చీకటి

నేపాలీ మూలం, ఇంగ్లీష్ : బిమల్ నీవ

తెలుగు సేత:వారాల ఆనంద్

రాత్రి చీకట్లో ఏమయినా జరగొచ్చు
పగులుపట్టిన రోడ్డులోంచి ఎగిరిపడ్డ
పోట్రాయి కాలికి తగలొచ్చు

అంతేకాదు ప్రాణం లేని శిలావిగ్రహాలతో ఢీ కొట్టొచ్చు
లేదా భూమ్మీదో వాకిట్లోనో పడిపోవచ్చు
తోవదప్పి మురికి కాలువలో పడిపోవచ్చు

రోడ్డుపైకి చొచ్చుకొచ్చిన
ఏ బంగ్లానో దేవాలయాన్నో
దారితప్పి గుద్దుకోవచ్చు, గాయాలపాలు కావచ్చు

చీకట్లో ఏమీ కనిపించదు
కళ్ళు వున్నా వృధా
చీకట్లో ఎలాంటి రక్షణా లేదు

చీకట్లో దాక్కొని
ప్రతిమలుపు దగ్గరా
ఓ కత్తి ఎదురుచూస్తూ వుంటుంది
అది నిన్ను చంపేయొచ్చు
చీకట్లో ఏమయినా జరగొచ్చు

మొదట మనమీ చీకటిని తొలగిద్దాం

*****

Please follow and like us:

One thought on “చీకటి (నేపాలీ మూలం, ఇంగ్లీష్ : బిమల్ నీవ, తెలుగు సేత: వారాల ఆనంద్ )”

  1. అనువాదంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన వారాల ఆనంద్ గారి కవిత బాగుంది. ముఖ్యంగా భావాత్మకంగా ముందు చీకటిని తొలగిద్దాం అనడం నచ్చింది

Leave a Reply

Your email address will not be published.