నువ్వు కూడా..? (కవిత)

నువ్వు కూడా..? -డా.నల్లపనేని విజయలక్ష్మి ఈ గాయం అనాది కదా అయినా ఇవాళ కొత్తగా బాధ పెడుతున్నది కురుసభలో కాపాడబడిన ద్రౌపది మానం మిత్ అని ఎప్పుడో తెలిసింది మౌనంగా వేడుక చూసే పెద్దమనుషులూ తొడ చరిచి అశ్లీలపు సంజ్ఞలు చేసే మగమహారాజులూ ఎరుక లోనివారే నీ దేహం ఒకనాడు వీర భోజ్యం కులమత దురహంకారం తిట్లలోనూ నీతో రమిస్తుంటే తలదించుకున్న తల్లివి నువ్వు నాగరికారణ్యంలో తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్ నీ అస్తిత్వ […]

Continue Reading
Posted On :

వానొచ్చింది (కవిత)

వానొచ్చింది -చిలుకూరు ఉషారాణి వానొచ్చింది ఉరుముల మెరుపులతో శబ్దం చేస్తూ మండుటెండల్లో హఠాత్తుగా.. మాగాయ పచ్చడికోసం మామేడ పైన ఆరబెట్టిన మామిడి కాయల ముక్కల రుచి చూడాలని కాబోలు. ఊరిస్తున్న ఊరమిరపకాయల ఘాటును కూడా తగ్గించాలని అనుకుందేమో ! వానొచ్చింది వసారా పైరేకులపై దభా దభా మని బాదుతూ .. పిలుస్తుంది గట్టిగా.. ఒంటరిగా కూర్చొని చరవాణి ఆటలో మునిగున్న నన్ను కలవాలని కాబోలు, వాళ్ళమ్మకు కూడా చెప్పకుండా వచ్చినట్లుంది, కాసేపు నాతో సరదాగా కలిసి ఆడుకోవాలని. […]

Continue Reading
Posted On :

అంతు చిక్కని దాన్ని (కవిత)

అంతు చిక్కని దాన్ని -డా.చీదెళ్ళ సీతాలక్ష్మి భూమికి గొడుగై విస్తరించి విశ్వమంతా వ్యాపించి కడుపులో దాచుకున్న నీటిని మేఘాల తోడునీడగా నా ఆవేశాన్ని మధ్య మధ్యలో గుమ్మరిస్తూ నా బాధను వెళ్లగక్కుతూ భూదేవితో నివేదన అది నా ఆవేదన!! అలసట లేక పగలు రాత్రి తెలియక సూర్యచంద్రుల గమనానికి ఆసరా నా కళ్ళే వెలిగే తారలు తుది మొదలు లేక లెక్కల్లో తేలక అంతు చిక్కలేక అందరికి అందని దాన్ని అందరి దాన్ని!! శూన్యమైన నేను అవసరం […]

Continue Reading
Posted On :

కరదీపం (కవిత)

కరదీపం -శింగరాజు శ్రీనివాసరావు చీకటిపడితే శరీరంమీద సమ్మెటపోట్లు తెల్లవారితే ముందురోజు పడినకష్టానికి వచ్చేకాళ్ళు ఎప్పటిలాగే సారాయిదుకాణం, చీరకొంగున కట్టిన చిల్లరనాణాలను పట్టుకుని వెళ్ళిపోయింది ఎండిపోయిన కళ్ళనుంచి చినుకు రాలలేదు ఫర్లాంగు దూరంలో ఎదురుచూసే అంట్లబోకులు కనిపించాయి తాళికట్టిన పశువు ఆకలితీర్చిన దేహానికి బాధపెట్టే మరో జానెడు ప్రాంతం నేనున్నానని అరిచింది చావలేక బ్రతుకుతున్న ఎండుకట్టె పెదవులు విరుస్తూ తుడవలేని తలరాతమీద రుద్దుకుంటు పొయ్యి వెలిగించింది వయసు వాంఛ నేలమీదకు వదలిన సాక్ష్యం దేవునితో మంతనాలు ఆపి ఆకలికేక […]

Continue Reading
Posted On :

ఒక్కసారి జవాబుగా మారి ఎదుటకురా…. (కవిత)

ఒక్కసారి జవాబుగా మారి ఎదుటకురా…. -చందలూరి నారాయణరావు రోజులోఏదో ఓ సమయంలోమాటల షార్టు షర్క్యూట్చీకటిలో ఉండిపోతంమౌనం ఇద్దరినీ నంజుకు తింటుంది.. ………..కాసేపు ఆగకతగాదా అని నీవుకాదని నేను………..నేను అడిగిందే కావాలనిఇష్టం యుద్ధం చేస్తుంది నీతోస్పందన లేకుండా గంట మాట్లాడతావుచప్పుడు లేకుండా…………నీకేమి కావాలో చెప్పవునీకేది ఇవ్వాలో తెలియదు.దేనికి చప్పుడు చేయకుండాఏది అర్దం కాదు…..అర్దముండదు…….కానీ ఏదో ఓ క్షణంలోఇద్దరం కలిసినప్పుడుదూరంగా మన మాటలు, చూపులువెక్కిరిస్తుంటేనా భుజంపై వాలి బాధపడతావు……నేనేం చేయాలి?మనమేమి కావాలి?ఒక్కసారి జవాబుగా మారి ఎదుటకురా….జీవితం ఎప్పటికీమనల్ని ఓడించలేదు… ***** […]

Continue Reading
Posted On :

ఊపిరితో ఊదుకుని…… (కవిత)

ఊపిరితో ఊదుకుని…… (కవిత) – శ్రీ సాహితి గుండెను అక్షరంతో తవ్వుతుంటే కంగు కంగుమనే కాలం మ్రోతకు గాఢ నిద్రలో మనసు ఉలిక్కిపడి గాయపడ్డ నిజాలని ఊపిరితో ఊదుకుని పడిన మచ్చలను నిజాయితీతో మాన్పి జీవితమంతా మెరిసే ఒక్క కలను తృప్తిగా పొదువుకోవాలని ఉంది ***** మా ఊరు అద్దంకి, ప్రకాశం జిల్లా, (ఆంధ్రప్రదేశ్.) నేను ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీ లో బి.ఫార్మసీ చదువుతున్నాను.నాకు చిన్నప్పటి నుండి తెలుగులో శతక పద్యాలు అంటే ఇష్టం. అలాగే మా […]

Continue Reading
Posted On :

శూన్య తత్వం (కవిత)

శూన్య తత్వం -గవిడి శ్రీనివాస్ ఆకాశ ఎడారి నుంచి చూపులు వేలాడేసుకుని దిక్కులు చూస్తున్నప్పుడు శూన్య తత్వం బోధపడుతుంది. కలలకి కన్నీళ్ళకి మధ్య దూరాన్ని చెరిపి అతి దగ్గరగా చూసినప్పుడు నిశ్శబ్దంలోంచి జీవిత సత్యం అవగతమవుతుంది. గుప్పెడు కన్నీళ్ళని పట్టుకుని వేలాడటం కాదు జీవితం. రాత్రి వెనుక పగలు దాగున్నట్టు దుఃఖః ఆవల సుఖం మౌనంగా కాలం కోసం ఎదురుచూస్తోంది. ఏమీ తోచనప్పుడు దిక్కులు చీకట్లతో మూసుకున్నప్పుడు మౌనం పరమావధిగా కాలాన్ని చెక్కు కోవాలి. ఆనంద తీరం […]

Continue Reading
Posted On :

సంసారి సాలెమ్మ (కవిత)

సంసారి సాలెమ్మ -బాలాజీ పోతుల ఓ కొడ్కా..! నా జీవి ఎండిపోతంది గంజి మిగిలిపోతంది నేనిప్పుడు మందిల లేను మనుసు మనుసుల లేదు నా ఎదన పెట్టుకొని పెంచిన కొడ్కా మిమ్ముల! పెద్దకొడ్కా..! మల్లేసూ..! మల్లి రాను బిడ్డా నీ పెల్లం పిల్లల్తోని లవు సక్కంగ ఉండు కొడ్కా పానం గాయి గాయి అయితంటే మనుసుల మనుసుపెట్టి మాట్లాడినవా? ఎర్రకారం తప్ప, ఏనాడన్న తున్కల కూర పెట్టినవా? నువ్వు, నీ కొడ్కులు, నీ పెల్లం మూసుకొని నడింట్ల […]

Continue Reading
Posted On :

అతని ప్రియురాలు (కవిత)

అతని ప్రియురాలు -డా||కె.గీత అతని మీద ప్రేమని కళ్ళకి కుట్టుకుని ఏళ్ల తరబడి బతుకు అఖాతాన్ని ఈదుతూనే ఉన్నాను అది మామూలు ప్రేమ కాదు అతని కుటుంబపు నిప్పుల గుండంలో వాళ్ళ మాటల చేతల కత్తుల బోనులో నన్ను ఒంటరిగా వదిలేసే ప్రేమ- చస్తున్నా మొర్రో అంటే చావడమే శరణ్యమైతే చావమనే ప్రేమ భరించలేను బాబోయ్ అంటే పారిపోవడమే ఇష్టమైతే పొమ్మనే ప్రేమ అయినా సిగ్గూ శరం లేకుండా ఆత్మాభిమానాన్ని చిలక్కొయ్యకి ఉరితాడేసి బిగించి కూపస్థ మండూకాన్నై […]

Continue Reading
Posted On :

దరి చేరని వసంతం !!

దరి చేరని వసంతం !! -ఇందు చంద్రన్ అతనో వసంత కాలపు అతిథి ! ఎండుటాకుల మధ్య చిగురిస్తూ పుట్టుకొస్తుంటాడు. ఓ వైపు వేసవి మంటలు మరో వైపు గడ్డ కట్టే చలి… రెండు కలగలిసే సంధ్యా సమయాన కనిపిస్తాడు. అప్పుడుపుడూ కలల్లోనూ, కొన్ని సార్లు నిజంగాను కనిపిస్తుంటాడు. వెచ్చని సూర్య కిరణాలు తాకినప్పుడో, చలికి బిగుసుకు పోయినప్పుడో ఏదైనా తింటూ పొలమారినప్పుడో అద్దంలో అందంగా చూసుకున్నపుడో గుర్తొస్తాడు. అనుకోని అతిథిలా ! ఆకలి, దప్పికల్లాగే అతని […]

Continue Reading
Posted On :

నీతో పడవ ప్రయాణం (కవిత)

నీతో పడవ ప్రయాణం -గవిడి శ్రీనివాస్ నేనిప్పుడు నీ జ్ఞాపకాలతో పడవ ప్రయాణం చేస్తున్నాను. ఏటు ఒడ్డున ఆగి ఇసుక గూళ్లలో దాగి నీ పరిమళ సుగంధాన్ని పీల్చుకుంటున్నాను. నీ వొడిలో వాలి నక్షత్రాల్ని లెక్కపెట్టడం నీ కౌగిలిలో క్షణాలు ఆగిపోవడం. అలా ఊపిరి సలపని జ్ఞాపకాలతో నలిగిపోతున్నాను. నేను నిశ్చలంగా ఉండలేను కొలమానాల కారణంగా దూరం గా సాగిపోయావు. చిన్ని జీవితానికి వెన్నెల జ్ఞాపకాలు వేదన రోదనలు తప్పా మాటల స్పర్శే లేని ఒంటరి జీవితాలకి […]

Continue Reading
Posted On :

ఇంకెంత ఇష్టమో ఈ నిజానిది? (కవిత)

ఇంకెంత ఇష్టమో ఈ నిజానిది? -చందలూరి నారాయణరావు చీకటి బాగా కాసి మనసును పులిమినప్పుడు పాత కలే చిరిగిన గుడ్డల్లో మాసిన ముఖంతో కోరిక తలుపు కొడుతూనే ఉంది. రెండు క్షణాల వయసులోనే ఇష్టం ప్రేమగా పరవశమై తన నీడనే తనే తొడుక్కుని తలలో కంటికెదురుగా లోతు ప్రశ్నలతో యుద్ధనౌకలో పొలిమేర దాకా సాగే కలవరింత వేడుకలో పరిమళిస్తూ దిక్కు తెలియకుండానే దారితో పనిలేకుండా ఆశ సువాసనతో గెంతులేసుకుంటూ గాలితో కలసి లోపల చేసే ప్రయాణంలో ఇంకెంత […]

Continue Reading
Posted On :

మా తాతదీ గుండె కోతనే! (కవిత)

మా తాతదీ గుండె కోతనే! -బాలాజీ పోతుల నా రాతలు చూసీ, ఈనికో పెద్ద నౌకరీ అస్తే, మంచిగుండనీ, మా తాత దినాం దేవులడుతడు ఆరిన, నా బతుకు దివిటీ ఎల్గించన్కి. చేత్లకు పైసరాని పని అదేం పనిరా అని కసురుకుంటడే గానీ, ఉన్నకాడికి కడుపు నింపుతడు. ఒగని కడుపుగొట్టి గాదు బిడ్డ్యా! ఆ కొట్టినోళ్లని మొకం మీద కొట్టినట్టు బతుకాలంటడు. ఏం చెప్తవే రోజూ, అని నేనంటే – ఇయ్యాల మేమున్నం, రేపట్పొద్దు ఉంటమో లేమో […]

Continue Reading
Posted On :

స్వీయ సంరక్షణా బాధ్యత – జసింటా కేర్కెట్టా (ఆదివాసీ కవి)

