image_print

‘ఇక మారాల్సింది నువ్వే’ పెనుగొండ సరసిజ కవితా సంపుటి పై సమీక్ష

ఇక మారాల్సింది నువ్వే కవితా సంపుటి పై సమీక్ష   -గిరి ప్రసాద్ చెలమల్లు వరంగల్ లో పుట్టిన సరసిజ పెనుగొండ గారు తాను పుట్టిన నేల ఆవేశాన్ని ఇక మారాల్సింది నువ్వే కవితా సంపుటి లోని తన కవితల్లో పెల్లుబికించారు. కవితా సంపుటి లో స్త్రీ వాదాన్ని , ప్రశ్నించే తత్వాన్ని, వలసల్లోని బాధని, రైతు వ్యధని చిత్రీకరిస్తూ లోతైన పదాలను వాడుతూ సామాన్య పాఠకులకు చేరువయ్యేల వ్రాసారు. కవితా వస్తువుల ఎంపికలో తనదైన అభిమతాన్ని […]

Continue Reading
Posted On :

అనీడ కవితా సంపుటి పై సమీక్ష

అనీడ కవితా సంపుటి పై సమీక్ష    -గిరి ప్రసాద్ చెలమల్లు నీడ కవితలోని అనీడయే సంకలనం పేరై కవితా సంకలనం గా పాఠకుల ముందుకు తెచ్చిన గార్ల బయ్యారం పుత్రిక రూప రుక్మిణి గారు కవితల్లో సామాజిక అంశాలను సమకాలీన సమాజంలో మానసిక రాజకీయ అంశాల ను వస్తువులుగా తీసుకున్నారు. ” తన స్నేహం వెలుతురున్నంత వరకే! అది తెలిసి నీడ అనీడ గా ” అంటూ పసిప్రాయంలో గుర్తించిన నీడ తన తో పాటుగా […]

Continue Reading
Posted On :

నైజం (కవిత)

నైజం -గిరి ప్రసాద్ చెల మల్లు అమ్మున్నంత కాలం ఎగబడ్డాయి పక్షులు అమ్మ పోయింది పక్షులు మరోవైపుకి మరలిపోతున్నాయి  అమ్మ వున్నప్పుడు ఎంగిలిచేతిని విదిలించని ఇళ్ళపై వాలుతున్న పక్షులు విదిలిస్తారని ఆశతో ఈసడించిన చేతులవైపు  అమ్మ పోపుగింజల్లో డబ్బు సైతంముక్కున కర్సుకుపోయిన  పక్షులు మరోవైపు  అమ్మ చేతి వంట తిన్న పక్షులు మర్చి మరబొమ్మల్లాతారాడుతున్నాయి  బెల్లమున్నప్పుడే ఈగలుఅమ్మ చెబుతుండేదెప్పుడూ కాని అమ్మే గుర్తెరగలేదనేది నేడు కన్పిస్తుంది కళ్ళముందు  గూటిపక్షులువలస పక్షులు అన్నీ అవే కోవలోఇసుమంతైనా తేడా లేదు సుమీ ! ముసిముసినవ్వుల వెనుక దాగిన మర్మం విషం గడపలో ఓ కుక్క విశ్వాసంగా అప్పుడూ ఇప్పుడూ **** పుట్టింది సూర్యాపేట. పెరిగింది నాగార్జున సాగర్. నాన్న గారి నుండి వామపక్ష […]

Continue Reading
Posted On :

డార్క్ ఫాంటసీ కవితా సంపుటి పై సమీక్ష (పుస్తక సమీక్ష)

డార్క్ ఫాంటసీ కవితా సంపుటి పై సమీక్ష -గిరి ప్రసాద్ చెలమల్లు ప్రేమ కవితల సమాహారం అద్భుత ఊహల సామ్రాజ్య అక్షరీకరణలో ఫలవంతమైన రచయిత్రి గీతా వెల్లంకి గారి తొలి  డార్క్ ఫాంటసీ సంపుటికి ముందుమాట డాక్టర్ నాగసూరి వేణు గోపాల్ వ్రాస్తూ రచయిత్రి కున్న ప్రేమ శిల్పాన్ని వ్యక్తీకరిస్తూ ప్రేమ కవితల విందుని పంచారన్నారు. ఇది ఒక గొప్ప తెలుగు ప్రేమ సాహిత్యమని అభివర్ణించారు. శ్రీమతి శిలాలోహిత గారు తెరచిన కిటికీలోంచి చూస్తూ స్నేహ చెలమను గుండెల్లో దాచుకున్న సముద్రమామె అని […]

