రేపటి ఉషోదయాన

ఫ్రెంచ్ మూలం: విక్టర్ హ్యూగో

ఆంగ్లం: విక్టర్ హ్యూగో

తెలుగు సేత: ఎలనాగ

రేపటి ఉషోదయాన పల్లె తెల్లబారినప్పుడు

               నేను బయలుదేరుతాను

               నువ్వు నా కోసం నిరీక్షిస్తుంటావని తెలుసు

               అడవిలోంచి, పర్వతాలమీంచి ప్రయాణిస్తాను

               ఇక ఎంత మాత్రం నీకు దూరంగా ఉండలేను

 

               నా దృష్టిని నా ఆలోచనల మీద నిలిపి

               భారంగా నడుస్తాను

               చుట్టూ వున్న దేన్నీ పట్టించుకోకుండా

               ఏ చప్పుడునూ వినకుండా

               ఒంటరిగా, అజ్ఞాతంగా, వంగిన వెన్నుతో,

               చేతులను గుణకారపు గుర్తులాగా పెట్టుకుని

               దుఃఖితుడనై నడుస్తాను

               పగలు కూడా రాత్రిలాగా ఉంటుంది నాకు

 

               సాయంసంధ్యలోని స్వర్ణకాంతులను గాని,

               దూరాన హార్ల్ ఫ్లూర్ రేవులో

               అవనతమవుతున్నతెరచాపల్ని గాని చూడను

               నేను రాగానే నీ సమాధి మీద

               పచ్చని పుష్పగుచ్ఛాన్ని ఉంచుతాను

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.