ఒక్కసారి జవాబుగా మారి ఎదుటకురా…. (కవిత)

ఒక్కసారి జవాబుగా మారి ఎదుటకురా…. -చందలూరి నారాయణరావు రోజులోఏదో ఓ సమయంలోమాటల షార్టు షర్క్యూట్చీకటిలో ఉండిపోతంమౌనం ఇద్దరినీ నంజుకు తింటుంది.. ………..కాసేపు ఆగకతగాదా అని నీవుకాదని నేను………..నేను అడిగిందే కావాలనిఇష్టం యుద్ధం చేస్తుంది నీతోస్పందన లేకుండా గంట మాట్లాడతావుచప్పుడు లేకుండా…………నీకేమి కావాలో చెప్పవునీకేది ఇవ్వాలో తెలియదు.దేనికి చప్పుడు చేయకుండాఏది అర్దం కాదు…..అర్దముండదు…….కానీ ఏదో ఓ క్షణంలోఇద్దరం కలిసినప్పుడుదూరంగా మన మాటలు, చూపులువెక్కిరిస్తుంటేనా భుజంపై వాలి బాధపడతావు……నేనేం చేయాలి?మనమేమి కావాలి?ఒక్కసారి జవాబుగా మారి ఎదుటకురా….జీవితం ఎప్పటికీమనల్ని ఓడించలేదు… ***** […]

Continue Reading
Posted On :

ఊపిరితో ఊదుకుని…… (కవిత)

ఊపిరితో ఊదుకుని…… (కవిత) – శ్రీ సాహితి గుండెను అక్షరంతో తవ్వుతుంటే కంగు కంగుమనే కాలం మ్రోతకు గాఢ నిద్రలో మనసు ఉలిక్కిపడి గాయపడ్డ నిజాలని ఊపిరితో ఊదుకుని పడిన మచ్చలను నిజాయితీతో మాన్పి జీవితమంతా మెరిసే ఒక్క కలను తృప్తిగా పొదువుకోవాలని ఉంది ***** మా ఊరు అద్దంకి, ప్రకాశం జిల్లా, (ఆంధ్రప్రదేశ్.) నేను ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీ లో బి.ఫార్మసీ చదువుతున్నాను.నాకు చిన్నప్పటి నుండి తెలుగులో శతక పద్యాలు అంటే ఇష్టం. అలాగే మా […]

Continue Reading
Posted On :

శూన్య తత్వం (కవిత)

శూన్య తత్వం -గవిడి శ్రీనివాస్ ఆకాశ ఎడారి నుంచి చూపులు వేలాడేసుకుని దిక్కులు చూస్తున్నప్పుడు శూన్య తత్వం బోధపడుతుంది. కలలకి కన్నీళ్ళకి మధ్య దూరాన్ని చెరిపి అతి దగ్గరగా చూసినప్పుడు నిశ్శబ్దంలోంచి జీవిత సత్యం అవగతమవుతుంది. గుప్పెడు కన్నీళ్ళని పట్టుకుని వేలాడటం కాదు జీవితం. రాత్రి వెనుక పగలు దాగున్నట్టు దుఃఖః ఆవల సుఖం మౌనంగా కాలం కోసం ఎదురుచూస్తోంది. ఏమీ తోచనప్పుడు దిక్కులు చీకట్లతో మూసుకున్నప్పుడు మౌనం పరమావధిగా కాలాన్ని చెక్కు కోవాలి. ఆనంద తీరం […]

Continue Reading
Posted On :

సంసారి సాలెమ్మ (కవిత)

సంసారి సాలెమ్మ -బాలాజీ పోతుల ఓ కొడ్కా..! నా జీవి ఎండిపోతంది గంజి మిగిలిపోతంది నేనిప్పుడు మందిల లేను మనుసు మనుసుల లేదు నా ఎదన పెట్టుకొని పెంచిన కొడ్కా మిమ్ముల! పెద్దకొడ్కా..! మల్లేసూ..! మల్లి రాను బిడ్డా నీ పెల్లం పిల్లల్తోని లవు సక్కంగ ఉండు కొడ్కా పానం గాయి గాయి అయితంటే మనుసుల మనుసుపెట్టి మాట్లాడినవా? ఎర్రకారం తప్ప, ఏనాడన్న తున్కల కూర పెట్టినవా? నువ్వు, నీ కొడ్కులు, నీ పెల్లం మూసుకొని నడింట్ల […]

Continue Reading
Posted On :

దరి చేరని వసంతం !!

దరి చేరని వసంతం !! -ఇందు చంద్రన్ అతనో వసంత కాలపు అతిథి ! ఎండుటాకుల మధ్య చిగురిస్తూ పుట్టుకొస్తుంటాడు. ఓ వైపు వేసవి మంటలు మరో వైపు గడ్డ కట్టే చలి… రెండు కలగలిసే సంధ్యా సమయాన కనిపిస్తాడు. అప్పుడుపుడూ కలల్లోనూ, కొన్ని సార్లు నిజంగాను కనిపిస్తుంటాడు. వెచ్చని సూర్య కిరణాలు తాకినప్పుడో, చలికి బిగుసుకు పోయినప్పుడో ఏదైనా తింటూ పొలమారినప్పుడో అద్దంలో అందంగా చూసుకున్నపుడో గుర్తొస్తాడు. అనుకోని అతిథిలా ! ఆకలి, దప్పికల్లాగే అతని […]

Continue Reading
Posted On :

నీతో పడవ ప్రయాణం (కవిత)

నీతో పడవ ప్రయాణం -గవిడి శ్రీనివాస్ నేనిప్పుడు నీ జ్ఞాపకాలతో పడవ ప్రయాణం చేస్తున్నాను. ఏటు ఒడ్డున ఆగి ఇసుక గూళ్లలో దాగి నీ పరిమళ సుగంధాన్ని పీల్చుకుంటున్నాను. నీ వొడిలో వాలి నక్షత్రాల్ని లెక్కపెట్టడం నీ కౌగిలిలో క్షణాలు ఆగిపోవడం. అలా ఊపిరి సలపని జ్ఞాపకాలతో నలిగిపోతున్నాను. నేను నిశ్చలంగా ఉండలేను కొలమానాల కారణంగా దూరం గా సాగిపోయావు. చిన్ని జీవితానికి వెన్నెల జ్ఞాపకాలు వేదన రోదనలు తప్పా మాటల స్పర్శే లేని ఒంటరి జీవితాలకి […]

Continue Reading
Posted On :

ఇంకెంత ఇష్టమో ఈ నిజానిది? (కవిత)

ఇంకెంత ఇష్టమో ఈ నిజానిది? -చందలూరి నారాయణరావు చీకటి బాగా కాసి మనసును పులిమినప్పుడు పాత కలే చిరిగిన గుడ్డల్లో మాసిన ముఖంతో కోరిక తలుపు కొడుతూనే ఉంది. రెండు క్షణాల వయసులోనే ఇష్టం ప్రేమగా పరవశమై తన నీడనే తనే తొడుక్కుని తలలో కంటికెదురుగా లోతు ప్రశ్నలతో యుద్ధనౌకలో పొలిమేర దాకా సాగే కలవరింత వేడుకలో పరిమళిస్తూ దిక్కు తెలియకుండానే దారితో పనిలేకుండా ఆశ సువాసనతో గెంతులేసుకుంటూ గాలితో కలసి లోపల చేసే ప్రయాణంలో ఇంకెంత […]

Continue Reading
Posted On :

మా తాతదీ గుండె కోతనే! (కవిత)

మా తాతదీ గుండె కోతనే! -బాలాజీ పోతుల నా రాతలు చూసీ, ఈనికో పెద్ద నౌకరీ అస్తే, మంచిగుండనీ, మా తాత దినాం దేవులడుతడు ఆరిన, నా బతుకు దివిటీ ఎల్గించన్కి. చేత్లకు పైసరాని పని అదేం పనిరా అని కసురుకుంటడే గానీ, ఉన్నకాడికి కడుపు నింపుతడు. ఒగని కడుపుగొట్టి గాదు బిడ్డ్యా! ఆ కొట్టినోళ్లని మొకం మీద కొట్టినట్టు బతుకాలంటడు. ఏం చెప్తవే రోజూ, అని నేనంటే – ఇయ్యాల మేమున్నం, రేపట్పొద్దు ఉంటమో లేమో […]

Continue Reading
Posted On :

స్వీయ సంరక్షణా బాధ్యత – జసింటా కేర్కెట్టా (ఆదివాసీ కవి)

స్వీయ సంరక్షణా బాధ్యత మూలం: జసింటా కేర్కెట్టా (ఆదివాసీ కవి) ఆంగ్లానువాదం: భూమికాచావ్లా డిసౌజా తెలుగు సేత: వారాల ఆనంద్ వాళ్ళు వాళ్ళ భగవంతుణ్ణి తీసుకొచ్చారు మీ పాపాల్నుంచీ మిమ్మల్ని విముక్తుల్ని చేస్తామన్నారు ‘మేమేం పాపాలు చేశామని’ అడిగాం వాళ్ళు దిక్భ్రమ చెందారు పాపాల్ని మోక్షాల్నీ పేర్కొనకుండా వారి భగవంతుని ఉనికిని ఎట్లా స్థాపిస్తారు ‘మీరేంత పేదవాళ్ళుగా, వెనకబాటుగా వున్నారో చూడండి’ అన్నారు వాళ్ళు ఇదంతా మీ మీ పాపాల ఫలితమే అన్నారు మా విశాలమయిన మా […]

Continue Reading
Posted On :

అమ్మ ఆవేదన! (కవిత)

అమ్మ ఆవేదన! -దయాకర్ రావుల మధ్యలో నిలబడి చుట్టూ వలయం గీసుకున్నా! వలయంలోకి కొంత మందినే ఆహ్వానించా! వాళ్ళతో సంతోషంగా ఉన్నా! కావాల్సినవన్నీ సమకూర్చి ఇచ్చా! ఏం అయ్యిందో ఏమో గానీ మెల్లి మెల్లిగా వలయం కాళీ అయ్యింది! రోజు రోజుకి చిన్నది అయ్యింది! నేను తప్ప ఎవరూ పట్టలేనంత! ఇంకో మనిషికి చోటు లేనంత!! నాపై నాకు ధ్యాస తప్పింది! శ్వాస ఇబ్బంది అయ్యింది! చుట్టూ నిర్మాన్యుషం! భరించలేనంత నిశ్శబ్దం! అయినా వలయం నుండి బయటకి […]

Continue Reading
Posted On :

ఎంతో కొంత మిగిలే వెలితివే (కవిత)

ఎంతో కొంత మిగిలే వెలితివే (కవిత) – శ్రీ సాహితి నీవు నిరంతరం ఏదో కోరికలా ఏ పేరుతో పిలచుకున్నా చెదరని అందంతో గర్వపడే లోపలి లోకంలో నాటు పడిన ఒక్క మాటగా అర్దమెంత కోసినా ఎంతో కొంత వెలితివే. ఎంత కురిసినా ముఖంలో మొలకెత్తని నిజానివే. నీకేమీ కావాలో తెలియకుండా తవ్వుకునే ప్రశ్నవే. నాతో పని లేకుండా ఏది అడగకుండానే బాగా తెలిసిన ఇష్టాలతో అన్నీ వేళలా అన్నీ చోట్ల… నా లోపలే ఉంటావు ఓ […]

Continue Reading
Posted On :

బతుకు పుస్తకం (కవిత)

బతుకు పుస్తకం -లక్ష్మీ శ్రీనివాస్ గాయ పడ్డావో జ్ఞాపకాలతో బంధింప పడ్డావో అవమానాల వలలో చిక్కుకొన్నావో తెలియని అయోమయ స్థితిలో మునక లేస్తున్నావా?? నిన్ను నువ్వు చూడాలా నువ్వు ఎక్కడ ఓడిపోయావో ఆ చోటు నుంచి నిన్ను నువ్వు చూడడం మొదలు పెట్టు. నువ్వు ఎంటో అర్థం అవుతుంది నీ గమ్యం ఎంటో తెలుస్తుంది తల దించిన చోటే తల ఎత్తేక్షణం నీ ముందు ఆవిష్కరింప బడుతుంది ఆ క్షణాన్ని ఆయుధంగా మార్చుకొంటే నీ జీవితం మరో […]

Continue Reading
Posted On :

గానుగ యంత్రం – కేహ్రీ సింగ్ మధుకర్ (డోగ్రీ కవిత, తెలుగు సేత: వారాల ఆనంద్ )

గానుగ యంత్రం – కేహ్రీ సింగ్ మధుకర్ ( డోగ్రీ కవిత)                                                   ఇంగ్లీషు అనువాదం: కేహ్రీ సింగ్ మధుకర్ తెలుగు సేత: వారాల ఆనంద్ గానుగ యంత్రం గర గరలాడుతూ పని చేస్తుంది ఎద్దు దాని వెనకాలే క్రమం తప్పకుండా స్థిరంగా […]

Continue Reading
Posted On :

చాక్ పీస్ (కవిత)

చాక్ పీస్ (కవిత) -వి.విజయకుమార్ చిరిగిన రంగు పేలికల్ని మింగి చక చకా ఇంద్రధనువుల్ని లాగే విదూషకుడి చేతుల్లా ఎన్ని వక్రాలు తిరుగుతావో ఎన్ని వయ్యారాలు పోతావో జ్ఞాన మూర్తి హస్తాల్లో చైతన్యపు తీవలై హొయలు పోతూ చిటికెడు బూడిదై లయించి పోతూ ఆవిరై చివరికి అంతమయ్యే జీవితమే అయినా అంతో ఎంతో ఘనీభవిస్తూ ఒకింత జీవితాన్ని పెంచుకుంటుంది కొవ్వొత్తి వెలుగివ్వడం కోసమే అనుకో- అణువు అణువుగా రాలిపోతూ హారతై హరించిపోతూ అప్పటికప్పుడే అదృశ్యమై పోతావు మరి […]

