నీకు నా ప్రేమ ఎట్లా చెప్పను, హైదరాబాద్?

ఆంగ్ల మూలం: మౌమితా ఆలం

తెలుగు సేత : ఎన్ వేణుగోపాల్

ఎండోస్కోపీ గదిలో
అక్క నా నొప్పిని లాగేస్తున్నప్పుడు
నువు రచించిన సుమధుర తెలుగు పదాల ప్రేమను
నా నుదుటి మీద అక్షరాలలో అనుభవించాను.
పక్కగది లోంచి ప్రతిధ్వనిస్తున్నాయి
నా బిడ్డల ఏడుపులూ నవ్వులూ
అమ్మల అనువాదాల భాషలో.
నాకు నీ లిపులూ అక్షరాలూ తెలియవు
కాని, హైదరాబాద్
నీ ప్రతిఘటన స్వరాలను
నా చర్మం మీద స్పర్శలో
అనుభవిస్తూనే ఉంటాను.
పొరలు పొరలుగా చిక్కని హలీం
నా నోట్లో ఇంకా కదలాడుతున్నది
నా పదాలకు
నీ నాలుక అక్షరాలు తొడుగుతున్నట్టు
నా విమానాశ్రయ దారి
వసంతపు పసుప్పచ్చ పూలను సింగారించుకున్నట్టు.
గత రాత్రి సంగీత గాన ప్రాంగణంలో నన్ను నేను
ఇక్కడే వదిలేసి పోతున్నాను.
పొద్దుపోయిన రాత్రి చాయ్ కప్పులలో
తొణికిసలాడిన ప్రేమ
కారుచీకటి రాత్రిలోనైనా
బండరాతి గుండెలనైనా ఓడిస్తుంది.
ఆకుల లాంటి అక్షరాలు
గాలిలో ఎగసి ప్రతి బాటసారినీ
నీ వెచ్చని గుండెలనూ తాకుతాయి.
నా నెచ్చెలి ఇంటి కిటికీ పక్కన
చింతచెట్టులా నన్ను సమున్నతంగా నిలబడనీ
మబ్బుపట్టిన సాయంకాలం
సూర్యకాంతి కిరణాలలా
పడమటి గాలిలో చింతచెట్టు కురులు
తేలియాడుతున్నాయి.
జనసమ్మర్దపు చార్మినార్
సందుల్లో దారి తప్పిన ఇద్దరు మహిళలు
నీ గురించిన విలువైన జ్ఞాపకం
హైదరాబాద్, నాతో తీసుకువెళ్తున్నాను.
నేను ప్రేమలో పడ్డానని ఎట్లా చెప్పను
రక్కసి అస్థిపంజరాలతో కాదు
నీ కళ్లలో నిరంతరం
జ్వలిస్తుండే జ్యోతులతో
ప్రేమలో పడ్డానని.
నీకు నా ప్రేమ ఎట్లా చెప్పను, హైదరాబాద్?
***
(హైదరాబాద్ మీద మౌమితా ఆలం ప్రేమగీతం: హైదరాబాద్ నుంచి బొంబాయి, బొంబాయి నుంచి కోల్కతా విమానాలలో మార్చ్ 22, 2024)
 
(సంపన్నుడికీ పేదరాలికీ మధ్య, రాకుమారుడికీ నర్తకికీ మధ్య, రాజప్రాసాదానికీ ఊరవతలి చెంచుల పల్లెకూ మధ్య, ఒక ముస్లింకూ ఒక హిందువుకూ మధ్య, ఉర్దూకూ తెలుగుకూ మధ్య, మూసీ ఉత్తరానికీ దక్షిణానికీ మధ్య, ఒక సంస్కృతికీ మరొక సంస్కృతికీ మధ్య ప్రేమ వారధి మీద పుట్టిన నగరం హైదరాబాద్. ఈ మహా జనావాసపు పునాదిరాయి మహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా ప్రేమాకాంక్షల కవిత. ఈ నాలుగువందల ముప్పై మూడేళ్లలో హైదరాబాద్ మీద ప్రేమగీతాలు రాసిన కవులెందరో ఉన్నారు. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ తో ప్రేమలో పడిన బెంగాలీ – కామతాపురి – రాజబొంగ్శి – ఇంగ్లిష్ కవి మౌమితా ఆలం కొత్త కవిత)
***
How to say I Love you, Hyderabad?
-by Moumita Alam

You write love in sweet Telugu tongues
I feel that on my forehead
When Akka peels my pains off
In the endoscopy room.

The hall room echoes the
cries and laughter of
my daughters through the
language of their translated mothers.

I don’t know the scripts and alphabet
Of yours
But I feel you, Hyderabad
on my skin through your resistance.

The thick layers of Haleem
linger in my mouth
as you drape my words
in your tongue like the spring wore
the yellow horn flowers
on my way to the airport.

I’m leaving behind myself
in last night mehfil.
The love that the late-night
tea cups hold can defeat even the
rock hard heart even
in the darkest of the time.

The leafy words fly
in the air to every passerby
and in the warm heart of yours
Let me stand tall like the tamarind tree
by the window of my friend’s house.
Her hair wafts in the west wind
like the shafts of sunshine
after the cloudy day.

The bustling char minar
and two women losing the way
in the bylanes
is a precious memory of yours
I am carrying with me, Hyderabad.

How to say I have fallen in love
Not with the monster skeletons
But with the Jyothis, forever incandescent
In your eyes.

How to say I love you, Hyderabad?
***
Moumita Alam is a poet from West Bengal. Her poetry collection, The Musings of the Dark was published in 2020. The book has about a hundred poems written in protest against the humanitarian crisis from the abrogation of article 370, the Delhi riots, and the Shaheen Bagh movement to the unbearable sufferings of the migrant labourers due to the unplanned COVID-induced lockdown. Her second poetry collection, Poems At Daybreak has been published by Red River Publications. The Telugu translations of her poems have been published in a collection titled, Poems That Should Not Be Written. The Tamil translations of her poems have been published in a collection, I Am A Muslim Women And I Am Not For Sale.

*****

Please follow and like us:

3 thoughts on “నీకు నా ప్రేమ ఎట్లా చెప్పను, హైదరాబాద్? (మౌమితా ఆలం ఆంగ్ల కవితకు తెలుగుసేత)”

  1. ఆకుల లాంటి అక్షరాలు
    గాలిలో ఎగసి ప్రతి బాటసారినీ
    నీ వెచ్చని గుండెలనూ తాకుతాయి.
    నా నెచ్చెలి ఇంటి కిటికీ పక్కన
    చింతచెట్టులా నన్ను సమున్నతంగా నిలబడనీ
    మబ్బుపట్టిన సాయంకాలం
    సూర్యకాంతి కిరణాలలా
    పడమటి గాలిలో చింతచెట్టు కురులు
    తేలియాడుతున్నాయి.

    చిక్కటి కవత

  2. అంగ్లానువాద మూలమైన కవిత భావార్థకమై సాగింది. వేణుగోపాల్ గారు అనువాదం లో కృతకృత్యులయ్యారు. ఆలం గారి భావాలకు తెలుగు పదాల చీర కట్టి సంఘర్షణ లను,సంఘటనలను కనుల ముందు సాదృశ్యం చేశారు. ఇరువురికీ అభినందనలు.

Leave a Reply

Your email address will not be published.