Continue Reading
Posted On :

ప్రకృతి (కవిత)

ప్రకృతి -గిరి ప్రసాద్ చెల మల్లు కృష్ణా నదిలోని నల్లని గులకరాళ్ళ కళ్ళ చిన్నది గోదావరంత పయ్యెద పై నే వాల్చిన తలని నిమిరే నల్లమల కొండ ల్లాంటి చేతివేళ్ళ చెలి సోమశిల లాంటి ముక్కు ఉచ్చ్వాస నిశ్వాసాలకి అదురుతుంటే నా గుండెలపై వెచ్చని రామగుండం స్పర్శ శేషాచలం కొండల కనుబొమ్మల మధ్య గుండ్రని చందవరం స్థూపం లాంటి తిలకంలో నా రూపు శాశ్వతం ఫణిగిరి లాంటి నల్లని వాలుజడ పిల్లలమర్రి ఊడల్లా ఊగుతుంటే మదిలో ఏటూరు […]

Continue Reading
Posted On :

అక్కమహాదేవి (కవిత)

అక్కమహాదేవి -గిరి ప్రసాద్ చెలమల్లు అక్కమ్మా! ఎప్పుడో ఏనాడో నీ నుండి జాలువారిన  వచనం మా సమాజాన్ని సూటిగా, నగ్నంగా ప్రశ్నిస్తున్నట్లగుపిస్తుందమ్మా నీ కాయం నీ ఇష్టం ఎవ్వరికి అర్పిస్తావో ఎవ్వరి దురాక్రమణకి లొంగక అణువణువూ చెన్నకేశవ చెంత దిగంబరమో నీ మనోభీష్టమో స్పర్శయో సాన్నిహిత్యమో తలంచినదే తడవుగా ఎక్కుబెట్టిన విమర్శనావచనం జీర్ణించుకోలేని ఆధిక్యత నీ గుహ ఎన్నో మనోనిగూఢాల వేదిక నీ మేను ప్రవచించిన కేశాల అల్లిక నాడే ఎలుగెత్తిన నీవే మా చలం కన్నా […]

Continue Reading
Posted On :

నవవాక్యం (కవిత)

నవవాక్యం -గిరి ప్రసాద్ చెల మల్లు అక్కడో పరువుతండ్లాడుతుంది గోబ్యాక్ నినాదాల వెనుక మర్మం జగద్విదితం  కులం గొంతుఆఖరిచూపునిచిదిమేసింది బిడ్డ భర్త హత్యలోప్రేమపర్వం తెరలుతెరలుగా సమాజగోడలపై చిత్రించబడుతుంది  మానసికస్థైర్యానివ్వలేని కులంమనిషిని చంపినా చేవ తగ్గకరంకెలేస్తుంది  గొడ్డలి వేటులో ప్రాణం గిలగిలలాడుతుంటేహర్షాతిరేకాలతోవీధుల్లో పైశాచిక కులోన్మాదం  పరిణతి ఇరవైల్లోనేజవాబులకు రంగుల పులిమే పాత్రికీచకత్వం  ప్రేమ భాష్యం  మారుతుందోమార్చబడుతుందో పరువు పదంలో కొంగ్రొత్తగా చెక్కబడుతున్న శిల్పంప్రేమ సహచర్యాన్ని ఓర్వలేని కులంతెగనరికి ప్రేమంటుంటేశిలపై ఉలి మొరాయిస్తూసమ్మెటకే ఎదురుతిరిగి వెలివాడల్లో ప్రేమకోసం పరుగులెత్తుతుంటే అడుగుల్లో నవవాక్యం కనబడుతుంది ***** పుట్టింది సూర్యాపేట. పెరిగింది నాగార్జున సాగర్. నాన్న గారి నుండి వామపక్ష భావజాలం పొందాను. విద్యార్థి దశలో ఎస్. […]

Continue Reading
Posted On :

నలుపు (కవిత)

