కాశీలో శవాలు

మగధ్ మూలం : ఇంగ్లీష్ అనువాదం : శ్రీకాంత్ వర్మ

తెలుగు సేత:వారాల ఆనంద్

కాశీ చూసావా
అక్కడ శవాలు వస్తూ వుంటాయి పోతూ వుంటాయి

శవాలదేముంది
శవాలు వస్తాయి పోతాయి

అయితే ఈ శవం ఎవరిదని అడగనా
రోహితాస్వునిదా? కాదు కాదు
అన్నీ రోహితస్వునివి కావు

అతని శవాన్ని
దూరం నుంచే గుర్తించొచ్చు
దూరం నుంచి కాకపోయినా
దగ్గరి నుంచయినా గుర్తించొచ్చు
ఒకవేళ దగ్గరి నుంచీ గుర్తించకపోతే
అది రోహితస్వునిది కాదు మరి

ఒకవేళ అయితే కూడా పెద్ద తేడా ఏముంటుంది

మిత్రులారా మీరు కాశీని చూశారు
ఒకే దారివెంటా శవాలు
వస్తాయి పోతాయి

నువ్వు దారిచ్చి
ఎవరి శవమని అడిగావు అంతేకాదా

శవం ఎవరిదయితే మాత్రం ఏముంది
ఎవరిది కాకుంటే మాత్రం
పెద్ద తేడా ఏముంది

*****

Leave a Reply

Your email address will not be published.