Continue Reading
Posted On :

ఆమె కాని ఆమె (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

ఆమె కాని ఆమె (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) -భూపాల్ మాసాయిపేట్ కుందేలులా దుంకుతూ ఆనందంతో ఆకాశాన్ని తాకేది. అందరూ ఆ అమ్మాయిని చూడు..ఎంత చక్కగా నడుస్తుందో అన్నారు. ఆమె తాబేలుగా మారి వయ్యారంగా నడిచింది. గాన కోకిలలా పాడుతూ ప్రపంచాన్ని మైమరిపించేది. అందరూ ఆ అమ్మాయిని చూడు..ఎంత చక్కగా మాట్లడుతుందో అన్నారు. ఆమె రామచిలుకగా మారి చిలక పలుకులు పలికింది. నెమలిలా ఆడుతూ తన బావాల కురి విప్పేది. అందరూ ఆ […]

Continue Reading
Posted On :

తొలి కవిత – అరవింద్ (డోగ్రీ కవిత, తెలుగు సేత: వారాల ఆనంద్ )

తొలి కవిత – అరవింద్ ( డోగ్రీ కవిత)                                                                         ఇంగ్లీషు అనువాదం: శివనాథ్ తెలుగు సేత: వారాల ఆనంద్ పొగమంచు ఆవరించిన ఓ సాయంకాలాన్ని గురించి […]

Continue Reading
Posted On :

మౌన సాక్షి (కవిత)

మౌన సాక్షి (కవిత) -వి.విజయకుమార్ ఎన్ని చేదు జ్ఞాపకాల మౌనసాక్షివి నీవు ఎన్ని సంతోషాల నిశ్శబ్ద మౌనివి నీవు నాలుగు దశాబ్దాల జీవితపు ఆనవాలు నువ్వు మాకు బతుకు నిచ్చిన జన్మవి నువ్వు నీడ నిచ్చిన జననివి నువ్వు మా సంతోషాల్నీ దుఃఖాల్నీ మాతో పాటూ పంచుకొని గుండెల్లో దాచుకున్న బంగారు తల్లివి నువ్వు రెక్కలొచ్చి ఎగిరిపోయాక మిగిలి ప్రిదిలిన పక్షి గూడులా బావురు మంటూ ఎంత హృదయ విదారకంగా ఉన్నావిప్పుడు ఒకనాడు నీ లోగిల్లో వెల్లి […]

Continue Reading
Posted On :

నిర్భయనై (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

నిర్భయనై (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) -ఎస్.కే.ఆముక్తమాల్యద స్వాప్నిక జగత్తులో విహరిస్తూన్న వేళ… ప్రకృతికి పరవశిస్తూ… కొండలు, లోయలు, వాగులు, వంకలు ఎన్నెన్నో దాటి కీకారణ్యంలోకి ప్రవేశించాను పులులు, సింహాలు, తోడేళ్లు, పాములు.. ఆప్యాయంగా..ఆర్ద్రంగా దయాపూరిత దృక్కులు ప్రసరిస్తూ. .. స్నేహ పరిమళాలు వెదజల్లుతూ.. వాటిని ఆఘ్రాణిస్తూ నేను.. కృూర మృగాల ప్రేమ జడిలో తడిసి ముద్దవుతూ నిర్భయనై హాయిగా సంచరించాను. సుషుప్తి నుంచి జాగృదావస్థలోకి రాక తప్పలేదు జనారణ్యంలోకి ప్రవేశింపకా తప్పలేదు. […]

Continue Reading
Posted On :

స్వీయ నిర్వచనం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

 స్వీయ నిర్వచనం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) -టి. రాజగోపాల్ గాయపరచి వికలం చేసిందెవరో జ్ఞాపకాల్లోంచి చెరిపేశాను చెయ్యందించి వదనాన చిరునవ్వులు మళ్ళీ పూయించిందెవరో స్మృతిలో పదిలం చేసుకున్నాను ప్రేమ , అనురక్తి , మాయనే మాయని స్ఫూర్తి , దూర దృష్టి , విసుగెరుగని పరిశ్రమలతో నెయ్యం వియ్యం కలుపుకుని అడుగులేస్తాను పరిపూర్ణంగా మనోనేత్ర దర్పణంలో నన్ను నేను దర్శించుకుంటాను బహిరంతర ఆహార్యాలు సరిదిద్దుకుంటాను నేనెవరో నాకు సందిగ్ధాలూ సంతాపాలూ లేకుండా […]

Continue Reading
Posted On :

ఆమెను పట్టించుకుందాం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

ఆమెను పట్టించుకుందాం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) -వెంకు సనాతని పొద్దుపొడవక మునుపే బడలికను విదిలించి నడక మొదలుపెడుతుంది పొద్దుపోయాక ఎప్పుడో ఆమె పరుగుకు విరామం దొరుకుతుంది టైము టంగుమనక ముందే టంచనుగా పనులన్నీ చక్కబెట్టడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య ఇంటి పనంతా ఆమెదే, బయట పనికి కుదిరినా కూడా… సూర్య చంద్రులకైనా అలుపుంటుంది కానీ, అవనికి అలంకారమైన ఆమెకు దైనందిత జీవన గమనంలో ఏ మలుపులోనూ అలుపుండదు ఇష్టాయిష్టాల్ని ఎరిగి […]

Continue Reading
Posted On :

ఒక ముద్దు -కైఫి ఆజ్మీ (తెలుగు సేత: వారాల ఆనంద్ )

 ఒక ముద్దు -కైఫి ఆజ్మీ తెలుగు సేత: వారాల ఆనంద్ ఈ అందమయిన కళ్ళను ముద్దు పెట్టుకున్నప్పుడల్లా చీకట్లో వంద కొవ్వొత్తులు వెలుగుతాయి పువ్వులూ మొగ్గలూ చంద్రుడూ తారలే కాదు వ్యతిరేకులూ ఆమె ముందు మోకరిల్లుతారు అజంతా చిత్రాలు నృత్యం చేయడం ఆరంభిస్తాయి సుదీర్ఘ నిశ్హబ్దంలో వున్న గుహలు పాటందుకుంటాయి దాహార్తి అయిన భూమ్మీద వర్షపు మబ్బులు గుమిగూడతాయి ఈ ప్రపంచం క్షణకాలం నేరాల్ని త్యజిస్తుంది క్షణకాలం రాళ్లూ చిరునవ్వు నవ్వడం మొదలుపెడతాయి ***** వారాల ఆనంద్, […]

Continue Reading
Posted On :

అసలు అర్థం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

అసలు అర్థం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) -సింగరాజు రమాదేవి విషాదమేమీ ఉదాత్తమైన భావన కాదు! దాన్ని అర్ధం చేసుకుని అధిగమించేందుకు చేసే ప్రయాసలోనే ఉంది ఉదాత్తత! పిరికితనం నేరమేమీ కాదు! భయపడుతూ అయినా చేసే తిరుగుబాటు ప్రయత్నంలోనే దాగి ఉంది ధీరత్వం! నిరంతరం ఒకరి నీడలో, బేలగా పరాధీనగా బ్రతికితే అంతా ప్రశాంతమే! జీవితపు ఉపరితలం పై అలవోకగా ఆనీ ఆనకుండా అడుగులేస్తుంటే అంతా నునుపే! గుండెలనిండా ఊపిరిపీల్చుకుని బలంగా కాలు […]

Continue Reading
Posted On :

కలంతో ఆమె నేను (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

కలంతో ఆమె నేను (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) -చిత్రాడ కిషోర్ కుమార్ ఆమె… నేను… ఎలా ఉంటామో మాకే తెలియదు కానీ ఆమె నన్ను చూస్తుంది నేను కూడా ఆమెను చూస్తూనే ఉంటాను చెట్లు చిగురిస్తున్నట్లు మాస్నేహమూ కొత్త చిగురు తొడుగుతూనే ఉంది కాలంతో మేమూ పరిగెడుతూనే ఉన్నాం ఒకానొక కాలంలో ఉత్తరాలలో కలుసుకునే వాళ్ళం కబుర్లు కలబోసుకునే వాళ్ళం బాధలు, బాధ్యతలు, వేడుకలూ అన్నిమాటలూ మారాతల్లోనే…. అయినా ఎన్నో తీపి […]

Continue Reading
Posted On :

ఆమె (కవిత)

ఆమె -గిరి ప్రసాద్ చెలమల్లు ఆమెకి ఓ సాంత్వన నివ్వు చేతనైతే ఆమె మౌనంలో ఎన్ని ఘోషలు దాగివున్నాయో వెతికే ప్రయత్నం చేసావా?! ఆమె గుండె దిటవు కావటం వెనుక ఎన్ని అగ్ని పర్వతాలు బద్దలయ్యాయో ఏనాడైనా గాంచావా! ఆమె చేయని నేరానికి ఆమెను పొడుచుకు తింటానికి కథంతా కాకపోయినా కాస్తంతైనా తెలియకుండానే ఒంటికాలిపై ఎగిరే ఎందరో తామేంటో తెలుసుకునే ప్రయత్నం చేసారా! ప్రేమ అనే రెండక్షరాల పదం పుట్టుక మర్మం ఎరుగక ముందు ఆమె మోములో […]

Continue Reading
Posted On :

ఏమి జంతువది (అస్సామీ మూలం & ఆంగ్లానువాదం – నీలిమ్ కుమార్, తెలుగు సేత: వారాల ఆనంద్ )

ఏమి జంతువది అస్సామీ మూలం & ఆంగ్లానువాదం: నీలిమ్ కుమార్ తెలుగు సేత: వారాల ఆనంద్ ఏమి జంతువది దాని ఆకలి ఎంతకూ తీరదు అసలే తృప్తి చెందదు దాని పొట్ట పరిమాణాన్ని అదే కొలవలేకున్నది ఎంత ఆహారం కావాల్నో దానికే తెలవదు ఆ సర్వభక్షకుడి పేరేమిటి భూమి ఇండ్లు వంతెనలు చెరువులు కుంటలు చెట్లు నదుల రెండు తీరాలు అది వేటినీ వదల్లేదు ఎంతకూ తృప్తి చెందని ఆకలితో వున్న ఆ జంతువేమీటది ఎల్లవేళలా ఆకలితోనే […]

Continue Reading
Posted On :

బతుకమ్మ పద్యాలు

బతుకమ్మ పద్యాలు -సముద్రాల శ్రీదేవి సృష్టిలోన పూలు స్త్రీ జాతిరూపము ప్రకృతి మాతగాను బ్రతుకునిచ్చు తల్లిగ బ్రతుకమ్మ తా తెలంగాణలో దివ్యమైన బాట దేవిమాట తీరుతీరు పూలు గౌరమ్మగను నవ రాత్రులందు మారి చిత్రముగను నీకు సాటిలేరు నేడు మా బ్రతుకమ్మ దివ్యమైన బాట దేవిమాట సంబురాలు జేస్తునంబరమ్ముగ మార్చి నారిగణము నాడు దీరులైరి న్యాయస్థాపనంబు నవ్విడె బ్రతుకమ్మ దివ్యమైన బాట దేవిమాట ఊరువాడయాటలుయ్యాల పాటలు నూరెగుబ్రతుకమ్మలుత్సవముగ వనములోన మనము జనజాతర గణము దివ్యమైన బాట దేవిమాట […]

Continue Reading
Posted On :

వృద్ధుడు (ఆంగ్ల మూలం : మోహన్ కుమార్, తెలుగు సేత: వారాల ఆనంద్ )

వృద్ధుడు ఆంగ్ల మూలం : మోహన్ కుమార్ తెలుగు సేత:వారాల ఆనంద్ అర్థరాత్రి  టేబుల్ ల్యాంప్ వెలుగులో చదువుకుంటున్న  వృద్ధుడితో  ఓ యువతి అంది  “ తాతయ్యా! నీ ఆరోగ్యం సున్నితమయింది  నీ కంటి చూపు మందగించింది  ఇప్పటికే అర్థరాత్రి అయింది నువ్విక పడుకోవాలి”   వృద్ధుడు తాను చదువుతున్న పుస్తకాన్ని మూసేసి  ఫ్రేం లేని కళ్ళద్దాల్ని తీసేసి నవ్వుతూ అన్నాడు  “ ఓ పక్క తనను చంపడానికి  విషం తయారవుతూ వుంటే  సోక్రటీసు  ఏమి చేస్తున్నాడో […]

Continue Reading
Posted On :

నిన్నటి సుమాన్ని నేను! (YESTERDAY’S FLOWER ఆంగ్ల గీతానికి అనువాదం)

నిన్నటి సుమాన్ని నేను! (YESTERDAY’S FLOWER ఆంగ్ల గీతానికి అనువాదం) -వి.విజయకుమార్ నిన్నటి సుమాన్ని నేను మ్రోవితో కడపటి తుషారాన్ని గ్రోలి వేచివున్నాను పుష్పలావికలు నా మృత్యు గీతాన్నాలపించడానికి రానే వచ్చారు కడపటి హేమంత తుషారపు మృత్యు నీడ పరచుకుంది చల్లగా శరత్ చంద్రుడి వీక్షణం దోబూచులాడుతోంది మెల్ల మెల్లగా నిన్నటి సుమసౌరభాలింకా నాలో సజీవంగా రేపటి సుగంధాలకది అవస్యమై ఉండగా నా మరణ గీతిక పల్లవిని పాడుకుంటూ విచ్చేసిన విరికన్నియలు ఇంకా ఆగమించే మగువలకోసం స్వాగత […]

