నెచ్చెలి-2024 కథా, కవితా పురస్కారాల పోటీలు

(ఆఖరు తేదీ మే10, 2024)

-ఎడిటర్

నెచ్చెలి 5వ వార్షికోత్సవం (జూలై10, 2024) సందర్భంగా నిర్వహిస్తున్న ద్వితీయ కథా, కవితా పురస్కార పోటీలకు రచనలకు ఆహ్వానం!

మొదటి బహుమతి పొందిన కథకు
*శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం*

మొదటి బహుమతి పొందిన కవితకు
*డా|| కె.గీత ఉత్తమ కవితా పురస్కారం*

బహుమతులు:

కథలకు:
మొదటి బహుమతి (ఉత్తమ కథా పురస్కారం)- రూ.3000/-
ద్వితీయ బహుమతి – రూ.2000/-
తృతీయ బహుమతి – రూ.1000/-
ప్రత్యేక బహుమతి– రూ.500/-

కవితలకు:
మొదటి బహుమతి (ఉత్తమ కవితా పురస్కారం)- రూ.1500/-
ద్వితీయ బహుమతి – రూ.1000/-
తృతీయ బహుమతి – రూ.750/-
ప్రత్యేక బహుమతి – రూ.250/-

సాధారణ ప్రచురణకు 20 కథలు, 20 కవితలు స్వీకరించబడతాయి.

ఎంపిక చేసిన కథలు, కవితలు “నెచ్చెలి”లో జూలై నెల నుండి నెలనెలా ప్రచురింప బడతాయి.

నిబంధనలు:-
* ఇతివృత్తం: స్త్రీలకి సంబంధించిన అంశం ఏదైనా.
* రచనతో బాటూ ఎక్కడా ప్రచురణ కాలేదనీ, పరిశీలనకు పంపలేదని హామీపత్రం జతచెయ్యాలి. హామీపత్రం లేని కథలు, కవితలు స్వీకరించబడవు.
* కథలు వర్డ్ ఫైల్ లో పది పేజీలకు మించకుండా, కవితలు వర్డ్ ఫైల్ లో 2 పేజీలకు మించకుండా తప్పనిసరిగా యూనికోడ్ లో ఉండాలి. పీడీఎఫ్ కూడా జత చెయ్యాలి.
* ఒక్కొక్కరు ఒక్క కథ (లేదా) ఒక కవిత- ఏదైనా ఒక్కటి మాత్రమే పంపాలి.
* రచనతో బాటూ చిన్న పారాగ్రాఫులో యూనికోడ్ లో రచయిత(త్రి) పరిచయం, ఫోటో, ఈ-మెయిలు, ఫోను నంబరు జతపరచాలి.
* ఈ-మెయిలు మీద “ నెచ్చెలి- కథ-కవితల పోటీ-2024కి” అని రాసి editor@neccheli.com కు పంపాలి.
*నెచ్చెలిలో నచ్చిన మూడు రచనల మీద గానీ, నెచ్చెలి యూట్యూబ్ వీడియోల మీద గానీ విశ్లేషణాత్మక వ్యాఖ్యలు పత్రికలో (లేదా) యూట్యూబులో తప్పనిసరిగా పోస్టు చెయ్యాలి. పోస్టు చేసిన వ్యాఖ్యల వివరాలు ఈ-మెయిలుకి జతపరచాలి.
* రచనలు చేరవలసిన ఆఖరుతేదీ: మే10, 2024. గడువుతేదీ తర్వాత అందినవి పరిశీలింపబడవు.
* బహుమతుల విషయంలో న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్త్యుత్తరాలకు తావులేదు.
* పోటీ ఫలితాలు “నెచ్చెలి” 5వ జన్మదిన సంచికలో జూలై 10, 2024న వెలువడతాయి.

***

నిర్వాహకులు:
డా.కె.గీత, సంస్థాపక సంపాదకులు,  నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.