జార్జి-రెక్కవిప్పిన రెవల్యూషన్..!!

-శోభరమేష్

అది తూర్పు దిక్కు
వియత్నాం విప్లవ హోరు
గాలులు వీస్తున్న కాలం !
లాటిన్ అమెరికా
జాతీయోద్యమాల
అగ్ని పర్వతాలు వెదజల్లే
లావావేడి గాలులు..!
హిమగిరులను
మరిగిస్తున్న కాలం
సహారాఎడారి దేశాల
నల్ల బానిసలు
నైలునది కెరటాలై
సామ్రాజ్య పునాదులను
పెకలించి వేస్తున్న
ఝంఝూనిల షడ్జ ద్యానాలు
విద్యాచనంలో
మర్మోగుతున్న రోజులు
పాలస్తీనా విమోచనోద్యమం
ఉష్ణరక్త కాసారపు
భుగ భుగలు పీడితప్రజల
రక్తనాళాలను ఉరుకలు
వేయించుతున్న కాలం
ఘనీభవించిన
ఓల్గాను త్రోసి రాజంటూ
పరవళ్ళు తొక్కుతున్న
యాంగ్జి నది నురగలు
మెరిసే మిలమిలలు
గంగ గోదావరిలపై
ప్రతిబింబిస్తున్న కాలం !
దేశాల స్వాతంత్రాలూ
జాతుల విమోచనాలూ
ప్రజల విప్లవాలు
కల్సి ప్రతిపక్షం కూటమిగా
చెట్టాపట్టాలేసు కొని
దళారి పంతుల భూగోళం పై
పెను తుఫాన్లు సృష్టిస్తున్న
ప్రళయ కాలం
వీచిన చల్లని పైరగాలిలకు
కలకత్తా విశ్వవిద్యాలయ
ప్రాంగణపు ” విద్యావస్థ “
ఎర్ర గులబీలతో
విరబూసిన పరిమళాలను ..
నక్సల్బరీ వసంతం
శ్రీకాకుళం కొండల్లో
గోదావరి లోయలు
తెలంగాణ మాగాణాల
పయనించి ఉస్మానియాలోని
సామాజిక విజ్ఞాన జిజ్ఞాన
పరులను ..
ముక్క పుటలను సోకాయి !
సువాసనల కైపునుంచి
తేలుకోక ముందే
ప్యారిస్ విశ్వవిద్యాలయాలలో
రెక్కవిప్పిన రివల్యూషన్
చప్పళ్ళ ప్రతిబింబించాయి !
ఆందీస్ కొండల
అమెజాన్ జలపాతాలలో
ఎలక్ట్రిక్ టర్చైన్ మీద దూకి
చేగువేరా చైతన్య దీపం
జార్జి హృదయ సారల పై
పరివర్తన చెంది ఈ మెదడు
క్యాంపస్ లో ప్రగతిశీల దీపాలను
వెలిగించే యజ్ఞాన్ని తలపెట్టింది
వసతి భవనాల వెంట
జీనా హైతో మరనా సిక్
కదమ్ కదమ్ పర్ల లడ్న సీకోక్స్
వీరగంధం పూసింది..!
తరగతి గది అనుభౌతిక
శాస్త్రమందు గోల్డ్ మెడల్
గతితార్కిక భౌతికవాదంలో
పాండిత్యం పొందింది
వేద వాదులు
నిలువెల్లా మండిపోయారు
అధర్మం నిప్పులు కురిపించింది
హిందుత్వం పడగ విప్పింది
మతోన్మాదం విషం కక్కింది
చీకటిలో బతికేందుకు
మతోన్మాద గబ్బిలాలు
వెలుతురు మీద పగ పట్టాయి
జ్ఞాన దీపాన్ని ఆర్పాలని
గోలుసులు బిగించాయి
మట్టుపెట్టాలని కత్తి కట్టారు
ఏప్రిల్ 14న
వెలుతురు మీద
చీకటి దాడి చేసింది
అక్కడికక్కడే ఆ మెదడు
ఆలోచించడం మానలేదు.
జ్ఞాన దీపం ఆరిపోయింది
అది విస్పోటనం చెల్లింది
ఆ విస్పోటన జ్ఞానాన్ని పరమాణువులుగా
రూపాంతరం చెంది !
అనంతశక్తిని విడుదల చేసింది
అది E=MC² అనుభౌతిక
సూత్రం వంటి సామాజిక శక్తి
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం
జగిత్యాల జగిత్యాయాత్ర మారుమ్రోగి
ఇంద్రవెల్లి దండకారణంలో
ప్రజా ఉద్యమానికి
నీవు అందించిన
జ్ఞాన దీపం ఆరిపోలేదు
లక్షకాంతి పుంజాలను
నిత్యనూతనంగా
విరజిమ్ముతూ ఉన్నది

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.