స్వీయ సంరక్షణా బాధ్యత మూలం: జసింటా కేర్కెట్టా (ఆదివాసీ కవి) ఆంగ్లానువాదం: భూమికాచావ్లా డిసౌజా తెలుగు సేత: వారాల ఆనంద్ వాళ్ళు వాళ్ళ భగవంతుణ్ణి తీసుకొచ్చారు మీ పాపాల్నుంచీ మిమ్మల్ని విముక్తుల్ని చేస్తామన్నారు ‘మేమేం పాపాలు చేశామని’ అడిగాం వాళ్ళు దిక్భ్రమ చెందారు పాపాల్ని మోక్షాల్నీ పేర్కొనకుండా వారి భగవంతుని ఉనికిని ఎట్లా స్థాపిస్తారు ‘మీరేంత పేదవాళ్ళుగా, వెనకబాటుగా వున్నారో చూడండి’ అన్నారు వాళ్ళు ఇదంతా మీ మీ పాపాల ఫలితమే అన్నారు మా విశాలమయిన మా […]

Continue Reading
Posted On :

అమ్మ ఆవేదన! (కవిత)

అమ్మ ఆవేదన! -దయాకర్ రావుల మధ్యలో నిలబడి చుట్టూ వలయం గీసుకున్నా! వలయంలోకి కొంత మందినే ఆహ్వానించా! వాళ్ళతో సంతోషంగా ఉన్నా! కావాల్సినవన్నీ సమకూర్చి ఇచ్చా! ఏం అయ్యిందో ఏమో గానీ మెల్లి మెల్లిగా వలయం కాళీ అయ్యింది! రోజు రోజుకి చిన్నది అయ్యింది! నేను తప్ప ఎవరూ పట్టలేనంత! ఇంకో మనిషికి చోటు లేనంత!! నాపై నాకు ధ్యాస తప్పింది! శ్వాస ఇబ్బంది అయ్యింది! చుట్టూ నిర్మాన్యుషం! భరించలేనంత నిశ్శబ్దం! అయినా వలయం నుండి బయటకి […]

Continue Reading
Posted On :

ఎంతో కొంత మిగిలే వెలితివే (కవిత)

ఎంతో కొంత మిగిలే వెలితివే (కవిత) – శ్రీ సాహితి నీవు నిరంతరం ఏదో కోరికలా ఏ పేరుతో పిలచుకున్నా చెదరని అందంతో గర్వపడే లోపలి లోకంలో నాటు పడిన ఒక్క మాటగా అర్దమెంత కోసినా ఎంతో కొంత వెలితివే. ఎంత కురిసినా ముఖంలో మొలకెత్తని నిజానివే. నీకేమీ కావాలో తెలియకుండా తవ్వుకునే ప్రశ్నవే. నాతో పని లేకుండా ఏది అడగకుండానే బాగా తెలిసిన ఇష్టాలతో అన్నీ వేళలా అన్నీ చోట్ల… నా లోపలే ఉంటావు ఓ […]

Continue Reading
Posted On :

బతుకు పుస్తకం (కవిత)

బతుకు పుస్తకం -లక్ష్మీ శ్రీనివాస్ గాయ పడ్డావో జ్ఞాపకాలతో బంధింప పడ్డావో అవమానాల వలలో చిక్కుకొన్నావో తెలియని అయోమయ స్థితిలో మునక లేస్తున్నావా?? నిన్ను నువ్వు చూడాలా నువ్వు ఎక్కడ ఓడిపోయావో ఆ చోటు నుంచి నిన్ను నువ్వు చూడడం మొదలు పెట్టు. నువ్వు ఎంటో అర్థం అవుతుంది నీ గమ్యం ఎంటో తెలుస్తుంది తల దించిన చోటే తల ఎత్తేక్షణం నీ ముందు ఆవిష్కరింప బడుతుంది ఆ క్షణాన్ని ఆయుధంగా మార్చుకొంటే నీ జీవితం మరో […]

Continue Reading
Posted On :

గానుగ యంత్రం – కేహ్రీ సింగ్ మధుకర్ (డోగ్రీ కవిత, తెలుగు సేత: వారాల ఆనంద్ )

గానుగ యంత్రం – కేహ్రీ సింగ్ మధుకర్ ( డోగ్రీ కవిత)                                                   ఇంగ్లీషు అనువాదం: కేహ్రీ సింగ్ మధుకర్ తెలుగు సేత: వారాల ఆనంద్ గానుగ యంత్రం గర గరలాడుతూ పని చేస్తుంది ఎద్దు దాని వెనకాలే క్రమం తప్పకుండా స్థిరంగా […]

Continue Reading
Posted On :

చాక్ పీస్ (కవిత)

చాక్ పీస్ (కవిత) -వి.విజయకుమార్ చిరిగిన రంగు పేలికల్ని మింగి చక చకా ఇంద్రధనువుల్ని లాగే విదూషకుడి చేతుల్లా ఎన్ని వక్రాలు తిరుగుతావో ఎన్ని వయ్యారాలు పోతావో జ్ఞాన మూర్తి హస్తాల్లో చైతన్యపు తీవలై హొయలు పోతూ చిటికెడు బూడిదై లయించి పోతూ ఆవిరై చివరికి అంతమయ్యే జీవితమే అయినా అంతో ఎంతో ఘనీభవిస్తూ ఒకింత జీవితాన్ని పెంచుకుంటుంది కొవ్వొత్తి వెలుగివ్వడం కోసమే అనుకో- అణువు అణువుగా రాలిపోతూ హారతై హరించిపోతూ అప్పటికప్పుడే అదృశ్యమై పోతావు మరి […]

Continue Reading
Posted On :

ఆమె కాని ఆమె (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

ఆమె కాని ఆమె (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) -భూపాల్ మాసాయిపేట్ కుందేలులా దుంకుతూ ఆనందంతో ఆకాశాన్ని తాకేది. అందరూ ఆ అమ్మాయిని చూడు..ఎంత చక్కగా నడుస్తుందో అన్నారు. ఆమె తాబేలుగా మారి వయ్యారంగా నడిచింది. గాన కోకిలలా పాడుతూ ప్రపంచాన్ని మైమరిపించేది. అందరూ ఆ అమ్మాయిని చూడు..ఎంత చక్కగా మాట్లడుతుందో అన్నారు. ఆమె రామచిలుకగా మారి చిలక పలుకులు పలికింది. నెమలిలా ఆడుతూ తన బావాల కురి విప్పేది. అందరూ ఆ […]

Continue Reading
Posted On :

తొలి కవిత – అరవింద్ (డోగ్రీ కవిత, తెలుగు సేత: వారాల ఆనంద్ )

తొలి కవిత – అరవింద్ ( డోగ్రీ కవిత)                                                                         ఇంగ్లీషు అనువాదం: శివనాథ్ తెలుగు సేత: వారాల ఆనంద్ పొగమంచు ఆవరించిన ఓ సాయంకాలాన్ని గురించి […]

Continue Reading
Posted On :

మౌన సాక్షి (కవిత)

మౌన సాక్షి (కవిత) -వి.విజయకుమార్ ఎన్ని చేదు జ్ఞాపకాల మౌనసాక్షివి నీవు ఎన్ని సంతోషాల నిశ్శబ్ద మౌనివి నీవు నాలుగు దశాబ్దాల జీవితపు ఆనవాలు నువ్వు మాకు బతుకు నిచ్చిన జన్మవి నువ్వు నీడ నిచ్చిన జననివి నువ్వు మా సంతోషాల్నీ దుఃఖాల్నీ మాతో పాటూ పంచుకొని గుండెల్లో దాచుకున్న బంగారు తల్లివి నువ్వు రెక్కలొచ్చి ఎగిరిపోయాక మిగిలి ప్రిదిలిన పక్షి గూడులా బావురు మంటూ ఎంత హృదయ విదారకంగా ఉన్నావిప్పుడు ఒకనాడు నీ లోగిల్లో వెల్లి […]

Continue Reading
Posted On :

నిర్భయనై (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

నిర్భయనై (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) -ఎస్.కే.ఆముక్తమాల్యద స్వాప్నిక జగత్తులో విహరిస్తూన్న వేళ… ప్రకృతికి పరవశిస్తూ… కొండలు, లోయలు, వాగులు, వంకలు ఎన్నెన్నో దాటి కీకారణ్యంలోకి ప్రవేశించాను పులులు, సింహాలు, తోడేళ్లు, పాములు.. ఆప్యాయంగా..ఆర్ద్రంగా దయాపూరిత దృక్కులు ప్రసరిస్తూ. .. స్నేహ పరిమళాలు వెదజల్లుతూ.. వాటిని ఆఘ్రాణిస్తూ నేను.. కృూర మృగాల ప్రేమ జడిలో తడిసి ముద్దవుతూ నిర్భయనై హాయిగా సంచరించాను. సుషుప్తి నుంచి జాగృదావస్థలోకి రాక తప్పలేదు జనారణ్యంలోకి ప్రవేశింపకా తప్పలేదు. […]

Continue Reading
Posted On :

స్వీయ నిర్వచనం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

 స్వీయ నిర్వచనం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) -టి. రాజగోపాల్ గాయపరచి వికలం చేసిందెవరో జ్ఞాపకాల్లోంచి చెరిపేశాను చెయ్యందించి వదనాన చిరునవ్వులు మళ్ళీ పూయించిందెవరో స్మృతిలో పదిలం చేసుకున్నాను ప్రేమ , అనురక్తి , మాయనే మాయని స్ఫూర్తి , దూర దృష్టి , విసుగెరుగని పరిశ్రమలతో నెయ్యం వియ్యం కలుపుకుని అడుగులేస్తాను పరిపూర్ణంగా మనోనేత్ర దర్పణంలో నన్ను నేను దర్శించుకుంటాను బహిరంతర ఆహార్యాలు సరిదిద్దుకుంటాను నేనెవరో నాకు సందిగ్ధాలూ సంతాపాలూ లేకుండా […]

Continue Reading
Posted On :

ఆమెను పట్టించుకుందాం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

ఆమెను పట్టించుకుందాం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) -వెంకు సనాతని పొద్దుపొడవక మునుపే బడలికను విదిలించి నడక మొదలుపెడుతుంది పొద్దుపోయాక ఎప్పుడో ఆమె పరుగుకు విరామం దొరుకుతుంది టైము టంగుమనక ముందే టంచనుగా పనులన్నీ చక్కబెట్టడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య ఇంటి పనంతా ఆమెదే, బయట పనికి కుదిరినా కూడా… సూర్య చంద్రులకైనా అలుపుంటుంది కానీ, అవనికి అలంకారమైన ఆమెకు దైనందిత జీవన గమనంలో ఏ మలుపులోనూ అలుపుండదు ఇష్టాయిష్టాల్ని ఎరిగి […]

Continue Reading
Posted On :

ఒక ముద్దు -కైఫి ఆజ్మీ (తెలుగు సేత: వారాల ఆనంద్ )

 ఒక ముద్దు -కైఫి ఆజ్మీ తెలుగు సేత: వారాల ఆనంద్ ఈ అందమయిన కళ్ళను ముద్దు పెట్టుకున్నప్పుడల్లా చీకట్లో వంద కొవ్వొత్తులు వెలుగుతాయి పువ్వులూ మొగ్గలూ చంద్రుడూ తారలే కాదు వ్యతిరేకులూ ఆమె ముందు మోకరిల్లుతారు అజంతా చిత్రాలు నృత్యం చేయడం ఆరంభిస్తాయి సుదీర్ఘ నిశ్హబ్దంలో వున్న గుహలు పాటందుకుంటాయి దాహార్తి అయిన భూమ్మీద వర్షపు మబ్బులు గుమిగూడతాయి ఈ ప్రపంచం క్షణకాలం నేరాల్ని త్యజిస్తుంది క్షణకాలం రాళ్లూ చిరునవ్వు నవ్వడం మొదలుపెడతాయి ***** వారాల ఆనంద్, […]

Continue Reading
Posted On :

అసలు అర్థం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

అసలు అర్థం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) -సింగరాజు రమాదేవి విషాదమేమీ ఉదాత్తమైన భావన కాదు! దాన్ని అర్ధం చేసుకుని అధిగమించేందుకు చేసే ప్రయాసలోనే ఉంది ఉదాత్తత! పిరికితనం నేరమేమీ కాదు! భయపడుతూ అయినా చేసే తిరుగుబాటు ప్రయత్నంలోనే దాగి ఉంది ధీరత్వం! నిరంతరం ఒకరి నీడలో, బేలగా పరాధీనగా బ్రతికితే అంతా ప్రశాంతమే! జీవితపు ఉపరితలం పై అలవోకగా ఆనీ ఆనకుండా అడుగులేస్తుంటే అంతా నునుపే! గుండెలనిండా ఊపిరిపీల్చుకుని బలంగా కాలు […]

Continue Reading
Posted On :

కలల కరపత్రం (కవిత)

కలల కరపత్రం -డా||కె.గీత అమ్మా! ఎందుకేడుస్తున్నావు? అప్పటిదాకా గాలిపటం ఎగరేస్తున్న బిడ్డడేడనా? ప్రపంచపటమ్మీద సరిహద్దుల కోసమో ఆధిపత్యం కోసమో కలల్ని కూలదోసేచోట గాలిపటాలకు తావుందా? రోజూ బాంబు దాడుల మధ్య తిండీ, నిద్రా లేని పసికందుల భవిష్యత్తునీ నేల రాస్తున్న చోట ఒక్కటే మళ్ళీ మళ్ళీ మొలుస్తున్నది యుద్ధ కుతంత్రం- అయినా ఎగరేయాలి- స్వేచ్ఛగా వీధుల్లో బంతాటాడుకునే బాల్యాలు మళ్ళీ మొలకెత్తేవరకు ఎగరేయాలి- నీ బిడ్డడు కూలిన భవంతుల కింద దారపు ఉండ చుట్టుకున్న చెయ్యిగానో తెగిన […]

