షర్మిలాం “తరంగం” మానవాళి నివాళి -షర్మిల ఒక్కోసారి ధైర్యం పోగొట్టుకుంటాం. మన చుట్టూ మమతలు పెనవేసుకున్న వారెందరో నిష్క్రమిస్తుంటే నిస్సహాయంగా వుండిపోవడం ఎంత శిక్ష ? కరోనా ఎందర్ని ఎత్తుకుపోయిందో తల్చుకుంటే గుండె చెరువవుతుంది. ఆషామాషీగా ముక్కుకి నోటికీ ఒక మాస్క్ వేసుకుంటే దగ్గరకు రాదనుకొనే కోట్లాది జనంలాగానే నేనూ కాబోలనుకున్నాను. కానీ మృత్యుదేవత మారువేషమని నా సన్నిహితులెందరినో పోగొట్టుకున్నాకే అర్ధం అయ్యింది. కరుణాకర్ మా మరిది ఫ్రెండ్. నేను పెళ్ళయి అత్తగారి ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి “వదిన గారూ ! అంటూ నీడలా తిరిగేవాడు. నా కూతురు మాకంటే Continue Reading