Continue Reading
Posted On :

విముక్తి

విముక్తి -ఇందు చంద్రన్ మబ్బులు మోసుకెళ్తున్నాయి. చుక్కలు పట్టుకునేలోపే తాకి వెళ్లిపోతున్నాయి. నాకంటూ ఏదీ లేదిక్కడ ! నా స్వార్థ కుబుసం కిందనే విడిచిపెట్టొచ్చేసినట్టున్నా. కింద ఒక్కప్పుడు నాకంటూ సృష్టించిన దార్లో ఇప్పుడు ఎందరో తిరుగుతున్నారు. నాకోసం కట్టుకున్న గూట్లో ఎవరో తెలియని వాళ్లుంటున్నారు. నే పోరాడి పోట్లాడి సాధించినవన్నీ వేరొకరు వాడేసుకుంటున్నారు. ఎవరూ నన్ను గుర్తు చేసుకోవట్లేదు. వాళ్ళతో నా జ్ఞాపకాలన్నీ చెరిగిపోయినట్టున్నాయి. నా సమాధి ఉండాల్సిన చోట బిల్డింగ్ మొలుచుకొచ్చినట్టుంది. నా ఆనవాళ్లేవి లేవిప్పుడు […]

Continue Reading
Posted On :

స్త్రీ (మరాఠీ మూలం : హీరా బన్సోడే, తెలుగు సేత: వారాల ఆనంద్ )

స్త్రీ మరాఠీ మూలం : హీరా బన్సోడే తెలుగు సేత:వారాల ఆనంద్ నేను నదిని అతను సముద్రం అతనితో నేనన్నాను నా జీవితమంతా నీ కోసం నీ వైపు ప్రవహిస్తూ నీలో కరిగిపోతున్నాను చివరాఖరికి నేను సముద్రాన్నయి పోయా ఒక స్త్రీ ఇచ్చే బహుమతి ఆకాశం కంటే పెద్దది కానీ నువ్వేమో నిన్ను నువ్వు ప్రస్తుతించుకుంటూనే వున్నావు నదివి కావాలని నాలో కలిసిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు ఆలోచించలేదు ***** వారాల ఆనంద్, కవి, రచయిత, అనువాదకుడు, సినీ […]

Continue Reading
Posted On :

ఊపిరి పోరాటం (కవిత)

ఊపిరి పోరాటం (కవిత) – శ్రీ సాహితి దేశం భరించలేని బాధ ఓ కన్నీటిచుక్క రూపంలో ఆమెని మింగేసింది. చీకటి కాపలా కాసిన నరకానికి సిగ్గుపడ్డ పగలు నిజాలకు చిక్కి శల్యమైనది. మంచం పట్టిన నమ్మకం మరణశయ్యపై చేరి దేశాన్ని ఓ మాట అడిగింది.. ఆడపిల్ల “ఊపిరి పోరాటం” చేయాలా? అని. సిగ్గుతో దేశం చచ్చిపోయింది ***** మా ఊరు అద్దంకి, ప్రకాశం జిల్లా, (ఆంధ్రప్రదేశ్.) నేను ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీ లో బి.ఫార్మసీ చదువుతున్నాను.నాకు చిన్నప్పటి […]

Continue Reading
Posted On :

సూర్యుడు (అస్సామీ మూలం : నిర్మల్ ప్రభా బొర్దోలోయ్, తెలుగు సేత: వారాల ఆనంద్ )

సూర్యుడు అస్సామీ మూలం : నిర్మల్ ప్రభా బొర్దోలోయ్ తెలుగు సేత:వారాల ఆనంద్ సూర్యుడు ఉదయిస్తే తుపాకుల మోతతో ఉదయిస్తాడా లేదు లేదు సూర్యుడు ఉదయిస్తే రాత్రి చీకట్లోంచి మంద్రంగా ఏడ్చే పక్షి గొంతులోంచి ఉదయిస్తాడు ***** వారాల ఆనంద్, కవి, రచయిత, అనువాదకుడు, సినీ విమర్శకుడు. డాక్యుమెంటరీ ఫిలిం మేకర్. నాలుగు దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో పని చేసారు. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవలల్లో జ్యూరీగా వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డు […]

Continue Reading
Posted On :

కాశీలో శవాలు (మగధ్ మూలం : ఇంగ్లీష్ అనువాదం : శ్రీకాంత్ వర్మ )

కాశీలో శవాలు మగధ్ మూలం : ఇంగ్లీష్ అనువాదం : శ్రీకాంత్ వర్మ తెలుగు సేత:వారాల ఆనంద్ కాశీ చూసావా అక్కడ శవాలు వస్తూ వుంటాయి పోతూ వుంటాయి శవాలదేముంది శవాలు వస్తాయి పోతాయి అయితే ఈ శవం ఎవరిదని అడగనా రోహితాస్వునిదా? కాదు కాదు అన్నీ రోహితస్వునివి కావు అతని శవాన్ని దూరం నుంచే గుర్తించొచ్చు దూరం నుంచి కాకపోయినా దగ్గరి నుంచయినా గుర్తించొచ్చు ఒకవేళ దగ్గరి నుంచీ గుర్తించకపోతే అది రోహితస్వునిది కాదు మరి […]

Continue Reading
Posted On :

ది బిచ్ (అమ్మ తల్లి)

ది బిచ్ (అమ్మ తల్లి) -వి.విజయకుమార్ నాకు ముందే తెలుసు నువ్వీ వీధిలో నెలలు నిండి భారంగా తిరుగుతున్నప్పడే యేదో ఒక రోజు గంపెడు బిడ్డలతో ప్రత్యక్షమౌతావనీ ముత్యాల్లాంటి పసిబిడ్డల్ని వేసుకుని దీనంగా చూస్తూ నా అశక్తతను ప్రశ్నిస్తావని! కడుపు నిండా పాలు తాగి వళ్ళో ఈ బుజ్జిగాడు గోముగా గీరుతూ వెచ్చని పరుపు మీద గుర్రుగా చూస్తూ ఈ దేశపు దొరబాబులా వెచ్చగా ఇక్కడ! నెల కూడా నిండని నీ పసికూనలు వర్షపు చినుకుల్లో ముద్దయి […]

Continue Reading
Posted On :

స్మృతి లేఖనం (బెంగాలీ మూలం, ఇంగ్లీష్ : సయ్యద్ శంశూల్ హక్, తెలుగు సేత: వారాల ఆనంద్ )

స్మృతి లేఖనం బెంగాలీ మూలం, ఇంగ్లీష్ : సయ్యద్ శంశూల్ హక్ తెలుగు సేత:వారాల ఆనంద్ నేనెవరో తెలియాల్సిన అవసరం లేదు నేను గుర్తుండాల్సిన అవసరమేముంది నన్నెందుకు జ్ఞాపకం చేసుకోవాలి దానికి బదులు నా పెట్టుడు పళ్ళని సాయంత్రపు సినిమాని నా ఉమ్మనీటిని గుర్తుంచుకోండి నీను వచ్చాను, చూశాను కానీ ఏ దిష్టి బొమ్మ విప్లవంలోనూ గెలవలేకపోయాను ఓ యాత్రికుడా నువ్వొకవేళ బంగ్లాదేశ్ లో పుట్టి వుంటే నా లోతయిన ఆవేదనని ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతావు ***** […]

Continue Reading
Posted On :

ఆమె ఒక ప్రవాహం (కవిత)

ఆమె ఒక ప్రవాహం -గవిడి శ్రీనివాస్ నీవు నా ప్రపంచంలోకి ఎప్పుడు సన్న సన్నగా అడుగులు వేశావో తెలీదు కానీ ఒక వెన్నెల వచ్చి తట్టినట్టు ఒక వేకువ లేపి మనసిచ్చినట్టు ఒక పూల తోట అత్తరు వాసనలు నింపినట్టు నా చుట్టూ తీయని పరిమళం నింపావు. నాపై నీ కలల పిట్టలు వాలేవి నాలో ఆరాధన వెలిగేది. నడిచిన దూరాలు ఎక్కిన కొండలు గుండె లోతుల్లోంచి తడిచేసిన దృశ్యాలు కళ్ళను తడుపుతూ అలా కుదుపుతూ ఉండేవి. […]

Continue Reading
Posted On :

గూడు కట్టిన గుండె (కవిత)

గూడు కట్టిన గుండె -బసు పోతన గూడు కట్టిన గుండెను గుట్టు విప్పమని అడిగితే బిక్కుబిక్కు మంటూ చూసింది గుట్టు చప్పుడు కాకుండా దిక్కుమాలినదానిలాకూర్చున్న మనసు చివుక్కుమన్న శబ్దానికి కూడా ఉలిక్కిపడింది. మనసు మనసెరిగిన కళ్ళు రెప్పలతో రహస్యంగా మాటాడి ఓదార్చేందుకు కన్నీటి బొట్టును పంపితే రెప్ప జారిన నీటి బొట్టు పగిలిన మనసులా నేలను తాకి వేల ముక్కలైంది ప్రతి రోజూ పగిలే ముక్కల్ని ఒక్కటిగా చేర్చి అతికించడమే రోజుటి బతుకులో భాగమైంది చితికే మనసుతో […]

Continue Reading
Posted On :

సరిహద్దు సాక్షిగా (కవిత)

సరిహద్దు సాక్షిగా -డా.కె.గీత విరగకాసిన ద్రాక్షతోట సాక్షిగా ‘సరిహద్దు ప్రేమకు అడ్డంకా?’ అని అతను గుసగుసలాడినప్పుడు గుండె గజగజా కొట్టుకున్నా అతని మీద ప్రేమ ఎఱ్ఱసముద్రాన్ని దాటింది మా ప్రేమమాధుర్యమంతా నింపుకున్న పవిత్రభూమి ఇది- ఇందులో దేశాలు ఎన్నో మాకు లెక్క లేదు పరమత సహనం నించి పుట్టిన ప్రేమతో ఏకమైన బంధం ఇది- ఇందులో దేశాల పాత్ర లేనే లేదు ఆ పొద్దు సరిహద్దులో అతని దేశపు వాళ్ళని ఎత్తుకొచ్చేవరకు అతని దేశం నా దేశం […]

Continue Reading
Posted On :

ఉయ్యాల్లో టెర్రరిస్ట్

ఉయ్యాల్లో టెర్రరిస్ట్ -వి.విజయకుమార్ ష్…పారా హుషార్ వీడు మామూలోడు కాడు పనిపిల్ల బుగ్గ కొరికిన కీచకుడు పక్కింటి పిల్ల కొంగు లాగిన దుశ్శాసనుడు తాత మొహాన్నే ఫెడీల్ మని తన్నిన కర్కోటకుడు! సాధించుకోవడం ఎలానో ఎరిగిన కిమ్ వాడు లేస్తూనే జాకీ చానై కిక్ బాక్సింగ్ మొదలెడతాడు చిట్టి రాముడై శరాలు సంధిస్తూ యుద్ధానికి సిద్ధమంటాడు ఎడం కాలితో భూగోళాన్నీ కుడికాలితో చందురుడ్ని అలవోకగా తంతూ వళ్ళు విరుచుకుంటాడు మోనార్క్ నంటూ విర్ర వీగుతాడు బజ్జున్నప్పుడే వీడు […]

Continue Reading
Posted On :

ఉప్పు (బెంగాలీ మూలం, ఇంగ్లీష్ : సుబోధ్ సర్కార్, తెలుగు సేత: వారాల ఆనంద్ )

ఉప్పు బెంగాలీ మూలం, ఇంగ్లీష్ : సుబోధ్ సర్కార్ తెలుగు సేత:వారాల ఆనంద్ ఉప్పూ దుఃఖం ఇద్దరూ అక్కాచెల్లెళ్ళు వాళ్ళు లేకుండా వున్న సంతోషం సంతోషమే కాదు వ్యాకులత నా కుమార్తె ఆమె నా రక్తనాళాల్లోని విషాన్ని శుభ్రం చేస్తుంది అదృష్టవంతులయిన కవులు మానవ చరిత్ర నుండి మురికిని కడిగేస్తారు మనమంతా అంతరించి పోవడానికి ముందు చట్టపరంగా ‘ప్రేమ’ సంతోషానికి పరాయిదే ***** వారాల ఆనంద్, కవి, రచయిత, అనువాదకుడు, సినీ విమర్శకుడు. డాక్యుమెంటరీ ఫిలిం మేకర్. […]

Continue Reading
Posted On :

అమ్మ (అమెరికన్ రచయిత్రి గ్వాన్డలిన్ బ్రూక్స్ రాసిన “మదర్” ఆంగ్ల కవితకు అనువాదం)

అమ్మ (అమెరికన్ రచయిత్రి గ్వాన్డలిన్ బ్రూక్స్ రాసిన “మదర్” ఆంగ్ల కవితకు అనువాదం) -వి.విజయకుమార్ గర్భస్రావాలు నిన్ను మరవనివ్వవు చేతికందినట్లే అంది, చేజారిన బిడ్డల జ్ఞాపకాల తలపులు మరపురానివ్వవు, పిసరంతో, అసలెంతో లేని జుత్తుతో తడియారని మాంసపు ముద్దలవి, గాయకులో, శ్రామికులో ఎప్పటికీ శ్వాసించని వారు. నువ్వెప్పటికీ దండించలేని వాళ్ళు, అలక్ష్యం చెయ్యని వాళ్ళు మిఠాయిలిచ్చి ఊరుకోబెట్టనూ లేవు. చీకే వారి బొటనివేలి చుట్టూ ఎప్పటికీ ఒక పట్టీని కూడా చుట్టలేవు వొచ్చే దయ్యాల్ని తరిమేయనూ లేవు. […]