Continue Reading
Posted On :

కలంతో ఆమె నేను (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

కలంతో ఆమె నేను (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) -చిత్రాడ కిషోర్ కుమార్ ఆమె… నేను… ఎలా ఉంటామో మాకే తెలియదు కానీ ఆమె నన్ను చూస్తుంది నేను కూడా ఆమెను చూస్తూనే ఉంటాను చెట్లు చిగురిస్తున్నట్లు మాస్నేహమూ కొత్త చిగురు తొడుగుతూనే ఉంది కాలంతో మేమూ పరిగెడుతూనే ఉన్నాం ఒకానొక కాలంలో ఉత్తరాలలో కలుసుకునే వాళ్ళం కబుర్లు కలబోసుకునే వాళ్ళం బాధలు, బాధ్యతలు, వేడుకలూ అన్నిమాటలూ మారాతల్లోనే…. అయినా ఎన్నో తీపి […]

Continue Reading
Posted On :

ఆమె (కవిత)

ఆమె -గిరి ప్రసాద్ చెలమల్లు ఆమెకి ఓ సాంత్వన నివ్వు చేతనైతే ఆమె మౌనంలో ఎన్ని ఘోషలు దాగివున్నాయో వెతికే ప్రయత్నం చేసావా?! ఆమె గుండె దిటవు కావటం వెనుక ఎన్ని అగ్ని పర్వతాలు బద్దలయ్యాయో ఏనాడైనా గాంచావా! ఆమె చేయని నేరానికి ఆమెను పొడుచుకు తింటానికి కథంతా కాకపోయినా కాస్తంతైనా తెలియకుండానే ఒంటికాలిపై ఎగిరే ఎందరో తామేంటో తెలుసుకునే ప్రయత్నం చేసారా! ప్రేమ అనే రెండక్షరాల పదం పుట్టుక మర్మం ఎరుగక ముందు ఆమె మోములో […]

Continue Reading
Posted On :

ఏమి జంతువది (అస్సామీ మూలం & ఆంగ్లానువాదం – నీలిమ్ కుమార్, తెలుగు సేత: వారాల ఆనంద్ )

ఏమి జంతువది అస్సామీ మూలం & ఆంగ్లానువాదం: నీలిమ్ కుమార్ తెలుగు సేత: వారాల ఆనంద్ ఏమి జంతువది దాని ఆకలి ఎంతకూ తీరదు అసలే తృప్తి చెందదు దాని పొట్ట పరిమాణాన్ని అదే కొలవలేకున్నది ఎంత ఆహారం కావాల్నో దానికే తెలవదు ఆ సర్వభక్షకుడి పేరేమిటి భూమి ఇండ్లు వంతెనలు చెరువులు కుంటలు చెట్లు నదుల రెండు తీరాలు అది వేటినీ వదల్లేదు ఎంతకూ తృప్తి చెందని ఆకలితో వున్న ఆ జంతువేమీటది ఎల్లవేళలా ఆకలితోనే […]

Continue Reading
Posted On :

బతుకమ్మ పద్యాలు

బతుకమ్మ పద్యాలు -సముద్రాల శ్రీదేవి సృష్టిలోన పూలు స్త్రీ జాతిరూపము ప్రకృతి మాతగాను బ్రతుకునిచ్చు తల్లిగ బ్రతుకమ్మ తా తెలంగాణలో దివ్యమైన బాట దేవిమాట తీరుతీరు పూలు గౌరమ్మగను నవ రాత్రులందు మారి చిత్రముగను నీకు సాటిలేరు నేడు మా బ్రతుకమ్మ దివ్యమైన బాట దేవిమాట సంబురాలు జేస్తునంబరమ్ముగ మార్చి నారిగణము నాడు దీరులైరి న్యాయస్థాపనంబు నవ్విడె బ్రతుకమ్మ దివ్యమైన బాట దేవిమాట ఊరువాడయాటలుయ్యాల పాటలు నూరెగుబ్రతుకమ్మలుత్సవముగ వనములోన మనము జనజాతర గణము దివ్యమైన బాట దేవిమాట […]

Continue Reading
Posted On :

వృద్ధుడు (ఆంగ్ల మూలం : మోహన్ కుమార్, తెలుగు సేత: వారాల ఆనంద్ )

వృద్ధుడు ఆంగ్ల మూలం : మోహన్ కుమార్ తెలుగు సేత:వారాల ఆనంద్ అర్థరాత్రి  టేబుల్ ల్యాంప్ వెలుగులో చదువుకుంటున్న  వృద్ధుడితో  ఓ యువతి అంది  “ తాతయ్యా! నీ ఆరోగ్యం సున్నితమయింది  నీ కంటి చూపు మందగించింది  ఇప్పటికే అర్థరాత్రి అయింది నువ్విక పడుకోవాలి”   వృద్ధుడు తాను చదువుతున్న పుస్తకాన్ని మూసేసి  ఫ్రేం లేని కళ్ళద్దాల్ని తీసేసి నవ్వుతూ అన్నాడు  “ ఓ పక్క తనను చంపడానికి  విషం తయారవుతూ వుంటే  సోక్రటీసు  ఏమి చేస్తున్నాడో […]

Continue Reading
Posted On :

నిన్నటి సుమాన్ని నేను! (YESTERDAY’S FLOWER ఆంగ్ల గీతానికి అనువాదం)

నిన్నటి సుమాన్ని నేను! (YESTERDAY’S FLOWER ఆంగ్ల గీతానికి అనువాదం) -వి.విజయకుమార్ నిన్నటి సుమాన్ని నేను మ్రోవితో కడపటి తుషారాన్ని గ్రోలి వేచివున్నాను పుష్పలావికలు నా మృత్యు గీతాన్నాలపించడానికి రానే వచ్చారు కడపటి హేమంత తుషారపు మృత్యు నీడ పరచుకుంది చల్లగా శరత్ చంద్రుడి వీక్షణం దోబూచులాడుతోంది మెల్ల మెల్లగా నిన్నటి సుమసౌరభాలింకా నాలో సజీవంగా రేపటి సుగంధాలకది అవస్యమై ఉండగా నా మరణ గీతిక పల్లవిని పాడుకుంటూ విచ్చేసిన విరికన్నియలు ఇంకా ఆగమించే మగువలకోసం స్వాగత […]

Continue Reading
Posted On :

విముక్తి

విముక్తి -ఇందు చంద్రన్ మబ్బులు మోసుకెళ్తున్నాయి. చుక్కలు పట్టుకునేలోపే తాకి వెళ్లిపోతున్నాయి. నాకంటూ ఏదీ లేదిక్కడ ! నా స్వార్థ కుబుసం కిందనే విడిచిపెట్టొచ్చేసినట్టున్నా. కింద ఒక్కప్పుడు నాకంటూ సృష్టించిన దార్లో ఇప్పుడు ఎందరో తిరుగుతున్నారు. నాకోసం కట్టుకున్న గూట్లో ఎవరో తెలియని వాళ్లుంటున్నారు. నే పోరాడి పోట్లాడి సాధించినవన్నీ వేరొకరు వాడేసుకుంటున్నారు. ఎవరూ నన్ను గుర్తు చేసుకోవట్లేదు. వాళ్ళతో నా జ్ఞాపకాలన్నీ చెరిగిపోయినట్టున్నాయి. నా సమాధి ఉండాల్సిన చోట బిల్డింగ్ మొలుచుకొచ్చినట్టుంది. నా ఆనవాళ్లేవి లేవిప్పుడు […]

Continue Reading
Posted On :

కొండమల్లిపూలు (కవిత)

కొండమల్లిపూలు   -వసీరా కొండమల్లి పూలు ఊరికే రావు కూడా తీసుకొస్తాయి కొత్త రుతువుని పిల్లలకు తీయని సన్నాయిలని వెళ్ళిపోయే వర్షాలు ఇచ్చే తాయిలాన్ని మంచులో పొట్లం కట్టిన వెచ్చని సూరీణ్ణి కొండమల్లి పూలు చూసినప్పుడల్లా నాకెందుకో ఊరికూరికే నవ్వాలనిపిస్తుంది నెత్తిన పోసుకుని పిచ్చి పిచ్చిగా ఆడుకోవాలనిపిస్తుంది పసితనం తీయగా పిలిచి తనలోకి లాక్కుంటుంది జీవితం ముందు చేతులు చాచి నుంచుని స్తుతి గీతాలు పాడాలని పిస్తుంది. ఓ నా జీవితమా! నీ ముందు మోకరిల్లి ప్రార్థించకుండానే పువ్వుల్లోకి […]

Continue Reading
Posted On :

స్త్రీ (మరాఠీ మూలం : హీరా బన్సోడే, తెలుగు సేత: వారాల ఆనంద్ )

స్త్రీ మరాఠీ మూలం : హీరా బన్సోడే తెలుగు సేత:వారాల ఆనంద్ నేను నదిని అతను సముద్రం అతనితో నేనన్నాను నా జీవితమంతా నీ కోసం నీ వైపు ప్రవహిస్తూ నీలో కరిగిపోతున్నాను చివరాఖరికి నేను సముద్రాన్నయి పోయా ఒక స్త్రీ ఇచ్చే బహుమతి ఆకాశం కంటే పెద్దది కానీ నువ్వేమో నిన్ను నువ్వు ప్రస్తుతించుకుంటూనే వున్నావు నదివి కావాలని నాలో కలిసిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు ఆలోచించలేదు ***** వారాల ఆనంద్, కవి, రచయిత, అనువాదకుడు, సినీ […]

Continue Reading
Posted On :

ఊపిరి పోరాటం (కవిత)

ఊపిరి పోరాటం (కవిత) – శ్రీ సాహితి దేశం భరించలేని బాధ ఓ కన్నీటిచుక్క రూపంలో ఆమెని మింగేసింది. చీకటి కాపలా కాసిన నరకానికి సిగ్గుపడ్డ పగలు నిజాలకు చిక్కి శల్యమైనది. మంచం పట్టిన నమ్మకం మరణశయ్యపై చేరి దేశాన్ని ఓ మాట అడిగింది.. ఆడపిల్ల “ఊపిరి పోరాటం” చేయాలా? అని. సిగ్గుతో దేశం చచ్చిపోయింది ***** మా ఊరు అద్దంకి, ప్రకాశం జిల్లా, (ఆంధ్రప్రదేశ్.) నేను ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీ లో బి.ఫార్మసీ చదువుతున్నాను.నాకు చిన్నప్పటి […]

Continue Reading
Posted On :

సూర్యుడు (అస్సామీ మూలం : నిర్మల్ ప్రభా బొర్దోలోయ్, తెలుగు సేత: వారాల ఆనంద్ )

సూర్యుడు అస్సామీ మూలం : నిర్మల్ ప్రభా బొర్దోలోయ్ తెలుగు సేత:వారాల ఆనంద్ సూర్యుడు ఉదయిస్తే తుపాకుల మోతతో ఉదయిస్తాడా లేదు లేదు సూర్యుడు ఉదయిస్తే రాత్రి చీకట్లోంచి మంద్రంగా ఏడ్చే పక్షి గొంతులోంచి ఉదయిస్తాడు ***** వారాల ఆనంద్, కవి, రచయిత, అనువాదకుడు, సినీ విమర్శకుడు. డాక్యుమెంటరీ ఫిలిం మేకర్. నాలుగు దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో పని చేసారు. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవలల్లో జ్యూరీగా వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డు […]

Continue Reading
Posted On :

కాశీలో శవాలు (మగధ్ మూలం : ఇంగ్లీష్ అనువాదం : శ్రీకాంత్ వర్మ )

కాశీలో శవాలు మగధ్ మూలం : ఇంగ్లీష్ అనువాదం : శ్రీకాంత్ వర్మ తెలుగు సేత:వారాల ఆనంద్ కాశీ చూసావా అక్కడ శవాలు వస్తూ వుంటాయి పోతూ వుంటాయి శవాలదేముంది శవాలు వస్తాయి పోతాయి అయితే ఈ శవం ఎవరిదని అడగనా రోహితాస్వునిదా? కాదు కాదు అన్నీ రోహితస్వునివి కావు అతని శవాన్ని దూరం నుంచే గుర్తించొచ్చు దూరం నుంచి కాకపోయినా దగ్గరి నుంచయినా గుర్తించొచ్చు ఒకవేళ దగ్గరి నుంచీ గుర్తించకపోతే అది రోహితస్వునిది కాదు మరి […]

Continue Reading
Posted On :

అమ్మకు నేనేం చేశాను? (కవిత)

అమ్మకు నేనేం చేశాను?  -డా. మూర్తి జొన్నలగెడ్డ తననొప్పులుపడి తాను తన రక్తం పంచిస్తేను ఈ లోకానికి వేంచేశాను బువ్వెడితే భోంచేశాను జోకొడితే పడకేశాను విసిగించి వేధించాను సహనానికి ప్రశ్నయ్యాను మరుగయ్యి కవ్వించాను కనుపించి నవ్వించాను అమ్మేమరి అన్నింటానూ, తలపైన చమురయ్యేను నిగనిగల నలుగయ్యేను శ్రీరామునిరక్ష య్యేను నట్టింట్లో పండగతాను పండగలో విందుగతాను విందుల్లో సందడిగాను నా చదువుల్లో జ్ఞానంగాను నా సందెలలో ధ్యానంగాను బరువుల్లో బాసటగాను నేనడిచే బాటగ తాను ఎన్నెన్నని నే చెబుతాను ఆ […]

