image_print

పడమటి దిక్కున వీచిన వింజామర ఈ సెలయేటి దివిటీ!

పడమటి దిక్కున వీచిన వింజామర ఈ సెలయేటి దివిటీ! -వి.విజయకుమార్ (కె. గీత గారి సెలయేటి దివిటీ పై చిరుపరామర్శ) కొండ వాలున నించుని ఆకాశం కేసి చూస్తూన్నప్పుడు నిరాధార జీవితం మీద ఒక వాన పూల తీగొచ్చి పడి పరిమళభరితం చేసినట్టు ఏ చిన్న అనుభవాన్నైనా రాగ రంజితం చేసి, ఒక్కో పద హృదయం పై పుప్పొడి పరిమళాలద్ది, వర్ణ శోభితాలైన సీతాకోకచిలుక లేవో అనుభూతుల మకరందాలను అందుకోకుండా పోతాయా అనుకుంటూ అన్వేషి స్తుంది కవయిత్రి […]

Continue Reading

వెలిబతుకుల నిషిద్ధాక్షరి అర్ధనారి ( బండి నారాయణస్వామి అర్థనారి నవలా సమీక్ష)

వెలిబతుకుల నిషిద్ధాక్షరి అర్ధనారి (బండి నారాయణస్వామి అర్థనారి నవలా సమీక్ష) -వి.విజయకుమార్ “…మగ శరీరాలలో దాక్కున్న ఆడతనాలు గోడలు పగలగొడుతున్నాయి. గీతలు చెరిపేస్తున్నాయి. ప్రవాహపు ఒడ్డుల్ని తెగ్గొడుతున్నాయి. వారు గలాటా చేస్తున్నట్టు లేదు. దేనినో అపహసిస్తూ ఉన్నట్టున్నారు. దేనిని? లోకాన్ని! సమాజాన్ని! పితృస్వామ్యంలో మగ కేంద్రాన్ని!          జీవిత యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు, కుటుంబానికి, ఊరికి వెలి అయిన వాళ్లు, సమాజం గేలి చేసిన వాళ్ళు, శరీరమే పరిహాసాస్పదమైనవాళ్లు!       […]

Continue Reading

నాగరీక పంకిలాన్ని కడిగేసిన బతుకు చిత్రం- రేవతి రాసిన ఒక హిజ్రా ఆత్మ కథ

నాగరీక పంకిలాన్ని కడిగేసిన బతుకు చిత్రం- రేవతి రాసిన ఒక హిజ్రా ఆత్మ కథ -వి.విజయకుమార్ ఇవ్వాళ తృతీయ ప్రవృత్తి గురించి మాట్లాడటం మరీ అంత ఘోరమైన విషయమేమీ కాదు! నిన్న మొన్నటిదాకా వారి పట్ల సానుభూతిని కలిగివుండటం, వారి సమస్యల పట్ల మాట్లాడటం కూడా ఒక వింత! రక్త మాంసాలూ, హృదయ రాగాలూ అన్నీ వున్నా జెనిటిక్ ఇంజనీరింగ్ లో జరిగిన యే అపసవ్యత వల్లో అటు పురుషుడి లక్షణాలనో, ఇటు స్త్రీ లక్షణాలనో సంపూర్ణంగా […]

Continue Reading

నోబెల్ సాహితీ పురస్కార గ్రహీత ఆనీ ఎర్నా

నోబెల్ సాహితీ పురస్కార గ్రహీత ఆనీ ఎర్నా మగువల నిషిద్ధ జ్ఞాపకాల స్వేచ్ఛా గీతిక -వి.విజయకుమార్           ఆనీ ఎర్నాకి ఇప్పుడు ఎనభై రెండేళ్ళు. ఆమెను నోబెల్ వరించడంతో సాహిత్య లోకమంతా ఆమె వైపు ఒక్కసారిగా అవాక్కయి చూట్టానికి పెద్ద కారణమే ఉంది, “తన అంతః చక్షువుతో వైయక్తిక స్మృతిపథంలోని మూలాల, ఎడబాట్ల, సమిష్టిగా ఎదురొడ్డే అడ్డుగోడల్ని ఛేదిస్తూ శోధించే స్పష్టతకూ, సాహసానికీ” నీరాజనాలు పడుతూ ఈ తొలి ఫ్రెంచ్ మహిళామణికి […]

Continue Reading

వేదనాగ్ని లో పుటం పెట్టిన అక్షరాలే హైమవతి కవిత్వం! (నీలిగోరింట కవిత్వ సమీక్ష)

వేదనాగ్ని లో పుటం పెట్టిన అక్షరాలే హైమవతి కవిత్వం!    -వి. విజయకుమార్ స్త్రీవాద కవిత్వంలో చెరగని సంతకం మందరపు హైమావతి. ఆంధ్రజ్యోతి ‘ఈ వారం కవిత’ ఒక నాటి యువ కవితా హృదయాల వేదిక. యువ కలాల యవనిక. పేజీ నిండుగా పరచుకొని అడుగు ముందుకు పడకుండా ద్వారం దగ్గరే నిలవరించే కవితా డోలిక. ఎన్ని హృదయాల్ని అలరించేదో, ఎందరి వేదనల్ని పలికించేదో, ఎందరి స్వప్నాల్ని ఉయ్యాల లూగించేదో! “సర్పపరిష్వంగం”  ఒక రోజు తొలిపేజీపై వచ్చి […]

Continue Reading

ఇదీ ఓ అమ్మ కథే! (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 ఇదీ ఓ అమ్మ కథే! (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – వి.విజయకుమార్ మనసంతా దిగులుగా వుంది. నిన్నటిదాకా చీకూ చింతా లేకుండా ఏదో రాసుకుంటూనో, చదూకుంటూనో కాలక్షేపం చేస్తూ వెళ్లిపోతున్న జీవితం అనుకోకుండా ఒక మలుపు తిరిగింది. చాలా గిల్టీగా వుంది! నేను చేసిన ద్రోహం ఇంత మంది మర్యాదస్తుల్ని నొప్పిస్తున్నదని తెలిసేలోగా ఘోరం జరిగింది. హృదయాన్ని కెళ్ళగించే బాధ ఒక పట్టాన విడివడక వెంటాడుతోంది. నేను చేసిన నేరం నన్ను ముద్దాయిని […]

Continue Reading

అంగార స్వప్నం (ఊర్మిళ కవితా సంకలనంపై సమీక్ష)

 అంగార స్వప్నం ( ఊర్మిళ) కవితా సంకలనంపై చిరు పరామర్శ    -వి. విజయకుమార్ ఊర్మిళ పలవరించిన అందమైన రంగులకల ఈ అంగార స్వప్నం! ఈ నులివెచ్చని కల దొంగిలించబడిందో లేదో తెలీదు కానీ, దొంగిలించిన కలని భుజాన వేసుకొని అటు తిరిగే పరిశుద్ధాత్ములు ఎందరో, అంటిన మరకలు తుడుచుకొంటో ఎప్పటిలాగే యీ ‘నేను’ లు ఎందరో! అటుచేతిరాతలు పోయాయ్, అనుభూతుల్ని కవిత్వీకరించుకొని, ఉల్లిపొర కాగితపు హృదయం మీద అందంగాపరిచి, అందించిన వాటిని ఆప్యాయంగా స్పృశించి, అమ్మలా […]

Continue Reading