• ‘నెచ్చెలి’ లో స్త్రీలు (లేదా) స్త్రీలకు సంబంధించిన రచనలు (పురుషులు రాసినవైనా) ప్రచురణకు తీసుకోబడతాయి. ఏ రచన అయినా స్త్రీలను కించపరిచేదిగా ఉన్నట్లయితే నిర్ద్వంద్వంగా తిరస్కరించబడుతుంది.
  • మీ రచన విధిగా యూనీకోడ్ లో టైప్ చేసి ఉండాలి.
  • రచనలు తప్పనిసరిగా అచ్చుతప్పులు లేకుండా ఉండాలి.
  • రచనలు ఈ-మెయిలు కు వర్డ్ డాక్యుమెంట్ గా జతచేసిగానీ, డైరక్టుగా ఈ-మెయిలు లో రాసి గానీ పంపించాలి. పిడిఎఫ్ లు, చేతివ్రాత తో రాసి పంపిన ఫోటోలు వంటివి స్వీకరించబడవు.
  • రచనలతో పాటూ ‘నెచ్చెలి’ లోప్రచురణకు హామీపత్రం తప్పనిసరిగా ఈ-మెయిలుకి జతచేయాలి.
  • నెచ్చెలి ప్రతినెలా 10 వ తారీఖున వెలువడుతుంది. 
  • మీ రచనలను ప్రతినెలా  20వ తారీఖుకు editor@neccheli.com కు తప్పనిసరిగా అందేలా పంపించండి. ఆ తరువాత అందిన రచనలేవైనా  ప్రచురణార్హం అయినట్లయితే తరువాతి నెలలో ప్రచురింపబడతాయి.
  • మొదటి సారి ‘నెచ్చెలి’ కి మీ రచనని పంపుతున్నట్టయితే మీ ఫోటో, 5 లేదా 6 వాక్యాల్లో బయోడేటా కూడా పంపించండి. 
  • ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాని రచనలు మాత్రమే పంపాలి.
  • ‘నెచ్చెలి’ కి మీ అభిప్రాయాలూ, సూచనలూ editor@neccheli.com కు తెలియజేయండి.
  • *‘నెచ్చెలి’ లో ప్రచురించిన వారం రోజుల లోపులో మీ రచనని మీ సొంత బ్లాగుల్లో, ఫేస్ బుక్ లాంటి సైట్లలో ప్రచురించుకోదలచుకుంటే ‘నెచ్చెలి’ లింక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు.
  • నెలవారీ/పోటీలకు రచనలు పంపేవారు విధిగా నెచ్చెలి పత్రిక కు, నెచ్చెలి యూట్యూబ్ ఛానెల్ కు, నెచ్చెలి వాట్సాపు గ్రూపుకి, నెచ్చెలి ఇన్స్టాగ్రామ్ కి    సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. ఇవి మూడూ పూర్తిగా ఉచితం. 
  • సమీక్షల కోసం పుస్తకాలు పంపవలసిన చిరునామా-

Neccheli,

17605, Calle Siena Ct,

Morgan Hill,

California – 95037

USA 

28 thoughts on “రచనలు-సూచనలు”

  1. నేచ్ఛేలి చాల కా లం నుంచి తెలుసు. ఇప్పుడు మళ్లి నెచ్చెలి తోటి స్నేహం మొదలయింది. ఒక రచయితగా నెచ్చెలితో స్నేహం చేసే అవకాశం ఇవ్వగలరా. నా కధలు కొన్ని తరుణి అంతర్జాల పత్రికలో కూడా ప్రచురిత మవుతున్నాయి.

      1. చాల సంతోషమండీ. త్వరలో నా కథతో కలుస్తాను.

        1. డియర్ డా||కె.గీత గారు
          మీకు నేనొక ఇంగ్లీష్ స్టోరీ “Deep down…..” , నా సొంత రచనను నవంబర్ 10,2023, తరువాత పంపించాను . దయచేసి ఆ కథ యొక్క స్టేటస్ తెలియచేయగలరా?

  2. క్రితం రోజుల్లో వార, మాస పత్రికలు ఇంట్లో పోటీ పడి చదివే వాళ్లము ఎందుకంటే ఒకే కాపీ, అందరికీ ఆతృత, తొందర. కానీ ఇప్పుడు ఎవరి ఫోన్ లో వాళ్లు, ఎవరి laptop లో వాళ్ల తీరిక సమయాల్లో చదువు కొనవచ్చును. ఈ టెక్నాలజీ బెనిఫిట్.

