నీకేమనిపిస్తుంది?

(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

– నర్సింహా రెడ్డి పట్లూరి

పెరిగిన దూరానికి
రోజురోజుకూ నీ ప్రేమ ధృవంలా కరిగిపోతే..
ఒకప్పటి జ్ఞాపకాల సముద్రం
ఉప్పెనై మీద పడ్డట్టుంది.
నీకేమనిపిస్తుంది? ఆ చెక్కిళ్ళ చెమ్మని చెరిపిన చేతులు
ఇప్పుడు ఎడారులైతే..
ఆ స్పర్శలనే నువ్ చెరిపేస్తే..
నిర్జీవమే నరాల్లో పవ్రహిస్తుంది.
మరి నీకేమనిపిస్తుంది? నా నుదుట నీ తడిని
ఉత్తలవణ గీతమని
నువ్ కొట్టిపడేస్తే
తనువణువణువునూ బాణాలు తాకిన బాధ.
నీకేమనిపిస్తుంది? ఇరువురి నడుమ
ఇంకిపోని మాటల బావిని
ఏకపక్షంగా మూసేస్తే..
ఉల్కా పాతంలా నేలబడ్డాను.
మరి నీకేమనిపిస్తుంది? దూరాన్ని లెక్కచెయ్యని పాదాలు.
రెండు రెళ్ళు ఒకటనుకున్నా ను.
గణితాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను.
నీ లెక్కలేవీ అర్థంకాక
అనంతమైన అంకెలు
మీద పడ్డట్టుంది.
నీకేమనిపిస్తుంది?

*****

Leave a Reply

Your email address will not be published.