
ప్రకృతి సందేశం
– సాయి కిషోర్ గిద్దలూరు
వర్షం పడుతుంది
నేల సువాసన వెదజల్లుతుంది
కోయిల కూ కూ సరిగమల రాగాలతో కూస్తుంది
పంటపొలాలు పచ్చగా చూడముచ్చటగా కనిపిస్తాయి
ఏదో కనిపించడం లేదని
అటు, ఇటు, పైకి చూసాను
రంగులద్దిన ఇంద్రధనస్సు
తెల్లటి కాగితంపై చిత్రంలా మెరిసింది
ఆ విహరిస్తున్న పక్షులను చూస్తే
మనసులో ఓ ఆలోచన మొలిచింది
పక్షపాతాలు లేవు,
బంధుత్వాల్లో భేదాలు అస్సలేవు
నడిచే మనిషి పక్షిలా ఎగరలేడు,
కానీ
జీవితం అనే ఈ ప్రయాణం
ఒక ప్రత్యేకమైన వరం
ఈ నగర వీధుల్లో జీవించడమే
మనకు దక్కిన అదృష్టపు వరం…
*****
Please follow and like us:

నా పేరు గిద్దలూరు సాయి కిషోర్. మా ఊరు రాయదుర్గం అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్. నా తల్లిదండ్రులు మురళి,లక్ష్మి. నాకు చెల్లెలు ఉంది. ఎక్కువగా కవితలు, కథలు రాయడం అంటే నాకు చాలా ఇష్టం. అలాగే కవిత, కథల పోటీలకు పాల్గొనడం అన్న ఇష్టం…
