image_print

వీమా (కథ)

వీమా (వంగూరి ఫౌండేషన్ 2023 ఉగాది ఉత్తమ రచనల పోటీలో అత్యుత్తమ కథగా బహుమతి పొందిన కథ) (కౌముది ఏప్రిల్ 2023 ప్రచురణ) -డా.కె.గీత           ఆఫీసు నించి వస్తూనే ఉయాల్లోంచి పాపని ఒళ్ళోకి తీసుకుని తల, చెవులు  నిమురుతూ తనలో తాను గొణుక్కుంటున్నట్లు ఏదో అనసాగేడు సాగర్.            “అదేవిటి బట్టలు కూడా మార్చుకోకుండా…. ఇంకా ఏదో అనబోతూ గది గుమ్మం దగ్గిరే ఆగిపోయేను.  నా […]

Continue Reading
Posted On :
K.Geeta

సంపాదకీయం- మే, 2023

“నెచ్చెలి”మాట  చిన్న జీవితం! -డా|| కె.గీత  చిన్న జీవితం అనగా నేమి? వేదాంతంబు కాదు నిజ్జంబుగ నిజ్జమే పేద్ద జీవితం అనుకుని ఎన్నో వాయిదాలు వేస్తాం ఒక కలయికనీ- ఒక ముఖాముఖినీ- చివరికి ఒక పలకరింపునీ – కానీ చిన్న జీవితం అని ఎప్పుడు అర్థం అవుతుందీ? మన కళ్ళెదురుగా ఉన్న మనుషులు అర్ధాంతరంగా మాయమైపోయినప్పుడు ఎంత రోదించినా ఏవీ వెనక్కి రానప్పుడు జ్ఞాపకాలు మాత్రమే చెవుల్లో రొద పెడుతున్నప్పుడు మరి చిన్న జీవితం అని తెల్సిపోయేకా […]

Continue Reading
Posted On :

నెచ్చెలి-2023 కథా, కవితా పురస్కారాల పోటీలు

 నెచ్చెలి-2023 కథా, కవితా పురస్కారాల పోటీలు (ఆఖరు తేదీ మే10, 2023) -ఎడిటర్ నెచ్చెలి 4వ వార్షికోత్సవం (జూలై10, 2023) సందర్భంగా నిర్వహిస్తున్న  కథా, కవితా పురస్కార పోటీలకు రచనలకు ఆహ్వానం! మొదటి బహుమతి పొందిన కథకు *శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం* మొదటి బహుమతి పొందిన కవితకు *డా|| కె.గీత ఉత్తమ కవితా పురస్కారం* బహుమతులు: కథలకు: మొదటి బహుమతి (ఉత్తమ కథా పురస్కారం)- రూ.2500/- ద్వితీయ బహుమతి – రూ.1500/- తృతీయ బహుమతి […]

Continue Reading
Posted On :

ప్రమద – మాధబి పూరీ బుచ్‌

ప్రమద సెబీ తొలి మహిళా ఛైర్ పర్సన్- మాధబి పూరీ బుచ్‌ -నీలిమ వంకాయల స్టాక్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు కొత్త చైర్‌పర్సన్‌గా మాధబి పూరీ బుచ్‌ను (Madhabi Puri Buch) కేంద్రం నియమించింది. సెబీ (SEBI) ఛైర్మన్‌గా తొలిసారి ఓ మహిళకు అవకాశం దక్కింది. ప్రస్తుత ఛైర్మన్ అజయ్ త్యాగి పదవీకాలం 2022, ఫిబ్రవరి 28తో ముగియడంతో ఆయన స్థానంలో ఈమె బాధ్యతలు చేపట్టారు. గ‌తేడాది అక్టోబ‌ర్ 28న సెబీ కొత్త ఛైర్మన్ […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-41 తమ్మెరరాధిక

కొత్త అడుగులు – 41 మొగలి రేకుల పరిమళం – ‘తమ్మెరరాధిక’ కవిత్వం – శిలాలోలిత           ‘తమ్మెర రాధిక’ కవిత్వమిది. ఎప్పట్నుంచో రాస్తున్నా ఇప్పుడు పుస్తకం చేస్తున్న సందర్భమిది. ఆమెను చూసీ చూడగానే శాంతంగా అనిపించింది. కవిత్వం పట్ల, కథల పట్లా ఎంతో ప్రేమున్న వ్యక్తిలా అనిపించారు. మాట, మనిషి ఎంత నెమ్మదో కవిత్వం అంత వేగంగా, తీవ్రంగా నడిచింది.           మీరేం చేస్తున్నారు […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి రేణుకా అయోలా గారితో నెచ్చెలి ముఖాముఖి

 ప్రముఖ రచయిత్రి రేణుకా అయోలా గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (రేణుకా అయోలా గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) ***           రేణుక అయోల ఒరిస్సాలోని కటక్ ప్రాంతంలో జన్మించారు. ఈమె అసలు పేరు రేణుక అయ్యల సోమయాజుల. ఉద్యోగరీత్యా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం వల్ల హిందీ గజల్స్ వినడం, వాటిపై ఆసక్తి పెంచుకోవడం చేశారు. ఈ క్రమంలో చాలా గజల్స్‌ ను […]

Continue Reading
Posted On :

కొత్త లోకం (కవిత)

కొత్త లోకం   –శిలాలోలిత రంగును కోల్పోయి కొల్లగొట్టబడ్డ నీటి మొహం కెరటాలతో తలబాదుకుంటోంది ఆకాశం ఏ రంగు చొక్కాను తొడిగితే అదే తన రంగనుకునే మురిపెం త్రివేణీ సంగమంలో కనిపించే రంగుల తేడా అండమాన్ దీవుల్లో మెరిసే ముదురు నీలం అంగీ ఆకుపచ్చని నలుపుల భ్రమల చెట్టు చుట్టూ తిరుగుతుంటుంది — ఆమె కూడా అంతే కోల్పోయిన బతుకు రంగుల్ని ఏరుకొనే ప్రయత్నమే బతుకంతా ఆమెకైతే ఉచితంగా గాయాల ఎర్ర రంగు కమిలిన శరీరాల పెచ్చులూడిన తనం […]

Continue Reading
Posted On :

అతను (కథ)

అతను (కథ) -డా. లక్ష్మీ రాఘవ గేటు ముందు కారు ఆగిన చప్పుడైతే వంటింట్లో నుండీ హాలు కిటికీ వైపు తొంగి చూసింది వర్ధని. కారు దిగి లోపలకు వస్తున్న వ్యక్తిని చూసి చట్టుక్కున పక్కకు జరిగి ఒక్క క్షణం నిలబడింది. వెంటనే త్వరగా వంటింట్లోకి వెళ్ళింది. మరు నిముషంలో కాలింగ్ బెల్ మ్రోగింది. తలుపు తీసిన వర్ధనిని చూస్తూ… “బాగున్నావా వర్ధినీ?” అనడిగాడు అతను. జవాబు చెప్పాలనిపించక తల ఊపింది… అతను సోఫాలో కూర్చుంటూ “బాబు […]

Continue Reading
Posted On :

HERE I AM and other stories-1 The Thieving Cat

HERE I AM and other stories 1. The Thieving Cat Telugu Original: P.Sathyavathi English Translation: Sashi Kumar Keen to reach home before the scheduled power cut, Seetaratnam took a shared auto to her bus stop. She got down from the bus and hurried to her house all out of breath. Her spirits lifted on seeing her […]

Continue Reading
Posted On :

అదే పాట (కథ)

అదే పాట (కథ) – కె. వరలక్ష్మి           “ఏంటే సుజాతా, నీకేవైనా బుద్ధీ గ్నానం ఉన్నాయా అసలుకి ? టైమెంతైందో చూసేవా, ఇప్పుడా డ్యూటీ కొచ్చేది!” అరుస్తోంది అమ్ములు.           ” ప్లీజ్ ప్లీజ్, అరవకే అమ్ములూ. ఒక్క అరగంటేగా ఆలస్యమైంది. డాక్టరుగారు విన్నాడంటే నా తలవాచిపోద్ది.”           “అంటే… నువ్ రాలేదని డాక్టరు గారి కింకా తెలీదనా? […]

Continue Reading
Posted On :

మరక మంచిదే! (కథ)

మరక మంచిదే! (కథ) – లలితా వర్మ ” యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా భగవతీ నిశ్శేష జాడ్యాపహా!!” పూజగదిలో నుండి శ్రావ్యంగా, మంద్రంగా, అలలు అలలుగా చెవికి సోకుతున్న అత్తగారి సరస్వతీ ప్రార్థన, అంతులేని మధురానుభూతిని కలిగించింది నిఖిలకి. కొద్దిగా తెరచి వున్న తలుపు సందు గుండా […]

Continue Reading
Posted On :

అమృత వాహిని అమ్మే కదా (పాట)

అమృత వాహిని అమ్మే కదా (పాట) -డా||కె.గీత ఆనందామృత క్షీరప్రదాయిని అమ్మే కదా అనురాగాన్విత జీవప్రదాయిని అమ్మే కదా ఇల్లాలై ఇలలో వెలసిన ఇలవేలుపు కదా జో లాలై కలలే పంచిన కనుచూపే కదా కడలిని మించే కెరటము ఎగసినా కడుపున దాచును అమ్మే కదా- ఉరుము మెరుపుల ఆకసమెదురైనా అదరదు బెదరదు అమ్మే కదా తన తనువే తరువై కాచే చల్లని దీవెన అమ్మే కదా జీవితమే ఒక ఆగని పోరాటం ఆశనిరాశల తరగని ఆరాటం […]

