
డాక్టర్ అమృతలత – పాలపిట్ట సంయుక్త ఆధ్వర్యంలో దీపావళి (2026) కథల పోటీ
సమాజంలో మంచిని పెంచడం, మనుషుల్లో హృదయ సంస్కారాన్ని ప్రోది చేయడం సాహిత్యం లక్ష్యం. మన చుట్టూరా సంక్లిష్టతలు, సంక్షోభాలు ఎన్ని వున్నా అనివార్యమైనది బతుకు ప్రయాణం. కనుక జీవితంపై ఆశనీ, పరిస్థితులను ఎదుర్కొనే ఆత్మస్థయిర్యాన్ని అందించడానికి సాహిత్యం తోడ్పడాలి. ఈ లక్ష్యానికి అనుగుణంగా కథా సాహిత్యాన్ని ప్రోత్సహించాలన్న దృష్టితో డాక్టర్ అమృతలత – పాలపిట్ట సంయుక్తంగా ఈ ఏడాది దీపావళి (2026) కథల పోటీ నిర్వహించాలని సంకల్పించడమైంది.
సకల ప్రాంతాల తెలుగు వారు ఈ పోటీకి తమ కథలను పంపించవచ్చు.
మొదటి బహుమతిః రూ. 10000
రెండో బహుమతిః రూ. 6000
మూడో బహుమతిః రూ. 4000
పది కథలకు ప్రత్యేక బహుమతులు
ఒక్కొక్క కథకి రూ. 1000
నిబంధనలు:
– సమాజ జీవితం బహుముఖీనమైనది. మానవ జీవితంలోని ప్రతి అంశమూ ఇతివృత్తానికి అర్హమైనది. కనుక కథా వస్తువు ఎంపిక రచయితల అభీష్టం. సామాజిక సంఘటనలే కాదు, మనిషి అంతరంగ అలజడుల్లోని పలు పార్శ్వాలను కథల ఇతివృత్తాలుగా ఎంపిక చేసుకోవచ్చు.
– ఏం చెప్పాలన్నదే కాదు ఎలా చెప్పారన్నది కథకు కీలకం. వస్తువును వినూత్న రీతిన సౌందర్యభరితంగా సృజించడం ప్రధానం. కనుక సరికొత్త కథా సంవిధానానికి పోటీలో ప్రాధాన్యం ఉంటుంది.
– పోటీకి పంపించే కథలు కొత్త కథలయి ఉండాలి. ఇదివరకు ఎక్కడా ప్రచురితం, ప్రసారమయి ఉండకూడదు. బ్లాగుల్లో, వాట్సాప్‌ల్లో ఏ ఇతర సోషల్ మీడియా వేదికలలో పోస్టు చేసి ఉండరాదు. ఈ మేరకు హామీపత్రం జత చేయాలి.
– కథ కథగా ఉండాలి. అచ్చుతప్పులు ఉండకూడదు. కథ అయి ఉండాలే తప్ప మినీ నవల, నవల కాకూడదు.
– కథలను పోటీకి పంపించేవారు తమ పూర్తి చిరునామాను కథతోపాటు పంపించాలి.
– కంపోజ్ చేసి పంపించేవారు వర్డ్ ఫైల్‌తో పాటు పిడిఎఫ్ జత చేయాలి. అను ఫాంట్స్లోనూ కథలను కంపోజ్ చేసి పంపించవచ్చు.
– కథను కాగితాల మీద రాసి పంపించేవారు, ఒక కాపీని మెయిల్ చేసినా విధిగా పోస్టు చేయడం మంచిది. స్కాన్డ్ కాపీలలో స్పష్టత ఉండదు.
` పోటీకి పంపించే కథలు తిరిగి పంపించడం సాధ్యం కాదు. కనుక ఒక కాపీ దగ్గర ఉంచుకోవాలి.
– కథల ఎంపికలో పాలపిట్ట సంపాదకవర్గానిదే తుది నిర్ణయం. దీనిపై ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.
– పోటీలో ఎంపికయ్యే కథలు పాలపిట్టలో ప్రచురితమవుతాయి.
చిరునామాః ఎడిటర్, పాలపిట్ట
ఫ్లాట్ నెం:3, బ్లాక్-6, ఏపిహెచ్‌బి
బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్-500044
ఫోనుః 94900 99327
email: palapittamag@gmail.com
మీ కథలు మాకు చేరడానికి చివరి తేదీ: – 20 అక్టోబర్ 2026
ఫలితాల ప్రకటన: 5 నవంబర్ 2026
*****
