ఆశయాల సాధనలో నిశ్శబ్ద రేయి

-డా. టి. హిమ బిందు

జాబిల్లి చెంత 

వెన్నెల రేయి చల్లనిదే..

నిదుర ఒడిలో 

జోల పాడే రేయి మధురమైనదే

ఒంటరి మనసులకు 

నిదానంగా నడుస్తూ రేయి మెల్లనిదే

ఒంటరి ప్రయాణంలో 

గుబులు పుట్టిస్తూ సాగిపోయే రేయి భయానకమైనదే

అస్వస్థతలో 

తోడు దొరకని రేయి నరకప్రాయమైనదే

ఆశయాల సాకారంలో 

సహకరించే రేయి నిశ్శబ్ద మైనదే…

కోప తాపాల నడుమ 

కొట్టుమిట్టాడుతున్న రేయి మౌనమైనదే…

ప్రేమ తోడులో 

ఊసులాడు రేయి ఆనంద నిలయమే….

ఎన్ని రేయిలయినా 

ప్రతి రేయి ప్రత్యేకమే..

ప్రతి ఉదయం 

కొత్త ఆశల ఉషోదయమే….

*****

Please follow and like us:

6 thoughts on “ఆశయాల సాధనలో నిశ్శబ్ద రేయి (కవిత)”

  1. ఒంటరి ప్రయాణంలో పగలైన రాత్రి అయినా ఆశయాల సాధనలో నిశ్శబ్ద రేయి అంటు సాగిన మీ నిశ్శబ్ద కవితలో ప్రేమ తోడైతే ఆ ఆనందమే వేరు….

  2. మీ కవిత చాల కొత్తగా మరియు ప్రేరణ కలిగించేలా ఉంది హిమ బిందు గారు …

  3. నిదుర ఒడిలో జోల పాడే రేయి. ఎంత మంచి భావన. కవిత చాలా బాగుంది.

Leave a Reply

Your email address will not be published.