Continue Reading
Posted On :

ది బిచ్ (అమ్మ తల్లి)

ది బిచ్ (అమ్మ తల్లి) -వి.విజయకుమార్ నాకు ముందే తెలుసు నువ్వీ వీధిలో నెలలు నిండి భారంగా తిరుగుతున్నప్పడే యేదో ఒక రోజు గంపెడు బిడ్డలతో ప్రత్యక్షమౌతావనీ ముత్యాల్లాంటి పసిబిడ్డల్ని వేసుకుని దీనంగా చూస్తూ నా అశక్తతను ప్రశ్నిస్తావని! కడుపు నిండా పాలు తాగి వళ్ళో ఈ బుజ్జిగాడు గోముగా గీరుతూ వెచ్చని పరుపు మీద గుర్రుగా చూస్తూ ఈ దేశపు దొరబాబులా వెచ్చగా ఇక్కడ! నెల కూడా నిండని నీ పసికూనలు వర్షపు చినుకుల్లో ముద్దయి […]

Continue Reading
Posted On :

యోధ..! (నెచ్చెలి-2024 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కవిత)

యోధ..! (నెచ్చెలి-2024 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కవిత) -బి.కళాగోపాల్ విట్రియోల్ నా ముఖాన్ని కాల్చేస్తూ చర్మాన్ని మండిస్తూ / శిరోజాలు అంటుకు పోయి కనుగుడ్లు చితికిపోయి / ముక్కురంధ్రాలు మూసుకుపోయి చెవులు తెగిపడి / చెంపలు కరిగి బొమికెలు తేలి నన్నో వికృతశిలగా మారుస్తున్న/ ఆ విషపు ద్రావణ బుడ్డి మురుగునీటి పక్కన/ విసిరిన వాడి అహాన్ని సంతృప్తి పరుస్తూ వికటాట్టహాసం చేయసాగింది../ మెడ దిగువన పాలిండ్లు ఉడికిపోతూ తోలుత్తిత్తిలా దేహం ఊగిసలాడుతుంటే/ మంట గాయం […]

Continue Reading
Posted On :

స్మృతి లేఖనం (బెంగాలీ మూలం, ఇంగ్లీష్ : సయ్యద్ శంశూల్ హక్, తెలుగు సేత: వారాల ఆనంద్ )

స్మృతి లేఖనం బెంగాలీ మూలం, ఇంగ్లీష్ : సయ్యద్ శంశూల్ హక్ తెలుగు సేత:వారాల ఆనంద్ నేనెవరో తెలియాల్సిన అవసరం లేదు నేను గుర్తుండాల్సిన అవసరమేముంది నన్నెందుకు జ్ఞాపకం చేసుకోవాలి దానికి బదులు నా పెట్టుడు పళ్ళని సాయంత్రపు సినిమాని నా ఉమ్మనీటిని గుర్తుంచుకోండి నీను వచ్చాను, చూశాను కానీ ఏ దిష్టి బొమ్మ విప్లవంలోనూ గెలవలేకపోయాను ఓ యాత్రికుడా నువ్వొకవేళ బంగ్లాదేశ్ లో పుట్టి వుంటే నా లోతయిన ఆవేదనని ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతావు ***** […]

Continue Reading
Posted On :

అప్రమత్తం ( కవిత)

అప్రమత్తం ( కవిత) -కందుకూరి శ్రీరాములు అరచేతిని ఎంత తెరిపిద్దామనుకున్నా తెరుచుకోదు భయాన్ని గుప్పెట్లో నలిపేస్తుంటుంది తిరుగుతుంటాం మాట్లాడుతుంటాం గదంతా వెలుతురున్నా ఎక్కడో ఒక దగ్గర ఓ మూల చీకటి చిటుక్కుమంటుంది బుగులుపులుగు గదంతా తిరుగుతుంటుంది ఎంతకీ తెల్లారనే తెల్లారదు తెల్లారినట్టు భ్రమపడి బాధపడుతుంటాం ! భయం నిశ్శబ్దంలో అపశబ్దపు పదాలు ఆలోచనలో మెదులుతుంటాయి ఏ చెరువు కట్ట తెగినట్టు ఉండదు ఏ పురుగు కరిచినట్టు ఉండదు శబ్దం వినని శబ్దం వినబడుతూ ఉంటుంది ముందు జాగ్రత్తగానే […]

Continue Reading
Posted On :

పుట్టింటి నేల మట్టి ( కవిత)

పుట్టింటి నేల మట్టి ( కవిత) -పరిమి వెంకట సత్యమూర్తి మెట్టింట అడుగిడినా వెంటాడుతూనే ఉండే పుట్టింటి మట్టివాసన!! మూడు ముళ్ళు ఏడడుగులుకొత్త బంధాలు ఏర్పడినాబుడి బుడి నడకలతో బుజ్జాయి మెట్టినింటిలో నడయాడినాపుట్టింటి నేలమట్టి అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది!! కన్నప్రేగు తెంచుకునిపుట్టింటి నేల మీదవాలినప్పటి నుంచికంటికి రెప్పలా కాపాడిన తల్లిదండ్రులు!! రక్తం పంచుకుని తనతో పుట్టి పెరిగిన తోబుట్టువులతోఆడుకున్న మధుర బాల్య స్మృతులు!! వారి తీయని జ్ఞాపకాలుమదిలో పది కాలాలు పచ్చగానే ఉంటాయి!! పుట్టినప్పుడే “ఆడ” పిల్ల అని ఈడ పిల్ల కాదు అని […]

Continue Reading
Posted On :

ఈళిక ఎత్తిన కాళిక (కవిత)

ఈళిక ఎత్తిన కాళిక -డా. కొండపల్లి నీహారిణి ఎన్ని కల్లోలాలనైనా క్రీగంట చూసినట్లు ఎన్ని కన్నీటి చెలిమెలనైనా కొనగోటితో తీసేసినట్టు పరాభవాలు అపరాధ భావాలు నీ గుండె దిటవు ముందు బలాదూర్ అయిపోతాయి చినుకుల పలకరింపులు నీ కను దోయి దాటవు కష్టపు కడవలు నిన్ను కాదని ఎక్కడెక్కడ తారాడుతాయి గానీ చలువ మబ్బుల పందిర్లేవి భజంత్రీలు కావు కోపం కొలిమిలోంచి ఎగిసినా ఈటెలు మొనదేరిన మాటలు విన్నా సహనము స్త్రీ సహజాతాల మిధునాలని చెప్పేసి మనసు […]

Continue Reading
Posted On :

మా బిచ్చవ్వ ( కవిత)

మా బిచ్చవ్వ ( కవిత) -ఈ. వెంకటేశ్ గ్రామంలోసూర్యుడు నలుపు రంగుపులుముకుని మేల్కొంటాడుదళితులకు జరుగుతున్నఅన్యాయాలను చూడలేక. గాలి మలయ మారుతంలామెల్లగా తాకుతూ వెళ్ళదుతుఫానుల పెనుగాలులు వీస్తాయిగడీలు ,మేడలునిజాం వారసుల గర్వాన్నిసత్యనాస్ చేస్తాయి. మాది ఊరంటే ఊరు కాదుచైతన్యాన్ని రక్ష మాంసాలుగాకలిగి జీవమున్న జవసత్వాలు కలిగిన పుణ్యభూమి. మా యవ్వ తన అనుభవంతోచెప్పే జీవిత సత్యాలముందునాలుగు వేదాలు నాలుకగీసుకోవడానికి కూడా పనికిరావు. ఉత్పత్తి కులంలో జన్మించివ్యవసాయంలో గిట్టుబాటు కాకదళారీల మధ్య ఒంటరి ఖైదీలాఇప్పటికీ మోసపోతూనే ఉన్నాం.. పనిచేయడం చెమటోడ్చడంతప్ప ఇతర వేషాలు వేయలేని వాళ్ళంఎప్పుడైనా నేను పని […]

Continue Reading
Posted On :

మ్యూజిక్ ( కవిత)

మ్యూజిక్ ( కవిత) -దేశరాజు తెల్లవారని జాముకికాస్త ముందు-వెలుతురు కోసం పచ్చని మొక్కలువెతుకులాడుతూంటాయినిద్దట్లోంచి లేచినా కలలోంచి మేల్కొనని ఆమెతోపరిమళాల మాట కలుపుతాయిస్టౌ పై మరుగుతున్న కాఫీ పొడి పెర్క్యులేటర్ నుంచి గుబాళిస్తుంటుందిగాలి గుడ్డిదిదానికి లింగ, వయోభేదాలు లేవుమా ఇద్దరినీ ఒకేలా అకేలా అల్లుకుంటుందిఇంతలో చిన్న పిట్టలేవో గ్రిల్ కంతల్లోంచి దూరిఊరిస్తున్నట్టుగా దూరంగా వాలి అందమైన పాటలు చూపిస్తాయిఆ దినపు మొదటి కాఫీ సిప్ చేస్తున్న ఇద్దరూ ఇద్దరే-ఇళయరాజా, రెహ్మాన్ తెలియనే తెలియరులయకారుడే, అసలైన సంగీతకారుడు అప్పుడే కాదు, ఎప్పటికీ. ***** దేశరాజుగా అందరికీ […]

Continue Reading
Posted On :

త్యాగాల నిలయం ( కవిత)

త్యాగాల నిలయం ( కవిత) -సుధీర్ కుమార్ తేళ్ళపురి ప్రపంచాన్నంతా నిద్రలేపేసూర్యుడికి కూడాతెల్లారిందని చెప్పేదికల్లాపిచల్లే నీ గాజుల చేతులే కదా – నువ్వు లేనిదే నిముషమైనా గడవదని తెలిసికూడాలేని అహాన్ని ప్రదర్శించినప్పుడునీ మౌనంతోనే అందరి హృదయాలనుజయిస్తావు – నిషిద్దాక్షరి, దత్తపది, అప్రస్తుత ప్రసంగాల వంటి వాటితో చేసేఅవధానాలకే గజమాలలుగండపెండేరాలు తొడిగితేఅత్తమామలు , ఆడపడుచులుకన్నవాళ్ళు, కట్టుకున్నవాడు,విరామం లేకుండా వచ్చిపోయేసమస్త బంధుగణంతోఅనునిత్యం నువ్వు చేసే అవధానానికిఎన్ని గజమాలలు వేయాలోఇంకెన్ని గండపెండేరాలు తొడగాలో – కాలాన్ని నడిపించే ఋతువులు ఆరేఅనుకుంటాం కానీమానవజాతి మనుగడ కోసంకనపడకుండా నీలో దాచుకున్నఏడో రుతువే […]

Continue Reading
Posted On :

ఆమె ఒక ప్రవాహం (కవిత)

ఆమె ఒక ప్రవాహం -గవిడి శ్రీనివాస్ నీవు నా ప్రపంచంలోకి ఎప్పుడు సన్న సన్నగా అడుగులు వేశావో తెలీదు కానీ ఒక వెన్నెల వచ్చి తట్టినట్టు ఒక వేకువ లేపి మనసిచ్చినట్టు ఒక పూల తోట అత్తరు వాసనలు నింపినట్టు నా చుట్టూ తీయని పరిమళం నింపావు. నాపై నీ కలల పిట్టలు వాలేవి నాలో ఆరాధన వెలిగేది. నడిచిన దూరాలు ఎక్కిన కొండలు గుండె లోతుల్లోంచి తడిచేసిన దృశ్యాలు కళ్ళను తడుపుతూ అలా కుదుపుతూ ఉండేవి. […]

Continue Reading
Posted On :

గూడు కట్టిన గుండె (కవిత)

గూడు కట్టిన గుండె -బసు పోతన గూడు కట్టిన గుండెను గుట్టు విప్పమని అడిగితే బిక్కుబిక్కు మంటూ చూసింది గుట్టు చప్పుడు కాకుండా దిక్కుమాలినదానిలాకూర్చున్న మనసు చివుక్కుమన్న శబ్దానికి కూడా ఉలిక్కిపడింది. మనసు మనసెరిగిన కళ్ళు రెప్పలతో రహస్యంగా మాటాడి ఓదార్చేందుకు కన్నీటి బొట్టును పంపితే రెప్ప జారిన నీటి బొట్టు పగిలిన మనసులా నేలను తాకి వేల ముక్కలైంది ప్రతి రోజూ పగిలే ముక్కల్ని ఒక్కటిగా చేర్చి అతికించడమే రోజుటి బతుకులో భాగమైంది చితికే మనసుతో […]

Continue Reading
Posted On :

సరిహద్దు సాక్షిగా (కవిత)

సరిహద్దు సాక్షిగా -డా.కె.గీత విరగకాసిన ద్రాక్షతోట సాక్షిగా ‘సరిహద్దు ప్రేమకు అడ్డంకా?’ అని అతను గుసగుసలాడినప్పుడు గుండె గజగజా కొట్టుకున్నా అతని మీద ప్రేమ ఎఱ్ఱసముద్రాన్ని దాటింది మా ప్రేమమాధుర్యమంతా నింపుకున్న పవిత్రభూమి ఇది- ఇందులో దేశాలు ఎన్నో మాకు లెక్క లేదు పరమత సహనం నించి పుట్టిన ప్రేమతో ఏకమైన బంధం ఇది- ఇందులో దేశాల పాత్ర లేనే లేదు ఆ పొద్దు సరిహద్దులో అతని దేశపు వాళ్ళని ఎత్తుకొచ్చేవరకు అతని దేశం నా దేశం […]

Continue Reading
Posted On :

