“నెచ్చెలి”మాట

విలువ

-డా|| కె.గీత 

దేనికెంత
విలువ
ఉన్నది
ఈ
జీవితమునందు?

ఇచ్చినవాటికి
ఇచ్చినంత!
ఇవ్వనివాటికి
ఇవ్వనంత!!

కాస్త
అర్థమయ్యేటట్లు
సెలవిస్తారా?

సెలవూ
లేదు
గుడ్ బై
లేదు

ఉన్నది
ఉన్నంత!
లేనిది
లేనంత!!

ఏమిటది?

అదేనండీ
విలువ!
దేనికైనా ఇచ్చే
విలువ!
ఎప్పటికప్పుడు
మారిపోయే
విలువ!

ఏమది?
ఎప్పటికప్పుడు
మారిపోయెడిదా?
బహు
చిత్రముగా
నున్నది!

చిత్రమా
మజాకానా!
మనిషి
మనసే
బహు విచిత్రము

కొన్నాళ్లు
ప్రేమకి విలువనిస్తే
కొన్నాళ్లు
ద్వేషానికి విలువ
కొన్నాళ్లు
చదువుకి విలువ
కొన్నాళ్లు
డబ్బుకి విలువ

నీ
కులానికి విలువ
నీ
స్టేటస్ కి విలువ

నీ అవసరం
ఉన్నంతసేపూ
నీ మాటకి విలువ
అవసరం తీరగానే
నీ నీడకి కూడా
లేదు విలువ

ఇక
రచయితలు
మరీ ఘోరం!
నాయకులు
రాజకీయ నాయకులు
వీరి ముందు
బలాదూర్!

వారికి
అసలు
అర్థం
తెలియని
పదమే
విలువ-
నీ
పుస్తకాలంటే
గొప్ప
పరాయివారి
పుస్తకాలంటే
చెత్త

సమాజాన్ని
ఉద్ధరించు వారు
తమనుద్ధరించుకోలేరు

హతవిధీ!
ఏదెప్పుడు
ఎందుకు
విలువనొందునో
ఎవరికి ఎరుక!

అదే మరి
వచ్చిన చిక్కు
మనిషికి
విలువ నివ్వనిది
మరెవ్వరో
కాదు
మనిషే !!

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.

మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.

వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి”లో  వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

సెప్టెంబరు, 2026 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు:  ఆర్.దమయంతి

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: సంపాదకీయం – డాక్టర్ కె.గీత 

ఇరువురికీ  అభినందనలు!

****

Leave a Reply

Your email address will not be published.