Continue Reading
Posted On :

కుసుమనిరీక్షణం

కుసుమనిరీక్షణం – శింగరాజు శ్రీనివాసరావు ఎన్నిసార్లు వహ్నిత చెప్పి చూసినా నిరీక్ష మనసు మారడం లేదు. ఆ పేదపిల్ల, అనాకారి కుసుమతో సన్నిహితంగా తిరగవద్దు అంటే వినడం లేదు. నాలుగు ఇళ్ళలో పనిచేసే పనిమనిషి రాములమ్మ కూతురు కుసుమ. ఆ పిల్ల తండ్రి తాగుబోతు. రాములమ్మను రోజూ ఏదో ఒక వంక పెట్టి కొడుతుంటాడట. పనిమనిషి కూతురని కుసుమంటే ఒక రకమైన చిన్నచూపు వహ్నితకు. కుసుమది తన కూతురిది ఒకటే తరగతి. ఇద్దరూ కలసి ఈ సంవత్సరం […]

Continue Reading
Posted On :
T. Hima Bindu

ఆశయాల సాధనలో నిశ్శబ్ద రేయి (కవిత)

ఆశయాల సాధనలో నిశ్శబ్ద రేయి -డా. టి. హిమ బిందు జాబిల్లి చెంత వెన్నెల రేయి చల్లనిదే.. నిదుర ఒడిలో జోల పాడే రేయి మధురమైనదే ఒంటరి మనసులకు నిదానంగా నడుస్తూ రేయి మెల్లనిదే ఒంటరి ప్రయాణంలో గుబులు పుట్టిస్తూ సాగిపోయే రేయి భయానకమైనదే అస్వస్థతలో తోడు దొరకని రేయి నరకప్రాయమైనదే ఆశయాల సాకారంలో సహకరించే రేయి నిశ్శబ్ద మైనదే… కోప తాపాల నడుమ కొట్టుమిట్టాడుతున్న రేయి మౌనమైనదే… ప్రేమ తోడులో ఊసులాడు రేయి ఆనంద నిలయమే…. ఎన్ని రేయిలయినా ప్రతి రేయి ప్రత్యేకమే.. ప్రతి ఉదయం కొత్త ఆశల ఉషోదయమే…. ***** రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నాను. స్వస్థలం భద్రాచలం. 2005 సం. లో కాకతీయ యూనివర్సిటీ , వరంగల్ లో పర్యావరణ శాస్త్రంలో నీటి కాలుష్యం పై పీ. హెచ్. డి. పూర్తయింది. పర్యావరణంపై […]

Continue Reading
Posted On :
Komuravelli Anjaiah

వెంటాడే కల (కవిత)

వెంటాడే కల -కొమురవెల్లి అంజయ్య వెంటాడే కల ప్రశ్నిస్తుంది చేతగానితనాన్ని నిలదీస్తుంది సోమరిపోతు వైఖరిని మొండి బారకుండా, తుప్పు పట్టకుండా ఎప్పటికప్పుడు నూరుతుంది కొత్తగా దారిలో నుంచి పక్కకు జరుగకుండా చూస్తుంది కలలెన్నో ముల్లె కట్టుకొని ఉంటాయి అన్నీ కుమ్మరిస్తాం, ఏరుతాం నచ్చినవి కొన్ని చొక్కాజేబులో దాచుకుంటాం గుండెకు దగ్గరగా విత్తనం ఏదైనా కనిపిస్తే భూమిలో నాటి నీళ్ళు పోసి పెంచుతాం రాళ్ళల్లో రత్నాన్ని మెడలో ధరిస్తాం వెంటాడే కల సాకారం కోసం నా చెమటతో నా […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-4

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 4 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల హార్టీకల్చర్ డిగ్రీ పూర్తిచేసి, ఎమ్.బి.ఏ కోర్స్ లో చేరింది. సీనియర్స్ నిర్వహించిన పోటీలలో ట్రోఫీ పొందింది. తండ్రి తీసుకువచ్చిన పెళ్ళి సంబంధం, మొదటిసారి పెళ్ళిచూపులలోనే అబ్బాయి విష్ణుసాయికి నచ్చిందని , నిశ్చితార్థానికి, పెళ్ళికి ముహుర్తం పెట్టించమని పెళ్ళికొడుకు తండ్రి విశ్వనాథ్ గారు ఫోన్ చేసి చెపుతారు. *** అది 1999 వ సంవత్సరం. తూరుపు తెలతెలవారుతోంది. సూర్యుని లేలేత కిరణాలు కిటికీఊచల సందుల్లోంచి చీల్చుకుని, […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-29

నిష్కల – 29 – శాంతి ప్రబోధ జరిగిన కథ: కొంత కాలం ఎడబాటు తర్వాత నిష్కల దగ్గరకు వస్తాడు సహజీవనంలో ఉన్న అంకిత్. పెద్ద కొడుకు మీద బెంగతో ఉన్న సుగుణమ్మ బతికుండగా చూస్తానో లేదోనని దిగులు పడుతుంది. అత్తగారి దిగులు పోగొట్టడానికి శతవిధాలా ప్రయత్నం చేయాలని శోభ అనుకుంటుంది..  అంకిత్ తల్లి ఫోన్ అందుకుని ఆశ్చర్యపోతుంది నిష్కల ***           తన గుమ్మం ముందు నిలిచిన ఆవిడని ఆశ్చర్యంగా […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-14 రాజీ

పేషంట్ చెప్పే కథలు – 14 రాజీ -ఆలూరి విజయలక్ష్మి “ ఈ యిల్లంటే నాకు అసహ్యం. ఇందులో బతుకుతున్న మనుషులంటే నాకు పరమ రోత. ఈ యింటికి, ఈ మనుషులకు దూరంగా పారిపోతాను. నా కంఠంలో ఊపిరుండగా మళ్ళీ ఈ గడపతొక్కను” చేతిలో ఉన్న టిఫిన్ బాక్స్ ని టేబిల్ మీదకు విసిరేసి, కళ్ళు తుడుచుకుని, వానిటీ బాగ్ తీసుకుని విస విసా గుమ్మందాటింది సుచరిత. పైన సెగలు పొగలు కక్కుతున్న సూరీడు కంటే ఎక్కువగా […]

Continue Reading
Posted On :

విజయవాటిక-21 (చారిత్రాత్మక నవల) – చివరి భాగం

విజయవాటిక-21 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ అమరావతి ఆ ఉదయం మహాదేవవర్మను మెత్తని మేనాలో పడుకోబెట్టి, ఆ మేనా రథం మీదకు చేర్చి, ఇంద్రపురిలోని ఘటికాపురి వైపు సాగిపోయారు. శ్రీకరుడు వారి ముందున్నాడు. కొంత సైన్యం, మరో రథంలో గురుదేవులు వస్తున్నారు. వారు ఆ రోజు సాయంత్రానికి ఘటికాపురి చేరుకున్నారు. గురుదేవుల పర్ణశాల ప్రక్కనే మరొక పర్ణశాలలో మహాదేవుని తుంగచాప పై పటుకోబెట్టారు. గురుదేవులు ప్రయాణ బడలికను సైతం లెక్కచెయ్యక, వెంటనే పసరు తీయించి, మహాదేవుని […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-5 సి.హెచ్. వు. రమణమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-5  -డా. సిహెచ్. సుశీల సి.హెచ్. వు. రమణమ్మ                    జాతీయోద్యమం, స్త్రీల హక్కులు, కులమత రహిత సమాజ నిర్మాణం వంటి విషయాల పట్ల అవగాహనతో, చైతన్యవంతమైన కథలు రచించిన నాటి రచయిత్రులు – ‘వర్గ పోరాటం ‘ శ్రమ జీవుల నుండి ధనిక వర్గం చేసే దోపిడీ వైపు కూడా దృష్టి సారించారు. ఎందరో కష్టజీవుల శ్రమను తమ బొక్కసంలో దాచుకొనే […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-20 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 20 – గౌరీ కృపానందన్ ఉమ అతన్ని ఆశ్చర్యంగా చూసింది. అతను ఆమె జవాబు కోసం ఎదురు చూస్తున్న వాడిలా సూటిగా ఆమెనే చూస్తున్నాడు. అతనికి జవాబు చెప్పే బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఆనంద్ వెంటనే వస్తే బాగుండునని అనుకుంది ఉమ. “మీరు వెంటనే జవాబు ఇవ్వనక్కరలేదు. ఆలోచించి చెప్పండి. ఒక వారం, ఒక నెల…. ఒక్క సంవత్సరం అయినా నేను వెయిట్ చేస్తాను. మీరు వద్దు, ఇష్టం లేదు అన్నా కూడా […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-29)

బతుకు చిత్రం-29 – రావుల కిరణ్మయి జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించుకుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది . *** సైదులు ఆలోచనలో పడ్డాడు . సరూప చెప్పేది నిజమేనా? అమ్మకు ఏ గాలో ధూళో తగిలి ఉంటుందా? లేక ఇంకె వరయినా కావాలనే చేశారా? అలాంటివే అయితే మందులతో నయంకావు. […]

Continue Reading
Posted On :