Continue Reading
Posted On :

చీకటి (నేపాలీ మూలం, ఇంగ్లీష్ : బిమల్ నీవ, తెలుగు సేత: వారాల ఆనంద్ )

చీకటి నేపాలీ మూలం, ఇంగ్లీష్ : బిమల్ నీవ తెలుగు సేత:వారాల ఆనంద్ రాత్రి చీకట్లో ఏమయినా జరగొచ్చు పగులుపట్టిన రోడ్డులోంచి ఎగిరిపడ్డ పోట్రాయి కాలికి తగలొచ్చు అంతేకాదు ప్రాణం లేని శిలావిగ్రహాలతో ఢీ కొట్టొచ్చు లేదా భూమ్మీదో వాకిట్లోనో పడిపోవచ్చు తోవదప్పి మురికి కాలువలో పడిపోవచ్చు రోడ్డుపైకి చొచ్చుకొచ్చిన ఏ బంగ్లానో దేవాలయాన్నో దారితప్పి గుద్దుకోవచ్చు, గాయాలపాలు కావచ్చు చీకట్లో ఏమీ కనిపించదు కళ్ళు వున్నా వృధా చీకట్లో ఎలాంటి రక్షణా లేదు చీకట్లో దాక్కొని […]

Continue Reading
Posted On :

ఋణం తీరేలా (కవిత)

ఋణం తీరేలా -చందలూరి నారాయణరావు కాస్త చూడు కళ్ళను తలుపు తట్టి లోపలికి.. రోజూ కలలో నీ గొంతు గుర్తులే నీ చూపు స్పర్శలే… ఎక్కడికి వెళ్ళినా ఏ దూరంలో ఉన్నా రాత్రి ఒడికి చేరక తప్పదు ఏదో కల చిటికిన వ్రేలితో వేకువ దాకా నీతోనేగా మనసు కలవరింత ఒక్కో కవిత రూపంలో ఋణం తీరేలా ***** పుట్టినది: ప్రకాశం జిల్లా జె. పంగులూరు. వృత్తి: హైస్కూల్ఉపాధ్యాయులు ప్రవృత్తి: వచన కవిత్వం రచనలు: మనం కాసేపు […]

Continue Reading
Posted On :

సంఘర్షణ లోంచి (కవిత)

సంఘర్షణ లోంచి -గవిడి శ్రీనివాస్ కోర్కెలు ఎక్కిపెట్టే బాణాలు ఎడారి జీవిత ప్రయాణానికి కొలువులౌతాయి. ఇవి ఎప్పటికీ తడి తడిగా ఆనందాల్ని విరబూయలేవు. మనకు మనమే ఇనుప కంచెలు వేసుకుని అసంతృప్తి తీరాలని వెంబడిస్తున్నాం. ప్రకృతి జీవి కదా స్వేఛ్చా విహంగాల పై కలలను అద్దుకుని బతికేది. ఎన్ని రెక్కలు కట్టుకు ఎగిరినా బాధను శ్వాసిస్తే ఏ కాలం ఏం చెబుతుంది. ప్రశ్నించు సమాధానం మొలకెత్తించు లోలోపల అగ్ని గోళాలని రగిలించు. ఎప్పుడు గొంతు విప్పాలో ఎప్పుడు […]

Continue Reading
Posted On :

చూపు కవాతు (కవిత)

చూపు కవాతు (కవిత) – శ్రీ సాహితి భయం ప్రేమించినిద్ర గుచ్చుకుని రాత్రికి గాయమైపగటి పెదవుల పైకాలపు నల్లని నడకలకు ఇష్టం చిట్లి బొట్లు బొట్లుగాముఖంలో ఇంకితడిసిన కళ్ళకు పారిన బాధకు ఎండిన కలతో వాడిన నిజంఓడిన మనసుతో ఒరిగిన అలోచనపాత రోజుల వాకిట ఆశకు వ్రేలాడుతూ గతం ముందడగేసిజారిన నిజాలును జాలితో చేతికందిస్తేగడ్డకట్టి కరుడుకట్టిన కోరికల్లోఒక్క కోరికలో కదలికొచ్చినా మనసు చిగుర్లు వేసిజ్ఞాపకాల తేమనరోజూ రోజును గుచ్చి గుచ్చినీ ఆనవాళ్ళు కోసంచూపు కవాతు చేస్తూనే ఉంటుంది.. […]

Continue Reading
Posted On :

అమ్మ మాట— (కవిత)

అమ్మ మాట -లక్ష్మీ శ్రీనివాస్ నాలుగు గోడల మధ్య నుంచినలుగురి మధ్యలో నిలవాలన్ననలుగురిలో గెలవాలన్ననలుగురిని గెలిపించాలన్నానాలుగు అక్షరాలు నేర్చుకోవాలని  చెబుతూ ఉండేది అమ్మ!! నాలుగు అడుగులు వేయాలన్ననాలుగు రాళ్ళు పోగేయలన్ననలుగురిని సంపాదించు కోవలన్ననలుగురికి సాయం చేయాలన్న నాలుగు అక్షరాలు నేర్చు కోవాలనిచెబుతూ ఉండేది అమ్మ!! గుడి తలుపులు బడి తలుపులుఎప్పుడు ఎదురుచూస్తుంటాయినీ ఎదుగుదలకు తోడ్పడుతుంటాయిగుడి బడి తల్లి తండ్రులు లాంటి వాళ్ళనిమంచి కథలతో ఎన్నే నీతులు బోధిస్తూఎప్పుడు హితాన్ని మరవకూడదనిసత్ మార్గంలో పయనించాలనిపరుల ఘోషకు కారణం కాకూడదనిచెబుతూ ఉండేది అమ్మ!! గెలుపు ఓటములనుస్వేచ్చగా స్వీకరించమంటుఎదురయ్యే […]

Continue Reading
Posted On :

మట్టి ప్రేమ (కవిత)

మట్టి ప్రేమ -గవిడి శ్రీనివాస్ కాసింత కాలం వెళ్ళిపోయాకగుండెలో దిగులు తన్నుకొస్తుంది. జ్ఞాపకాలు పిలుస్తున్నట్లుఊరిపొలిమేర పలవరిస్తున్నట్లుఇంకా సమయమౌతున్నట్లుగూటికి చేరుకోమనే సందేశంవంత పాడినట్లుమనస్సంతా భారంగా ఉంటుంది. కళ్ళలో పొలాలుకన్నీళ్ళలో అనుభవాలుఅనుబంధాలు దొర్లిఇప్పుడున్న చోట నిల్చోనీయవు. పక్షులు ఎంత దూరం కదిలినాగూటిని మరవనట్లుచూపులు ఇంటివైపేదుముకుతుంటాయి. ఉద్దేశం విశ్వమానవుడిగానేఅయినాకాలం పొరలు కదిలిన కొద్దీనా మట్టి వేళ్ళు లాగుతుంటాయి.నా మట్టి ప్రేమనా మూలాలికి  చేర్చుతుంది.ఇప్పుడు కుదురుగా ఉండలేనునా మట్టి పై అలా వాలేవరకూ. ***** గవిడి శ్రీనివాస్  ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు.  సెయింట్ ఆన్స్ […]

Continue Reading
Posted On :

అనఘతల్లి (కవిత)

అనఘతల్లి -శింగరాజు శ్రీనివాసరావు ప్రభానుడు తన ప్రతాపాన్ని ప్రజ్వలింప చేస్తున్నాడు రోహిణి వచ్చిందేమో రోళ్ళు పగిలేటంత భగభగలు సగం కాళ్ళు మాత్రమే కప్పుతున్న పాదరక్షలు వడివడిగా అడుగులు వేస్తూ కదిలి పోతున్నాయి నడినెత్తి మీద మెడలు విరిగేటంతటి భారం మోయకపోతే పొయ్యిలో పిల్లి లేవదు మరి చేతులు మాత్రం ఖాళీగా ఉన్నాయనుకోవడానికి లేదు నవమాసాల భారం నేలను తాకి చంకకు చేరింది బుడి బుడి అడుగులు మరో చేతికి అలంకారమాయె కొంగు చుట్టూచేరి చేతనున్న వాడికి గొడుగైతే […]

Continue Reading
Posted On :

నా నీడ తప్ప (కవిత)

నా నీడ తప్ప -హేమావతి బొబ్బు నా నీడ తప్ప నేను నాకు కనిపించడం లేదు నా లోన ఏదో  సందిగ్ధత అది పెరిగి పెద్దదై చివురు నుండి మ్రానుగా తుఫానుగా మారుతుంటే తుమ్మెదల ఝూంఝూంకారం నాథoగా నాథా కారంగా లోకాన్నంతా అలుముతుంటే విషాదమో ఆనందమో విశదీకరించలేని స్థితి ఛిటికేనవ్రేలుని పట్టుకొన్న చిన్నారి కన్నులలోకి  జారుతున్న కన్నీళ్ళు ఏదో తరుముకొస్తున్నట్లు అంతా వేగంగా కదలిపోతుంటే, ……..ఇక్కడే ఒక్క క్షణం స్తబ్దంగా మిగిలిపోవాలని మారే కాలాన్ని గుప్పెటన బంధించి నీ కౌగిలిలో నిశ్శబ్దముగా ఒదిగి పోవాలని నీ దాహాన్ని తీర్చే నీటి బొట్టునై నీ హృదయాన్ని చేరాలని ……. ***** నేను హేమావతి బొబ్బు తిరుపతి వాసిని, ప్రాధమిక విద్య తిరుమల శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో, ఉన్నత విద్య శ్రీ పద్మావతి మహిళా కళాశాల  తిరుపతి లో జరిగింది. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం […]

Continue Reading
Posted On :
gavidi srinivas

సంపూర్ణం…! (కవిత)

సంపూర్ణం…! -గవిడి శ్రీనివాస్ దాహాలు అసంపూర్ణంగానే ఆరంభమౌతాయి. ఆలోచనల సంఘర్షణలోంచి ఒక దారి తళుక్కున మెరుస్తుంది. ఒక లక్ష్యం నిద్రలేని క్షణాల్ని వేలాడదీస్తుంది. జీవితం ఒక్కో పాదముద్రను చెక్కుతూ నిరాడంబరంగా విజయానికో చిరునవ్వు విసురుకుంటూ ముందుకు పోతుంది. ప్రతి క్షణమూ తిరిగిరానిదే. ఇక్కడ ఛేదించాల్సినవి చేయాల్సినవి కొన్ని వుంటాయి. అలా అలా సంతోషాల్ని లిఖిస్తూ కాస్త ముందుకు జరగాలి. అసంపూర్ణం నుంచి సంపూర్ణానికి ఒక్కో అడుగు తొడుగుతూ ఒక్కో మైలురాయి లో చిహ్నాల్ని కొన్ని తీపి గురుతులు […]

Continue Reading
Posted On :
gavidi srinivas

గాయం పాడిన గేయం (కవిత)

గాయం పాడిన గేయం -గవిడి శ్రీనివాస్ ఉండుండీ ఒక్కసారీ దుఃఖ దొంతరల్లోకి జారిపోతాను. ఎప్పటికప్పుడు వ్యూహాలు పదును పెట్టడం కన్నీటిని చెక్కడం సుఖమయ ప్రయాణాలుగా మల్చడం. లోతుగా జీవితాన్ని తరచిచూడటం తడిమి చూడటం ఒక లక్ష్యం వైపు దూసుకు పోవటం నిరంతర శ్రమలోంచి దారుల్ని వెలిగించటం తృప్తిని ఆస్వాదిస్తూ అలా అడుగులు సాగుతుంటాయి . నిద్రలేని రాత్రుల్ని గాయం పాడిన గేయం ఓదార్చుతుంది . మౌన ప్రపంచంలోంచి లేచి భావాలు భాషిల్లుతుంటాయి . ఇక్కడ విషాదమేమిటంటే పరిగెత్తేవేగానికి […]

Continue Reading
Posted On :
T. Hima Bindu

ఆశయాల సాధనలో నిశ్శబ్ద రేయి (కవిత)

ఆశయాల సాధనలో నిశ్శబ్ద రేయి -డా. టి. హిమ బిందు జాబిల్లి చెంత వెన్నెల రేయి చల్లనిదే.. నిదుర ఒడిలో జోల పాడే రేయి మధురమైనదే ఒంటరి మనసులకు నిదానంగా నడుస్తూ రేయి మెల్లనిదే ఒంటరి ప్రయాణంలో గుబులు పుట్టిస్తూ సాగిపోయే రేయి భయానకమైనదే అస్వస్థతలో తోడు దొరకని రేయి నరకప్రాయమైనదే ఆశయాల సాకారంలో సహకరించే రేయి నిశ్శబ్ద మైనదే… కోప తాపాల నడుమ కొట్టుమిట్టాడుతున్న రేయి మౌనమైనదే… ప్రేమ తోడులో ఊసులాడు రేయి ఆనంద నిలయమే…. ఎన్ని రేయిలయినా ప్రతి రేయి ప్రత్యేకమే.. ప్రతి ఉదయం కొత్త ఆశల ఉషోదయమే…. ***** రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నాను. స్వస్థలం భద్రాచలం. 2005 సం. లో కాకతీయ యూనివర్సిటీ , వరంగల్ లో పర్యావరణ శాస్త్రంలో నీటి కాలుష్యం పై పీ. హెచ్. డి. పూర్తయింది. పర్యావరణంపై […]

Continue Reading
Posted On :
Komuravelli Anjaiah

వెంటాడే కల (కవిత)