ఉయ్యాల్లో టెర్రరిస్ట్

ఉయ్యాల్లో టెర్రరిస్ట్ -వి.విజయకుమార్ ష్…పారా హుషార్ వీడు మామూలోడు కాడు పనిపిల్ల బుగ్గ కొరికిన కీచకుడు పక్కింటి పిల్ల కొంగు లాగిన దుశ్శాసనుడు తాత మొహాన్నే ఫెడీల్ మని తన్నిన కర్కోటకుడు! సాధించుకోవడం ఎలానో ఎరిగిన కిమ్ వాడు లేస్తూనే జాకీ చానై కిక్ బాక్సింగ్ మొదలెడతాడు చిట్టి రాముడై శరాలు సంధిస్తూ యుద్ధానికి సిద్ధమంటాడు ఎడం కాలితో భూగోళాన్నీ కుడికాలితో చందురుడ్ని అలవోకగా తంతూ వళ్ళు విరుచుకుంటాడు మోనార్క్ నంటూ విర్ర వీగుతాడు బజ్జున్నప్పుడే వీడు […]

Continue Reading
Posted On :

నీ కలని సాగు చేయడానికి (కవిత)

నీ కలని సాగు చేయడానికి   -వసీరా చల్లగా వచ్చిన వరద నీరు వీడని నీడలా….లోపలి నుండి తొలుచుకొచ్చే నీడలా ఇక జీవితకాలపు సహచరిలా స్థిరపడిపోతోందా? నువ్వయితే ఇన్ని సూర్యకిరణాలనీ వాసంత సమీరాల్ని, యేటి ఒడ్డు ఇసుక మీద ఆటల్నీ వదలి చప్పుడు లేకుండా వెళ్ళిపోయావు అప్పుడు తెలియలేదు శూన్యం ఎంత పెద్దదో బహుశా నువ్వు రాలిన ఆకుల మీది రంగుల రెక్కల్ని తీసుకుని జ్వాలలోంచి జ్వాలలోకి , కలని ఖాళీచేసి శూన్యంలోకి వెళ్ళావనుకున్నాను లేదు, నువ్వు శూన్యాన్ని […]

Continue Reading
Posted On :

ఉప్పు (బెంగాలీ మూలం, ఇంగ్లీష్ : సుబోధ్ సర్కార్, తెలుగు సేత: వారాల ఆనంద్ )

ఉప్పు బెంగాలీ మూలం, ఇంగ్లీష్ : సుబోధ్ సర్కార్ తెలుగు సేత:వారాల ఆనంద్ ఉప్పూ దుఃఖం ఇద్దరూ అక్కాచెల్లెళ్ళు వాళ్ళు లేకుండా వున్న సంతోషం సంతోషమే కాదు వ్యాకులత నా కుమార్తె ఆమె నా రక్తనాళాల్లోని విషాన్ని శుభ్రం చేస్తుంది అదృష్టవంతులయిన కవులు మానవ చరిత్ర నుండి మురికిని కడిగేస్తారు మనమంతా అంతరించి పోవడానికి ముందు చట్టపరంగా ‘ప్రేమ’ సంతోషానికి పరాయిదే ***** వారాల ఆనంద్, కవి, రచయిత, అనువాదకుడు, సినీ విమర్శకుడు. డాక్యుమెంటరీ ఫిలిం మేకర్. […]

Continue Reading
Posted On :

యక్షిణి (ఆంగ్లమూలం: అనురాధా విజయకృష్ణన్, అనువాదం: ఎలనాగ)

యక్షిణి ఆంగ్లమూలం: అనురాధా విజయకృష్ణన్ తెలుగు సేత: ఎలనాగ ఒక ప్రాచీన కథ ప్రకారం … విరగబూసిన పాలవృక్షం మీద రాత్రివేళ ఆశ్చర్యపోయిన చంద్రుని కాంతిలో పువ్వులు రహస్య దీపాలలా వెలుగుతున్నప్పుడు, లేదా చంద్రుడు లేని చీకటిరాత్రిలో పరిమళాలు పాముల్లా గాలిలో నాట్యం చేస్తూ, ఆటపట్టిస్తూ, భయపెడుతున్నప్పుడు ఆ పాలవృక్షం ఆ స్త్రీ మీద పువ్వుల్ని వర్షిస్తే అప్పుడామె యక్షిణిగా మారుతుంది. ఆమె గోళ్ళు దాహంగొన్న మేలిమి కత్తులుగా మారుతై. అవి ఒక్క ఉదుటున గుండెల్ని అమాంతంగా పెకలించ […]

Continue Reading
Posted On :

అమ్మ (అమెరికన్ రచయిత్రి గ్వాన్డలిన్ బ్రూక్స్ రాసిన “మదర్” ఆంగ్ల కవితకు అనువాదం)

అమ్మ (అమెరికన్ రచయిత్రి గ్వాన్డలిన్ బ్రూక్స్ రాసిన “మదర్” ఆంగ్ల కవితకు అనువాదం) -వి.విజయకుమార్ గర్భస్రావాలు నిన్ను మరవనివ్వవు చేతికందినట్లే అంది, చేజారిన బిడ్డల జ్ఞాపకాల తలపులు మరపురానివ్వవు, పిసరంతో, అసలెంతో లేని జుత్తుతో తడియారని మాంసపు ముద్దలవి, గాయకులో, శ్రామికులో ఎప్పటికీ శ్వాసించని వారు. నువ్వెప్పటికీ దండించలేని వాళ్ళు, అలక్ష్యం చెయ్యని వాళ్ళు మిఠాయిలిచ్చి ఊరుకోబెట్టనూ లేవు. చీకే వారి బొటనివేలి చుట్టూ ఎప్పటికీ ఒక పట్టీని కూడా చుట్టలేవు వొచ్చే దయ్యాల్ని తరిమేయనూ లేవు. […]

Continue Reading
Posted On :

చీకటి (నేపాలీ మూలం, ఇంగ్లీష్ : బిమల్ నీవ, తెలుగు సేత: వారాల ఆనంద్ )

చీకటి నేపాలీ మూలం, ఇంగ్లీష్ : బిమల్ నీవ తెలుగు సేత:వారాల ఆనంద్ రాత్రి చీకట్లో ఏమయినా జరగొచ్చు పగులుపట్టిన రోడ్డులోంచి ఎగిరిపడ్డ పోట్రాయి కాలికి తగలొచ్చు అంతేకాదు ప్రాణం లేని శిలావిగ్రహాలతో ఢీ కొట్టొచ్చు లేదా భూమ్మీదో వాకిట్లోనో పడిపోవచ్చు తోవదప్పి మురికి కాలువలో పడిపోవచ్చు రోడ్డుపైకి చొచ్చుకొచ్చిన ఏ బంగ్లానో దేవాలయాన్నో దారితప్పి గుద్దుకోవచ్చు, గాయాలపాలు కావచ్చు చీకట్లో ఏమీ కనిపించదు కళ్ళు వున్నా వృధా చీకట్లో ఎలాంటి రక్షణా లేదు చీకట్లో దాక్కొని […]

Continue Reading
Posted On :

ఋణం తీరేలా (కవిత)

ఋణం తీరేలా -చందలూరి నారాయణరావు కాస్త చూడు కళ్ళను తలుపు తట్టి లోపలికి.. రోజూ కలలో నీ గొంతు గుర్తులే నీ చూపు స్పర్శలే… ఎక్కడికి వెళ్ళినా ఏ దూరంలో ఉన్నా రాత్రి ఒడికి చేరక తప్పదు ఏదో కల చిటికిన వ్రేలితో వేకువ దాకా నీతోనేగా మనసు కలవరింత ఒక్కో కవిత రూపంలో ఋణం తీరేలా ***** పుట్టినది: ప్రకాశం జిల్లా జె. పంగులూరు. వృత్తి: హైస్కూల్ఉపాధ్యాయులు ప్రవృత్తి: వచన కవిత్వం రచనలు: మనం కాసేపు […]

Continue Reading
Posted On :

సంఘర్షణ లోంచి (కవిత)

సంఘర్షణ లోంచి -గవిడి శ్రీనివాస్ కోర్కెలు ఎక్కిపెట్టే బాణాలు ఎడారి జీవిత ప్రయాణానికి కొలువులౌతాయి. ఇవి ఎప్పటికీ తడి తడిగా ఆనందాల్ని విరబూయలేవు. మనకు మనమే ఇనుప కంచెలు వేసుకుని అసంతృప్తి తీరాలని వెంబడిస్తున్నాం. ప్రకృతి జీవి కదా స్వేఛ్చా విహంగాల పై కలలను అద్దుకుని బతికేది. ఎన్ని రెక్కలు కట్టుకు ఎగిరినా బాధను శ్వాసిస్తే ఏ కాలం ఏం చెబుతుంది. ప్రశ్నించు సమాధానం మొలకెత్తించు లోలోపల అగ్ని గోళాలని రగిలించు. ఎప్పుడు గొంతు విప్పాలో ఎప్పుడు […]

Continue Reading
Posted On :

బోన్సాయ్ (కవిత)

బోన్సాయ్ -డా. లక్ష్మీ రాఘవ బలంగా ఉన్న విత్తుని నేను ఎక్కడపడ్డా ధృడంగా ఉంటా..అనుకున్నా ఆప్యాయత అనే నీరు పుష్కలంగా దొరుకుతుందనుకున్నా ఏపుగా ఎదగాలన్న కోరికతో ఉన్నా విస్తరించి నలుగురికీ ఆశ్రయం ఇచ్చే లక్షణాలు కలిగి ఉన్నా అందుకే అన్నీ దొరికాయని మట్టిని తోసుకుంటూ బలంగా బయటికి వచ్చా. సూర్య కాంతి అందం నన్ను మురిపించి రా అంటూ చేయి చాచింది. ఆహారం సమకూర్చుకుంటూ ఇంకాస్త పైకి లేచి చుట్టూ చూసా.. అందమైన ప్రపంచం పరికరిస్తూంటే పడిందో […]

Continue Reading
Posted On :

జార్జి-రెక్కవిప్పిన రెవల్యూషన్..!! (కవిత)

జార్జి-రెక్కవిప్పిన రెవల్యూషన్..!! -శోభరమేష్ అది తూర్పు దిక్కు వియత్నాం విప్లవ హోరు గాలులు వీస్తున్న కాలం ! లాటిన్ అమెరికా జాతీయోద్యమాల అగ్ని పర్వతాలు వెదజల్లే లావావేడి గాలులు..! హిమగిరులను మరిగిస్తున్న కాలం సహారాఎడారి దేశాల నల్ల బానిసలు నైలునది కెరటాలై సామ్రాజ్య పునాదులను పెకలించి వేస్తున్న ఝంఝూనిల షడ్జ ద్యానాలు విద్యాచనంలో మర్మోగుతున్న రోజులు పాలస్తీనా విమోచనోద్యమం ఉష్ణరక్త కాసారపు భుగ భుగలు పీడితప్రజల రక్తనాళాలను ఉరుకలు వేయించుతున్న కాలం ఘనీభవించిన ఓల్గాను త్రోసి రాజంటూ […]

Continue Reading
Posted On :

చూపు కవాతు (కవిత)

చూపు కవాతు (కవిత) – శ్రీ సాహితి భయం ప్రేమించినిద్ర గుచ్చుకుని రాత్రికి గాయమైపగటి పెదవుల పైకాలపు నల్లని నడకలకు ఇష్టం చిట్లి బొట్లు బొట్లుగాముఖంలో ఇంకితడిసిన కళ్ళకు పారిన బాధకు ఎండిన కలతో వాడిన నిజంఓడిన మనసుతో ఒరిగిన అలోచనపాత రోజుల వాకిట ఆశకు వ్రేలాడుతూ గతం ముందడగేసిజారిన నిజాలును జాలితో చేతికందిస్తేగడ్డకట్టి కరుడుకట్టిన కోరికల్లోఒక్క కోరికలో కదలికొచ్చినా మనసు చిగుర్లు వేసిజ్ఞాపకాల తేమనరోజూ రోజును గుచ్చి గుచ్చినీ ఆనవాళ్ళు కోసంచూపు కవాతు చేస్తూనే ఉంటుంది.. […]

Continue Reading
Posted On :

అమ్మ ముచ్చట ( కవిత)

అమ్మ ముచ్చట ( కవిత) -కందుకూరి శ్రీరాములు అమ్మ ఆచ్ పిట్టయ్యి ఎగిరిపోయింది ఇక్కడ గూడూ లేదు మనిషి నీడా లేదు తను ఎటో వెళ్ళిపోతానని తెలియక తన తనువు ఎటో మాయమైందోనని తెలియక పండుగకో పబ్బానికో కట్టుకోవటానికి పెట్టెలో భద్రంగానే దాచుకుంది మూటచుట్టిన పట్టు చీర ! ఎన్నెన్ని ముల్లెలు కట్టుకుందో ఆకలైతే ఆంప్రో బిస్కెట్ ప్యాకెట్! అరగకపోతే సోడా సొంపు ప్యాకెట్! ఎంత క్రమశిక్షణతో ఉన్నా ఎప్పుడూ ఏదో ఒక నలత ! ఒక్కతే […]

Continue Reading
Posted On :

కోడి కూతలోపే నీకు దిష్టి తీస్తాను ( కవిత)

