image_print

కళాత్మక హృదయం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

కళాత్మక హృదయం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – ములుగు లక్ష్మీ మైథిలి ఆమె చేతి వేళ్ళు వెదురు బద్దలపై ప్రతిరోజూ నెత్తుటి సంతకం చేస్తాయి పంటి బిగువున బాధను బిగబట్టి పక్షి గూడు అల్లుకున్నట్టు ఎంతో ఓపికగా బుట్టలు అల్లుతుంది ఆమె చేయి తాకగానే జీవం లేని వెదురుగడలన్నీ సజీవమైన కళాఖండాలుగా అందంగా రూపుదిద్దుకుంటాయి తనవారి ఆకలి తీర్చటం కోసం రేయింబవళ్ళు ఎంతో శ్రమిస్తుంది తెగిన వేళ్ళకు ఓర్పును కట్టుగా కట్టుకుని […]

Continue Reading

నేను (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

నేను (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – ములుగు లక్ష్మీ మైథిలి నేను లేని ఇల్లు లేదు నేను లేక ఈ జగతి లేదు ప్రతి ఇంట్లో అనుబంధాల పందిరి వేస్తాను మన ఆడపడుచుల పొత్తిళ్ళ నుండి చెత్త కుప్పలోకి విసిరేసే కర్కశత్వానికి సవాల్ ను నేను కొలతలు తప్ప మమతలు తెలియని మృగాళ్ళు ఉన్న జనారణ్యంలో సమానతలంటునే సమాధి చేస్తారు ఎన్నో మైళ్ళ పురోగమనంతో అలుపెరగని పయనాన్ని బాధ్యతల బరువును మోస్తూ ఏ […]

Continue Reading

పూలమ్మ (కథ)

పూలమ్మ (కథ) – ములుగు లక్ష్మీ మైథిలి సంధ్యా సమయం. అప్పుడే విచ్చుకుంటున్న మల్లె పూలను దండలుగా కట్టి, అమ్ముకోవడానికి వీధిలోకి వచ్చింది సీతవ్వ. అనారోగ్యంతో మంచం పట్టిన భర్తకు చేదోడు వాదోడుగా ఉండటానికి పూల వ్యాపారం మొదలుపెట్టింది. ప్రతీరోజూ ఇంటి ముందున్న మల్లె, కనకాంబరాలు, చామంతుల మొక్కలకు ప్రతీరోజూ నీరు పోసి, ఎరువు వేసి పెంచుతుంది. సాయంత్రం సమయానికి పూలు మాలలుగా కట్టటం కోసం మధ్యా హ్నం నుంచే  అన్ని రకాల పూలతో మాలల కట్టి […]

Continue Reading

కొడిగట్టిన దీపం (కవిత)

కొడిగట్టిన దీపం -ములుగు లక్ష్మీ మైథిలి నడుస్తున్న దేహం పై రాబందులు వాలుతాయిబతికి ఉండగానే నిలువునా చీల్చి చెండాడతాయిఆకలి తీరగానే నిర్దయగా వదిలేస్తాయితనువు అచేతనంగా మిగులుతుందిఆప్యాయతల తాలుకు కట్టిన తాయెత్తులు,రక్షరేకులు ఫలించవెందుకో?!..చలనం లేని ఆ దేహం కోసం కొన్ని నేత్రాలు అశృపూరితాలవుతాయికొన్ని చూపులు అగ్ని కురిపిస్తాయిసాయంత్రానికి వాడవాడలా కొవ్వొత్తులు ప్రశ్నిస్తాయిఏవేవో గొంతుకలు నినదిస్తాయి…తనరాక కోసం ఎదురుచూస్తున్నకళ్ళు…నిదురను వారిస్తున్నాయి..ఇంటి దీపం ఎక్కడ కొడికడుతుందేమోననీఆకాశంలో వెన్నెల ముఖం మసకబారిందినిన్నటిదాకా ఆడిపాడిన మేనుఇనుపహస్తాల గోట్లకు గాటుపడి రక్తమోడుతోంది…రాకాసుల కసికివారి కంటి వెలుగు శిథిలమైందినిండు పున్నమిని మాంసపుముద్ద […]

Continue Reading

ఆత్మీయ నేస్తం (కవిత)

ఆత్మీయ నేస్తం -ములుగు లక్ష్మీ మైథిలి ప్రతి ఉదయం అలారమై పిలుస్తుంది బ్రతకడానికి పాచిపని అయినా ఇంటి మనిషిలా కలిసిపోతుంది ఒక్క చేత్తో ఇల్లంతా తీర్చిదిద్దుతుంది నాలుగు రోజులు రాకపోతే డబ్బులు తగ్గించి ఇచ్చే నేను.. ఇప్పుడు లాక్ డౌన్ కాలంలో పనంతా నా భుజస్కంధాలపై వేసుకున్నా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ పని మొత్తం చిటికెలో చేసేది నిత్యం ముంగిట్లో ముగ్గులు ఆమె రాకను తెలియచేస్తాయి పెరట్లో చిందరవందరగా వేసిన గిన్నెలన్నీ ఒద్దికగా బుట్టలో చేరేవి ఒక్కోరోజు […]

Continue Reading

ఒంటరి (కవిత)

ఒంటరి (కవిత) -ములుగు లక్ష్మీ మైథిలి రాతిరి కొన్ని బాధలు కరిగిస్తుంది అర్థరాత్రి నిశ్శబ్దం వెలుతురు నాహ్వానిస్తూ గడిచిన వెతలకు జవాబు చెపుతుంది రాతిరి నా అక్షరాలు నల్లని చీకటిని చీల్చే కాంతి పుంజాలవుతాయి చెదిరిన ఆశల తునకలను కవిత్వం గా అల్లుకుంటాను రాతిరి వెన్నెల లో ఊసులు చెప్పుకొని ఎన్నాళ్ళయిందో? ఆ నిశీధి మౌనంలో హృదయాల సవ్వడులు మూగగా మాట్లాడుకుంటాయి రాతిరి నిదురలేని రాత్రులు ఈ దేహపు ఆకాశం లో ఉదయాస్తమయాలు ఒక్కటే కన్నీటి నక్షత్రాలు […]

Continue Reading