బతుకమ్మ పద్యాలు

-సముద్రాల శ్రీదేవి

సృష్టిలోన పూలు స్త్రీ జాతిరూపము
ప్రకృతి మాతగాను బ్రతుకునిచ్చు
తల్లిగ బ్రతుకమ్మ తా తెలంగాణలో
దివ్యమైన బాట దేవిమాట

తీరుతీరు పూలు గౌరమ్మగను నవ
రాత్రులందు మారి చిత్రముగను
నీకు సాటిలేరు నేడు మా బ్రతుకమ్మ
దివ్యమైన బాట దేవిమాట

సంబురాలు జేస్తునంబరమ్ముగ మార్చి
నారిగణము నాడు దీరులైరి
న్యాయస్థాపనంబు నవ్విడె బ్రతుకమ్మ
దివ్యమైన బాట దేవిమాట

ఊరువాడయాటలుయ్యాల పాటలు
నూరెగుబ్రతుకమ్మలుత్సవముగ
వనములోన మనము జనజాతర గణము
దివ్యమైన బాట దేవిమాట

కల్పవల్లి సకల కళల తెలంగాణ
పుడమిపైన నేడు పూలలొల్లి
యాడుకొనును ఘనముగతివలు సతతము
దివ్యమైన బాట దేవిమాట

*****

Leave a Reply

Your email address will not be published.