కోడి కూతలోపే నీకు దిష్టి తీస్తాను ( కవిత) -సుభాషిణి వడ్డెబోయిన కళ్ళ లోగిలిన చూపుపడకేసి కలల ధూపమేసి తలపు తలుపు తెరచుకున్నా కాలం కరుగుతున్నా కానరాననుకోని కాదంటానని కలత పడ్డావేమో! సెలయేటి నవ్వులతో సంచరించిన ఊసులు చిలిపి మాటలతో  చెప్పుకున్న ముచ్చట్లు మనం అనే వనంలో పండు వెన్నెలలో పడి పడి కోసుకున్న పూలనడుగు నా మనసు సువాసనలు చెబుతాయి మన చెలిమి వెలుగు కునుకుతో చీకటికి కునుకాగి జాబిలి జంట కోరికతో సిగ్గుపడి మబ్బు […]

Continue Reading
Posted On :

కనబడుట లేదు ! ( కవిత)

కనబడుట లేదు ! ( కవిత) -రామ్ పెరుమాండ్ల కళ్ళున్నాచూపులేదు .బహిరంగంగా చూడడం మానేశాకఅంతర్గత అల్లకల్లోలం మరెప్పుడు చూస్తానో !  అక్కడన్ని కిరాతకంగా కుతికె పిసికి చంపిన మరణాలే  అగుపిస్తాయి.అచ్చం మేకపిల్లను అలాల్ చేసినట్లు జీవగంజి ఆశచూపి జీవం తీసుకున్నా క్షణాలెన్నో ,  కంచంలోకి మెతుకులు రావాలంటే కాసిన్ని కుట్రలు నేర్వాలని ,పూటకో పాటందుకున్న రోజులెన్నోనిజమే వేశ్య వేషమేసినా వ్యవస్థలెన్నో  దొంగకొడుకుల రాజ్యానమూగబోయిన నన్ను సందుగలో దాచిన చిన్నప్పటి పలక చీదరించుకొని చెంప చెల్లుమనిన సందర్భాలెన్నో !  నేరం నాదే నేరస్థుడే కనపడుట లేదు. లెక్కతేలనికత్తిపోట్లతో కొన ఊపిరితో తప్పిపోయిన నేను నాకు కనపడుట లేదు. ***** నా పేరు రామ్ పెరుమాండ్ల. […]

Continue Reading
Posted On :

హ్యాపీ న్యూ ఇయర్! (కవిత)

హ్యాపీ న్యూ ఇయర్! -బండి అనూరాధ హఠాత్తుగా మాయమైన ఎవరో..ఇంటి ముందు నడుచుకుంటూ మరెవరో..లోనికింకి బయటపడని మరింకెవరో.. చుట్టూ పచ్చదనంలోకి నిన్ను లాగేఅక్కడే వాలిన ఒక పక్షి! ఇలాగా!?కొంత నొప్పిని, కథలోకోకవిత్వంలోకో చొప్పించడం! మరి నువ్వు చూసుకుపోతున్నప్పుడుదారి నిన్ను చూసి నవ్వినట్లనిపించిందా?పక్కలమ్మట గడ్డిపూలనయినా పలకరించావా? సైడు కాలువలో నుండీ బయటకొచ్చీ లోపలికి గెంతులేసే కప్పల సంగతీ?నీలోని బెకబెకల సంగతో మరి!ఆకలేస్తోందా..? అక్షరాలని ఇక కట్టేసిదారిన పంటపొలాలకేసి చూస్తోన్నావా.. మరి వాళ్ళకు తప్పదు; కోత కొయ్యాలీ,.. కుప్పవెయ్యాలీ,..నూర్చాలీ,..  హేయ్…నువ్వు ఇక కవితల్ని తూర్పారపెట్టుకోమాటలజాలిని పొట్టులా విసురుకో Happy new year!! ***** పేరు అనూరాధ […]

Continue Reading
Posted On :

మూడు చిన్న కవితలు

మూడు చిన్న కవితలు ఆంగ్లమూలం: ఎడ్నా సెయింట్ విన్సెంట్ మిల్లే తెలుగు సేత: ఎలనాగ అవిశ్రాంత వ్యక్తి నా కొవ్వొత్తి రెండు వైపులా వెలుగుతుంది రాత్రంతా వెలగడానికి అది సరిపోదు కానీ నా శత్రువులారా! ఇంకా నా మిత్రులారా! అది అద్భుతమైన వెలుగును ఇస్తుంది గురువారం బుధవారంనాడు నిన్ను నేను ప్రేమిస్తే అది నీకేమిటి? గురువారం నాడు నిన్ను నేను ప్రేమించకపోవడం ఎంతో వాస్తవం ఏమిటి నీ ఫిర్యాదు? అర్థం కావడం లేదు నాకు అవును, బుధవారం […]

Continue Reading
Posted On :

స్వేచ్ఛాదీపం (ఆంగ్లమూలం: డబ్ల్యు. బి. యేట్స్, తెలుగు సేత: ఎలనాగ)

స్వేచ్ఛాదీపం ఆంగ్లమూలం: డబ్ల్యు. బి. యేట్స్ తెలుగు సేత: ఎలనాగ లేచి వెళ్తాను స్వేచ్ఛాద్వీపానికి వెళ్ళి, మట్టితో కర్రలతో చిన్నచిన్న కొమ్మలతో ఒక చిన్న గుడిసెను నిర్మించుకుంటానక్కడ నాకోసం పచ్చదనాన్నీ తేనెటీగల కోసం తేనెతుట్టెనూ నెలకొల్పుకుంటాను తేనెటీగల ధ్వని నిండిన డొంకలో హాయిగా నివసిస్తాను అక్కడికి తిన్నగా వచ్చే ప్రశాంతి నాకు దొరుకుతుందక్కడ కీచురాళ్ళు పాడే ఆ స్థలంలో ఉదయం వేళ కొండల అవగుంఠనాల్లోంచి ప్రశాంతి రాలిపడుతుంది అక్కడ అర్ధరాత్రి ఒక ప్రకాశం మధ్యాహ్నం ఊదారంగు కాంతి […]

Continue Reading
Posted On :

దిగులు కళ్ళు (కవిత)

దిగులు కళ్ళు -బండి అనూరాధ దిగులు కళ్ళు చుక్కలని పోల్చుకోలేవు.చీకటి ఇల్లు వెన్నెలని చదువలేదు. పనికిమాలిన తత్వాలకిపేర్లు పెట్టుకుంటూఇంకా నువ్వు వెళ్ళిన వైపే చూస్తూ అక్షరాలతో,  అనేకానేక చింతలతోకాలయాపన చేస్తున్నా. మిగులుగా జీవిస్తూ పోతానుకానీఅప్రమేయతలోనూ సత్యమొకటి ఉంటుంది. అడుగు అడుగుకీ నిబద్ధత చప్పుడుని చేస్తుంది. ఇక,.. ఏ తెల్లారగట్టో కోడి కూస్తుంది.మసకవెలుతురికి చూపు జారుతుంది. అప్పుడు,.. కలల జాడ ఒక ప్రశ్నై పొడుస్తుంది.కళ్ళ ఎరుపు ఒక జవాబై మిగులుతుంది. ***** పేరు అనూరాధ బండి. స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం. ప్రస్తుత నివాసం కృష్ణా జిల్లా తాడిగడప […]

Continue Reading
Posted On :

ఇప్పుడు పల్లెవుంది! (కవిత)

ఇప్పుడు పల్లెవుంది! -శోభరమేష్ తోట తగలబడి పోతుంటేగోళ్ళు గిల్లుకుంటూనిల్చోన్నవాణ్ణి !గుండెల మీద చితిపేర్చికొరకంచుతో నిప్పంటీస్తేమౌనంగా భరిస్తున్నవాణ్ణినా మూడొందల గడపల బతుకుశ్వాసలో !కల్తీగాలులు వీస్తుంటేనా వెయ్యిన్నూటపదారుకళ్ళ నరీక్షణికి వలసరెక్కలు పోడుచుకొస్తుంటేనా పల్లె పరాయితనంలోకిపరకాయ ప్రవేశం చేస్తుంటేనేనిప్పుడు ప్రేక్షకుణ్ణి మాత్రమేనిలువెల్లా నిరాశల గాయాల తొడిగినక్షతాత్మగాత్రుణ్ణి మాత్రమే మా పల్లెకి కలలమ్మినవాళ్ళే మా రాత్రిళ్ళని దోచుకున్నారుమా ఆశలకి నీరుపోసినవాళ్ళే మా చిరునవ్వులులాగేస్తున్నారుమా పొలాల్లో లంకెబిందెలు చూపిమా పంటలు నూర్చుకున్నారుఉదయ సాయంత్రాలు చిలకలువాలే తోటనితొండలు గుడ్లుపెట్టే బండనేలగా మార్చారుపల్లెబతుకు మీద సమాధికట్టిఅభివృద్ధికి ప్రాణం పోస్తున్నవాళ్ళుమండే కడుపుల పైన […]

Continue Reading
Posted On :

లయాత్మక గుసగుసలు… (రష్యన్ మూలం: జినైడ గిప్పియస్, ఆంగ్లంనుండి అనువాదం: ఎలనాగ)

లయాత్మక గుసగుసలు… రష్యన్ మూలం: జినైడ గిప్పియస్ ఆంగ్లం నుండి అనువాదం: ఎలనాగ శబ్దాలు కలగలిసిపోయే చోట లయాత్మక గుసగుసలు కోరుతాను అడుగు లేని సల్లాపాన్ని ఆశగా జీవితాంతం వింటుంటాను దుఃఖపు చెరువులో పెద్దపెద్ద అనిశ్చయాల వలలు విసురుతాను మురికి నిండిన మార్గాల గుండా పయనించి అంతిమంగా సౌకుమార్యాన్ని చేరుకుంటాను అబద్ధపు ఉద్యానవనంలో మెరిసే మంచుబిందువుల కోసం వెతుకుతాను జమచేసిన ధూళికుప్పల్లో ప్రకాశించే సత్యపు గోళాల్ని భద్రపరుస్తాను దిగులు నిండిన కాలంలో ఆత్మవిశ్వాసాన్ని అంచనా వేస్తాను దేహదుర్గాన్ని […]

Continue Reading
Posted On :

ఎక్కడ వెతికేది? (కవిత)

ఎక్కడ వెతికేది? -శీలా పల్లవి అన్ని చోట్లా ఆశగా వెతికానుదొరక లేదుపోనీ ఎక్కడా దొరకక పోయినాకొద్దిగా కొనుక్కుందాం అని అనుకుంటేకనీసం అమెజాన్ లోనో , ఫ్లిప్ కార్ట్ లోనోదొరుకుతుందని అనుకోడానికిఅదేమైనా వస్తువా?తప్పకుండా దొరుకుతుందనేవిపరీతమైన నా నమ్మకాన్నిజాలిగా చూస్తూఎక్కడా నీకు నేను దొరకను అంటూ వెక్కిరించింది అంతటా ఎండిపోయింది అని అనుకుంటేబీటలు పడిన అంతరాంతరాలలోఏ మూల నుంచోకొద్ది కొద్దిగా ఉబికి వస్తున్న అలికిడి వినిపిస్తుందికానీ జాడ మాత్రం కనిపించలేదునాకు ఎదురుపడిన ప్రతీ పలకరింపులోవెతికాను కానీ దొరకలేదుఅడుగడుగునా తన ఉనికిని […]

Continue Reading
Posted On :

ఇంటికి దూరంగా (కవిత)

ఇంటికి దూరంగా -ఎం.అనాంబిక రాత్రి మెల్లగా గడుస్తుందిగిర్రున తిరిగే ఫ్యాన్ చప్పుడుమాత్రమే నా చెవులలోప్రతిధ్వనిస్తుంది.. ఒక్కొక్కసారి మాత్రం కాలంసీతాకోకచిలుకలా నా నుంచిజారిపోతుంది అంటుకున్నరంగు మాత్రం పచ్చని ముద్రలా మిగిలిపోతుంది.. ఉబ్బిన కళ్ళలో కాంతి తగ్గిపోయినీరసించిన మొహంలో తెలియని తడి అన్నిసార్లూ బాధని చెప్పుకోలేకపోవచ్చు అసలు రాత్రున్నంత మనేదిపగలుండదేందుకో! నిజానికి అప్పుడే ఎన్నోఆలోచనలు మనసు చుట్టూమెదడు చుట్టూ గుప్పుమంటాయి ఆ ఆలోచనల్ని పూరించేసమాధానాలు నాకు ఒక్కటీకనిపించవు. ***** అనాంబిక  ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు మండలం, గత 2022 సంవత్సరంలోనే […]

Continue Reading
Posted On :

గతపు పెట్టె (కవిత)

గతపు పెట్టె -డా||కె.గీత గతపు పెట్టెని తెరవనే కూడదు బిలబిలా ఎగిరే తూనీగల్తో బాటూ తోకలు విరగదీసి తలకిందులుగా వేళ్ళాడదీసిన ముళ్ళ తాళ్ళు కూడా ఉంటాయి మిలమిలా మెరిసే నక్షత్రాలతో బాటూ అగాధాంధకారంలోకి విసిరేసే ఖగోళాంతరాలు కూడా ఉంటాయి గలగలా పారే జలపాతాలతో బాటూ కాళ్ళకి బరువై ముంచేసే బండరాళ్ళు కూడా ఉంటాయి సువాసనలు అలుముకున్న అడవుల్లో వేటాడే క్రూరమృగాలు పచ్చని పరిమళాల పూల పొదల్లోనే బలంగా చుట్టుకున్న నాగుబాములు ప్రశాంత తామర కొలనుల్లో రహస్యంగా పొంచి […]

Continue Reading
Posted On :

విషాదమే విషాదం(ఫ్రెంచ్ మూలం: జ్యూల్ లఫోర్గె, ఆంగ్లం నుండి అనువాదం: ఎలనాగ)

