వర్షానికి ఉత్తరం

డారి మూలం: రెజా మొహమ్మది

ఆంగ్లం: హమీద్ కబీర్ నిక్ లేర్డ్

తెలుగు సేత: ఎలనాగ

ప్రియమైన వర్షమా!

            చలికాలం గడచిపోయింది

            వసంతం కూడా చివరిదశను చేరుకుంది

            తోట నిన్ను ఎంతగానో మిస్ అవుతోంది

            నువ్వు కనపడని ఈ పరిస్థితి ఎప్పుడు ముగుస్తుంది?

 

            వర్షమా, ఓ వర్షమా!

            కరుణ నిండిన చల్లని హృదయమున్న వర్షమా!

            ఎడారుల నుండి, పర్వతాల నుండి, అరణ్యాల నుండి

            వీచే గాలికి ఎగిరే పాదచారి కాళ్ళ

            ఎర్రెర్రని ధూళి తప్ప తోటకు ఏమీ మిగిలి లేదు

            గోడల మీద, మూలల్లో దుమ్ము పేరుకుపోయింది

 

            వర్షమా, మార్దవమైన వర్షమా!

            పొద్దు వాలిన పిదప తోటలోని

            ఆఖరు పక్షి ఎగిరిపోతుంది

            దాని విప్పుకున్న రెక్కల మీద

            ఈ కవితను రాశాను నేను

            ఇది నీకు చేరుతుందా లేదా?

 

            డాలియా పూలు పొద్దంతా నీకోసం ఏడ్చాయి

            వాటి సుఖం కోసం రాశాను నేనీ కవితను

 

            వర్షమా!

            ఇది నీకు అందగానే వెంటనే రా

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.