అనుసృజన-మీనాకుమారి హిందీ కవిత-4

అనుసృజన మీనాకుమారి హిందీ కవిత-4 అనువాదం: ఆర్.శాంతసుందరి అలనాటి మేటి హిందీ నటి మీనా కుమారి అసలు పేరు మాహ్ జబీన్. ఆమె కవయిత్రి అన్న విషయం మీకు తెలుసా? ఆమె మరణించాక గుల్జార్ ఆమె కవితలని సీడీగా రికార్డు చేశారు, మీనా కుమారి తన కవితలను స్వయంగా చదివి రికార్డ్ చేసిన వీడియోలు కొన్ని దొరికాయి. మూల (హిందీ) కవితలను తెలుగులో రాసాను, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. తెలుగు అనువాదం ఆమె కవితల్లోని భావాన్ని అర్థం […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 21 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం) (చివరి భాగం)

కాళరాత్రి-21 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల ఏప్రిల్‌ 10వ తేదీన ఇంకా క్యాంపులో 20వేల మంది ఖైదీలున్నారు. వారిలో పిల్లలు కొన్నివందల మంది సాయంత్రానికంతా అందరినీ ఒకేసారి తరలించాలని నిర్ణయించారు. తదుపరి క్యాంపు తగలబెడతారు. అందరినీ పెద్ద అపెల్‌ ఫ్లాట్‌లోకి తోలారు. గేటు తెరుచుకునేలోగా 5 మంది చొప్పున వరుసలు గట్టి ఎదురుచూడాలి. అకస్మాత్తుగా సైరన్లు మోగాయి. జాగరూకతగా. అందరం బ్లాక్స్‌ లోపలికెళ్ళాం. సాయంత్రం మమ్మల్ని తరలించడం సాధ్యం కాదు. […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -5 (యదార్థ గాథ)

జీవితం అంచున -5 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి Care for one… that’s love. Care for all… that’s nursing. కనీసం చిన్న పించ్ కూడా తెలియకుండా నర్సు “ఐ యాం సారీ డార్లింగ్” అంటూనే నా రక్త నాళంలో నుండి బోలెడు రక్తం తోడేసింది. మనం ఒకే ఫ్రెటర్నిటి అనుకుంటూ ఆవిడ వైపు ఆత్మీయంగా చూసాను. ఆలూ చూలూ లేకుండా బిడ్డ కోసం కలలని నవ్వుకుంటున్నారా… నా కంటి […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 30

నా జీవన యానంలో- రెండవభాగం- 30 -కె.వరలక్ష్మి           మనుషుల రూపానికీ, నడవడికకీ సంబంధం ఉంటుంది అంటారు. అది నిజం కాదని కొన్నిసార్లు నిరూపితమౌతుంది. గొప్ప అందగాడైన షేర్ సింగ్ రాణా వాళ్ళ కుటుంబీకులెందర్నో చంపేసిందనే కోపంతో 2001 జూలై 25న పూలన్ దేవిని కాల్చి చంపేసాడు. గాయాల గురించి ఇసుకలోను, దయగురించి చలువరాతి పైన రాయాలన్నారు పెద్దలు.           బైటికెక్కడికీ వెళ్ళొద్దని ఎంత నిర్ణయించుకున్నా […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 8

యాదోంకి బారాత్-8 -వారాల ఆనంద్ కరీంనగర్ – కాలేజీ చదువుల దశాబ్దం           వ్యక్తుల పైనా శక్తులపైనా వ్యవస్తలపైనా కాలం తనదయిన భాషలో తనదైన రీతిలో ప్రభావం చూపుతూనే తుడిచి వేయలేని చరిత్రని లిఖించి వెళ్తూనే వుంటుంది. భారత స్వాతంత్రానంతర కాలంలో 70 వ దశకం అతి ముఖ్యమయినది. అత్యంత ప్రభావవంత మయినది. అనేక ఆటుపోట్లకు గురయిన కాలమది. మంచినీ చెడునీ ఒకే గవాక్షం గుండా చూసి సరి చేసుకుని ముందుకు […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 16

వ్యాధితో పోరాటం-16 –కనకదుర్గ రోజూ చైతన్య స్కూల్ కి, శ్రీని ఆఫీస్ కి వెళ్ళేలోగా అన్నీ పనులు చేసుకుని రిలాక్స్ అయ్యేదాన్ని. వాళ్ళు వెళ్ళేలోపే స్నానం చేసి, ఏదైనా తినేసి టీ.వి పెట్టుకుని కూర్చునే దాన్ని. మధ్యాహ్నం శ్రీని ఆఫీస్ నుండి లంచ్ టైమ్ లో వచ్చి తినడానికి చాలా హెల్తీ తిండి చేసి పెట్టేవాడు. తను కూడా లంచ్ చేసి వెళ్ళేవాడు. నాకు పనంతా శ్రీని పైనే పడినందుకు చాలా బాధగా వుండేది. కానీ డాక్టర్స్ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-29)

నడక దారిలో-29 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం తోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి దేవి పేరుతో కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. డిగ్రీ చదువు పూర్తిచేసుకుని మేలో పరీక్షల తర్వాత హైదరాబాద్ శాశ్వతంగా వచ్చేసాను. ఏడాది తిరగకుండానే మా […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-44

మా కథ (దొమితిలా చుంగారా)- 44 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  అంతర్జాతీయ మహిళా సమావేశంలో 1974లో ఐక్యరాజ్యసమితి తరఫున ఒక బ్రెజిలియన్ సినిమా దర్శకురాలు బొలీవియాకు వచ్చింది. మహిళా ఉద్యమ నాయకులను కలుసుకొని, మహిళల స్థితి గతుల మీద వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి, స్త్రీల పరిస్థితిని మెరుగు పరచడంలో వాళ్ళు ఎంత వరకూ ఏ రకంగా సాయపడగలరో తెలుసుకోవడానికి ఆవిడ లాటిన్ అమెరికన్ దేశాలన్నీ తిరుగుతోంది. మా గృహిణుల సంఘం గురించి విదేశాలలో […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-42 కె. రామలక్ష్మి

  నారి సారించిన నవల-42 కె. రామలక్ష్మి – 2                       -కాత్యాయనీ విద్మహే గత సంచికలో రామలక్ష్మిగారి  లభ్య నవలలో 1967 లో వచ్చిన  ‘ఆడది’ మొదటి నవల అని చెప్పుకొన్నాం. కానీ అప్పటికి లభించని ‘మెరుపు తీగ’ నవల ఇప్పుడు లభించింది. అది  1960 నవంబర్ లో యం. శేషాచలం అండ్ కంపెనీ ప్రచురించినది. అందువల్ల ఇప్పటికి అది మొదటి […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-4

నా అంతరంగ తరంగాలు-4 -మన్నెం శారద అమ్మమ్మ వూరికి  ప్రయాణం Co canada నా చిన్నతనంలో రెండు రైల్వేస్టేషన్లలో ఈ పేరే ఉండేది. cocanada.. town, cocanada.. Port అని. కెనడాలా ఉంటుందని బ్రిటిష్ వారు ఆఁ పేరు పెట్టారని  అంటుంటారు. కాకినాడ formed city అని కూడా అంటుంటారు. Rectangular road system, మెయిన్ రోడ్డుతో పాటూ అటూ ఇటూ ఫాలో అవుతుండే అరడజను రోడ్లు, సినిమా హాల్స్ అన్నీ ఒకే వీధిలో ఉండడం, కాకినాడ […]

Continue Reading
Posted On :
K.Geeta

గీతామాధవీయం-21 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-21 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-21) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) జనవరి 2, 2022 టాక్ షో-21 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-21 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** డా|| […]

Continue Reading
Posted On :

వినిపించేకథలు-29-విశ్రాంత స్వర్గం-తులసి బాలకృష్ణ కథ

వినిపించేకథలు-29 విశ్రాంత స్వర్గం రచన :శ్రీ తులసి బాలకృష్ణ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama artist. గతంలో దూరదర్శన్ లోనూ […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-46)

వెనుతిరగని వెన్నెల(భాగం-46) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) వెనుతిరగని వెన్నెల(భాగం-46) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు […]

Continue Reading
Posted On :

నవలాస్రవంతి-31 లోపలిమనిషి-4 (పి.వి.నరసింహారావు నవల)

నందిని సిధారెడ్డి ప్రముఖ కవి, రచయిత, సామాజిక ఉద్యమకారులు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు. రచనలు:భూమిస్వప్నం, సంభాషణ, దివిటీ, ప్రాణహిత, ఒక బాధ కాదు, నది పుట్టుబడి, ఇగురం, ఆవర్థనం, ఇక్కడి చెట్లగాలి, నాగేటి చాల్లల్ల (పాటలు), చిత్రకన్ను (కథా సంపుటి) మొ||నవి.