విషాదమే విషాదం ఫ్రెంచ్ మూలం: జ్యూల్ లఫోర్గె ఆంగ్లం నుండి అనువాదం: ఎలనాగ నేను నా అగ్నిని తల్చుకుంటాను ఒక ఆవులింతను నొక్కి బయటికి రాకుండా చేస్తాను గాలి ఏడుస్తుంది వర్షం నా కిటికీ మీద ధారలై కొడుతుంది పక్కింట్లో పియానో మీంచి బరువైన సంగీతకృతి వినిపిస్తుంది బతుకెంత విషాద భరితం జీవితం ఎంత మెల్లగా సాగుతుంది నేను మన భూమికోసం శాశ్వత తారకల అనంత యవనికమీది క్షణపరమాణువు కోసం మన నిస్త్రాణ చక్షువులను చదివిన అతి […]

Continue Reading
Posted On :

నీవో బ్రతుకు మెట్టువు (కవిత)

నీవో బ్రతుకు మెట్టువు -డా. కొండపల్లి నీహారిణి టీ నీళ్ళు మరుగుతున్నాయి కమ్మని వాసన తన రుచులు అవి అని గొప్పలుబోతున్నది ఉదయం వెంటేసుకొచ్చే హుషారు సమయాలు చేయాల్సిన పని ఒక్కటే వెన్నంటి ఉన్న విషయాన్ని కాసేపు మరచిపొమ్మన్నది ఎల్లలు లేనిది ఆకాశానికే కాదు హృదయాలకు కూడా! కావాల్సినంత ఓపిక కాలేని విసుగు మసిగుడ్డను పక్కన్నే పడిఉన్న పట్కారును పక్క దిగని పిల్లలను పనికెళ్ళాల్సిన పెనిమిటినీ సముచిత భావముద్రలుగా ఆమెతోబాటు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి తద్ధితాలో కృదంతాలో మాటమాటకు […]

Continue Reading
Posted On :

వర్షానికి ఉత్తరం(డారి మూలం: రెజా మొహమ్మది, ఆంగ్లం: హమీద్ కబీర్ నిక్ లేర్డ్ తెలుగు సేత: ఎలనాగ)

వర్షానికి ఉత్తరం డారి మూలం: రెజా మొహమ్మది ఆంగ్లం: హమీద్ కబీర్ నిక్ లేర్డ్ తెలుగు సేత: ఎలనాగ ప్రియమైన వర్షమా! చలికాలం గడచిపోయింది వసంతం కూడా చివరిదశను చేరుకుంది తోట నిన్ను ఎంతగానో మిస్ అవుతోంది నువ్వు కనపడని ఈ పరిస్థితి ఎప్పుడు ముగుస్తుంది? వర్షమా, ఓ వర్షమా! కరుణ నిండిన చల్లని హృదయమున్న వర్షమా! ఎడారుల నుండి, పర్వతాల నుండి, అరణ్యాల నుండి వీచే గాలికి ఎగిరే పాదచారి కాళ్ళ ఎర్రెర్రని ధూళి తప్ప […]

Continue Reading
Posted On :

అయినా సరే! (కవిత)

అయినా సరే! -బండి అనూరాధ చిగురించి పండి ఎండి రాలి..ఆకుల వంటి వారమే మనం కూడా. ఒక్కోసారి,ఒళ్ళు జలదరించే సత్యాల్లోకి తొంగిచూస్తేనిద్రపట్టని రాత్రుళ్ళలోకి వెళ్ళిపడతామేమోననిఈవలిగానే పట్టీపట్టనట్లుండిపోతాం. భ్రమల నేలలో అన్నీ బరువే అనుకునితేలికగా ఊపిరి తీసుకుంటూచెట్లనీడలో పడిన ప్రాణంలాతెరిపినపడుతూ… ఒక నిద్రకి, కలల చెట్లని పట్టుకెళ్ళివాడని పూలను కోసుకుంటూనిజంలా బ్రతికేస్తూ… వనాలలో వైనాలన్నీ పగటికి పూసివెర్రి నవ్వొకటి నవ్వుకుంటాం. రాలడం తెలియదుగా..ఎప్పుడో..!! ***** పేరు అనూరాధ బండి. స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం. ప్రస్తుత నివాసం కృష్ణా జిల్లా తాడిగడప […]

Continue Reading
Posted On :

కారబ్బంతి చేను (కవిత)

కారబ్బంతి చేను -అనిల్ డ్యాని మట్టిదారి ముందు మనిషి కనబడడు పొగమంచు దట్టంగా గుండె జలుబు చేసినట్టు ఊపిరి ఆడని ఉక్కిరిబిక్కిరి తనం కుడివైపున ఏపుగా పెరిగిన తాడిచెట్ల నుంచి కమ్మగా మాగిన తాటిపళ్ళ వాసన ఎడమవైపున శ్మశాన వైరాగ్యపు సమాధులు సామూహిక బహిర్భూమి ప్రదేశాలు ప్రవహిస్తున్న మద్రాసు కాలవ నిండా దాని తవ్వకానికి నా పూర్వీకులు చిందించిన చెమట ఒంటిమీద కనీసం రెండైనా గుండీలుండని పల్చటి చొక్కా మోకాళ్ళ పైకి జారకుండా ఉన్న నిక్కరుకి మొలతాడే […]

Continue Reading
Posted On :

రేపటి ఉషోదయాన(ఫ్రెంచ్ మూలం: విక్టర్ హ్యూగో, ఆంగ్లం మూలం: విక్టర్ హ్యూగో, తెలుగు సేత: ఎలనాగ)

రేపటి ఉషోదయాన ఫ్రెంచ్ మూలం: విక్టర్ హ్యూగో ఆంగ్లం: విక్టర్ హ్యూగో తెలుగు సేత: ఎలనాగ రేపటి ఉషోదయాన పల్లె తెల్లబారినప్పుడు నేను బయలుదేరుతాను నువ్వు నా కోసం నిరీక్షిస్తుంటావని తెలుసు అడవిలోంచి, పర్వతాలమీంచి ప్రయాణిస్తాను ఇక ఎంత మాత్రం నీకు దూరంగా ఉండలేను నా దృష్టిని నా ఆలోచనల మీద నిలిపి భారంగా నడుస్తాను చుట్టూ వున్న దేన్నీ పట్టించుకోకుండా ఏ చప్పుడునూ వినకుండా ఒంటరిగా, అజ్ఞాతంగా, వంగిన వెన్నుతో, చేతులను గుణకారపు గుర్తులాగా పెట్టుకుని […]

Continue Reading
Posted On :

గాయం రంగు (కవిత)

గాయం రంగు -బండి అనూరాధ బద్ధకం, మగతా, పలు మీమాంశల మధ్యగా కళ్ళుతెరవ చూస్తాను.లోపలెవరో నెగడుని రగిలించినట్లుకళ్ళ మంటలు; కొంచ మాగాక, పక్షులు ఇక ఊరుకోవు.ఒక కిటికీ పక్కగా జామచెట్టూ;మరో కిటికీ పక్కగా వేపచెట్టూ;గది మొత్తం, ఆ రెంటి పై తిరుగాడే పక్షుల భాషే! ఇక నిజంగా లేవబోతానా! అజ్ఞాత చిత్రకారులెవరో, రకరకాల అసంపూర్తి కాన్వాస్లని వదిలిపోయిన చోటులోనే తిరుగాడుతున్న రాత్రికల ఇంకానా కళ్ళలో సజీవచిత్రమై ఉంది. మరి పూర్తి మెలకువలో, అంతా అయోమయం.తెర మొత్తం నీలమూ తెలుపు బూడిదరంగు.ఎర్రని వృత్తంలో ప్రాణం. పశ్చిమంకి […]

Continue Reading
Posted On :

అమ్మ మాట— (కవిత)

అమ్మ మాట -లక్ష్మీ శ్రీనివాస్ నాలుగు గోడల మధ్య నుంచినలుగురి మధ్యలో నిలవాలన్ననలుగురిలో గెలవాలన్ననలుగురిని గెలిపించాలన్నానాలుగు అక్షరాలు నేర్చుకోవాలని  చెబుతూ ఉండేది అమ్మ!! నాలుగు అడుగులు వేయాలన్ననాలుగు రాళ్ళు పోగేయలన్ననలుగురిని సంపాదించు కోవలన్ననలుగురికి సాయం చేయాలన్న నాలుగు అక్షరాలు నేర్చు కోవాలనిచెబుతూ ఉండేది అమ్మ!! గుడి తలుపులు బడి తలుపులుఎప్పుడు ఎదురుచూస్తుంటాయినీ ఎదుగుదలకు తోడ్పడుతుంటాయిగుడి బడి తల్లి తండ్రులు లాంటి వాళ్ళనిమంచి కథలతో ఎన్నే నీతులు బోధిస్తూఎప్పుడు హితాన్ని మరవకూడదనిసత్ మార్గంలో పయనించాలనిపరుల ఘోషకు కారణం కాకూడదనిచెబుతూ ఉండేది అమ్మ!! గెలుపు ఓటములనుస్వేచ్చగా స్వీకరించమంటుఎదురయ్యే […]

Continue Reading
Posted On :

మట్టి ప్రేమ (కవిత)

మట్టి ప్రేమ -గవిడి శ్రీనివాస్ కాసింత కాలం వెళ్ళిపోయాకగుండెలో దిగులు తన్నుకొస్తుంది. జ్ఞాపకాలు పిలుస్తున్నట్లుఊరిపొలిమేర పలవరిస్తున్నట్లుఇంకా సమయమౌతున్నట్లుగూటికి చేరుకోమనే సందేశంవంత పాడినట్లుమనస్సంతా భారంగా ఉంటుంది. కళ్ళలో పొలాలుకన్నీళ్ళలో అనుభవాలుఅనుబంధాలు దొర్లిఇప్పుడున్న చోట నిల్చోనీయవు. పక్షులు ఎంత దూరం కదిలినాగూటిని మరవనట్లుచూపులు ఇంటివైపేదుముకుతుంటాయి. ఉద్దేశం విశ్వమానవుడిగానేఅయినాకాలం పొరలు కదిలిన కొద్దీనా మట్టి వేళ్ళు లాగుతుంటాయి.నా మట్టి ప్రేమనా మూలాలికి  చేర్చుతుంది.ఇప్పుడు కుదురుగా ఉండలేనునా మట్టి పై అలా వాలేవరకూ. ***** గవిడి శ్రీనివాస్  ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు.  సెయింట్ ఆన్స్ […]

Continue Reading
Posted On :

చూస్తూ ఉరుకునేదే లేదు (కవిత)

చూస్తూ ఉరుకునేదే లేదు -డా. కందేపి రాణీప్రసాద్ సహనంగా ఉంటే చాతగాదని కాదుమౌనంగా ఉంటే మతాలు రావని కాదుఓపిక పట్టామంటే ఎదురు తిరగలేరని కాదుభరిస్తున్నామంటే పోరాడలేరని కాదు! నీ పరువెందుకు తీయటమని కావచ్చునీ మీద మిగిలిన ప్రేమ నమ్మకం కావచ్చునీలాగా దిగజారి మాట్లాడలేక కావచ్చునీలాగా అవినీతి వెంట నడవలేక కావచ్చు! అంతేకానీనువ్వేం చేసిన చెల్లుతుందని కాదునువ్వేం మాట్లాడినా నెగ్గుతుందని కాదుఅన్యాయం ఎల్లవేళలా కాపుకాస్తుందని కాదుకాలం కొండలా అడ్డు నిలబడిందని కాదు పదే పదే అవమానిస్తే వెనక్కి తోసేస్తేకావాలని గొప్పదనాన్ని తగ్గించి చులకన […]

Continue Reading
Posted On :

దేహ దానం (కవిత) 

దేహ దానం     – రేణుక అయోల   ప్రమాదం వార్త చూపుని కప్పేసిన కన్నీటి జడివానలో హాస్పిటల్ ఎమర్జెన్సీ గది ముందు అలజడి అడుగు వేయలేక తడిసిన శిలలలై ఆరని కనురెప్పలు కింద నీటి బొట్టు కంట్లోనే తిరుగుతుంటే మెదడు చనిపోయింది అంటాడు డాక్టరు గుండె ఆగిందా ! అంటే గుండె వుంది కానీ మనిషి చనిపోయారంటే నమ్మలేని వైద్య భాష అవయవ దానం మరో అర్థం కాని ప్రశ్న గుండెని ఆపడం గుండు సూది గుచ్చుకున్ననొప్పి […]

Continue Reading
Posted On :

వృథాగా వలస పోతాను(ఫ్రెంచ్ మూలం: అబ్దుల్లతీఫ్ లాబి, ఆంగ్లం మూలం: ఆండ్రె నఫీస్ – సాహెలీ, తెలుగు సేత: ఎలనాగ)

వృథాగా వలస పోతాను ఫ్రెంచ్ మూలం: అబ్దుల్లతీఫ్ లాబి ఆంగ్లం: ఆండ్రె నఫీస్ – సాహెలీ తెలుగు సేత: ఎలనాగ నేను వృథాగా వలస పోతాను ప్రతి నగరంలో అదే కాఫీ తాగుతూ, ఉద్వేగం లేని సర్వర్ ముఖాన్ని చూసి మార్పు లేని పరిస్థితిని మౌనంగా అంగీకరిస్తాను పక్క టేబుళ్ల దగ్గరి నవ్వు సాయంత్రపు సంగీతాన్ని చెడగొడుతుంది ఒక స్త్రీ అంతిమంగా నిష్క్రమిస్తుంది నా పరాయీకరణను పక్కా చేసుకుంటూ వృథాగా వలస పోతాను నేను ప్రతి ఆకాశంలో […]

Continue Reading
Posted On :

