతాలు, ప్రతీకలను గుర్తించడంలో పొరపాట్లు జరుగుతున్నాయి. isms కు కట్టుబడ్డ వారికైతే తమ వాదనలను సమర్థించే ప్రతీకలు అన్ని చోట్లా కనబడుతూనే ఉంటాయి. అనేక బొమ్మల క్రింద text ఉంటుంది, నేపథ్యం గ్రహించగలం. అప్పడాల కర్రతో బెదిరిస్తూ నిల్చున్న ఇల్లాలి ముందు వంట పని చేస్తూ దీనంగా కూర్చున్న సీతప్పను బాపూ బొమ్మ గీస్తే దాన్ని కార్టూన్ గా తీసుకొని నవ్వుతామా లేక దానిలో స్త్రీ ఆధిపత్య ధోరణి నిరసిస్తూ పురుష వాదాన్ని తలకెత్తుకుంటామా?
‘పాతాళభైరవి’ గుర్తుందా? రాకుమార్తె చెలికత్తెతో తోటలోకి వస్తున్నప్పుడు, తోటరాముడు చెట్టు పైకి ఎక్కి దాక్కుంటాడు, రాజుగారి బామ్మర్ది ‘వినవే బాల ..నా గోల ‘ పాట పాడుతున్నప్పుడు పాము వస్తుంది, చెట్టుపై నుంచి దూకి రాముడు వీరోచితంగా దాని తోకను పట్టుకొని గిరగిరా తిప్పి విసిరేస్తాడు. ఈ సన్నివేశంలోని అంతరార్థం వివరించడానికి కె వి రెడ్డి లేరు!
ఫ్రాగోనార్డ్ వేసిన చిత్రాన్ని డిస్నీ లాటి గొప్ప దర్శకుడే అర్థం చేసుకోలేదు, ఈ చిత్రంలో .. తోటలో ఒక యువతి ఆడుతూ పాడుతూ ఉయ్యాల ఊగుతూ ఉంటుంది, ఒక కాలి చెప్పు ఊడి ఎగిరి పోతుంది – తోటలో రాతిపైన ఉన్న cupid(మన్మధుడు) శిల్పం వైపు.. ఆమె వేసుకున్న గౌను గాలికి పైకి లేచి పోతూ ఉంటుంది, ఆమెను ఉయ్యాల్లో ఊపుతూ ఉన్న భార్యాలోలుడు దూరంగా నిల్చుని వెనక ఉంటాడు. చిత్రం ముందు భాగంలో ఆమె ప్రియుడు పొదల్లో దాక్కుని ఆమె పాదాల కేసి చూస్తూ ఉంటాడు. డిస్నీ ఇదొక అల్లీబిల్లీ అమ్మాయి బొమ్మ అనుకొని తాను పిల్లల కోసం తీసిన చిత్రంలో వాడుకొని జనం చేత తిట్లు తిన్నాడు!
చిత్రాల్లో అంతరార్థాలు ఉండవని అనడం లేదు, ప్రతీకాత్మక చిత్రాలలోని భావాల గురించి వ్యాఖ్యానం చేసేముందు కొన్ని నియమాలు పాటించాలి, కొన్ని సూత్రాలకు కట్టుబడి ఉండాలి. thematic / symbolic చిత్రాలు గుర్తు పట్టడం art critics కు పెద్ద కష్టం కాదు. Swing is a painting of orgasm!
*****

గణేశ్వర్రావు ప్రముఖ రచయిత. చిత్రకళ పట్ల వీరికి అమితమైన ఆసక్తి. ప్రత్యేకించి వీరు రాసే చిత్ర కథనాల ద్వారా ఎందరో గొప్ప చిత్ర కళాకారుల్ని పరిచయం చేసారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ప్రముఖ అనువాదకులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత శాంతసుందరి గారు వీరి సతీమణి.
