“నెచ్చెలి”మాట

సర్వేజనా సుఖినోభవంతు!

-డా|| కె.గీత 

సర్వేజనా సుఖినోభవంతు!

అంటే….
నేను
నా పెళ్ళాం/మొగుడు
పిల్లలు
అనేగా?!

అదికాదండీ-

సరే సరే
అర్థమైంది-
మేమూ,
మా
అత్తగారి
తరఫు వాళ్ళు …
అంతేగా

అదీ కాదండీ
ఓహో
మేమూ,
మా
అత్తగారి
తరఫు వాళ్ళు,
మా
అమ్మగారి
తరఫు వాళ్ళు…

హయ్యో..
ఖర్మ!

ఆగండాగండి-
మేమూ,
మా వాళ్ళు,
కాస్త
కలుపుకుంటే
ఉపయోగపడే
బంధువులు…
అంతే
కాకుండా
పనికొచ్చే
స్నేహితులు

ఆహా
ఏమి సెలవిచ్చితిరి!
వెంటపడని
అప్పిచ్చువారు
అద్దె అడగని
ఇల్లుగలవారు
బాకీ రాయని
పచారీ కొట్టువాడు
ఎంత కాదన్నా
మంచి చేయువారు
….
వీరందరినీ
మరచితిరే!!

అయ్యో
మీరు
మరీ
మొహమాటపెట్టేస్తున్నారు-
అవునండోయ్
వారందరినీ
కూడా
కలుపుకుందాం
అదేగా
సర్వేజనా సుఖినోభవంతు
ఎప్పుడూ
మనమేకాదు
కాస్త
అవసరానికి
పనికొచ్చే
వాళ్ళనీ
కలుపుకోవాలి మరి!

హయ్యో
ఖర్మ!
మీవంటి వారి వల్లనే
అర్థములకు
అర్థములు
మారిపోవుచున్నవి
వాడుకొనుటయే
నేటి
సర్వజనానీకమునకు
పరిపాటి అయినది!

సర్వేజనా సుఖినోభవంతు!
సర్వేజనా సుఖినోభవంతు!!

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.

మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.

వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి”లో  వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

అక్టోబరు, 2026 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: శింగరాజు శ్రీనివాసరావు
ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: వానకు తడవని రాయి- – పొత్తూరి సీతారామరాజు
(నెచ్చెలి-2026 కవితల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత)

ఇరువురికీ అభినందనలు!

****

Leave a Reply

Your email address will not be published.