చిన్న పల్లెలో పుట్టిపెరిగి స్వశక్తితో గురువులు నేర్పని విద్య, స్వయంకృషితో నేర్చుకుని ,ఆ కుగ్రామంలో మొదట డిగ్రీ, పీ జి చేసిన ఆడపిల్లను నేనే ..నలభై ఏళ్ళుఉపాధ్యాయవృత్తి నిర్వహించాను .... సువిశాలమైన ఈసాహితీ క్షేత్రంలోనావంటూ కొన్ని విత్తులు నాటుకోవాలని, నిత్యం సేద్యంచేస్తూ ఉన్నాను..
అందులోభాగంగానే "బాల కడలి " ," ముత్యాల జల్లు" అనే బాల గేయ సంకలనాలను మనుమలి చేతిమీదుగా ఆవిష్కరించాను.నా కథలు.కవితలు ,నాటికలు. వ్యాసాలు !సన్మానపత్రాలువివిధ పత్రికలలో, ఆకాశవాణిలో విశాఖపట్నం కేంద్రం ద్వారా , ప్రచురితమయ్యాయి, ప్రసారమయ్యాయి. కథలు ,కథానికలు, కవితలు,గేయాలు,బుఱ్ఱకథలు నాటికలు. వ్యాసాలు .గేయాలుు గీతాలువంటి వివిధ సాహితీ ప్రక్రియల చేస్తూ ఉండటం. తృప్తికోసం వ్రాయడం ఒక అలవాటు ..
"పిల్లల కోసం 25 పైగా నాటికలు రాసి వాటిని మా పాఠశాల పిల్లలచే పాతికేళ్లు ప్రదర్శింప చేశాను" ..వివిధ సంస్థలచే ఉత్తమ ఉపాధ్యాయునిగా, సన్మానాలు సత్కారాలు పొందాను.
చక్కని చుక్క -దామరాజు విశాలాక్షి “ఏంటి ? ఆ పిల్ల నిన్ను పెళ్ళి చేసుకోవాలంటే, నేను వెళ్ళి వాళ్ళ బామ్మతో మాటాడాలా? నాకున్న పలుకుబడి పేరు ప్రతిష్టలు చూసి, నీకు పిల్లనివ్వడానికి, బోల్డు మంది లైనుకడుతుంటే, ఆ పిల్ల కోసం నేను…..నేను….. …ఒకప్పుడు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే చేసినవాడిని, దేహీ। అని వాళ్ళ ఇంటికెళ్ళి పిల్లనడగాలా? మండిపడ్డాడు. మనోజ్ తాత మరిడయ్య …. అడగకు. నేను ఆ అమ్మాయిని పెండ్లాడి వాళ్ళింటికి వెళ్ళిపోతాను. లేకపోతే ! ఏదో దేశం […]
న్యాయపక్షం (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -దామరాజు విశాలాక్షి “బాల్కనీలో కూర్చొని భానుమతి పరిపరివిధాల ఆలోచిస్తోంది”. తన కళ్ళారా చూసిన ఆ సంఘటన పరిపరి విధాల ఆలోచించేలా చేస్తోంది” ఏం చెయ్యాలి? ఈ విపరీతం ఎలా ఆపాలి? ఇందుకోసమై వీడు తనింట చేరాడా? వీడిని వెళ్ళగొట్టినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందా? “సమస్యను సమూలంగా నాశనం చేయాలి… ఎంతో నమ్మకంతో సింహాద్రి పిల్లని తన వద్ద వదిలి వెళ్ళింది. తను ఆమెకు మాటిచ్చి తప్పుచేసిందా? […]
జ్ఞాపిక (తృతీయ ప్రత్యేక సంచిక కథ) -దామరాజు విశాలాక్షి “ఇది కఛ్చితంగా నీ పనే. ముందు నుండీ ఆ బొంత చూసి ఛీదరించు కుంటున్నావు.. ఏ చెత్తల బండిలోనో పడేసినావా ? నన్నుకూడా పడేయే ,నీకళ్ళు చల్ల బడతాయి నా నేస్తురాలు సచ్చిపోయిందంటే సూడ్డానికెళ్ళాను .. పొద్దున్నెల్లి సాయింత్రానికి వచ్చాను గదే! ఏడుస్తోంది ముసల్దిసత్తెమ్మ ” … “నాకు తెలియదంటే నమ్మవేం? అయినా, దొంగతనంగా నేనెందు కు పడేస్తాను,చెప్పి చెప్పి చిరాకేసి […]