“నెచ్చెలి”మాట 

ఎన్నికలనగా-

-డా|| కె.గీత 

ఎన్నికలు అనగా నేమి?
నిష్పక్షపాత
నిర్బంధరహిత…
……
అడిగింది
ఉపన్యాసం
కాదండీ

పోనీ
అతిపెద్ద
ప్రజాస్వామ్యదేశ
వ్యవస్థీకృత…
……
అడిగింది
నిర్వచనం
కాదండీ

అసలు
అడిగింది
ఏవిటి?

అడగడం
ఏవిటి?
మీకేం
తెలుసో
కనుక్కుంటుంటేనూ?

ఓహో
అలా వచ్చారా!

అయినా ఏముందిలెండి!
టీవీల్లో
యూట్యూబు ఛానెళ్ళలో
సోషల్ మాధ్యమాల్లో
ఊదరగొట్టడం
చూడ్డం లేదా?

ఎన్నికలనగా
ఒకరినొకరు
తిట్టుకొనుట-
ఆడిపోసుకొనుట-
దుమ్మెత్తి పోయుట-

ఏసీ బస్సులో
షికారు కొచ్చే
నాయకుల
పదినిమిషాల
ఉపన్యాస విన్యాసాలు
ఎవరి కొరకు?

ఆ సభల కోసం
పొద్దుట్నించీ
ఎండల్లో
మలమాలమాడే
జనానీకపు గోడు
పట్టించుకొనుటకా?
ఓట్లు కొల్లగొట్టుటకా?

ఎన్నికలనగా
గూడుపుఠాణీలు చేయుట-
మద్యం ఏరులై పారించుట-
నల్లడబ్బు విరివిగా పంచుట-
రిగ్గింగులకు పాల్పడుట-

అసలు ఎన్నికలు
ఎవరి కొరకు?

ఇది కూడా జ్ఞానంబును
పరీక్షించుట కొరకేనా?!

అయినా ఎన్నికలు
ఇంకెవరి కొరకు?
ఏలిన వారి కొరకు!
ఏలుచున్న వారి కొరకు!
ఏలబోయెడి వారి కొరకు!

మరి
కష్టించి
ఎండా కొండా అనక
పడిగాపులు పడి మరీ
ఓట్లేసే
జనానీకం సంగతో!

ఎందుకులెండి
ఉపన్యాసాలు ఇవ్వడం….

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

          ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

          మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

          వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

ఏప్రిల్ 2024 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు:V.Vijayakumar
ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: Diary of a New Age Girl -Chapter 10 Toxicity in American Politics and Society by Varudhini

ఇరువురికీ అభినందనలు!

****

Please follow and like us:

5 thoughts on “సంపాదకీయం-మే, 2024”

  1. ఈసారి నెచ్చెలి సంపాదకీయం నాకు బాగా నచ్చింది. కవిత రూపంలో సూటిగా వాస్తవానికి అద్దం పట్టింది.

    ఎన్నికలంటే కొత్త నిర్వచనాలు ఇప్పుడు అమలులో ఉన్నాయి. ఆ సంగతిని ఈ సంపాదకీయం వ్యంగ్యంగా బయటపెట్టి దుమ్మెత్తి పోసింది. ‘

    ‘ ఎన్నికలంటే ఎన్నికలు ఎవరి కొరకు ? ఏలిన వారి కొరకు ! ఏలుచున్న వారి కొరకు! ఏలబోయెడి వారి కొరకు ! ‘ అనే సత్యం చెబుతూనే ‘ కష్టించి ఎండా కొండ అనక పడిగాపులు పడి మరీ ఓట్లేసే జనానీకం సంగతో !’ అని ప్రశ్నిస్తుంది. సమయానికి తగు సంపాదకీయం .

  2. ఎన్నికలనగా
    ఒకరినొకరు
    తిట్టుకొనుట-
    ఆడిపోసుకొనుట-
    దుమ్మెత్తి పోయుట-ఈ కవిత సులభ పదాలతో వ్యంగ్యాత్మకంగా వుంది.

    నేటి 2024 ఎన్నికల భారతాన్ని, ఆంధ్ర దేశాన్ని చూపించింది.

Leave a Reply

Your email address will not be published.