వెంటాడే కల -కొమురవెల్లి అంజయ్య వెంటాడే కల ప్రశ్నిస్తుంది చేతగానితనాన్ని నిలదీస్తుంది సోమరిపోతు వైఖరిని మొండి బారకుండా, తుప్పు పట్టకుండా ఎప్పటికప్పుడు నూరుతుంది కొత్తగా దారిలో నుంచి పక్కకు జరుగకుండా చూస్తుంది కలలెన్నో ముల్లె కట్టుకొని ఉంటాయి అన్నీ కుమ్మరిస్తాం, ఏరుతాం నచ్చినవి కొన్ని చొక్కాజేబులో దాచుకుంటాం గుండెకు దగ్గరగా విత్తనం ఏదైనా కనిపిస్తే భూమిలో నాటి నీళ్ళు పోసి పెంచుతాం రాళ్ళల్లో రత్నాన్ని మెడలో ధరిస్తాం వెంటాడే కల సాకారం కోసం నా చెమటతో నా […]

Continue Reading
Posted On :

ఆ చిరునవ్వు ఆగిపోయింది (కవిత)

ఆ చిరునవ్వు ఆగిపోయింది -పారుపల్లి అజయ్ కుమార్ మనిషి ఎంత ఎత్తు ఎదిగి  ఏం లాభం ? మనసులో మాలిన్యాన్ని నింపుకొని ……. ఎంత చదువు చదివి ఏం ప్రయోజనం ? సంస్కారం అన్నది లేకపోయాక …… కత్తితో పొడిస్తేనో, తుపాకీతో కాలిస్తేనో హత్యా ? మాటలను తూటాలుగా పేల్చి మనసును శకలాలుగా చేయటం హత్య కాదా? ఎన్నో గుండెలపై స్టెతస్కోప్ ను పెట్టి హృదయ స్పందనలను విని ప్రతిస్పందించే గుండెలో హేళనగా, అసహ్యకరమైన రాతల గునపాలు […]

Continue Reading
Posted On :
gavidi srinivas

పల్లె పిలుస్తోంది…! (కవిత)

పల్లె పిలుస్తోంది…! -గవిడి శ్రీనివాస్ చిగురుటాకుల్లో  వెన్నెల చూపుల్లో తడిసిలేలేత గాలులతో మురిసి పల్లె నిండుగా పులకరిస్తోంది. చిన్ని సరదాల్ని సూర్య కిరణాల్ని వొంపుతూముఖం లోంచి ఆనందాలు ఉదయిస్తున్నాయి. ఆరుబయట అట్లానేచిరు నవ్వులు వేచివున్నాయి. పల్లెతనం అమ్మతనం ఎంచక్కాఆప్యాయంగా నిమురుతున్నాయి. వేసవి అయితే చాలుపిల్లలు పల్లెకు రెక్కలు కట్టుకునిఎగురుతున్నారు. మామిడి చెట్ల నీడలోజీడి చెట్ల కొమ్మల్లోఅడుగులు వడివడిగామురిసి పోతున్నాయి. మట్టి పరిమళాల్ని అద్దుకునిమంచు బిందువుల్ని పూసుకునిఎగిరే పక్షుల వెంటఆనందాలు సాగిపోతున్నాయి. కరిగిపోతున్న కలల్ని ఎత్తుకునినా పల్లెలో వాలిపోతాను. దోసిళ్ళలో చిరు నవ్వుల్నివెలిగించుకునిఅలసిన క్షణాల నుంచీఅలా సేదదీరుతుంటాను. ***** గవిడి శ్రీనివాస్  […]

Continue Reading
Posted On :

మధ్య తరగతి మకరందం (కవిత)

మధ్య తరగతి మకరందం -ఎజ్జు మల్లయ్య అమ్మ నేర్పిన తొలి పలుకుల నుంచి అమ్మ ఒడిలో పడుకున్న వెచ్చని నిద్ర నుంచి అమ్మ మోసిన కట్టెల మోపు నుంచి పాత బట్టలకు కుట్టేసిన సూది దారం నుంచి అమ్మ చేసే పరమాన్నం తిన్న పరమానందం నుంచి నాన్న వాడిన ఉల్లి-బాడిష నుంచి నాన్న చెక్కిన పళుగొర్రు నుంచి నాన్న దున్నిన గుంటిక వరుసల్లోంచి నాన్న పేర్చిన బండి పల్గడి దబ్బల నుంచి నాన్న అల్లిన పుల్జరితట్ట నుంచి […]

Continue Reading
Posted On :

మర్చిపోతున్నారు (కవిత)

మర్చిపోతున్నారు -లక్ష్మీ శ్రీనివాస్   అమ్మ పాలు వదిలిఅమ్మకం పాలు రుచి చూచినప్పుడేఅమ్మ భాషను మరిచి ..అమ్మకం భాషకు బానిస అయ్యారు!స్వేచ్ఛగా తెలుగు భాషనుమాట్లాడడానికి మొహం చాటేసుకుంటూ పరాయి భాషను బ్రతికిస్తూగొప్పగా బ్రతుకుతున్నామనిఅనుకొంటున్నారు కానిబ్రతుకంతా బానిసేనని మర్చి పోయారు !! నేడు పరాయి భాష కోసంప్రాకులాడుతున్న వాళ్లంతావిదేశాలకు పారిపోయికన్న వాళ్ళను అనాధలుగా చేసివాళ్ళ కన్నీటికి కారణమవుతున్నారుతెలుగు జాతి ఆత్మ గౌరవానికితెలుగు భాష మనుగడకు భంగం చేకూరుస్తున్నారుచీకటికి వెలుగు కరువైనట్టుతెలుగుకి తెలుగువాడు మరుగౌతున్నాడు!! పెద్ద పెద్ద చట్ట సభలలోసూటు బూటు వేసుకొనిఅర్ధం కాని పదాలతోఫ్యాషన్ […]

Continue Reading
Posted On :

జవాబు జాడ చెప్పడం లేదు… (కవిత)

జవాబు జాడ చెప్పడం లేదు… -చందలూరి నారాయణరావు నా కథలో అడుగుదూరంలో ఓ కొత్త పాత్ర నడుస్తున్న చప్పుడును దగ్గరగా విన్న ఇష్టం కలకు ప్రాణంపోసి…. ప్రవహించే ఊహగా పరిగెత్తె ఆశగా ఎంత వెతికినా నడక ఎవరిదై  ఉందన్న ఒక్క ప్రశ్నకు ఏ క్షణం జవాబు జాడ చెప్పడం లేదు. నెర్రెలు బారిన మోముతో పొడిబారిన కళ్లతో ఏనాడో పుట్టి పెరిగిన ఈ రహస్యమో గుండెలో దాచుకున్న సత్యంగా ఏ గాలికి కొట్టుకురావాలో? ఏ వరదకు నెట్టుకురావాలో? […]

Continue Reading
Posted On :
T. Hima Bindu

తానే (కవిత)

తానే -డా. టి. హిమ బిందు నిస్వార్ధపు లాలిత్యం కురిపించే తల్లీ తానే దూరంగున్నా మమతలో హక్కు కోరే కూతురూ తానే ప్రేమకు సర్వం ధారపోసే అపూర్వం తానే చిలిపి అల్లర్లున్నా కలిమి లేమిలో తోడుగ నిలిచే చెల్లీ తానే పోటీ కొచ్చినా కడుపులో పెట్టుకు చూసే అక్కా తానే సోపతి అనుకునే పతికి సహధర్మచారిణీ తానే అలుపెరగని పతికి ఆలంబన తానే సకలం నీవే అనే పతికి పట్టపు రాణీ తానే కాలం కలిసి రాక […]

Continue Reading
Posted On :

పెదాలు చీకటి పడి (కవిత)

పెదాలు చీకటి పడి – శ్రీ సాహితి మధ్యలో ఓ పేజీలో మాటేసిన ఓ వాక్యం కవాతుకు నిద్ర లేని రాత్రులు తూర్పార పట్టినా గుండెకెత్తలేని కలకు పోగైన జ్ఞాపకాలు నిద్రలో నల్లగా పొంగి పొర్లి పట్టపగలే పెదాలు చీకటి పడి పలుకు స్పర్శలేక ఆకలి కళ్ళు పాత మనసువైపు తీపిగా చూస్తుంటే కొత్త ఆకలికి పాత శరీరంలో లేని రుచి ఉంటుందా? ***** మా ఊరు అద్దంకి, ప్రకాశం జిల్లా, (ఆంధ్రప్రదేశ్.) నేను ప్రస్తుతం నాగార్జున […]

Continue Reading
Posted On :
subashini prathipati

నీకు నాకు మధ్యన (కవిత)

నీకు నాకు మధ్యన -సుభాషిణి ప్రత్తిపాటి అప్పుడెప్పుడో… దశాబ్దాల క్రితంఏడేడు జన్మల బంధంనీది నాది అనుకుంటూ…అడుగులో అడుగు వేసినప్పుడుమన మధ్యన ఏముంది?? మహా గొప్పగా చెప్పడానికి!తొలి వలపులతహతహల చెర వీడిన మలి అడుగుల్లో …మది తలుపులేవో మెల్లగా తెరిచాక కదాఅగాధాల లోతులు తెలిసిందికర్కశపు జాడలు చూసింది కన్నీటి వ్యథ ఎదురైంది అప్పుడు మన నడుమదట్టమైన గాజు తెరలుమన నీడలే మనకు శత్రువులైఅనిశ్చితంగా కదలాడేవి! గదిలోపలి గోడలు బీటలు వారిన ఇన్నేళ్ళకు,నాకర్థమయింది,కాలంతో పాటు మంచులా కరిగింది మన మధ్యన ఇన్నాళ్లూ పేరుకున్న *నిశ్శబ్దమని*! శాబ్దికమయినాకే తెలిసిందిహృదయం రవళిస్తుందని, అదేమిటోఁ…. ముసురుకున్న హృదయాకాశంకరుణావృష్టిని ధారపోస్తే […]

Continue Reading
Posted On :
gavidi srinivas

కొన్ని పరిమళాలు (కవిత)

కొన్ని పరిమళాలు -గవిడి శ్రీనివాస్ నలుగురితో  మాట్లాడుకోవటంపక్షుల కిలకిల రావాలు వినటంవనాలు పచ్చని తోరణాలు కట్టటంమొగ్గలు వీడి గాలితో పలకరించటంగాలి చేరి హృదయాలు వికశించటం ఇసుక తెన్నెల్లో  కూర్చునిఎగసే కెరటాల్ని చూడటం చుట్టూ ఊగే దృశ్యాల్నికళ్ళల్లో వొంపుకోవటంఆస్వాదించటం నాలో సంచరించే కొన్ని పరిమళాలు. వెన్నెల కాంతుల్ని తొడుక్కోవటంవర‌్షధారల్ని నింపుకోవటం ఆశగాఆకాశం వంకాహరివిల్లు వంకాకొంచెం కొత్తగా చూపుల్ని ఆరేసుకోవటంనాకింకా అలానే ఆనందాలు పొద్దు పొడుస్తున్నాయి. దేహమంతా పరవశంతోఅనేక దీపాలుగా వెలుగుతుంది. చిన్ని కొండలనూ ఎక్కి దృశ్యాల్ని నింపుకుంటాను. పిల్లకాల్వలో గెడ్డలలోచేపలు పట్టుకుంటాను కొన్ని పరిమళాల్నినాతో అంటిపెట్టుకుంటాను. ***** గవిడి శ్రీనివాస్  ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం […]

Continue Reading
Posted On :

కీ (కవిత)

కీ -లక్ష్మీ శ్రీనివాస్ ఆనాడు కొందరుఊపిరి విడిచిఊపిరి పోసిరిఊరూరు స్వేఛ్చగా ఉండాలని ఆశ పడిరిఆశలు ఆశలుగానే ఉన్నాయి నేడు స్వేచ్ఛఎగరేసిన ప్లాస్టిక్ పక్షిలామారిపోయిందిఎక్కడ వాలమంటే అక్కడ వాలుతుందిపాపం దానికేం తెలుసు ? నేడు సమాజమే”కీ” ఇచ్చే యంత్రంలామారిపోయింది ఆడించే ఆటబొమ్మలా మారిపోయిందిఇంక ఎక్కడ స్వేచ్ఛస్వేచ్ఛ కూడా అక్కడేఎక్కడ ఉంటే “కీ” ***** టి.శ్రీనివాసులు (లక్ష్మీ శ్రీనివాస్) చిత్తూరు జిల్లా పలమనేరు తాలూకా దగ్గర తాళ్ళపల్లి గ్రామంలో లక్ష్మీదేవి, ఆంజప్పలకు జన్మించారు. ఎం. ఏ, బి. ఏడ్, పూర్తిచేసి, ప్రస్తుతం తెలుగు అధ్యాపకుడిగా మదర్ థెరిస్సా జూనియర్ […]

Continue Reading
Posted On :

సంతోషాన్ని వెతుకుతూ (కవిత)

సంతోషాన్ని వెతుకుతూ -హేమావతి బొబ్బు సంతోషాన్ని వెతుకుతూ కొండ కోనలు తిరుగుచూ ఎక్కడున్నదో తెలియక ఎప్పుడోస్తుందో, అసలు వస్తుందో రాదోనని పబ్బుల్లో ఉందో మబ్బుల్లో ఉందో తాగే మందులో ఉందో చల్లటి చెట్టు నీడలో ఉందో మదిలో ఉందో షాపింగ్ మాల్స్ లో ఉందో పర్స్ లో లేకా ప్రేమించే గుండెలోన హిమాలయాల లోనే కలియతిరుగుచూ కనిపించే ప్రతి హృదయాన్ని నే అడిగా నాకు కొంచెం సంతోషాన్ని ఇవ్వమని విరిసే ప్రతి పువ్వుని అడిగా దారి తప్పిన నా సంతోషాన్ని దరి చేర్చమని మీకు తెలిస్తే తప్పక చెప్పండి నా సంతోషాన్ని రమ్మని పొత్తిళ్ళలో పసిపాపలా పెంచాను నేను దాన్ని మొగ్గలా తొడిగేను అది నా పసిప్రాయంలో యవ్వనాన ఎదిగేను మహావృక్షంగా నడుమొంగిన వయస్సులో నా మెడలు వంచి నడచి పోయెను నేను ఎదిగానని తలచి ***** నేను హేమావతి బొబ్బు తిరుపతి వాసిని, ప్రాధమిక విద్య తిరుమల శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో, ఉన్నత విద్య శ్రీ పద్మావతి మహిళా కళాశాల  తిరుపతి లో జరిగింది. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ […]

