సంసారి సాలెమ్మ

-బాలాజీ పోతుల

ఓ కొడ్కా..!
నా జీవి ఎండిపోతంది
గంజి మిగిలిపోతంది
నేనిప్పుడు మందిల లేను
మనుసు మనుసుల లేదు
నా ఎదన పెట్టుకొని పెంచిన కొడ్కా మిమ్ముల!

పెద్దకొడ్కా..! మల్లేసూ..!
మల్లి రాను బిడ్డా
నీ పెల్లం పిల్లల్తోని లవు సక్కంగ ఉండు కొడ్కా

పానం గాయి గాయి అయితంటే
మనుసుల మనుసుపెట్టి మాట్లాడినవా?

ఎర్రకారం తప్ప,
ఏనాడన్న
తున్కల కూర పెట్టినవా?
నువ్వు, నీ కొడ్కులు, నీ పెల్లం
మూసుకొని నడింట్ల తిన్నరు గానీ!

సిన్న కొడ్కా..! సిరికాంతూ..!
సిన్నబోకు బిడ్డా
లవు సిన్న మనుసు నీది

దూపయితుంది కొడ్కా అంటే –
నోట్ల గుటికెడు నీళ్లు పోసుడు ఇడ్సి
ఇంటి ముంగట బోరింగ్ల
నీళ్లు పట్కచ్కొని తాగ్మన్నవ్!

ఆకలయితుంది బిడ్యా అంటే –
నీ పింఛన్ పైసలింకా రాలేదే
ముసలిదానా అని తిట్టినవ్

ఆడిబిడ్యల్లేని నా బత్కు
ఎన్నెల్ల అమాసయింది!

*****

0 thoughts on “సంసారి సాలెమ్మ (కవిత)”

  1. కండ్లల్ల నీల్లు వెట్టుకుంటే ఏమైతది సాలెమ్మా , ఐలమ్మ లెక్క తిరగవడు రజాకార్ కొడుకుల మీద

Leave a Reply

Your email address will not be published.