image_print

జీవితం అంచున -5 (యదార్థ గాథ)

జీవితం అంచున -5 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి Care for one… that’s love. Care for all… that’s nursing. కనీసం చిన్న పించ్ కూడా తెలియకుండా నర్సు “ఐ యాం సారీ డార్లింగ్” అంటూనే నా రక్త నాళంలో నుండి బోలెడు రక్తం తోడేసింది. మనం ఒకే ఫ్రెటర్నిటి అనుకుంటూ ఆవిడ వైపు ఆత్మీయంగా చూసాను. ఆలూ చూలూ లేకుండా బిడ్డ కోసం కలలని నవ్వుకుంటున్నారా… నా కంటి […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -4 (యదార్థ గాథ)

జీవితం అంచున -4 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి Every great dream begins with a dreamer.. ఎప్పుడో ఎక్కడో చదివిన కోట్. అవును. చిరకాల కల. నిశిరాతిరి నిద్దట్లో కల… వేకువజాము కల… పట్టపగటి కల… వేళ ఏదయినా కల ఒకటే. మనది కాని విదేశీయుల విశ్వవిద్యాలయంలో ఎప్పుడెప్పుడు అడుగు మోపుతానా అని మనసు ఒకటే ఉవ్విళ్లూరుతోంది. నర్సింగ్ విద్యార్థి ఊహే నా వయసును అమాంతం రెండింతలు తగ్గించేసింది. మనలో […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -3 (యదార్థ గాథ)

జీవితం అంచున -3 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి Future is always a mystery… మనిషి టెక్నాలజీ పరంగా ఎంత పురోగతి సాధించినా రేపు ఏమి జరుగుతుందో తెలుసుకోలేడు కదా. రాత్రి కమ్మిన దిగులు మేఘాలకు ఎప్పుడో అపరాత్రికి పడుకున్నానేమో చాలా ఆలస్యంగా లేచాను. ఆ రోజు శనివారం సెలవు కావటం వలన అందరూ ఇంట్లోనే వున్నారు. అల్లుడు స్టడీ రూములో కూర్చుని కంప్యూటర్ నుండి ఏవో ప్రింట్ ఔట్స్ తీస్తున్నాడు. […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -2 (యదార్థ గాథ)

జీవితం అంచున -2 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి తరువాతి మూడు రోజులు మూడు యుగాల్లా గడిచాయి. ఒకటే రెస్ట్లెస్ నెస్… రెస్ట్లెస్ నెస్ అంటే ఏమిటంటారా… నాకు అప్పుడప్పుడూ కలిగే కుదురుంచని ఒక అస్థిమిత భావన. అది కలిగినప్పుడు విసుగ్గా వుంటుంది… ఏ పని పైనా ధ్యాస వుండదు. మాట్లాడుతున్నా ఆ మాటలు నావి కావు. టీవీలో సినిమా చూస్తున్నా నా కళ్ళు దానిని గ్రహించవు. చదువుతున్నా తలకెక్కదు. తింటున్నా నాలుకకు […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -1 (యదార్థ గాథ)

జీవితం అంచున -1 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి   PROLOGUE  Life is taking up challenges  Life is achieving goals Life is being inspiration to others And age should not be a barrier for anything….           అనగనగా అప్పట్లో పంథొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో ఓ అమ్మాయి తెల్లని కోటు, చల్లని నవ్వుతో రోగుల గాయాలు […]

Continue Reading
Posted On :

ఫెమినిజం

ఫెమినిజం – ఝాన్సీ కొప్పిశెట్టి అది రోజూ బయిల్దేరే సమయమే… శాంతమ్మ టిఫిన్ బాక్సు సర్దుతోంది. వైదేహికేదో తప్పు చేస్తున్న భావన…బస్సు మిస్ అవుతావంటూ, ఆఫీసుకి లేటవుతావంటూ శాంతమ్మ తొందర చేస్తోంది. వైదేహిని తను చేయబోతున్న దొంగ పని కలవర పెడుతూ చకచకా తెమలనీయటం లేదు. అక్కడికి వెళ్ళాలన్న తపనే తప్ప ఆమెకు అందమైన చీర కట్టుకుని ప్రత్యేకంగా తయారవ్వాలన్న ధ్యాస కూడా లేదు. ఓవర్ ప్రొటెక్టివ్ తల్లి వంక అక్కసుగా చూసింది. కరుణామయిగా పేరుగాంచిన తన తల్లికి ఎందుకంత […]

Continue Reading
Posted On :

అందీ అందని ఆకాశం (కవిత)

అందీ అందని ఆకాశం (కవిత) -ఝాన్సీ కొప్పిశెట్టి ఓ కవి ‘మధుశాల’ లోతుల్లో మునిగి వున్నాన్నేను అదేమిటో… మనసు పొరల్లో దాచుకున్న ఇష్టమైన అనుభవాలన్నీ అనుభవంలోకి వచ్చాయి..! జ్ఞాపకాల పొరల్లోని కౌగిలింతల స్పర్శలు చిక్కటి స్నేహాలు జో కొట్టిన హస్తాలు… ఎందుకో మరోసారి పితృస్వామ్యం పైన అక్కసు ఎగిసిపడింది..! పురుషుడు ఆడమాంసపు ఆఘ్రాణింపుపై రాసినా వేశ్యల భోగలాలసపై మనసు పడినా ప్రియురాళ్ళ ఓణీల్లోని అందాల్లో ఓలలాడినా అన్నీ స్వానుభవాలేనని ఒత్తి పలికినా ఆక్షేపణ లేదు ఈ పితృస్వామ్య […]

Continue Reading
Posted On :

నువ్వేంటి…నా లోకి…(కవిత)

నువ్వేంటి…నా లోకి…(కవిత) -ఝాన్సీ కొప్పిశెట్టి నువ్వేంటి ఇలా లోలోకి.. నాకే తెలియని నాలోకి… నేనేమిటో నా పుట్టుక పరమార్ధమేమిటో ఏ పుట్టగతులనాశించి పుట్టానో అసలెందుకు పుట్టానోనన్న అన్వేషణలో నేను… గాలివాటుతో ఊగిసలాడే నా చంచల చిత్తం సత్యాసత్యాల చిక్కుముడిలో చిక్కడిన నా అంతరంగం వాటిపై జరిగే అనేకానేక దురాక్రమణలు నా ఉనికితనపుటంచుల్లో భయాందోళనలు నా తెలిసీ తెలియనితనపు తప్పటడుగులు… నా మకిలంటిన మనసుకి విహ్వలించిన నేను నన్నథిక్షేపించే నాపై నేనే ప్రకటించుకునే యుద్దాలు నాలో నేనే సాగించే […]

Continue Reading
Posted On :