Continue Reading
Posted On :

శ్రీరాగాలు- 10 రిషబన్ తమిళ కథ “కూడు” కథకు గౌరీ కృపానందన్ తెలుగు అనువాదం “గూడు”

https://youtu.be/MeuEsryMCfw శ్రీరాగాలు-10 గూడు (రిషబన్ తమిళ కథ “కూడు” కథకు గౌరీ కృపానందన్ తెలుగు అనువాదం “గూడు”) – గౌరీ కృపానందన్ తలుపు తియ్యడానికి ఎందుకు ఇంత ఆలస్యం? కాలింగ్ బెల్లును మళ్ళీ నొక్కాను. బస్ స్టాండు నుంచి ఇంటికి రావడానికి పావుగంట నడక. ఇంకా ఊపిరి అందకుండా ఉంది. ఇంట్లో కుక్కూ మంటూ కాలింగ్ బెల్ మోగుతున్న శబ్దం వినిపిస్తూనే ఉంది. కానీ అమ్మ ఇంకా వస్తున్నట్లు లేదు. ఏమై ఉంటుంది? నిద్ర పోతోందా? లేక… […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-40 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-4)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-4 ప్రయాణం మా ఇంటి నుంచి శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్టు ట్రాఫిక్ లేని వేళల్లో సరిగ్గా గంట వ్యవధిలో ఉంటుంది. ముందు చెప్పినట్టుగా మేం ముందుగా శాన్ఫ్రాన్సిస్కో నించి లాస్ ఏంజిల్స్ వెళ్లి అక్కణ్ణించి సిడ్నీ వెళ్లాలి. సాయంత్రం 5 […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -5 మహాభారతకథలు – పురాణపురుషుడు పరీక్షిత్తు మహారాజు కథ

పౌరాణిక గాథలు -5 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి పురాణపురుషుడు పరీక్షిత్తు మహారాజు కథ మహాభారతం మొత్తం వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెప్పినట్లు ఉంటుంది కదా. జనమేజయుడు ఎవరూ అంటే పరీక్షిత్తుమహారాజు కొడుకు. పరీక్షిత్తు మహారాజు ఎవరూ అంటే అభిమన్యుడికి కొడుకు పాండవులకి మనుమడు. ఈ మహా భారతంలో పరీక్షిత్తు మహారాజు గురించిన కథ చదువుదాం. ఉదంకమహర్షి ఒకసారి జనమేజయ మహారాజుని కలిసి దానాలు, యజ్ఞాలు చేస్తూ, భరతవంశాన్ని వృద్ధిపరుస్తూ, ప్రజలందరికీ మేలు చేస్తూ అర్జునుడితో సమానమైన, ఇంద్రియ […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

స్వచ్ఛత పాటిద్దాం

స్వచ్ఛత పాటిద్దాం -కందేపి రాణి ప్రసాద్           ఒకరోజు ఉదయాన్నే గుహ వదిలి బయటకు వచ్చింది మృగరాజు అలా ఆడవంత ఒకసారి తిరిగి వద్దామనుకున్నది.           పక్షుల కుహు కుహులు చెవుల కింపుగా వినిపిస్తున్నాయి. చెట్లన్నీ తలలూపుతూ నాట్యం చేస్తున్నట్లుగా ఊగుతున్నాయి. సింహం సంతోషంగా ముందుకు అడుగులు వేసింది. దారిలో జంతువులన్నీ నమస్కారం పెడుతున్నాయి. వాటిని చిరునవ్వుతో స్వీకరిస్తూ ముందుకు వెళ్ళింది.           […]

Continue Reading
Posted On :

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-10

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-10     -కల్లూరి భాస్కరం కేరళలో 1921లో తలెత్తిన ‘మోప్లా’ తిరుగుబాటు చరిత్ర ప్రసిద్ధం. అది ఎందుకు తలెత్తింది, దాని పర్యవసానాలేమిటన్నవి ఇక్కడ మనకు అవసరమైన ప్రశ్నలు కావు; ‘మోప్లా’ అనే పేరుకు గల అర్థంతోనే మనకిక్కడ సంబంధం. తమిళ/మలయాళ మూలా లున్న ‘మాప్పిల’, లేదా ‘మాపిళ్లై’ అనే మాట నుంచి పుట్టిన ఈ మాటకు ‘పెళ్లికొడు’కని అర్థం. వ్యవహారంలో ‘అల్లు’డని కూడా అంటారు. వాస్కో డ గామా రాకతో… దీని వెనకాల కథ […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-8

బొమ్మల్కతలు-8 -గిరిధర్ పొట్టేపాళెం  ఇండియన్ ఇంక్‌ – అప్పట్లో ఈ ఇంక్ చాలా పాపులర్. ప్రత్యేకించి బ్లాక్ అండ్ వైట్ స్కెచింగ్ చెయటానికి ఎక్కువగా ఈ ఇంక్ నే వాడేవాళ్ళు. ఇంచు మించు అన్ని బుక్ షాపుల్లోనూ దొరికేది. ఆ రోజుల్లో ఎవరో ఆర్టిస్టులు తప్ప ఇంకెవరూ వాడని ఇంక్ అయినా అంత సులభంగా అన్ని చోట్లా దొరికేది అంటే, దాని వాడకం చాలా పురాతనమై ఉండాలి. ఆర్ట్ కే కాకుండా ఇంకా చాలా విధాలా వాడుకలో […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -46

జ్ఞాపకాల సందడి-46 -డి.కామేశ్వరి  కావమ్మ కబుర్లు – 23          పెళ్ళికి మూడు రోజులుందనగా నాన్న మందీ మార్బలంతో దిగేవారు. ఒక సూపర్ వైజర్, నలుగురు కూలీలను వెంట బెట్టుకుని దిగేవారు. హడావుడి మొదలు. పందిర్లు వేయడం, గాడిపొయ్యి తవ్వించడం, పెరడంతా బాగు చేయడం, గడ్డి గాదం పీకించి, చదును చేయించి, ఎత్తుపల్లాలు లేకుండా నాలుగైదు సార్లు దిమిసా కొట్టించి, నాలుగయిదుసార్లు పేడనీళ్ళు జల్లించే వారు. ఆ రోజుల్లో టేబుల్ మీల్స్ ఎక్కువుండేవి […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-44

కనక నారాయణీయం -44 –పుట్టపర్తి నాగపద్మిని           కనకవల్లి రెండు స్టీల్ లోటాల్లో పొగలు కక్కుతున్న కాఫీతో వచ్చేవరకు, శేషమ్మ, రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి చేయవలసి రావటంలోని సాధక బాధకాలను వివరిస్తూ వున్న శేషమ్మ, ‘ అల్లుడూ, ఇంతకూ మా వియ్యంకులు ఎప్పుడు వస్తున్నారట? ‘ అని అడిగింది.           ‘ఔను, మా అయ్యకు ఉత్తరం రాయవలె! కనకా!! త్వరగా రాద్దాం యీ రోజే!!’ అనేసి, […]

Continue Reading
Posted On :

స్వరాలాపన-23 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-23 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు […]

Continue Reading
Posted On :

ఒక్కొక్క పువ్వేసి-22

ఒక్కొక్క పువ్వేసి-22 సమ సమాజ న్యాయమే – అంబేద్కర్ -జూపాక సుభద్ర యిది వరకు అంబేద్కర్ అంటే మాదిగ, మాలల నాయకుడనీ, వాళ్లకే సంబంధీకు డనీ మనువాదులు దూరముంచారు. మనువాదాన్ని వొదిలేయని మార్కిసిస్టులు అంబేద్కర్ బూర్జువా ప్రతినిధి అనీ, బ్రిటీష్ ఏజెంట్ అని పక్కనబెట్టి ప్రచారం చేసిండ్రు. అట్లా కమ్యూనిస్టులు అస్పృశ్య కులాలకు అంబేద్కర్ ని అందకుండా చేసిండ్రు. కానీ సామాజిక అవసరాలు, రాజకీయార్ధిక, తాత్విక అంశాలు అంబేద్కర్ని అవాచ్యమ్ చేయ లేని పరిస్థితులు. అంబేద్కర్ని తలకెత్తుకోక […]

Continue Reading
Posted On :

చిత్రం-47

చిత్రం-47 -గణేశ్వరరావు  అమెరికన్ చిత్రకారిణి ఐరిన్ (Irene Georgopoulon) వస్తువుల సమూహాన్ని, మూర్తి చిత్రాలను పాస్టెల్ రంగుల్లో చిత్రిస్తుంది. పాస్టెల్ రంగుల మాధ్యమంకు మాయాజాలం ఉంది, అది వెలుతురును ప్రతిబింబచేస్తూ, చిత్రం యొక్క ఉపరితల కాంతిని ప్రసరించే టట్లు చేయగలదు. తనకు నచ్చిన వస్తువులను ఐరిన్ సొంతంగా సేకరిస్తుంది, తన సృజనాత్మక శక్తి కి వాటి నుంచి స్ఫూర్తి పొందుతుంది. అత్యంత సామాన్యమైన వస్తువు లను ప్రకాశవంతమైన మూర్తి ( స్టిల్ లైఫ్) చిత్రాలుగా రూపొందిస్తుంది. వ్యక్తుల […]

Continue Reading
Posted On :

పుస్తకాలమ్ – 19 కథాసంగమం

కథాసంగమం   పుస్త‘కాలమ్’ – 19 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ అపురూపమైన కథలకు అద్భుతమైన అనువాదాలు ఈ వారం ఎ ఎం అయోధ్యా రెడ్డి అనువాదం చేసిన పదిహేడు దేశాల, పందొమ్మిది మంది కథకుల కథల అనువాద గుచ్ఛం ‘కథా సంగమం’ గురించి మీకు పరిచయం చేయదలచాను. ఆ అద్భుతమైన అనువాద కథల సంపుటం గురించి చెప్పబోయే ముందు అనువాద కథలు నాకు పరిచయమైన, నన్ను సమ్మోహపరచిన పురాస్మృతిని […]