నలుపు -గిరి ప్రసాద్ చెల మల్లు నేను నలుపు నా పొయ్యిలో కొరకాసు నలుపు రాలే బొగ్గు నలుపు నాపళ్లని ముద్దాడే బొగ్గు పొయ్యిమీది కుండ  నలుపు నాపొయ్యిపై పొగచూరిన  తాటికమ్మ నలుపు కుండలో బువ్వ నా దేహదారుఢ్య మూలం నల్లని నాదేహం నిగనిగలాడే నేరేడు నల్లని నేను కనబడకపోతే ఎవ్వరిని నల్లగా చేయాలో తెలీక సూరీడు తికమక సూరీడు  తూర్పునుండి  పడమర నామీదుగానే పయనం పొద్దుని చూసి కాలం చెప్పేంత స్నేహం మాది నా పందిరిగుంజకి […]

Continue Reading
Posted On :

యుద్ధం (కవిత)

యుద్ధం -గిరి ప్రసాద్ చెల మల్లు దేశం కోసం  సరిహద్దుల్లో  కులమతాల భద్రతకోసం లోలోన చంపుకునేందుకు చంపేందుకు మంచుదుప్పట్లో వాడక్కడ కాపలా  లైన్ ఆఫ్ కంట్రోల్ మీదుగా రాడ్లు కర్రలు బాహాబాహీ భూముల గెట్ల తగాదాలో లోపల  అక్కడ సమిష్ఠి బాధ్యతకై వాడు ఇక్కడ పెత్తనం కోసం బలవంతుడు బలహీనుడిని తొక్కుతూ అక్కడా పెట్టుబడీ ఇక్కడా పెట్టుబడీ కోరలు అక్కడాఇక్కడా అవినీతి జాడ్యం చిదిమేది బడుగు బతుకునే  దేశమంటే మనుషులని వాడు అచ్చట ప్రాణాలొడ్డి దేశమంటే కులాలఎంపిక మతాల తరిమేత ఇక్కడ గద్దెకోసం రగడ రాజేయు అన్నివేళలా ఇక్కడసౌభ్రాతృత్వం కోసం వాడు రగులు అచ్చట  అచ్చట వాడికి మూడురంగుల జెండా యే కనపడు ఇచ్చట […]

Continue Reading
Posted On :

విడదీయ లేరూ (కవిత)

విడదీయ లేరూ !!! -గిరి ప్రసాద్ చెల మల్లు నేను ఆమె మెడచుట్టూ అల్లుకుపోయి రెండుమూడు చుట్లు తిరిగి భుజాల మీదుగా ఆమె మెడవంపులోకి జారి గుండెలమీద ఒదిగిపోగానే ఆమెలో అనుభూతుల పర్వం  ఆమె కళ్ళల్లో మెరుపు కళ్ళల్లో రంగుల స్వప్నాలు ఆమె అధరాలపై అందం కించిత్తు గర్వం  తొణికిసలాడు ఆమె రూపులో కొత్తదనం బహిర్గతం  నేను  ఆమె అధరాలను స్పృశిస్తూ నాసికాన్ని నా ఆధీనంలోకి తీసుకు రాగానే ఆమె ఉఛ్వాసనిశ్వాసాల గాఢత నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది  ఆమె కింది కనురెప్పల వారగా నేను ముడతలను మూసేస్తూపై కనురెప్పల ఈర్ష్యను గమనిస్తూ ముంగురులను ముద్దాడుతూ ఆమె […]

Continue Reading
Posted On :

ఆమె (కవిత)

ఆమె (కవిత) -గిరి ప్రసాద్ చెల మల్లు ఆమె ఒక ప్రశ్న జవాబు దొరకదు ఆమె ఒక పజిల్ అంచనాకు అందదు ఆమె వర్షిణి కురిపించే ప్రేమ కొలిచే పరికరం లేదు ఆమె సృష్టి బిడ్డ కోసం పంచే పాల నాణ్యత లాక్టో మీటర్ కి చేరదు ఆమె దుఖం కుటుంబ పాలన లో అడుగడుగునా రెప్పల మాటున గడ్డ గట్టి ఏకాంతంలో విష్పోటనం ఆమె ఆరోగ్యం జీవన శైలి ప్రతిబింబం ఆమె భద్రత ఆమె చుట్టూ […]

Continue Reading
Posted On :