అనఘతల్లి (కవిత)

అనఘతల్లి -శింగరాజు శ్రీనివాసరావు ప్రభానుడు తన ప్రతాపాన్ని ప్రజ్వలింప చేస్తున్నాడు రోహిణి వచ్చిందేమో రోళ్ళు పగిలేటంత భగభగలు సగం కాళ్ళు మాత్రమే కప్పుతున్న పాదరక్షలు వడివడిగా అడుగులు వేస్తూ కదిలి పోతున్నాయి నడినెత్తి మీద మెడలు విరిగేటంతటి భారం మోయకపోతే పొయ్యిలో పిల్లి లేవదు మరి చేతులు మాత్రం ఖాళీగా ఉన్నాయనుకోవడానికి లేదు నవమాసాల భారం నేలను తాకి చంకకు చేరింది బుడి బుడి అడుగులు మరో చేతికి అలంకారమాయె కొంగు చుట్టూచేరి చేతనున్న వాడికి గొడుగైతే […]

Continue Reading
Posted On :

ఊ…ఊ అంటోంది పాప (కవిత)

ఊ…ఊ అంటోంది పాప   -వసీరా ఒక స్వప్నంలో తేలుతోంది పాప పడుకున్న మంచం కల మీద తేలే మరో కలలాగ ఉన్నది మంచం మీద పడుకున్న పాప చిన్నిపాప నిద్రపోతోంది మంచు నిద్రపోయినట్లు మంచు ఉదయం సరస్సు నిద్రపోయినట్లు సరస్సు మీద లేత ఎండ నిద్రరపోయినట్లు మేలిమి ఎండలో సరస్సులోని కలువ నిద్రపోయినట్లు అలా పడుకుని ఉన్న పాప శరీరం బహుశ ఒక స్వప్నం తన చిన్నిశ్వాసలోంచి పాపలోకి ఓ స్వప్నం ప్రవేశించి విస్తరిస్తోంది బేబీ నిశ్వాసంలోంచి […]

Continue Reading
Posted On :

నా నీడ తప్ప (కవిత)

నా నీడ తప్ప -హేమావతి బొబ్బు నా నీడ తప్ప నేను నాకు కనిపించడం లేదు నా లోన ఏదో  సందిగ్ధత అది పెరిగి పెద్దదై చివురు నుండి మ్రానుగా తుఫానుగా మారుతుంటే తుమ్మెదల ఝూంఝూంకారం నాథoగా నాథా కారంగా లోకాన్నంతా అలుముతుంటే విషాదమో ఆనందమో విశదీకరించలేని స్థితి ఛిటికేనవ్రేలుని పట్టుకొన్న చిన్నారి కన్నులలోకి  జారుతున్న కన్నీళ్ళు ఏదో తరుముకొస్తున్నట్లు అంతా వేగంగా కదలిపోతుంటే, ……..ఇక్కడే ఒక్క క్షణం స్తబ్దంగా మిగిలిపోవాలని మారే కాలాన్ని గుప్పెటన బంధించి నీ కౌగిలిలో నిశ్శబ్దముగా ఒదిగి పోవాలని నీ దాహాన్ని తీర్చే నీటి బొట్టునై నీ హృదయాన్ని చేరాలని ……. ***** నేను హేమావతి బొబ్బు తిరుపతి వాసిని, ప్రాధమిక విద్య తిరుమల శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో, ఉన్నత విద్య శ్రీ పద్మావతి మహిళా కళాశాల  తిరుపతి లో జరిగింది. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం […]

Continue Reading
Posted On :

క(అ)మ్మతనం (కవిత)

క(అ)మ్మతనం  -డా. మూర్తి జొన్నలగెడ్డ కలలోనైనా ఇలలోనైనా కమ్మగ ఉండేదే అమ్మతనం కన్నుల లోనైనా మిన్నుల లోనైనా వెలుగులు నింపేదే ఆ తల్లి పదం గోరు ముద్దల నాడూ ఆలి హద్దుల నేడూ అలసటే ఎరుగని ఆ నగుమోము చూడు అస్సలంటూ చెరగని ఆ చిరునవ్వు తోడు అలసి సొలసిన చిన్నారినీ అలుక కులుకుల పొన్నారినీ అక్కున చేర్చేటి ఆ అమ్మ తోడు అక్కర తీర్చేటి ఆ తల్లి తోడు ఎవరు తీర్చేది కాదు ఆ తల్లి […]

Continue Reading
Posted On :

ఉరి తీయబడ్డ అక్షరాలు (కవిత)

ఉరి తీయబడ్డ అక్షరాలు   –శిలాలోలిత చెంచా గిరీలు నడుస్తున్న కాలమిది సరిహద్దుల మీద నరుకుతున్న కాళ్లు గుండె ఒక్కటే మనుషులొక్కటే మానవత్వం ఒక్కటే అనే విశ్వ మానవ ప్రేమికులు రచన ద్రష్టలు అందరూ అందరూ కలగలవలనే కాంక్షా తీరులు(హితులు) సంకుచిత హృదయాలతో భూమి నుంచి చీల్చుతున్న గండ్రగొడ్డల ధ్వనులు అరమరికలు లేని స్వేచ్ఛ ధోరణలతో ప్రపంచ కవుల తీరొక్కటే అని ఎలుగెత్తుతుంటే కీర్తిలు, భుజకీర్తుల కాలమైపోయింది కొంత _____(?) కొంత నష్టం ఎంపిక లోపాలు లోపాయి కారీతనాలు […]

Continue Reading
Posted On :
gavidi srinivas

సంపూర్ణం…! (కవిత)

సంపూర్ణం…! -గవిడి శ్రీనివాస్ దాహాలు అసంపూర్ణంగానే ఆరంభమౌతాయి. ఆలోచనల సంఘర్షణలోంచి ఒక దారి తళుక్కున మెరుస్తుంది. ఒక లక్ష్యం నిద్రలేని క్షణాల్ని వేలాడదీస్తుంది. జీవితం ఒక్కో పాదముద్రను చెక్కుతూ నిరాడంబరంగా విజయానికో చిరునవ్వు విసురుకుంటూ ముందుకు పోతుంది. ప్రతి క్షణమూ తిరిగిరానిదే. ఇక్కడ ఛేదించాల్సినవి చేయాల్సినవి కొన్ని వుంటాయి. అలా అలా సంతోషాల్ని లిఖిస్తూ కాస్త ముందుకు జరగాలి. అసంపూర్ణం నుంచి సంపూర్ణానికి ఒక్కో అడుగు తొడుగుతూ ఒక్కో మైలురాయి లో చిహ్నాల్ని కొన్ని తీపి గురుతులు […]

Continue Reading
Posted On :

ఔర్ చాలీస్ బాకీహై-

ఔర్ చాలీస్ బాకీహై- -డా||కె.గీత ఇక ఆ తలుపులు ఎంత బాదినా తెరుచుకోవు- తలపులు మాత్రం ఇటువైపు రోదిస్తూ ఇక ఆ ఫోను మోగదు- పాతవేవో సంభాషణలు చెవుల మోగుతూ ఆ వేళ్ల నించి మెసేజీ రాదు- దు:ఖం ఇంకిపోయిన బాధాత్మకవేర్లు గుండెలోతుల్లో పాతుకుపోతూ ఔర్ చాలీస్ బాకీహై- ఔర్ చాలీస్ బాకీహై- ఇంకా వినిపిస్తూనే ఉంది.. అరవయ్యేళ్ళకే తనువు పరిమితం కాదంటూ అనేవారుగా ఔర్ చాలీస్ బాకీహై- నిజమనిపించేంత ఆశాపాశం- తల్చుకున్నప్పుడల్లా ఎంత బావుండేదీ- ఎప్పుడో […]

Continue Reading
Posted On :

ఒక పరివ్రాజక కల (కవిత) 

ఒక పరివ్రాజక కల – శేషభట్టర్ రఘు నా కాలంలో ఆడపిల్లలు గోరింటాకుతో తిరిగినట్టునా మటుకు నేను గొప్పోడిననే ఖ్యాతితో తిరగాలనికలగనేవాడ్నిఅలా అనుకోవటంలోనే ఒక గమ్మత్తయిన మత్తుందనికలలేవీ లేనివాడ్ని సన్యాసి అంటారనివాడికి అడవులు కొండల్లో జపమాలలు తిప్పటమేపనిగా ఉంటుందని అనుకునే వాడ్ని అప్పుడప్పుడూ కన్న కలలన్నీ గుట్టపోసి చూసేవాడ్నిఏం చేయాలో తోచక మళ్ళీ బుర్రలోనే దాచేవాడ్ని బతకటం అంటే జీవితం చేసే నానా రకాల అలజడినిసితారు తీగల్లా సవరించటం కాదు కనకనా ఖ్యాతి కలలు కూడా గడ్డంలాగే నెరిసిపోయాయిఅప్పుడు పిల్లల నాజూకు […]

Continue Reading
Posted On :

ఓపెన్ సీక్రెట్ (కవిత)

ఓపెన్ సీక్రెట్  -నిర్మలారాణి తోట నాకు తెలుసు నాకే కాదు సమస్తనారీలోకానికీ తెలుసు నీ చూపుడు వేలెప్పుడూ నావైపే చూస్తుందని నే కట్టే బట్టా నా పెరిగే పొట్టా అన్నీ నీకు కాలక్షేపసాధనాలే ఆక్షేపణల శోధనలే.. మడతపడ్డ నాలుగువేళ్ళు నిన్నేమని నిలదీస్తున్నాయో నీకెప్పుడూ కనిపించదు నీ కురుచ బుద్దికి నా దుస్తులు పొట్టివైపోతాయి నీ మైక్రోస్కోపిక్ చూపులకు ఆరు గజాల చీరకూ చిల్లులు పడతాయి నువ్వెప్పుడూ “నేను” కాని మాంసపుముద్దనే చూడగలవెందుకో.. చిత్రంగా అనిపిస్తుంది మేము చేసిన బొమ్మలే మమ్మల్ని బొమ్మల్నిచేసి […]

Continue Reading
Posted On :

దేహచింతన (కవిత)

దేహచింతన   –చల్లపల్లి స్వరూపారాణి నిజానికి మీకో దేశాన్నే యివ్వాలనుకున్నాదేహాన్నిచ్చి పాఠ్య పుస్తకం అవుతున్నా చచ్చినాక పూడ్చుకోడానికి ఆరడుగుల నేలకోసం యుద్ధాలు చేసే సంతతివైద్య విద్యార్దీ!యిది దేహం కాదు, దేశం ఈ దేహాన్ని జాగ్రత్తగా చదువు!దేశం అర్ధమౌతాది పేగుల్లో అర్ధశాస్త్రముంది చూడు చర్మం సుకుమారి కాదు వెన్నపూసల మర్దనా నలుగుపిండి స్నానం యెరగదు అయినా కళ్ళల్లో ఆకాంతి యెక్కడిదో ఆరా తియ్ !యిక గుండెకాయ గురించి యేమి చెప్పను!యెన్ని కొంచెపు మాటలు రంపంతో కోశాయో!ఆ గాయాలే సాక్ష్యం  వూపిరితిత్తులు నవనాడులు కాసింత గౌరవం కోసమే కొట్టుకునేవి ఈ దేహానికి తలకంటే పాదాలే పవిత్రం రాళ్ళూ రప్పల్లో చెప్పుల్లేకుండా తిరుగాడిన కాళ్ళు యెదురు దెబ్బలతో  నెత్తురు […]

Continue Reading
Posted On :

జీవితం(ఆంగ్లం మూలం: క్యారీ లా మోర్గన్ ఫిగ్స్ తెలుగు సేత: ఎలనాగ)

జీవితం ఆంగ్లం: క్యారీ లా మోర్గన్ ఫిగ్స్ తెలుగు సేత: ఎలనాగ 1 ఆనందపు క్షణం, ఆర్తి నిండిన ఘడియ ఎండ కాసిన ఒక దినం, వాన కురిసిన ఏడు రోజులు శాంతి విరిసిన పక్షం, ఘర్షణ ముసిరిన ఒక మాసం ఇవన్నీ కలిస్తే జీవితమౌతుంది 2 డజను శత్రువుల మధ్య నిజమైన స్నేహితుడొక్కడు, మూసిన ఇరవై గేట్లను మరిపిస్తూ తెరిచివున్న ద్వారాలు రెండు భోగభాగ్యాల సింహాసనం, ఆపైన పాడుకాలపు పట్టాకత్తి మిత్రులారా! ఇవన్నీ కలిస్తే జీవితం […]

Continue Reading
Posted On :

సముద్రం (కవిత)

సముద్రం   -వసీరా ఆకాశాన్ని నెత్తి మీదమోస్తూ సముద్రం ఒక చేపగా మారి ఈదేస్తుంది భూతలం మీద సముద్రం ఎగురుతుంది పక్షిగా మారి నీటిరెక్కలతో నీలమేఘమైపోయి సూరీడికి ఆవిరి స్నానం చేయించి సముద్రమే బడి వరండాలోంచి బయటపెట్టిన చిన్నారుల అరచేతుల మీద చినుకులై మునివేళ్లమీద విరిసిన సన్నజాజులై సముద్రమే చిన్నారుల ముఖాలమీద మెరుపులై ముఖపుష్పాల మీంచి ఎగిరే నవ్వుల సీతాకోక చిలుకలై సముద్రమే సముద్రమే బడిగంటమోగినంతనే చినుకుల మధ్య కేరింతలతో మారుమోగే గాలికెరటాలై సముద్రమే తన సొట్టబుగ్గల మీద […]

Continue Reading
Posted On :