Continue Reading
Posted On :

బద్ధకంగా బతికే ఉంటాయి (కవిత)

బద్ధకంగా బతికే ఉంటాయి – శ్రీ సాహితి ఒక్కో రోజుకు బాకీ పడతామో, బాకీ తీరుతుందో తెలియదు. పగలంతా ఊహల్లో ఈత రాత్రంతా మెలకువలో మునక ఊడిగం చేసే ఆలోచనలో విశ్రాంతి లేని నిజాలు వెలుతురును కప్పుకుని ఎండలో ఎగురుతూ చీకటిని చుట్టుకుని చలిలో ముడుక్కుని తలను నేలలో పాతి ఆకాశానికి కాళ్ళను వ్రేలాడుతీసి సంద్రంలా మారిన మెదడులోని తెరలు తెరలుగా కలలు నిద్రను ఢీ కొని బద్దలైన రోజులో బద్ధకంగా బతికే ఉంటాయి. ***** మా […]

Continue Reading
Posted On :

నీకు నా కృతజ్ఞతలు ప్రభూ (కవిత)

నీకు నా కృతజ్ఞతలు ప్రభూ -హేమావతి బొబ్బు దప్పికతో ఒయాసిస్సులు వెదకుచూ ఎండమావుల వెంట పరుగులు తీస్తున్నపుడు గుక్కెడు నీటిని ఇచ్చి దప్పికను తీర్చినందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ ఆకలితో నకనక లాడుచున్న కడుపును చేతబట్టి దేశదిమ్మరినై తిరుగుతున్నపుడు గుప్పెడు మెతుకులతో ఆకలిని తీర్చినందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ నాది నా వాళ్లంటూ  ప్రాణం పోయినా మమకారాన్ని చంపుకోలేక నా ఆత్మ దిక్కులేక ఆక్రోశిస్తున్నపుడు అమ్మ కడుపులో ఊపిరి పొసినందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ లోకం పోకడ తెలియక బుడి బుడి నడకలతో చెడుబాట పట్టినపుడు నడక నేర్పడానికి తండ్రివి నీవై నందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ కడుపు నిండిన మనస్సు పండక ప్రేమను కోరుతున్న కట్టెని కాల్చడానికి  నా గుండె దాహాన్ని తీర్చడానికి ప్రియురాలి వై, భార్య వైనందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ వాలుతున్న శరీరాన్ని వసంతంలో నింపడానికి వయస్సుడుగుతున్నపుడు నా భుజాల చుట్టూ చేతులు వేసి నన్ను నడిపించడానికి నా బిడ్డవైనందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ నాకు పునరుజ్జీవితం ఇవ్వడానికి నాకు మరణాన్ని ప్రసాదిస్తున్నందుకు నీకు నా కృతజ్ఞతలు ప్రభూ ***** నేను హేమావతి బొబ్బు తిరుపతి వాసిని, ప్రాధమిక విద్య తిరుమల శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో, ఉన్నత […]

Continue Reading
Posted On :
T. Hima Bindu

ఆశయాల సాధనలో నిశ్శబ్ద రేయి (కవిత)

ఆశయాల సాధనలో నిశ్శబ్ద రేయి -డా. టి. హిమ బిందు జాబిల్లి చెంత వెన్నెల రేయి చల్లనిదే.. నిదుర ఒడిలో జోలపాడే రేయి మధురమైనదే ఒంటరి మనసులకు నిదానంగా నడుస్తూ రేయి మెల్లనిదే ఒంటరి ప్రయాణంలో గుబులు పుట్టిస్తూ సాగిపోయే రేయి భయానకమైనదే అస్వస్థతలో తోడు దొరకని రేయి నరకప్రాయమైనదే ఆశయాల సాకారంలో సహకరించే రేయి నిశ్శబ్ద మైనదే… కోప తాపాల నడుమ కొట్టుమిట్టాడుతున్న రేయి మౌనమైనదే… ప్రేమ తోడులో ఊసులాడు రేయి ఆనంద నిలయమే…. ఎన్ని […]

Continue Reading
Posted On :

ఆలస్యంగా (కవిత)

ఆలస్యంగా -మనోజ్ఞ ఆలమూరు  మనిద్దరం ఆలస్యంగా ఒకరి జీవితాల్లోకి ఒకరం అడుగుపెట్టాం ఎవరు కాదనగలరు? అయినా నేను ప్రతీరోజూ నీ గురించి కలగంటాను ఏ ఒక్కటీ నిజం కాదని తెలిసినా…. ప్రతీ కలనీ….అందులోంచి కదలివచ్చే నీ రూపాన్నీ… తల్చుకుంటూ రోజులు దొర్లించుకుంటాను ఎన్నెన్నో మధుర స్మృతులు మరెన్నో చేదు జ్ఞాపకాలునూ.. అన్నింటినీ కలిపే తీపి కల…. వాస్తవంలోకి లాక్కొచ్చే జీవితం కలలోని నీ రూపం కోసం నా ఎదురుచూపు ఆ ఎదురుచూపులో మిగిలే నైరాశ్యం అది ఎప్పటికీ […]

Continue Reading
Posted On :

అంతస్సూత్రం (కవిత)

అంతస్సూత్రం -పి.లక్ష్మణ్ రావ్ మండుతున్న అగ్ని కొలిమి పైభూతలాన్ని పెనంగా పెట్టిచంద్రుడ్ని అట్టుగా‌‌పోస్తుంది అమ్మ ! అట్టు మధ్య చిన్నచిన్న రంధ్రాలేచంద్రునితో జత కలిసే తారలు ! ముఖస్తంగా చంద్రుడువెన్నెలై మెరుస్తున్నాక్రింద అమావాస్య చీకటిదాగి వుందనేది నర్మగర్భం ! అట్టుని అటూ ఇటూ తిరగేయడమేశుక్ల పక్షం, కృష్ణ పక్షం ! ఓ చిన్నారీ !వెన్నెల కురిపించే చంద్రునికేచీకటి వెలుగులున్నట్లుజీవితంలోకష్టసుఖాలు సమానమే తండ్రీ ! నోరూరించే అట్టులోనూదాగివున్న రహస్యమదే! ఒకవైపే వుంటే మాడిపోద్దిరెండు వైపులా తిరగేస్తుంటేనేరుచులు పంచుతాది ! ***** నేను సాహిత్య రంగంలో 2004లో అడుగుపెట్టాను. నానీలు,హైకూలు, మినీ కవిత్వం, […]

Continue Reading
Posted On :

కొత్త రంగు (కవిత)

కొత్త రంగు -లక్ష్మీ శ్రీనివాస్ ఈ రంగుల ప్రపంచంలో ఈ రంగుకు రూపం ఉండదు ఇదొక వింత రంగు మార్కెట్లో దొరికే రంగుల కంటే చాలా చిత్రమైనది దుర్గుణ వర్ణాలతో కూడి మనిషి రూపాన్ని మార్చేస్తుంది ఈ రంగు పులుముకొన్న మనుషుల్లో ప్రేమలకు అనురాగాలకు మంచితనానికి మానవత్వానికి బంధాలకు బంధుత్వాలకు బాధ్యతకు  భరోసాకు తేడా తెలియని మనిషిగా ఒక వింత మనిషిగా ఒక విచిత్ర వేష భాష ధారణతో వికృత చేష్టలతో విహరిస్తుంటారు. ఈ రంగులద్దుకొన్న మనుషుల్ని కాస్తా గుర్తించండి […]

Continue Reading
Posted On :

బొమ్మను (కవిత)

బొమ్మను -రాధాకృష్ణ కర్రి బొమ్మనుగమ్యానికి బాటలు వేసుకోలేని రాతి బొమ్మను.దిక్సూచికి వ్యతిరేక దిశలో పయనించేకళ్ళు ఉన్న కబోది బొమ్మను.కర్కశత్వం, మొండితనమే ఇంధనంగాసాగే మనసు లేని మరబొమ్మను.అష్ట వంకరల మార్గంలో పయనించేరెక్కలు లేని విహంగాన్ని.ప్రేమ అనే తెరచాపకై వెదుకులాడుతూరుధిరమైన తనువుతోసాగరంలో నడిచే నావికను.వందశాతం పరీక్షలు రాసిఅద్భుతమైన శూన్య ఫలితాలను సాధించే నిత్య నూతన విఫల విద్యార్థిని.లోటుపాట్ల జాడ తెలుసుకోలేకచతికిలపడ్డ పంకిలాన్ని.నాకు నేనే అర్థం కాని ఒక చిక్కు ప్రశ్నను. ***** నా పేరు రాధ కర్రి. నివాస స్థలం విజయవాడ. భాగస్వామి పేరు కృష్ణ. […]

Continue Reading
Posted On :
gavidi srinivas

అదే వర్షం…! (కవిత)

అదే వర్షం…! -గవిడి శ్రీనివాస్ వేకువల్లే వేయి కలలు వెలిగించుకుని తూరుపు కాంతులు పూసుకుని చూపులు మార్చుకున్న రోజులు కళ్ల పై వాలుతున్నాయ్ . హాయిని గొలిపే ప్రపంచమంటే కళ్ళలో  వెలిగే దీపాలు దారిచూపటం . మనసున ఊగే భావాలు ఊరించటం అలరించటం అంతే కదా … వర్షాల ఊయల్లో అలా ఊగిపోవటం బంధాల్ని ముడిపెట్టుకోవటం కదూ… ఇంతలా వెన్నెల  ఆకాశాన్ని వొంచి తల నిమురుతూంటేనూ… లోలోపల జ్ఞాపకాలు  తడుముతుంటేనూ… ఏదో వెన్నెల వాకిలి వొలికి చిలికి […]

Continue Reading
Posted On :

పరిష్కార దీపం (కవిత)

పరిష్కార దీపం -యలమర్తి అనూరాధ అమ్మా! ఆర్తనాదం గుమ్మంలోబిచ్చగత్తె కాదు ఎక్కడో దూరంగాబావి లోంచి వినబడనట్లు కొడుకులు వదిలించుకున్న వృద్ధుల మౌన ఘోష ఇది మన దేశమేనా !?సందిగ్దంలో పడ్డ మనసు ఒంటరి తనం చీకటిన మ్రగ్గుతున్న కర్కశహృదయాలుచివరి అంకానికి ఇదా ముగింపు ?  ఆ నిముషాన కొడుకులనంతా వృద్ధులుగా మార్చాలన్నంత ఆవేశం హిప్నాటెస్ట్ నై ఒక్కసారి ఆ అనుభవాన్ని రుచి చూపించాలనిమూసుకున్న కళ్ళు అప్పుడైనా తెరుచుకుంటాయేమో?వదిలిన అనుబంధపు పాశాలు మళ్ళీ చుట్టుకుంటాయేమో! ***** యలమర్తి అనూరాధ నివాసం హైదరాబాద్. కృషాజిల్లా ముదునూరులో జన్మించారు. 1978 […]

Continue Reading
Posted On :

దుఃఖపుమిన్నాగు (కవిత)

దుఃఖపుమిన్నాగు -డా.కె.గీత దుఃఖం జీవితం అడుగున పొంచి ఉన్న మిన్నాగు ఎప్పుడు నిద్రలేస్తుందో దానికే తెలీదు ఎప్పుడు జలజలా పాకుతుందో ఎవరికీ తెలీదు ఎగిసిపడ్డప్పుడు మాత్రం ఎప్పటెప్పటివో నిశ్శబ్ద వేదనలన్నీ ఒక్కోటిగా తవ్వుకుంటూ జరజరా బయటికి పాక్కొస్తుంది దాని పడగ నీడలో ప్రతిరోజూ నిద్రిస్తున్నా ఏమీ తెలియనట్టే గొంతు కింద ఎడమ పక్క సిరలు ధమనులు చుట్ట చుట్టుకుని బయట పడే రోజు కోసం తపస్సు చేస్తుంటుంది ఒక్కసారి నెత్తుటి గంగలా బయట పడ్డదా దాని తాండవం […]

Continue Reading
Posted On :

ఎప్పటికీ నిండని కుండ (కవిత)

ఎప్పటికీ నిండని కుండ -పాపినేని శివశంకర్ ‘చావదురా ఈ పాము / చప్పిడి దెబ్బలకు / భావించి వైరాగ్యమనే/ బడితెదెబ్బబడితె గాని’ అంటూ అప్పుడెప్పుడో మా అమ్మ పాడిందొక తత్త్వం. ఇప్పుడైతే ‘నిండదురా ఈ కుండ / మెండైన సంపదల్తో’ అని పాడేదేమో. కాకికి దప్పికైనప్పుడు అడుగున నీళ్లున్న కుండని గులకరాళ్లతో నింపి దాహం తీర్చుకొంది. కానీ,             ఈ కుండలు నిండవు. ఎవరికుండా నిండటం లేదు. నువ్వు కొండల్ని పిండిచేసి కూరినా నిండదు. ఎన్నికార్లు, అద్దాల మేడలూ, […]