Continue Reading
Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-4 జన్యుశాస్త్రంలో సూత్రధారి-రొసాలిండ్ ఫ్రాంక్లిన్ (1920-1958)

విజ్ఞానశాస్త్రంలో వనితలు-4 జన్యుశాస్త్రంలో సూత్రధారి-రొసాలిండ్ ఫ్రాంక్లిన్ (1920-1958) – బ్రిస్బేన్ శారద రచయిత సిద్ధార్థ ముఖర్జీ  “ది జీన్”  (The Gene) అనే తన అద్భుతమైన పుస్తకంలో విజ్ఞాన శాస్త్రం లో వచ్చిన గొప్ప మలుపులు- అణువు, జన్యువు, కంప్యూటర్ బైట్ (atom, gene, byte) అంటాడు. అణువు- భౌతిక పదార్థం యొక్క మౌలిక (లేదా ప్రాథమిక) పదార్థం అయితే, జన్యువు-జీవ పదార్థానికి ప్రాథమిక మూలం, కంప్యూటర్ బైట్ సమాచారానికి మౌలికమైన అంకం అనీ ఆయన అభిప్రాయపడ్డారు. […]

Continue Reading
Posted On :

సాహసాలే శ్వాసగా సాగిపోయే మధు నాగరాజ -1

సాహసాలే శ్వాసగా సాగిపోయే మధు నాగరాజ -1 -డా. అమృతలత చిత్తూరు జిల్లా, పుంగనూరులో జన్మించి మైసూరులో పెరిగిన మధుగారు సుశీల నాగరాజ దంపతుల ఏకైక పుత్రుడు.           ఆయన విద్యాభ్యాసమంతా మైసూర్లోని మరిమల్లప్ప , జె.ఎస్.ఎస్ హైస్కూల్స్ లో సాగింది.            మైసూరు యూనివర్సిటీ క్యాంపస్ క్వార్టర్స్ లో వున్న మధు ఈత నేర్చుకోవడానికి తన తోటి స్నేహితులతో ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి , […]

Continue Reading
Posted On :

Political Stories- 11Elections – Part 1

Political Stories by Volga Political Stories-11 Elections – Part 1 The envelopes handed to the lecturers as they arrived at the college caused quite a stir. Male lecturers were asking each other about the villages they were assigned to, reminiscing about their past experiences and recalling the facilities available in those villages. The female lecturers […]

Continue Reading
Posted On :

Tempest of time (poems)

Tempest of time (poems) -Kondapalli Niharini Translated by Elanaaga I Go Along with Time          Has my observation of society increased since poetry writing became a fond habit for me?I am unable to tell whether I am turning myself into poesy only from the observation of society. Yet I have no habit […]

Continue Reading
Posted On :

Bruised, but not Broken (poems) – 4. Prohibited Dream

Bruised, but not Broken (poems) -Challapalli Swarooparani  4. Prohibited Dream My memory does not carry Colourful dreams that converse with my eyelids. In my dream, someone chases me, Always, as I keep running Insecure And towards an unknown destiny. In fact, life too is like a dream! I bundle up my identity and toss it […]

Continue Reading
Posted On :
Aduri Satyavathi Devi

Poems of Aduri Satyavathi Devi – 12 “The Torn Emerald Canvas”

Poems of Aduri Satyavathi Devi Poem-12 The Torn Emerald Canvas Telugu Original: Aduri Satyavathi Devi English Translation: Raamateertha Perching on the yonder hill side greenery As if busy composing music to a new song, With awakening roulades, Those birds becoming musical organs, In pairs drenching in the snow ‘Mushaira’ Used to fill my morning walk […]

Continue Reading
Posted On :

Carnatic Compositions – The Essence and Embodiment-24

Carnatic Compositions – The Essence and Embodiment – Aparna Munukutla Gunupudi  Our intent for this essay is to highlight the great features of the language, emotion and melody (rAgam) of a krithi (song/composition) and also to provide the song for your listening pleasure.  Most of you may know these krithis, but when you discover the […]

Continue Reading
Posted On :

Cineflections:42 – Sruthialayalu – 1987, Telugu

Cineflections-42 Sruthialayalu – 1987, Telugu -Manjula Jonnalagadda “శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసంఫణిః” The children know, the animals know the snakes know the essence of music Sruthilayalu is a film written and directed by K. Viswanath. The film premiered at the International Film Festival of India. It won several Andhra Pradesh state government’s Nandi Awards. It won […]

Continue Reading
Posted On :

The Invincible Moonsheen – Part-12 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta)

The Invincible Moonsheen Part – 12 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta) English Translation: V.Vijaya Kumar (The previous story briefed) Samira comes to meet her mother’s friend Udayini, who runs a women-helping organization Sahaya in America. Udayini greatly impressed Samira. The four-month-pregnant Samira details her inclination toward divorce and the causes that lead to […]

Continue Reading
Posted On :
K.Geeta

సంపాదకీయం- ఏప్రిల్, 2023

“నెచ్చెలి”మాట  శోభకృత్ ఉగాది! -డా|| కె.గీత  శోభకృత్ ఉగాది అంటే శోభని కలగజేస్తుందట! పండుగ రానూ వచ్చింది పోనూ పోయింది లోకంలో ఎక్కడన్నా శోభ వుందా? కళ వుందా? కాంతి వుందా? అయ్యో అసలు శోభ ఎక్కణ్ణించొస్తుందీ?! దిక్కుమాలిన ప్రపంచం మారి చస్తేనా? ఓ పక్క సంవత్సరం దాటుతున్నా యుద్ధం ఆగదు- కాదు.. కాదు… ఆగనిస్తేనా? దురాక్రమణలూ ఆయుధ కుతంత్రాలూ ఆగి చస్తేనా?! ఇక శోభ ఏవిటి? కళ ఏవిటి? కాంతి ఏవిటి? మరో పక్క భూకంపాలు […]

Continue Reading
Posted On :

నెచ్చెలి-2023 కథా, కవితా పురస్కారాల పోటీలు

 నెచ్చెలి-2023 కథా, కవితా పురస్కారాల పోటీలు (ఆఖరు తేదీ మే10, 2023) -ఎడిటర్ నెచ్చెలి 4వ వార్షికోత్సవం (జూలై10, 2023) సందర్భంగా నిర్వహిస్తున్న  కథా, కవితా పురస్కార పోటీలకు రచనలకు ఆహ్వానం! మొదటి బహుమతి పొందిన కథకు*శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం* మొదటి బహుమతి పొందిన కవితకు*డా|| కె.గీత ఉత్తమ కవితా పురస్కారం* బహుమతులు: కథలకు:మొదటి బహుమతి (ఉత్తమ కథా పురస్కారం)- రూ.2500/-ద్వితీయ బహుమతి – రూ.1500/-తృతీయ బహుమతి – రూ.1000/-ప్రత్యేక బహుమతులు – 2- […]

Continue Reading
Posted On :

ప్రమద – క్షమా సావంత్

ప్రమద సియాటెల్ (అమెరికా)లో కుల వివక్ష నిషేధాన్ని తెచ్చిన భారతీయ మహిళ క్షమా సావంత్ -నీలిమ వంకాయల సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలలో కుల వివక్ష కూడా ఒకటి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలతో పాటు ఎందరో మహనీయులు అనేక దేశాల్లో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు జరిపారు. ప్రపంచ దేశాల్లో అభివృద్ధిలో  అగ్రగామిగా నిలిచే అమెరికాలో కుల వివక్ష, జాతి వివక్ష, వర్ణ వివక్ష రాజ్యమేలుతుంటాయంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. కులాల కుమ్ములాటలు భారత్ లోనే కాదు […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-40 “మరో గ్రహం”కవయిత్రి హిమబిందు

కొత్త అడుగులు – 40 “మరో గ్రహం”కవయిత్రి హిమబిందు  – శిలాలోలిత హిమబిందు కొత్త అడుగులతో మన ముందుకు వచ్చింది. సైన్స్ ను, ఎంతో ప్రయోగాత్మకంగా వివరించడానికి గ్రహాల ఆంతర్యాలను విప్పడానికి “మరో గ్రహం” పేరుతో కవిత్వ రూపంలో వచ్చింది. పిల్లలకీ పెద్దలకు కూడా జ్ఞాన సముపార్జనగా పనికొస్తుంది. గ్రహాల ఆంతర్యాలతో పాటు భూమి చలనాలు, ప్రకృతి, పర్యావరణం, మానవ జీవన మూలాలు ఇలా ఒకటేమిటి అనేక రూపాలతో సైన్స్ తో అభివర్ణిస్తూ నడిచింది కవిత్వం. దీనిని […]

Continue Reading
Posted On :

నిర్భయనై విహరిస్తా (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

నిర్భయనై విహరిస్తా..! (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) – బి.కళాగోపాల్ జలజకు హృదయమంతా కలచి వేయసాగింది. ఊరుతున్న కన్నీళ్లను మాటిమాటికీ తుడుచుకో సాగింది. ఆవేదనతో ఆమె మనస్సంతా కుతకుతలాడసాగింది. గుండె గూడుపట్లను కుదుపుతున్న దుఃఖాన్ని మోస్తూ ఆమె నిలువెల్ల శోకతప్తగా నిలబడింది. హాస్పిటల్ లో ఉరుకులు.. పరుగులు పెడుతున్న సిబ్బంది. […]

Continue Reading
Posted On :

బాలాదేవి గారికి నివాళి!

