image_print

యదార్థ గాథలు- శాంతంతో శాంత విజయం

యదార్థ గాథలు శాంతంతో  శాంత విజయం -దామరాజు నాగలక్ష్మి శాంత  చిన్నప్పుడంతా చాలా చురుగ్గా ఎప్పుడూ నవ్వుతూ వుండేది. పిల్లలందరికీ శాంతతో ఆడాలంటే చాలా ఇష్టంగా ఉండేది. ఎంతో చురుగ్గా ఉన్న శాంత స్కూల్లో కూడా ప్రతి విషయంలోనూ ముందే వుండేది. అందరికీ చాలా ఆనందంగా వుండేది.  పాటల పోటీల్లో జాతీయ స్థాయిలో బహుమతులు గెలుచుకుంది.  పాటలంటే ప్రాణం.  ఎవరు పాడమన్నా మొహమాటం లేకుండా పాడేది. శాంతకి డిగ్రీ పూర్తయ్యింది. స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది. […]

Continue Reading

యదార్థ గాథలు- ఆదర్శవంతమైన లలిత జీవితం

యదార్థ గాథలు ఆదర్శవంతమైన లలిత జీవితం -దామరాజు నాగలక్ష్మి లలితకి సంవత్సరం తిరక్కుండానే తల్లి జానకికి దూరంమయింది.  ఏమీ తెలియని వయసు. తండ్రికి కుదురైన ఉద్యోగం లేదు. రకరకాల ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.  జానకి మరణం తర్వాత లలితమ్మని తమ్ముడు రాముడికి అప్పచెప్పి తను ఎక్కడికి వెడుతున్నానో కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. లలితకి బాబాయి రాముడు, పిన్ని సరళ అమ్మానాన్నలయ్యారు.  అప్పటికే వాళ్ళకి లీల, మాధవి, శ్రీదేవి అని ముగ్గురు ఆడపిల్లలు వుండేవారు. వాళ్ళతోపాటే లలిత […]

Continue Reading

యదార్థ గాథలు- శ్రీలక్ష్మి సాహసం

యదార్థ గాథలు శ్రీలక్ష్మి సాహసం -దామరాజు నాగలక్ష్మి శ్రీలక్ష్మి చాలా అందమైన అమ్మాయి. పసుపచ్చని మేని ఛాయ, ఏ రంగు చీరైనా ఒంటికి కొట్టొచ్చినట్టు కనిపించేది.  ఐదుగురు అన్నలు, ఒక అక్క తరవాత పుట్టడంతో చాలా గారాబంగా పెంచారు. మొండితనం ఎక్కువగా వుండేది. ఇంట్లో అందరూ చాలా భయపడేవారు. పెద్దయిన తర్వాత ఎలా వుంటుందో అనుకునేవారు. మేనమామ రామారావుకి చిన్నప్పటి నుంచీ శ్రీలక్ష్మి అంటే చాలా ఇష్టంగా వుండేది. పెళ్ళి చేసుకుంటే శ్రీలక్ష్మినే చేసుకుంటాను అనేవాడు. సరే […]

Continue Reading

యదార్థ గాథలు- పరిమళించిన పరిమళ జీవితం

యదార్థ గాథలు పరిమళించిన పరిమళ జీవితం -దామరాజు నాగలక్ష్మి పరిమళ  ఇద్దరన్నలకి అపురూపమైన చెల్లెలు. చెల్లెలిని చాలా ప్రేమగా చూసుకునేవారు. ఏదీ కాదనకుండా ఇచ్చేవారు. అన్నలంటే కూడా పరిమళకి అంతే ప్రేమ.   చదువులో ఎప్పుడూ ముందుండే పరిమళ స్కాలర్ షిప్పుల మీద చదువు కొనసాగించింది. డిగ్రీ పూర్తవుతుండగా పెద్దన్న కామేశ్వర్ ఫ్రెండ్ సుదర్శన్ కి పరిమళ నచ్చింది. పెళ్ళి చేసుకుంటాను అన్నాడు. కానీ పరిమళకి చదువు పూర్తవ్వందే పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు. అదే మాట చెప్పింది.  […]

