కోడి కూతలోపే నీకు దిష్టి తీస్తాను ( కవిత)

-సుభాషిణి వడ్డెబోయిన

కళ్ళ లోగిలిన చూపుపడకేసి
కలల ధూపమేసి
తలపు తలుపు తెరచుకున్నా
కాలం కరుగుతున్నా
కానరాననుకోని
కాదంటానని కలత పడ్డావేమో!

సెలయేటి నవ్వులతో సంచరించిన ఊసులు
చిలిపి మాటలతో  చెప్పుకున్న ముచ్చట్లు
మనం అనే వనంలో పండు వెన్నెలలో
పడి పడి కోసుకున్న పూలనడుగు
నా మనసు సువాసనలు చెబుతాయి

మన చెలిమి వెలుగు కునుకుతో
చీకటికి కునుకాగి
జాబిలి జంట కోరికతో సిగ్గుపడి
మబ్బు ఒడిలో మునిగింది

చలికే వణుకు పుట్టి
వేడి కోసం వెతుక్కుంటూ
మదిన మత్తును కోరగా
మన పక్కలో ఒరిగి,

తొంగి చూసే జాము వెక్కిరించేలోపే
గుట్టుగా నా గుండెల్లో దూరిపో
కోడి కూతలోపే నీకు దిష్టి తీస్తాను…
కోరిన తీపి కోరికను
మూట కట్టి నీ ముందు ఉంచుతాను…

*****

2 thoughts on “కోడి కూతలోపే నీకు దిష్టి తీస్తాను ( కవిత)”

  1. కవితకు పెట్టిన పేరు చూడగానే ఎవరైనా చదవకుండా ఉండలేరేమో! చక్కని భావ వ్యక్తీకరణతో సాగిన మంచి కవిత.

  2. కవితకు పెట్టిన పేరు చూడగానే ఎవరైనా చదవకుండా ఉండలేరేమో! చక్కని భావ వ్యక్తీకరణలో సాగిన మంచి కవిత.

Leave a Reply

Your email address will not be published.