బాలాదేవి గారికి నివాళి! స్నేహమయి పింగళి బాలాదేవిగారు! -కె.వరలక్ష్మి (పింగళి బాలాదేవి గారికి నివాళిగా ఈ ప్రత్యేక వ్యాసాన్ని, బాలాదేవి గారితో నెచ్చెలి ఇంటర్వ్యూని పాఠకుల కోసం ప్రత్యేకంగా మళ్ళీ ఇక్కడ ఇస్తున్నాం.) *** 2009 జనవరిలో అనకాపల్లిలో ‘మనలో మనం ‘ ( ఇప్పటి ప్ర.ర.వే) మొదటి సమావేశాలు జరిగాయి. మొదటి సెషన్ లో అందరం పరిచయాలు చేసుకున్నాం. ఆ సెషన్ ముగిసాక గంధం రంగులో ఫెయిర్ గా ఉన్న ఒకావిడ నా దగ్గరకు వచ్చి […]

Continue Reading
Posted On :

వడగండ్ల వాన (కథ)

వడగండ్ల వాన -రుబీనా పర్వీన్ ‘డాడీ నువ్వు తొందరగా ఇంటికొచ్చేయ్‌’ అంది ఆద్య. ‘ఏమైంది తల్లీ! ఎందుకంత టెన్షన్‌ పడుతున్నావ్‌?’ ‘నువ్వొచ్చేయ్‌ డాడీ’ ఏడుపు గొంతుతో అంది. ‘అయ్యో… ఏడవుకురా. నువ్వేడుస్తుంటే చూడడం నా వల్ల కాదు’ ‘నేనేడవద్దంటే నువ్వు తొందరగా వచ్చేయ్‌’ ‘లీవ్‌ దొరకడం లేదు తల్లీ… దొరకగానే వచ్చేస్తా’ ‘లీవ్‌ లేదు. గీవ్‌ లేదు. జాబ్‌ వదిలేసి వచ్చేయ్‌’ ‘ముందు ఏడుపు ఆపు. ఏమైందో చెప్పు’ ‘నాకు భయమేస్తోంది. నువ్వు రాకపోతే మమ్మీ మనిద్దరిని […]

Continue Reading
Posted On :

క్షమయా ధరిత్రి (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

క్షమయా ధరిత్రి (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) -కైకాల వెంకట సుమలత   చాలా కాలానికి కథ రాయాలని పెన్ను పేపర్ తీసుకుని కూర్చున్నాను…రాయాలన్న కోరిక బలంగా ఉంది కానీ ఎలా మొదలు పెట్టాలో ఎక్కడ ఆపాలో తెలియడం లేదు.గుండె నిండిన వ్యధ తీరాలంటేపెన్ను కదలాలి. ఊహ తెలిసిన నాటి […]

Continue Reading
Posted On :

ఎగిరే పావురమా! (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

ఎగిరే పావురమా (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) – మధుపత్ర శైలజ ఉప్పలూరి “మేడం! నాకు చాలా భయంగా ఉంది. మా అమ్మావాళ్ళ దగ్గరకు పంపె య్యరూ! మా ఊరెళ్ళాక ఏవో చిన్నచిన్న పనులను చేసుకుంటూ బ్రతికేస్తాను. అమ్మో ఇన్నిసమస్యలు, బాధలు చుట్టుముడతాయని తెలిసుంటే అస్సలు చదువుకునేదాన్నే కాదు. “మన […]

Continue Reading
Posted On :

స్త్రీ కి స్త్రీ యే (కథ)

స్త్రీ కి స్త్రీ యే -డా. మూర్తి జొన్నలగెడ్డ          నమస్కార౦ డాక్టరు గారూ! అని రొప్పుకు౦టూ సైకిలుదిగాడు పక్కవీధిలో లేడీడాక్టరు దమయ౦తి గారి అసిస్టె౦టు.          ఏవిఁటి రమేష్! మ౦చి నీళ్ళేవైఁనా ఇమ్మ౦టావేఁమిటి? అన్నాను.          “అబ్బే పర్లేద౦డి. అర్జ౦టు సిజేరియన్ ఉ౦ది మిమ్మల్ని రమ్మ౦టు న్నారు” అని చెప్పి వొచ్చిన౦త వేగ౦గానూ వెళ్ళిపోయాడు.          మా ఇ౦ట్లో […]

Continue Reading
Posted On :

ఆ చిరునవ్వు ఆగిపోయింది (కవిత)

ఆ చిరునవ్వు ఆగిపోయింది -పారుపల్లి అజయ్ కుమార్ మనిషి ఎంత ఎత్తు ఎదిగి  ఏం లాభం ? మనసులో మాలిన్యాన్ని నింపుకొని ……. ఎంత చదువు చదివి ఏం ప్రయోజనం ? సంస్కారం అన్నది లేకపోయాక …… కత్తితో పొడిస్తేనో, తుపాకీతో కాలిస్తేనో హత్యా ? మాటలను తూటాలుగా పేల్చి మనసును శకలాలుగా చేయటం హత్య కాదా? ఎన్నో గుండెలపై స్టెతస్కోప్ ను పెట్టి హృదయ స్పందనలను విని ప్రతిస్పందించే గుండెలో హేళనగా, అసహ్యకరమైన రాతల గునపాలు […]

Continue Reading
Posted On :
gavidi srinivas

పల్లె పిలుస్తోంది…! (కవిత)

పల్లె పిలుస్తోంది…! -గవిడి శ్రీనివాస్ చిగురుటాకుల్లో  వెన్నెల చూపుల్లో తడిసిలేలేత గాలులతో మురిసి పల్లె నిండుగా పులకరిస్తోంది. చిన్ని సరదాల్ని సూర్య కిరణాల్ని వొంపుతూముఖం లోంచి ఆనందాలు ఉదయిస్తున్నాయి. ఆరుబయట అట్లానేచిరు నవ్వులు వేచివున్నాయి. పల్లెతనం అమ్మతనం ఎంచక్కాఆప్యాయంగా నిమురుతున్నాయి. వేసవి అయితే చాలుపిల్లలు పల్లెకు రెక్కలు కట్టుకునిఎగురుతున్నారు. మామిడి చెట్ల నీడలోజీడి చెట్ల కొమ్మల్లోఅడుగులు వడివడిగామురిసి పోతున్నాయి. మట్టి పరిమళాల్ని అద్దుకునిమంచు బిందువుల్ని పూసుకునిఎగిరే పక్షుల వెంటఆనందాలు సాగిపోతున్నాయి. కరిగిపోతున్న కలల్ని ఎత్తుకునినా పల్లెలో వాలిపోతాను. దోసిళ్ళలో చిరు నవ్వుల్నివెలిగించుకునిఅలసిన క్షణాల నుంచీఅలా సేదదీరుతుంటాను. ***** గవిడి శ్రీనివాస్  […]

Continue Reading
Posted On :

మధ్య తరగతి మకరందం (కవిత)

మధ్య తరగతి మకరందం -ఎజ్జు మల్లయ్య అమ్మ నేర్పిన తొలి పలుకుల నుంచి అమ్మ ఒడిలో పడుకున్న వెచ్చని నిద్ర నుంచి అమ్మ మోసిన కట్టెల మోపు నుంచి పాత బట్టలకు కుట్టేసిన సూది దారం నుంచి అమ్మ చేసే పరమాన్నం తిన్న పరమానందం నుంచి నాన్న వాడిన ఉల్లి-బాడిష నుంచి నాన్న చెక్కిన పళుగొర్రు నుంచి నాన్న దున్నిన గుంటిక వరుసల్లోంచి నాన్న పేర్చిన బండి పల్గడి దబ్బల నుంచి నాన్న అల్లిన పుల్జరితట్ట నుంచి […]

Continue Reading
Posted On :

మర్చిపోతున్నారు (కవిత)

మర్చిపోతున్నారు -లక్ష్మీ శ్రీనివాస్   అమ్మ పాలు వదిలిఅమ్మకం పాలు రుచి చూచినప్పుడేఅమ్మ భాషను మరిచి ..అమ్మకం భాషకు బానిస అయ్యారు!స్వేచ్ఛగా తెలుగు భాషనుమాట్లాడడానికి మొహం చాటేసుకుంటూ పరాయి భాషను బ్రతికిస్తూగొప్పగా బ్రతుకుతున్నామనిఅనుకొంటున్నారు కానిబ్రతుకంతా బానిసేనని మర్చి పోయారు !! నేడు పరాయి భాష కోసంప్రాకులాడుతున్న వాళ్లంతావిదేశాలకు పారిపోయికన్న వాళ్ళను అనాధలుగా చేసివాళ్ళ కన్నీటికి కారణమవుతున్నారుతెలుగు జాతి ఆత్మ గౌరవానికితెలుగు భాష మనుగడకు భంగం చేకూరుస్తున్నారుచీకటికి వెలుగు కరువైనట్టుతెలుగుకి తెలుగువాడు మరుగౌతున్నాడు!! పెద్ద పెద్ద చట్ట సభలలోసూటు బూటు వేసుకొనిఅర్ధం కాని పదాలతోఫ్యాషన్ […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-3