Continue Reading

యదార్థ గాథలు- సాధనమున పనులు

యదార్థ గాథలు -దామరాజు నాగలక్ష్మి కలిసొచ్చిన అదృష్టం రజిత దగ్గిరకి చాలా రోజుల తర్వాత రోహిణి వచ్చింది. మొహం చాలా పీక్కుపోయి, జ్వరం వచ్చినట్లుగా వుంది. ముందేమీ అడగకుండా లోపలికి రమ్మని వేడి వేడి కాఫీ ఇచ్చింది. కాసేపయ్యాక రోహిణి ఏడవడం మొదలు పెట్టింది. ఏదో జరిగి వుంటుందని ఊహించింది రజిత. రోహిణీ నువ్వు ఏడుస్తే ఏమీ చెయ్యలేవు. ఏదైనా ధైర్యంగా వుంటేనే ఏదైనా చెయ్యగలుగుతావు. నిన్ను చూస్తే నీ పరిస్థితులు సరిగ్గా లేనట్లు అనిపిస్తోంది. ఏమయ్యిందో […]

Continue Reading

యదార్థ గాథలు- కలిసొచ్చిన అదృష్టం

యదార్థ గాథలు -దామరాజు నాగలక్ష్మి కలిసొచ్చిన అదృష్టం రజిత దగ్గిరకి చాలా రోజుల తర్వాత రోహిణి వచ్చింది. మొహం చాలా పీక్కుపోయి, జ్వరం వచ్చినట్లుగా వుంది. ముందేమీ అడగకుండా లోపలికి రమ్మని వేడి వేడి కాఫీ ఇచ్చింది. కాసేపయ్యాక రోహిణి ఏడవడం మొదలు పెట్టింది. ఏదో జరిగి వుంటుందని ఊహించింది రజిత. రోహిణీ నువ్వు ఏడుస్తే ఏమీ చెయ్యలేవు. ఏదైనా ధైర్యంగా వుంటేనే ఏదైనా చెయ్యగలుగుతావు. నిన్ను చూస్తే నీ పరిస్థితులు సరిగ్గా లేనట్లు అనిపిస్తోంది. ఏమయ్యిందో […]

Continue Reading

యదార్థ గాథలు- సుఖవంతమైన సుజాత (కథ)

యదార్థ గాథలు -దామరాజు నాగలక్ష్మి సుఖవంతమైన సుజాత కథ నలుగురు అక్కచెల్లెళ్ళలో నాలుగవది సుజాత. అందరూ పల్లెటూర్లో పుట్టి పెరిగారు. నలుగురూ తెల్లగా చూడడానికి చక్కగా వుంటారు. వాళ్ళ నాన్న రామారావు పక్క ఊరిలో ఫుడ్ కార్పొరేషన్ లో పనిచేేసేవాడు. అమ్మ సీత చక్కటి గృహిణి. ఊళ్ళో అన్నదమ్ములు, మేనమామలు అందరి మధ్యా వుండడంతో ఆవిడకి రోజులు సాఫీగా గడిచిపోతుండేవి. అసలు కథలోకి వస్తే నలుగురు ఆడపిల్లల చక్కదనం చూసి బంధువుల్లోనే తెలిసిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. […]

Continue Reading

యదార్థ గాథలు- కష్టాలకు కళ్ళెం

యదార్థ గాథలు -దామరాజు నాగలక్ష్మి కష్టాలకు కళ్ళెం విరిత, వాళ్ళన్న శేఖర్ ఎప్పుడూ ఒక్కక్షణం కూడా విడిచి వుండేవారు కాదు. బి.టెక్. చదువుతున్న విరితకి ఏ సందేహం వచ్చినా శేఖర్ చిటికలో దాన్ని తీర్చేవాడు. ఇద్దరికీ ఒకళ్ళంటే ఒకరికి చాలా ప్రాణం.  అన్నా నేను చదువయ్యాక మంచి ఉద్యోగం చేస్తాను. బాగా సెటిల్ అయ్యాక పెళ్ళి చేసుకుంటాను అంది. దానికి శేఖర్ ఎందుకమ్మా… నీకు ఉద్యోగం చెయ్యాల్సిన  అవసరం ఏముంది…? చక్కగా చదువయ్యాక కొన్నాళ్ళు ఎంజాయ్ చెయ్యి […]