Continue Reading
Posted On :

అమ్మసంచి (కవిత)

అమ్మసంచి -బంగార్రాజు కంఠ నువ్వు పుట్టక ముందుఅమ్మ ఒక నాజూకుతనంనువ్వు పుట్టక ముందుఅమ్మ ఒక చలాకీ చిరునామానువ్వు పుట్టక ముందుఅమ్మ ఒక ఆశల తేనెపట్టునువ్వు పుట్టక ముందుఅమ్మ ఒక ఉరికే వాగునీరు నువ్వు పుట్టాకతన సమస్తం గాలికి గిరాటుకొట్టాకఇక నువ్వే తన బంగరుకొండ తప్పో ఒప్పోపదినెలలు ఈ భూమిని మోసిన అమ్మకు తప్పఎవరికీ వుండదు ఆ చారికల సంచిప్రపంచం మొత్తం మీద అమ్మకి తప్ప ఎవరికీ నచ్చవుకడుపు మీది ఆ బాధానంద ముద్రలుపొత్తికడుపు మొత్తం కత్తితో చీరినట్టునువ్వూ నేనూ చీరే వుంటాం పొట్టలో […]

Continue Reading
Posted On :

ఓటమి ఎరుగని తల్లి (కవిత)

ఓటమి ఎరుగని తల్లి -శింగరాజు శ్రీనివాసరావు కడుపు సంచి ఖాళీగా వున్న దేహాన్ని గర్భసంచి బరువు సమం చేసింది బక్కచిక్కిన శరీరపు ఒడిలోకి చచ్చుబడిన పిండం ప్రాణం పోసుకుంది నవ్వే బిడ్డకు నడకలేని కాళ్ళు దిష్టి చుక్కల్లా.. దరిద్రానికి తోబుట్టువులా అవిటితనం.. అసంపూర్ణ పుష్పాన్ని చూసి ఆమె దూషించలేదు నడవలేని కన్నయ్యవని మురిసి రొమ్ముపీకను నోటికందించింది తరువుకు కాయ బరువు కాదని తనయుడి భారాన్ని భుజాన వేసుకుంది కదలలేని కాయం మోయలేనంత ఎదిగితే నడుము వంచి గజమై […]

Continue Reading
Posted On :

రోజు ఇలాగే (కవిత)

రోజు ఇలాగే -మహెజబీన్ రోజు ఇలాగే కొత్తగా మొదలవుతుంది జీవితం తొలిసారి చూసినట్టు ప్రతీ సూర్యోదయం అద్భుతమే సంధ్యా సాయంకాలం ప్రతీ రోజు వర్ణ చిత్ర మవుతుంది చూసినప్పుడల్లా సముద్రం ఆశ్చర్యమవుతుంది పుట్టినప్పటి నుండి చూస్తున్ననీలాల గగనమే, అయినా తనివి తీరదు నక్షత్రాల్నిచెల్లా చెదురుగా పడేసుకున్న రాత్రి ఆకాశం, దాని మీద కురిసే వెన్నెల చూపు తిప్పనీదు ప్రతీ ఋతువు కొత్తగా కనిపిస్తుంది వచ్చిన ప్రతీసారి వసంతం కొత్త రంగుల్నిఇచ్చి వెళుతుంది వాన కురిసిన ప్రతీసారి అహ్లాదమే […]

Continue Reading
Posted On :
T. Hima Bindu

స్టేబుల్-స్టాఫ్ రూమ్ టేబుల్ (కవిత)

స్టేబుల్-స్టాఫ్ రూమ్ టేబుల్ -డా. టి. హిమ బిందు నిశ్శబ్దంగా వింటున్నాను ఆశ్చర్యంగా చూస్తున్నాను కళకళలాడే అందమైన అలంకారాల అరుదైన అందాలు చూస్తున్నాను అంతకన్నా మించిన సృజనా శైలిలు చూస్తున్నాను ఆనంద క్షణాలలో కంటి వెలుగులు చూసి సంతోషిస్తున్నాను దుఃఖ సమయాన కన్నీటి సాగరాల అలలకు విలవిల లాడుతున్నాను గుస గుసల చెవుల కోరుకుల్లు మింగుడు బడక ముసి ముసి నవ్వులతో ముడుచుకు పోతున్నాను! గల గల నవ్వుల జల్లులు, ఏడిపించడాలు, ఓదార్పులు తీపి కబుర్లు, మిఠాయిల […]

Continue Reading
Posted On :
gavidi srinivas

పొలం ఒక బంధం (కవిత)

పొలం ఒక బంధం -గవిడి శ్రీనివాస్ కాసిన్ని చినుకులు రాలటం కాబోలు నాల్గు మడి సెక్కలు సూర్యుణ్ణి చూసి మురిసిపోతున్నాయి. ఉత్సాహం ఉత్సవమౌతూ కళ్ళల్లో వరి కలల కాంతులు దర్శిస్తున్నాడు రైతు . గుంపు కొంగల బారులా వరినాట్లు నాటిన ఆడోళ్ళు. నిజమే కదా మట్టిని తాకిన పాదాలు మొక్కలై  ఎదుగుతుంటాయి . నడిచిన  మట్టి మీద మమకారపు  పొరలు విప్పుకుంటాయి . అస్థిత్వాన్ని నెత్తిన ఎత్తుకుని పంట చేల కోసం పాట మొలుస్తుంది . రేపటి భయాలని […]

Continue Reading
Posted On :

కలను ఏ కన్నీళ్లు ఆపలేవు (కవిత)

కలను ఏ కన్నీళ్లు ఆపలేవు – శ్రీ సాహితి నిద్రను హత్యచేసిన ఆ కల పట్టపగలు ఎన్నో రాత్రులను మోసుకుంటూ ఏ రోజుకు చిక్కకుండా ఏ గంటకు పట్టుపడక నగ్నంగా తిరుగుతుంది. ఎదురొచ్చిన ముఖంపై చెంబుడు కబుర్లు చల్లి చిందుల్ని ఏరుకుంటూ పసి హృదయంలో లోతుగా పాకిన ఇష్టం పెద్దయ్యాక వటవృక్షమై ఇప్పుడు కలకు కళ్ళతో పనిలేక కాలంతో ముడి వీడి కోరికగా మారి మనసులో మాటైయింది…చూపైయింది… చప్పుడైంది….చిత్రమైంది. ఇక కాలు ఆగేదాక కళ్ళు ఆరేదాకా ఏ […]

Continue Reading
Posted On :

వేయి మాటల ఉప్పెన (కవిత)

వేయి మాటల ఉప్పెన -చందలూరి నారాయణరావు కోపానికి చీల్చుకొచ్చిన లోపలి మనిషి నోరు బయట పుట్టపలిగి వంద నాలుకల వేయి మాటల ఉప్పెన నాలుగు కళ్ళుగుండా వేలమైళ్ళ మీటవేసి మెదడును ఖాళీ చేసిన రక్తం పాదాలకి చేరి తలలో పాతపగను తాకి మొగ్గలేసిన సమస్య పచ్చని గాయమై ఎర్రగా నవ్వింది. ఆ నల్లని రోజు నిండా నిమిషానికో గాయానికి స్రవించే అరుపుల తరంగాలు చెవుల్లో పొంగి పొర్లి పక్కనున్న రోజుపై చింది పగలు చీకటి దుప్పటి కప్పుకుంటే […]

Continue Reading
Posted On :

ఎండి తుమ్మ గజ్జెలు (కవిత)

ఎండి తుమ్మ గజ్జెలు -గుమ్మల సాయితేజ ఆడుతున్న మా అయ్య చెప్పిన ఎండి తుమ్మ గజ్జెలు కట్టి ఆడుతున్న  నవ్వుతున్న నవ్వుతూ ఆడుతున్న కొత్త బొబ్బలెక్కిన పెయ్యి ఏడెక్కినకంట్లో నీళ్లు బయటికొస్తేచెమట అనుకోని తుడుసుకుంట  ఆ డముకు డముకు సప్పుల్ల  నా ఏడుపును కలిపేసి పండ్లు ఇకిలిచ్చి కండ్లు సిన్నంగ చేసి నడుం మీదో చేయి నెత్తి మీదో చేయి పెట్టి  భరతనాట్యం అయ్య పిల్ల తిని చాలా రోజులైందయ్య అని పాన్ పరాగ్ ఉమ్మేసుకుంటా చెప్తున్న  మా అయ్య మొహం చూసి నవ్వుతున్న నవ్వుతూ ఆడుతున్న  మూగవోయిన చేయి చూపించి పైసలు ఇచ్చిన పెద్దనాన్న , మామయ్య , పెద్దమ్మలను చూసి పొర్లు దండాలు పెడుతున్న తమ్ముని చూసి అయ్యా […]

Continue Reading
Posted On :
gavidi srinivas

యుద్ధం ఒక అనేక విధ్వంస దృశ్యాలు (కవిత)

యుద్ధం  ఒక అనేక విధ్వంస దృశ్యాలు -గవిడి శ్రీనివాస్ యుద్ధం ఎపుడు విధ్వంసమే విద్వేషాలే యుద్దానికి మూల ధాతువులు . ఆధిపత్యం పోరు ప్రాణాల్ని ఛిద్రం చేస్తుంది . అండ చూసుకొని ఒక చిన్న దేశం అంగ బలం చూసుకొని ఒక పెద్ద దేశం యుద్దానికి తెరలేపాయి. శూన్యాన్ని విధ్వంసం చేసి ఆకాశాన్ని అల్లకల్లోలం చేసి రక్తపు మడుగుల వాసన తో యుద్ధం తడిసిపోతోంది. నాటో వ్యూహాల మధ్య దేశాల దేహాలు తగలబడిపోతున్నాయి. ఇప్పుడు బతకడమంటే మూడో ప్రపంచ […]

Continue Reading
Posted On :

అబద్ధమాడని నిజం (కవిత)

అబద్ధమాడని నిజం -చందలూరి నారాయణరావు నిత్యం వారిద్దరి విందులో రుచిగల మాటలు అబద్దమాడని నిజాలు ప్రియమైన వంటకాలు. ఎదుటపడని కలయికలో ఎదమాటున సంగతులు మధురంగా మైమరిపించే మనసూరించే ఇష్టాలు. నిద్రమంచానే చూపులు ముఖాల్లో ఏరులా ప్రవహించి సంతోషసారాన్ని ఇచ్చి పదునుగా ప్రవర్తించి రోజూ గుప్పెడు అనుభావాల్ని ఒకరిలో మరొకరు చల్లుకుని ముసురుపట్టి మెరుపులతో జోరుగా కురుసుకుంటారు తనివితీరా తడిసిన తలపులకు మన్ను వెన్నులో పదాల మొలకలు పుట్టపగిలి ఉదయించుకుంటారు వాక్యాల మెరుపులతో కౌగిలించుకుంటారు. కవితల విరుపులతో రెపరెపలాడతారు… […]

Continue Reading
Posted On :

ఎందాకని జ్ఞాపకాలకు రుచౌతావు? (కవిత)

ఎందాకని జ్ఞాపకాలకు రుచౌతావు?  – శ్రీ సాహితి ఎన్నాళ్ళని ఆ ఒక్క ప్రశ్నను ఈడ్చుకుంటూ దగ్గరతనాన్ని కలగంటూ దూరాన్ని మోస్తావు? చాటేసిన ముఖంతో మౌనాన్ని తప్పతాగి వేళకు మనసుకు రాని జవాబుకు ఎన్ని రాత్రులను తీవాచిగా పరుస్తావు? చూపలరిగి చుక్కలై అలిసిన ఆశకు దప్పిక తీర్చాలని కన్నీళ్లను గొంతులో రహస్యంగా ఎందాకని దాస్తావు? కాలం తొక్కిడికి ఒరిగిన కోరికను సున్నితంగా చేరదీసి కడుపున దాచి ఎందాకని గుట్టుఔతావు? కళ్ళకు తెలియకుండా కన్న కలను కరిగి ఆరకుండా చెదరి […]

Continue Reading
Posted On :

భవిత (కవిత)

భవిత – టి. వి. యెల్. గాయత్రి చెట్టులేదు చేమ లేదుచిట్టడవు లెక్కడ? లేనే లేవుపులుగు పోయి పుట్ర పోయిపశుల జాతి పోయి పోయివెనకడుగై కనుమరుగైగతము లోకి జారి పోతేఒంటరిగా వేదనతోభగభగమని మండి పోతూవేడి పుట్టే వాడి సెగలుపుడమి తల్లి కక్కు తుంటేఎక్కడ? ఎక్కడ? నీ భవిత?చెప్ప వోయి వెఱ్ఱి మనిషి! గాలి నిచ్చి జీవమిచ్చి చేవ నిచ్చి మేలుచేయుచెట్టు చేమ పెంచ వోయి!చేర దీసి నీరు పెట్టిభూత కోటి బ్రతుకు పట్టిభూమాతకు బహుమతిగాపచ్చదనము పెరగనీయి! ***** నా పేరు […]

Continue Reading
Posted On :
subashini prathipati

ఆరాధనాగీతి (కవిత)