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 3 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల హార్టీకల్చర్ కోర్స్ చదువుతోంది. జూనియర్స్ కు విశాల మంచి రోల్ మోడల్. పరీక్షలలో హాస్టల్ లో ఉండి చదువుకుంది. తన రూమ్మేట్ యమున బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేయలేదని డీలా పడితే, రేపు జరుగబోయే పరీక్ష మీద దృష్టి పెట్టమని హితబోధ చేసింది. విశాల హార్టికల్చర్ డిగ్రీ పట్టా తీసుకుని, తరువాత ఎమ్.బి.ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్లో చేరింది. సీనియర్స్ నిర్వహించిన పోటీలలో, చదరంగంలో […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-28

నిష్కల – 28 – శాంతి ప్రబోధ జరిగిన కథ: నిష్కల, సారా ఒకే తండ్రి బిడ్డ లేనన్న ఎరుకలోకి వచ్చారు. కొన్నాళ్ల ఎడబాటు తరువాత నిష్కలను చేరిన అంకిత్. లోలోన అనేక అగాధాలు, సుడిగుండాలు చుట్టుముట్టిన జీవితాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న శోభకు కూతురిని జంటగా చూడాలని ఆశ. పెద్దకొడుకు జ్ఞాపకాల్లో అతని చూపుకోసం ఎదురుచూసే నిష్కల నానమ్మ సుగుణమ్మ ***           ఆ రోజు ఉదయం త్వర త్వరగా […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-13 పరుగు

పేషంట్ చెప్పే కథలు – 13 పరుగు -ఆలూరి విజయలక్ష్మి “గుడ్ మార్నింగ్ యంగ్ లేడీ!” “గుడ్ మార్నింగ్! నేనింకా యంగ్ లేడీలా కనిపిస్తున్నానా మీకు?” స్నిగ్ధంగా నవ్వింది డాక్టర్ శృతి. “మీరెంత పెద్ద వాళ్ళయినా నువ్వూ, హరితా నాకు చిన్నపిల్లలానే కనిపిస్తారమ్మా!” పండిపోయిన జుట్టు, అలిసిపోయిన కళ్ళు, ఆర్ద్రంగా వున్నా కంఠం… శ్రీపతిరావును చూస్తుంటే ఆయన రూపురేఖల్ని పుణికి పుచ్చుకున్న తన స్నేహితురాలు హరిత కళ్ళ ముందు నిలిచింది శృతికి. “హరిత ఫోన్ చేసింది. రిజర్వేషన్ […]

Continue Reading
Posted On :

విజయవాటిక-20 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-20 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ మహాదేవవర్మ మందిరం- రాజ్యవైద్యుడు చెప్పిన ఆ మాటకు అక్కడ హఠాత్తుగా శ్మశాన నిశ్శబ్దం అలుము కుంది. శ్రీకరుడు నమ్మలేకపోయాడు… “ఏమిటి?” అంటూ ముందుకొచ్చాడు. అతని కళ్ళలో ఆశ్చర్యం… మహారాజు మాధవవర్మ మ్రాన్పడిపోయాడు. కొంత తడవకు తేరుకొని ఎఱ్ఱబడ్డ కళ్ళతో నిప్పులు కురుస్తూ… “కారా! ఏమిటిది? నీవు రాజపుత్రునికి బహిర్‌ప్రాణము. నీకు తెలియక, నిన్ను తప్పుకు ఈ విషప్రయోగమెట్లు సంభవము?” అన్నాడు. ఆయన కంఠం ఉరిమినట్లుగా ఉంది. శ్రీకరుడు ప్రపంచంలో అతి […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-4 పులవర్తి కమలావతీదేవి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-4  -డా. సిహెచ్. సుశీల   “ప్రథమ దళితోద్యమ కథా రచయిత్రి*”పులవర్తి కమలావతీదేవి                  1930 లలో స్త్రీలు స్వాతంత్రోద్యమంలో పురుషులతో ధీటుగా పాల్గొని, జైలు కెళ్ళడం తో పాటు, రాజకీయ వ్యవహారాలలో తీర్మానాలు చేయడం ద్వారా తమ భాగస్వామ్యాన్ని నిరూపించుకున్నారు. అఖిల భారత స్థాయిలో ఎన్నెన్నో మహిళా మహాసభలలో చురుగ్గా పాల్గొన్నారు.              స్త్రీలు చదువుకుంటే ఏ […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-19 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 19 – గౌరీ కృపానందన్ వాకిట్లో రెండు కార్లు ఉన్నాయి. పైజామా ధరించిన యువకుడు మాధవరావుని విచిత్రంగా చూశాడు. డ్రైవర్ సిద్దంగా ఉన్నాడు కారు స్టార్ట్ చేయడానికి. వెనక సీట్లో ఇద్దరు స్త్రీలు బురఖాలో ఉన్నారు. ఇంకొక సీటు ఖాళీగా ఉంది. “కౌన్ చాహియే ఆప్ కో?” “మిస్టర్ ఇంతియాస్?” “ఇంతియాస్! కోయి పోలీస్ వాలే ఆయే హై.” ఇంతియాస్ కి పాతికేళ్ళు ఉంటాయి. తెల్లగా, దృడంగా ఉన్నాడు.వేళ్ళకి ఉంగరాలు. మణికట్టు దగ్గర […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-28)

బతుకు చిత్రం-28 – రావుల కిరణ్మయి జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించుకుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది . ***          దేనికి పైసలియ్యాలె? నీ ఓటుకు సుతం సర్కారు పైసలియ్యల్నా? ఓటేసే టందుకు ఇచ్చినట్టు పైసలియ్యాల్నా? ఇజ్జతు లేదా? అడిగేటందుకు? అని గయ్యిమన్నడు. నీ బాధ్యత […]

Continue Reading
Posted On :

అనుసృజన-మీనాకుమారి హిందీ కవిత-3

అనుసృజన మీనాకుమారి హిందీ కవిత-3 అనువాదం: ఆర్.శాంతసుందరి అలనాటి మేటి హిందీ నటి మీనా కుమారి అసలు పేరు మాహ్ జబీన్. ఆమె కవయిత్రి అన్న విషయం మీకు తెలుసా? ఆమె మరణించాక గుల్జార్ ఆమె కవితలని సీడీగా రికార్డు చేశారు, మీనా కుమారి తన కవితలను స్వయంగా చదివి రికార్డ్ చేసిన వీడియోలు కొన్ని దొరికాయి. మూల (హిందీ) కవితలను తెలుగులో రాసాను, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. తెలుగు అనువాదం ఆమె కవితల్లోని భావాన్ని అర్థం […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 20 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-20 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల సైరన్లు మోగాయి. లైట్లు వెలిగాయి. అందరం లోనకు జొరబడ్డాం. వాకిలి దగ్గర సూపు బాండీలున్నా ఎవరికీ తినాలనిపించలేదు. మంచాల మీదకు చేరితే చాలనుకున్నాం. చాలా బంకులు ఖాళీగా ఉన్నాయి. ఉదయం మెలకువ వచ్చింది. నాకొక నాన్నున్నాడని జ్ఞప్తికి వచ్చింది. హడావిడిగా రాత్రి లోనకు జొరబడిపోయానేగాని నాన్నను పట్టించుకోలేదు. నాన్నకోసం చూడటానికి వెళ్ళాను. నా అంతరంగంలో ఆయన లేకపోతే నాకేమీ బాధ్యత ఉండదనే దుర్మార్గపు […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -4 (యదార్థ గాథ)

జీవితం అంచున -4 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి Every great dream begins with a dreamer.. ఎప్పుడో ఎక్కడో చదివిన కోట్. అవును. చిరకాల కల. నిశిరాతిరి నిద్దట్లో కల… వేకువజాము కల… పట్టపగటి కల… వేళ ఏదయినా కల ఒకటే. మనది కాని విదేశీయుల విశ్వవిద్యాలయంలో ఎప్పుడెప్పుడు అడుగు మోపుతానా అని మనసు ఒకటే ఉవ్విళ్లూరుతోంది. నర్సింగ్ విద్యార్థి ఊహే నా వయసును అమాంతం రెండింతలు తగ్గించేసింది. మనలో […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 29

నా జీవన యానంలో- రెండవభాగం- 29 -కె.వరలక్ష్మి           మోహన్ హెడ్మాస్టరుగా పనిచేస్తున్న ఏలేశ్వరం స్కూల్ టీచర్ ఒకావిడ నాకు ఫోన్ చేసింది. “మాస్టారు GPF లోన్ 30వేలకి పెట్టేస్తున్నాడు. నా వైఫ్ ని అందరూ ఎన్నికల్లో నిలబెడతాం అంటున్నారు. ఎక్కడలేని డబ్బూ కావాలిప్పుడు. ఇలా నా డబ్బు నేను తీసేసుకుంటేనే గానీ నన్ను ఇరికించేస్తారు అంటున్నారు” అని. అదీ సంగతి. నా వెనుక దన్నుగా నిలబడాల్సిన నా భర్త గారి […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 7

యాదోంకి బారాత్-7 -వారాల ఆనంద్ ఎస్.ఆర్.ఆర్.కాలేజ్ డిగ్రీ చదువులు, సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు           1974-77 ఎస్.ఆర్.ఆర్.కాలేజీలో బి.ఎస్సీ. డిగ్రీ చదువు ఆడుతూ పాడుతూ సాగిన కాలం. కాలేజీకి వెళ్ళామా వచ్చామా అంతే. అట్లని విచ్చలవిడితనం అన్నదీ లేదు. మంకమ్మతోట ఇంటి నుంచి రాజేందర్ జింబో, నేను సైకిళ్ళ మీద వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు భాగ్యనగర్ వున్న చోట పెద్ద కుంట వుండేది. తర్వాత వరి మడులు. కేవలం St. John’s […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 15