Continue Reading

యదార్థ గాథలు-నోరు మంచిదయితే…

యదార్థ గాథలు -దామరాజు నాగలక్ష్మి నోరు మంచిదయితే… సుబ్బమ్మ అందరిళ్ళలో వంటచేస్తుంది. భర్త గోవిందు ఎక్కడో ఊరికి దూరంగా వుండే హోటల్లో పనిచేస్తున్నాడు. వాళ్ళకి ఒక అమ్మాయి, ఒక అమ్మాయి. మాట మంచితనంతో అందరినీ ఆకట్టుకునేది సుబ్బమ్మ. పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు. వాళ్ళిద్దరినీ వదిలేసి వంట పనులు చూసుకుని వచ్చేది. తను వచ్చేవరకు పిల్లలు ఆకలికి అలమటించిపోయేవారు.  ఏమీ చెయ్యలేని పరిస్థితి. దిగులుగా వుండేది. జీవితాన్ని ఎలా ఈడ్చుకుని వస్తానా అనుకునేది. సుబ్బమ్మ చదువుకోలేక పోయానని చాలాసార్లు అనుకుంది. […]

Continue Reading

యదార్థ గాథలు-గెలుపునాదే

యదార్థ గాథలు -దామరాజు నాగలక్ష్మి గెలుపునాదే జ్యోతి చిన్నప్పటి నుంచీ చాలా హుషారుగా వుండేది. తను నల్లగా వుంటుందని ఎవరైనా అంటే తప్ప పట్టించుకునేది కాదు. చాలా నల్లగా వుండేది. చాలామంది నల్ల పిల్ల అని పిలిచేవారు. జ్యోతీ అని పిలిస్తే తప్ప పలికేది కాదు. ఎవరినీ నోరెత్తి ఏమీ అనేది కాదు. చదువులో ముందరే వుండేది. వాళ్ళమ్మ పాటలు బాగా పాడుతుంది కాబట్టి తనూ నేర్చుకుంది. చక్కటి గొంతు. ప్త్రెజు వచ్చినా రాకపోయినా ప్రతి పోటీకి […]

Continue Reading

యదార్థ గాథలు-ఎదురీత

యదార్థ గాథలు -దామరాజు నాగలక్ష్మి ఎదురీత అజిత, సుజిత తల్లిచాటు బిడ్డలు. అమ్మనేర్పిన  పిండి వంటలు, కుట్లు, అల్లికలు, ఇంటిని అందంగా తీర్చిదిద్దడంలాంటి పనులన్నీ చక్కగా చేస్తుండేవారు. ఇద్దరికీ రాని పనంటూ లేదు. అందంగా ఉన్న అజితని వరసకి బావ అయిన రమేష్ ఇష్టపడ్డాడు. రమేష్ చాలా బావుంటాడు. అందరితో మర్యాదగా మాట్లాడతాడు. అజిత తండ్రి సుబ్బారావు అతన్ని చూసి చాలా ముచ్చటపడ్డాడు. పెళ్ళి మాటలు అయిపోయాయి. ఒక శుభముహూర్తాన అజిత, రమేష్ లు ఓ ఇంటివాళ్ళయ్యారు. […]

Continue Reading

యదార్థ గాథలు-అలసట తీరిందిలా

యదార్థ గాథలు -దామరాజు నాగలక్ష్మి అలసట తీరిందిలా కొంతమంది జీవితాలు ధైర్యంగా ముందుకి వెడితేనే బాగుపడతాయనుకుంటున్నాను.  ఇలాగే జీవితాన్ని ఓ కొలిక్కి తెచ్చుకున్న విమల కథ. రవితో విమల జీవితం ఎటువంటి లోటూ లేకుండా హాయిగా సాగిపోతోంది. వాళ్ళు అమ్మాయి సుమ, అబ్బాయి రాజాలతో చీకూచింతా లేకుండా వున్నారు. రవి ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నప్పటికీ కష్టపడి పనిచేేసేవాడు కాబట్టి ఆఫీసులో మంచి పేరు వుండేది. టైమ్ ప్రకారం పనులన్నీ చేసుకుంటూ వుండేవాడు. పిల్లలిద్దరూ స్కూలుకెళ్ళి వచ్చేసరికి […]

Continue Reading

యదార్థ గాథలు-సహనమే వరమయ్యిన వేళ

యదార్థ గాథలు -దామరాజు నాగలక్ష్మి సహనమే వరమయ్యిన వేళ సహన  అసలు సిసలైన మధ్యతరగతి కుటుంబంలో, పెద్దపట్నమూ పల్లె కాని ఊళ్ళో పుట్టింది. ఓపికకి పెట్టినది పేరు. కష్టసుఖాలు బాగా అర్థంచేసుకోగల తత్వం. ఎవరితోనైనా బాగా కలిసిపోతుంది. అందరిలో మంచిపేరు. ఇక ఇంటి పనులు, వంటపనులు చక్కగా చెయ్యగల నేర్పరి. చెల్లెలిని, తమ్ముడిని బాధ్యతగా చూసుకుంటుంది.  పెళ్ళివయసు వచ్చిందని సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. అనుకోకుండా పక్కవూరిలోనే గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్న సుధీర్ సంబంధం కుదిరింది. గవర్నమెంట్ […]