  3. మేడమ్ నమస్కారం ! గ్రూపులో రచనలకు పుస్తక సమీక్షలకు ఆహ్వానం పలికారు .ఎంత వెతికినా పుస్తక సమీక్షకు పుస్తకం ఎలా పంపాలో ఎవరికి పంపాలో తెలపండి .నమస్కారం ….రత్నాకర్ పెనుమాక

  4. అమరవేణి వెంకటరమణ , శివాజీ నగర్, ఖానాపూర్, నిర్మల్ జిల్లా. says:

    స్త్రీ లకు సంబంధించిన ఏ సాహిత్య ప్రక్రియ లో నైనా రచనలు ఉండవచ్చునా? నేను పద్యాలు, వచన కవిత్వం, గేయాలు రాస్తాను.ఇలాంటివి పంపిచవచ్చా.

    1. వెంకట రమణ గారూ! తప్పకుండా పరిశీలనకు పంపండి.

  5. మేడమ్, మీరు కవులు (మగ వారి )గురించి రాసి పంపితే పత్రికలో వేసుకొంటారా. ప్రముఖ సాహితీవేత్త, విమర్శకుడు కీ. శే. Dr. Vadali మందేశ్వరరావు గారి గురించిన జీవిత విశేషాలను పంపడానికి. దయచేసి telupagalaru.

  6. రచనలు యూనికోడ్ కీ బోర్డు లో మాత్రమే ఎందుకు టైప్ చేయాలో దయచేసి తెలియజేయగలరు మేడం ధన్యవాదాలు

    1. యూనికోడ్ లో మాత్రమే ఆన్ లైన్ లో సపోర్టు ఉంది. దానికి కొత్త కీబోర్డ్ అవసరం లేదు. https://lekhini.org/ లో కానీ, గూగుల్ ఫాంట్స్ లేదా, సెల్ఫోను లో కూడా టైపు చెయ్యవచ్చు షమీం గారూ!

  7. ట్రావెలాగ్స్ పంపాలంటే ఎలా పంపాలి?, ఎంత నిడివి ఉండాలి?, ఫొటోలు జతచెయ్యొచ్చా?, చెయ్యొచ్చు అంటే ఎన్ని ఫొటోలు ఉండొచ్చు, తెలియజేస్తారా? ప్లీజ్

    1. Please send the travelogue as you wish Nagalakshmi Garu. We will contact you if there is anything needed.

  8. The email address given seems to be not working. I tried sending my work and got an email saying the address doesn’t exist. Please provide the correct email address for submitting article

      1. Madam
        This is to bring to your kind notice that I have not received any rejected / accepted message from you about my article on ANGARA SWAPNAM by Urmila garu.
        Will you please confirm it and make it clear whether it is received or not.
        Thankyou. Your reply will be greatly appreciated.

  9. చాలా ఆలస్యంగా మహిళల కోసం నెచ్చెలి అనే పత్రిక ఉంది అని తెలుసుకున్నందుకు నన్ను నేను నిందించుకుంటున్న..
    .ఎప్పుడో..చదివిన వనిత, వనితాజ్యోతి వంటి పత్రికల్ని మళ్ళీ చూస్తున్నంత ఆనందంగా ఉంది…అన్ని శీర్షికలు .చాలా…బావున్నాయి…..

    1. థాంక్స్ అరుణ కుమార్ గారూ! మీకు నెచ్చెలి పత్రిక నచ్చుతుందని ఆశిస్తాను. – ఎడిటర్

  10. సంవత్సరం పాటు దిగ్విజయంగా నడిచిన నెచ్చెలిని మొదటిసారి ఇప్పుడే చూసాను. నిజంగా చాల సంతోషంగా వుంది, స్త్రీల కోసం ఒక అంతర్జాల పత్రిక వుండడం. ప్రభుత్వ కళాశాలలో పని చేసిన అమ్మాయి అనగానే, ఒక ఆత్మీయత ( నేను ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ గా రిటైర్ అయ్యాను), ప్రముఖ రచయిత్రి కె.వరలక్ష్మి గారమ్మాయి అనగానే మరింత అభిమానం. దుర్గ, మల్లమ్మ వంటి కథలు చాల బాగున్నాయి. గత సంచికలు అన్నీ చదవాలి అన్న ఉత్సుకతతో , ప్రస్తుతానికి సెలవు.

    1. సుశీల గారూ! మీవంటి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ గారికి నెచ్చెలి నచ్చినందుకు గర్వకారణంగా ఉంది. పత్రికను చదివి, కామెంట్ పెట్టినందుకు చాలా సంతోషమండీ. మీకు నచ్చిన రచనల దగ్గర కూడా కామెంట్స్ పెట్టగలరా? రాసిన వారికి ఉత్సాహాన్ని ఇస్తాయి.

Leave a Reply

Your email address will not be published.