వ్యాధితో పోరాటం-15 –కనకదుర్గ నిన్నటిలాగే ఇన్సూలిన్ ఇస్తున్నారు. మంటలెక్కువగా వుంటే చల్లటి టవల్స్ ఇచ్చారు. చైతు, శ్రీని తల పైన, కళ్ళపైన, చేతులు, కాళ్ళపైన వేస్తూ వున్నారు. థాంక్స్  గివింగ్ డిన్నర్ నాలుగు గంటలకు స్పెషల్ వుంటుందన్నారు. మధ్యాహ్నం కాఫెటేరియాకి వెళ్ళి వాళ్ళకి నచ్చినవి తినేసి వచ్చారు. ఫాల్ సీజన్ మొదలయ్యింది. ఈ సారి స్నో చాలా త్వరగా పడింది. ఇప్పుడు బయట ఆకులు రంగులు మారాయి ఇప్పుడు. మొత్తానికి ఈ ట్రీట్మెంట్ వల్ల నొప్పులు రావడం […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-28)

నడక దారిలో-28 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కు కుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీలో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్యం, సంగీతంతోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి దేవి పేరుతో కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. డిగ్రీ చదువు పూర్తిచేసుకుని మేలో పరీక్షల తర్వాత హైదరాబాద్ శాశ్వతంగా వచ్చేసాను. […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-43

మా కథ (దొమితిలా చుంగారా)- 43 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  “దురదృష్టకరమైన ప్రమాదం” బొలీవియాలో యువకులందరూ పద్దెనిమిదేళ్ళకే సైన్యంలో చేరాల్సి ఉండింది. సైన్యంలో చేరిన పత్రాలు లేకపోతే బైట ఉద్యోగాలు దొరకక పదిహేడేళ్ళకే సైన్యంలో చేరిన వాళ్ళు కూడా ఉన్నారు. సైన్యంలో చేరనంటే పెద్ద మూల్యమే చెల్లించాల్సి వచ్చేది. నరకంలాంటి బాధలు అనుభవించాల్సి వచ్చేది. కొడుకులు బారలకు వెళ్ళే పరిస్థితి వచ్చిన రోజు తల్లిదండ్రులు నోరువిప్పి మాట్లాడ గూడదు. ఇక సైన్యంలో చేరాక […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-41 కె. రామలక్ష్మి 1

  నారి సారించిన నవల-41 కె. రామలక్ష్మి – 1                       -కాత్యాయనీ విద్మహే          ఈ శీర్షిక కింద ఈ నెల నుండి  కె. రామలక్ష్మి గారి నవలల మీద వ్రాయాలి. సేకరించుకొన్న నవలలు అన్నీ టేబుల్ మీద పెట్టుకొంటుండగానే మార్చ్ 3 శుక్రవారం (2023) ఆమె మరణవార్త వినవలసివచ్చింది. 92 సంవత్సరాల సంపూర్ణ సాధికార సాహిత్య […]

Continue Reading
Posted On :
K.Geeta

గీతామాధవీయం-20 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-20 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-20) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) డిసెంబరు 26, 2021 టాక్ షో-20 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-20 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** డా|| […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-3

నా అంతరంగ తరంగాలు-3 -మన్నెం శారద ఒక ఆర్టిస్ట్ గా ఇది నా అక్కసో, బాధో అని మీరు అనుకోవచ్చు. మా చిన్నతనంలో బొమ్మలు వేయాలంటే మాకు వడ్డాది పాపయ్యగారో, లేదా బాపు గారి బొమ్మలో శరణ్యమయ్యేయి. లేదా ఇంట్లో గోడలకి వున్న రవివర్మ పటాలు దిక్కయ్యేయి. వాటిని చూసే ప్రాక్టీస్ చేసే వాళ్ళం. ఇప్పటిలా గూగుల్ లో వెదకి పట్టుకునే పరిస్థితి మాకు అప్పుడు లేదు. సినిమా తారల ఫోటోలు పత్రికల మీద అందుబాటులో వున్నా […]

Continue Reading
Posted On :

వినిపించేకథలు-28-వెలుగు వాకిట్లోకి- శ్రీ శ్రీరాజ్ గారి కథ

వినిపించేకథలు-28 వెలుగు వాకిట్లోకి రచన :శ్రీ శ్రీరాజ్ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama artist. గతంలో దూరదర్శన్ లోనూ న్యూస్ […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-45)

వెనుతిరగని వెన్నెల(భాగం-45) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) వెనుతిరగని వెన్నెల(భాగం-45) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు […]

Continue Reading
Posted On :

నవలాస్రవంతి-30 లోపలిమనిషి-3 (పి.వి.నరసింహారావు నవల)

పరాంకుశం వేణుగోపాలస్వామి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పట్టభద్రులు. నమస్తే తెలంగాణా అసిస్టెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Continue Reading
Posted On :

శ్రీరాగాలు- 9 లంక సీత కథ – జీవన సత్యం

శ్రీరాగాలు-9 జీవన సత్యం -లంక సీత సుబ్బారావు సుజాతలు ఇంచుమించుగా ఒకేసారి బ్యాంకులో చేరారు. ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకింటివారయ్యారు. ఇది పాతికేళ్ల నాటి సంగతి. ఈ పాతికేళ్ళ సంసార జీవితంలో సుబ్బారావు సుజాతలు ఎంతో అన్యోన్యంగా సుఖంగా గడిపారు. ఇద్దరు కూతుళ్ళు సౌజన్య, సౌమ్యల భవిష్యత్తు చక్కదిద్దాలనే తపనతో అహర్నిశలూ కష్టపడి, చదివించి పెంచి పెద్ద చేశారు. చక్కటి సంబంధాలు చూసి పెళ్లిళ్లు కూడా చేశారు. పెద్దమ్మాయి భర్త అమెరికాలో ఒక సాప్ట్ వేర్ ఇంజనీర్. […]

Continue Reading
Posted On :

దుబాయ్ విశేషాలు-1

దుబాయ్ విశేషాలు-1 -చెంగల్వల కామేశ్వరి దుబాయ్ గురించి రాయాలంటే నాకు తెలిసినది సరిపోదు. అందుకే నాల్గయిదు సార్లు దుబాయ్ వెళ్లినపుడు నేను తెలుసుకొన్నవి, అక్కడ మా పిల్లలు చూపించిన కొన్ని విశేషాలు రోజువారీగా పంచుకుంటాను.          UAE అంటే యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ అబుదాబీ, రస్అల్ కైమా, దుబాయ్, అజ్మాన్, షార్జా, ఫ్యుజేరా, ఉమ్మ్ అల్ క్వయిన్, అన్న ఏడు అరబ్బు (చిన్న )దేశాల సమాహారం.          వీటిలో అబూ దాభి ఎమిరేట్ […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-39 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-3)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-3 లగేజీ ఏ టూరుకి వెళ్ళినా లగేజీ ఒక పెద్ద సమస్యే. ‘అసలు అక్కడి వాతావరణానికి ఏం బట్టలు వేసుకోవాలి? ఎన్ని జతలు పట్టుకెళ్ళాలి?’ లాంటి ప్రశ్నలతో మొదలయ్యి చివరికి ‘ఎన్ని కేజీలు పట్టుకెళ్ళనిస్తారు’ తో ముగుస్తుంది. నిజానికి […]

Continue Reading
Posted On :

ఈజిప్టు పర్యటన – 4 (చివరి రోజు)

ఈజిప్టు పర్యటన – 4 (చివరి రోజు) -సుశీల నాగరాజ నైలు అందాలను, నది పొడవునా ఉన్న లెక్కపెట్టలేనన్ని ప్రాచీన దేవాలయాలను, శిధిలాలను చూసుకొంటూ ప్రయాణం ! అస్వాన్ నుంచి లుక్సర్ దాకా ఉన్న 90 కిలో మీటర్ల దూరం మోటారు బోటులో ప్రయాణం. అదే నైలు క్రూజ్ ! ఇది నాలుగు రోజులు (మూడు రాత్రులు) ప్రాచీన ఈజిప్ట్ నాగరికతలో ముఖ్యమైనవి రకరకాలైన దేవతలు, వారికి కట్టిన దేవాలయాలు, వాటిని ప్రపంచంలో అతి ప్రాచీన భాషల్లో […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -4 మహాభారతకథలు – మాంధాతృడు కథ

పౌరాణిక గాథలు -3 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి మాంధాతృడు కథ మన పురాణాల్లోను, ఇతిహాసాల్లోను గొప్ప కీర్తి పొందినవాళ్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్లందరూ మనకి తెలియదు కదా! వాళ్లు ఏ కాలంలో జీవించినా ఆ కాలంలో వాళ్లే చాలా గొప్పవాళ్లు అనిపించు కున్నారు. అటువంటి వ్యక్తులు ఎంతోమంది ఈ భూమి మీద పుట్టి, వేల సంవత్సరాలు జీవించి, ఎన్నో మంచి పనులు చేసి యుగాలు గడుస్తున్నా ఇప్పటికీ కీర్తి కాయంతో జీవించి ఉన్నారు. వాళ్లు ఇప్పుడు […]

Continue Reading
Posted On :