Continue Reading

యదార్థ గాథలు-గమ్యం చేరిన జీవితం

యదార్థ గాథలు గమ్యం చేరిన జీవితం    -దామరాజు నాగలక్ష్మి    విమల ఓ మధ్యతరగతి కుటుంబంలో మూడవ పిల్లగా అపురూపంగా పెరిగింది. తండ్రి గోవిందయ్య ఓ చిన్న మిల్లులో గుమాస్తా. విమలని అన్న కృష్ణ, అక్క సీత చాలా ప్రేమగా చూసుకునేవారు. ఉండేది పల్లెటూరు కాబట్టి చాలీ చాలని జీతంతో ఎలాగో నెట్టుకొస్తూనే పిల్లలని డిగ్రీలు చేయించాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక ఉద్యోగాలకోసం హైదరాబాదు వస్తూ తల్లితండ్రులిద్దరినీ తీసుకుని వచ్చేశారు.    విమల కంపెనీలో ఉద్యోగానికి చేరింది. […]

Continue Reading

యదార్థ గాథలు-కష్టాలని అధిగమించిన వాసంతి

యదార్థ గాథలు కష్టాలని అధిగమించిన వాసంతి -దామరాజు నాగలక్ష్మి  అమాయకురాలు, తండ్రిచాటు బిడ్డ వాసంతి పెళ్ళి ఘనంగా చేశారు.   వాసంతి ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పాసయ్యింది. తండ్రి రాఘవయ్యతో నాన్నానేను డిగ్రీ చదువుతాను. మా స్నేహితులందరూ చదువుతున్నారు. నాకు తోడుగా వుంటారు అంది.  అప్పటికే ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసి అప్పులపాలయిన రాఘవయ్య అమ్మా! వాసంతీ ! అక్కలిద్దరి పెళ్ళిళ్ళు అయి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాను. నువ్వు చదువుకుంటానంటున్నావు బాగానే వుంది. కానీ ఇప్పుడు నువ్వు చదివి ఏం […]

Continue Reading

యదార్థ గాథలు-ఓ అమల కథ

యదార్థ గాథలు -దామరాజు నాగలక్ష్మి ఓ అమల కథ మరీ పల్లెటూరు పట్నమూ కాని వూళ్ళో ముగ్గురు అన్నదమ్ముల ముద్దుల చెల్లెలు అమల. మనవరాలంటే తాత సోమయ్య, నాయనమ్మ పార్వతిలకి చాలా గారాబం. అందరి మధ్యన చాలా అపురూపంగా పెరుగుతోంది.  పల్లెటూరులో పెద్ద పెంకుటిల్లు. ముందు వెనక చాలా ఖాళీస్థలం. ఎప్పుడూ వచ్చేపోయేవాళ్ళతో ఇల్లంతా సందడిగా వుండేది. ఇంటినిండా పనిమనుషులు, పాలేళ్ళతో చిన్నపాటి జమీందారుగారిల్లులా వుండేది. ఊళ్ళో అందరికీ  సోమయ్య, పార్వతి అంటే గౌరవం, అభిమానం. అమల […]

Continue Reading

యదార్థ గాథలు-సాహసమే జీవితం

యదార్థ గాథలు -దామరాజు నాగలక్ష్మి పరిచయం ఎన్నో సమస్యలతో సతమతమవుతూ చివరికి జీవితాన్ని అంతం చేసుకుందామనుకుని కూడా తిరిగి ఆత్మస్థైర్యంతో వాళ్ళకాళ్ళమీద వాళ్ళు నిలబడి విజయవంతంగా జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు ఎంతోమంది తారసపడ్డారు. అదే మహిళా సాధికారత. వీరి జీవితాలు స్ఫూర్తిగా వుంటాయని అందరికీ అందించాలని సంకల్పించాను. — సాహసమే జీవితం – 1 జీవితంలో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన ఎంతోమంది స్త్రీల జరిగిన కథలు. తల్లితండ్రులు ఆడపిల్లలకి పెళ్ళి చేసి అమ్మయ్య అమ్మాయి పెళ్ళయిపోయిందని […]

Continue Reading