ఆరాధనాగీతి -సుభాషిణి ప్రత్తిపాటి పాత పుస్తకాలుతిరగేస్తుంటే నెమలీక జారిపడింది,ఎన్ని దశాబ్దాల నాటిదోఇంకా శిథిలం కాలేదుగుండెలో దాచుకున్నతొలివలపులా ఇంకామెరుపులీనుతూనే ఉంది! ఊరంతామారిపోతోందిపాతభవనాలన్నీ రాళ్ళగుట్టలవుతుంటేఅల్లుకున్న నా జ్ఞాపకాలన్నీచెంపలపై చెమ్మగా జారసాగాయి!అదిగో ఆ రంగువెలసినఅద్దాలమేడ కిటికీ మాత్రంతెరిచే ఉందిఅక్కడినుంచి ఒకప్పుడునన్ను తడిమిన పద్మనేత్రాలులేకపోవచ్చుకానీఆ ఆరాధనా పరిమళం మాత్రంఇప్పటికీనాకు నిత్యనూతనమే!!మా కళాశాలకుపాతబడిన విద్యార్థిగావెళ్లాను,అన్నీ నవాంశలే అక్కడ,కొత్త గదులు,చెట్లుఒక్కటిమాత్రమేనన్ను హృదయానికిహత్తుకుందిపాత మిత్రుడిలా..నా వేళ్ళు తడిమిన ఆ పుటలన్నీవిశ్వభాషలో నన్నుపలకరించాయి,నన్ను సేదతీర్చాయిచంటిపాపను చేసి లాలించాయితాదాత్మ్యతలోకాలం తెలీనేలేదు.సముద్రం వైపునడిచాను.తీరం హంగులు దిద్దుకుంది గానీ…అలల దాహమే ఇంకాతీరినట్టు లేదునా బాల్యంలోలాగేఒకటే […]

Continue Reading
Posted On :

తూకం (కవిత)

తూకం -రూపా దూపాటి అందమైన మనిషిని పువ్వుతో పోల్చడం తప్పేమీ కాదు! కానీ ఒక అబ్బాయిని రోజా పువ్వులా ఉన్నావు అనడాన్ని నేను ఇప్పటి వరకు వినలేదు!! వండు కోవడం, తినడం మానవ అవసరాలే! కానీ మీ బాబుకు వంట వచ్చా అని పెళ్లి కుదుర్చుకున్న సంఘటన నేను ఇప్పటి వరకు చూడలేదు!! స్వతంత్రం మనకి ఎపుడో వచ్చింది! కానీ ఆడపిల్ల ఒంటరిగా తిరుగుతున్నప్పుడు ధైర్యంగా ఉన్న మనసును నేను ఇప్పటి వరకు తారసపడలేదు!! అమ్మాయి, అబ్బాయి […]

Continue Reading
Posted On :

వివక్ష?! (కవిత)

వివక్ష?! -అనురాధ నాదెళ్ల వివక్షా? అలాటిదేం లేదే. భారత రాజ్యాంగం ఎప్పుడో చెప్పింది- కులం, మతం, వర్గం, లింగం, భాష ఇలాటి భేదాలేవీ ఉండవని, అన్నిటా అందరూ సమానమేననీ! అంటే వివక్షలంటూ ఉండవన్నమాట! మరి, ఈ పదం ఎలా పుట్టిందంటారా? భలే సులువు! ఇంట్లోంచి, మనుషుల్లోంచి, ఆలోచనల్లోంచి, అహంకారాల్లోంచి అలా వైనవైనాలై, రాజ్యాంగ నిర్మాతలకు తోచని ఎన్నో మార్గాల్లోంచి పుడుతూనే ఉంది! వారి మేధకు అందని దారుల్లో పెత్తనం చేస్తూనే ఉంది. ముందుగా ఏదైనా ఒక ఇంటి […]

Continue Reading
Posted On :
rajeswari diwakarla

తల్లి చీర (కవిత)

తల్లి చీర -రాజేశ్వరి దివాకర్ల మమతల వాలుకు చిక్కి వలస వెళ్ళిన వాళ్ళిద్దరు తిరిగి రాని సమయాలకు ఎదురు చూపుల ఇల్లు మసక బారిన కళ్ళతో ఇసుక రాలిన చిన్న శబ్దానికైనా ఇటుక గోడల చెవిని ఆనించు కుంది. విశ్రాంతి పొందిన ఉత్తరాలు కొన్ని బ్యాంకు జమా బాపతు తాఖీదులు కొన్ని పిల్లల పుట్టిన రోజులకు గుడి పూజల తారీఖుల పిలుపు రివాజులు కొన్ని గాలి వాటుకు ఎగిరి ధూళి కమ్ముకున్న నేలకు ఒరుసుకున్నాయి. సంవత్సర చందాలకు […]

Continue Reading
Posted On :

చూపు చెంగున….. (కవిత)

  చూపు చెంగున….. -చందలూరి నారాయణరావు నేను అనుకోలేదు నా కవిత ఓ బంధానికి పెద్దమనిషి అవుతుందని… ఓ మనసుకు చుట్టరికంతో చిత్రాలు చేస్తుందని… ఓ సంతోషాన్ని వరంగా బలమై నిలుస్తోందని…. ఓ కదలికను పుట్టించి కలగా దగ్గరౌతుందని… ఓ కమ్మనిమాట సువాసనతో మనసు నింపుతుందని ఓ ఆనందాన్ని పంచే అందాన్ని మదికిస్తుందని…. ఎప్పుడు పుట్టిందో? ఎక్కడ పెరిగిందో? ఎలా ఎదురైందో మరి? ఇప్పుడు నాకై అనిపించేలా నాలో ఇష్టమై నా కవిత కొంగున ఆమె బంగారం. […]

Continue Reading
Posted On :
gavidi srinivas

తీపి దుఃఖాలు (కవిత)

తీపి దుఃఖాలు -గవిడి శ్రీనివాస్ ఒక అసంపూర్ణ సంధ్యాకాలం నీ విచ్చిన సంతోషంతో నువ్ పంపిన సందేశంతో ఇక్కడ నీ జ్ఞాపకాల్ని ధ్యానిస్తున్నా . ఒక్క మాట చెప్పు నీ తపస్సులో ఉషస్సుని చూస్తున్న నాకు ఈ తీపి దుఃఖాలు ఓదారుస్తాయా ..! నీ చూపులు వెన్నెల్ని కురుస్తున్నపుడు నీ ఊహలు తూనీగల్ని ఎగరేస్తున్నపుడు నీ కన్నుల్లో అఖండ దీపాలు వెలుగుతున్నపుడు నిశ్చేష్ఠుడనై నిర్ఘాంత పోయినపుడు ఆ ఉఛ్వాస నిశ్వాసాల్లో ధ్వనించిన అనురాగ మధురిమల్ని  ఏరుకుంటున్నపుడు నాలో […]

Continue Reading
Posted On :

చెరగని చిరునామా (కవిత)

చెరగని చిరునామా  -రామ్ పెరుమాండ్ల రాత్రి వాహనాలన్ని ఇంటికెళ్ళాయి .కానీ ఫుట్ పాత్ పైకి ఎవరొస్తారో తెలియదు.కడుపులో ఖాళీలను పూరించడానికి ఈ లోకం ఏ ఒక్క అవకాశం ఇవ్వను లేదు .ఆకలిని వెతికి వెతికి అలిసిన కన్నులు కునుకు కోసం దారి వెతుకుతున్నాయి . ఈ దేశం చేసిన సంతకాల చట్టాలు రోజూలాగే తన ఖాళీ సంచిలో నింపుకోవడానికి వెళితే చెత్త కుప్పలో విరివిగా దొరికాయి .అయిన తనకేం తెలుసు బడి లేదు బలపం లేదు . అలా ఆ కాగితాలను పరుపుగా ఇటుక పెళ్లను దిండుగా జేసుకున్నాడు .తన ఖాళీకడుపుపై […]

Continue Reading
Posted On :

యుద్ధం ఒక గుండె కోత-19 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండెకోత-19 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి ఉగ్రమో ఆగ్రమో పదునెక్కిన రెండు కొమ్ముల అమానుష మృగాలు ఆవురావురుమంటూ కాలుదువ్వుతున్నప్పుడు మదం తలకెక్కినవి కొన్ని, మతం దిమ్మెక్కినవి కొన్ని రెండు తలల సర్పాలు రెండు నాల్కల సరీసృపాలు పెనుబుసల ఊపిర్లతో అంతకంతకూ మంటని రాజేస్తున్నప్పుడు ఇతిహాసాలలోంచి సైతాన్లూ, హిరణ్యకశిపులూ నల్లమాంత్రికులూ, భస్మాసురులూ ఏ మత గ్రంథాలలోంచో ఊపిర్లు పోసుకొని భూగర్భ సమాధుల్లోంచి పైకి లేస్తున్నప్పుడు మూఢనమ్మకాల అగ్ని పర్వతాల్ని రగిల్చి భూ ఆవరణల్ని స్మశానాల్ని […]

Continue Reading
Posted On :

అందీ అందని ఆకాశం (కవిత)

అందీ అందని ఆకాశం (కవిత) -ఝాన్సీ కొప్పిశెట్టి ఓ కవి ‘మధుశాల’ లోతుల్లో మునిగి వున్నాన్నేను అదేమిటో… మనసు పొరల్లో దాచుకున్న ఇష్టమైన అనుభవాలన్నీ అనుభవంలోకి వచ్చాయి..! జ్ఞాపకాల పొరల్లోని కౌగిలింతల స్పర్శలు చిక్కటి స్నేహాలు జో కొట్టిన హస్తాలు… ఎందుకో మరోసారి పితృస్వామ్యం పైన అక్కసు ఎగిసిపడింది..! పురుషుడు ఆడమాంసపు ఆఘ్రాణింపుపై రాసినా వేశ్యల భోగలాలసపై మనసు పడినా ప్రియురాళ్ళ ఓణీల్లోని అందాల్లో ఓలలాడినా అన్నీ స్వానుభవాలేనని ఒత్తి పలికినా ఆక్షేపణ లేదు ఈ పితృస్వామ్య […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

అంతా నీటి మీద రాతలే (కవిత)

అంతా నీటి మీద రాతలే (కవిత) -కందేపి రాణి ప్రసాద్ ఆకాశం లో నువ్వు సగం అంటారు అంతా వాళ్ళే దోచుకు పోతారు ఆకాశమే నీ హద్దు అంటారు అంగుళం కూడా ఎదగనివ్వరు నువ్వెంతయిన చదువుకో అంటారు అబ్బాయిని మాత్రం మించకు అంటారు నిన్ను ఎక్కడికైనా పంపిస్తాం అంటారు పక్కింటికైన తోడు లేనిదే పంపించరు. వరుడిని ఎంచుకునే హక్కుంది అంటారు ఎంచుకుని తీసుకెళ్తే ఇంట్లోంచి గెంటేస్తారు సమాన హక్కులు ఇచ్చాం అంటారు ఎప్పుడు వెనక వరసే మిగులుస్తారు […]

Continue Reading
Posted On :
subashini prathipati

ప్రత్తిపాటి నానీలు (కవిత)

ప్రత్తిపాటి నానీలు -సుభాషిణి ప్రత్తిపాటి 1. అమ్మే.. నా బలం ఎప్పుడూ! నా కలంలో సిరా.. అమ్మ కన్నీళ్ళేగా! 2. ఆమె కళ్ళకు ఒకటే ఋతువు! అతని అహం తీర్చే… శ్రావణమేఘాలవి! 3. ఆ రాత్రి అరుణమై జ్వలించింది! వీరుని రక్తం పూసుకుందదిగో కశ్మీరం! 4. ఆదివారం ఒక్కటే, బతికిపోయాను…! రెండైతే… బొందితో స్వర్గమే!.. 5. అంతా ఆ నలుగురే! ఆహ్వానించడానికీ‌… సాగనంపడానికి కూడా! 6. అవమానాలు తూటాల్లాంటి మాటలవ్వచ్చు. కానీ… గుండెకు తూట్లు కారాదు! 7. […]

Continue Reading
Posted On :

ఆమె లోకం (కవిత)

ఆమె లోకం -గూండ్ల వెంకట నారాయణ ఎండకు ఎండివానకు తడిసిఇంటికి రాగానే బయట ఎక్కడెక్కడో గాలి రెమ్మల్లా తిరిగిన కోళ్లన్నీఆమె కాల్లచుట్టూ తిరుగుతూచీరకి ముక్కులు తుడుస్తూగోల పెడుతూ ఉంటాయి.ఆమె ఒక్కో రోజు వాటిని కసురుకుంటుంది.’ నా సవుతుల్లారా చీర వదలండే ‘ అని.ఒక్కో సారి ‘ నా బంగారు తల్లుల్లారా ‘ అని ముద్దు చేస్తుందిఆ కోళ్ళు ఆమెకి బిడ్డలు మసి నిండిన ఆవేసిన కుండలాంటి బూజు మొలిచిన రేకుల కొంపలోఆ మొక్కతే కోళ్ల కౌగిలింతల మధ్యపగలంతా పొలం కూలీలో కరిగిన ఒంటిని నిద్ర పుచ్చుతుందిదోసిటి […]

Continue Reading
Posted On :

సరికొత్తగా … (కవిత)

సరికొత్తగా ….. -రామ్ పెరుమాండ్ల అనగనగా ఓ ఉదయం కనులకు చూపులను అద్దుకొని పాదాలకు  అడుగులను తొడుక్కొని నిన్నటిదాకా చెల్లా చెదురుగా పడి ఉన్న హృదయం రాత్రి వచ్చిన పీడకలను చెరిపేస్తూ స్వేచ్ఛగా ,విశాలంగా మార్పుకు సిద్ధమైంది . కాలం మనస్సుకు అంటుకున్న గతకాలపు మాసిన చేదు జ్ఞాపకాలను ఊరవతలి కాలువ బండ కాడ ఉతికేసి శుభ్రంగా గాలికి ఆరవేసి ఓ చెట్టుకింద సేద తీరుతున్నది. అలా ఆకాశాన్ని గుండెల్లోకి ఒంపుకొని చూడగా అటు ఇటు కదలాడే […]

Continue Reading
Posted On :