image_print

కనబడుట లేదు ! ( కవిత)

కనబడుట లేదు ! ( కవిత) -రామ్ పెరుమాండ్ల కళ్ళున్నాచూపులేదు .బహిరంగంగా చూడడం మానేశాకఅంతర్గత అల్లకల్లోలం మరెప్పుడు చూస్తానో !  అక్కడన్ని కిరాతకంగా కుతికె పిసికి చంపిన మరణాలే  అగుపిస్తాయి.అచ్చం మేకపిల్లను అలాల్ చేసినట్లు జీవగంజి ఆశచూపి జీవం తీసుకున్నా క్షణాలెన్నో ,  కంచంలోకి మెతుకులు రావాలంటే కాసిన్ని కుట్రలు నేర్వాలని ,పూటకో పాటందుకున్న రోజులెన్నోనిజమే వేశ్య వేషమేసినా వ్యవస్థలెన్నో  దొంగకొడుకుల రాజ్యానమూగబోయిన నన్ను సందుగలో దాచిన చిన్నప్పటి పలక చీదరించుకొని చెంప చెల్లుమనిన సందర్భాలెన్నో !  నేరం నాదే నేరస్థుడే కనపడుట లేదు. లెక్కతేలనికత్తిపోట్లతో కొన ఊపిరితో తప్పిపోయిన నేను నాకు కనపడుట లేదు. ***** రామ్ పెరుమాండ్లనా పేరు రామ్ […]

Continue Reading
Posted On :

చెరగని చిరునామా (కవిత)

చెరగని చిరునామా  -రామ్ పెరుమాండ్ల రాత్రి వాహనాలన్ని ఇంటికెళ్ళాయి .కానీ ఫుట్ పాత్ పైకి ఎవరొస్తారో తెలియదు.కడుపులో ఖాళీలను పూరించడానికి ఈ లోకం ఏ ఒక్క అవకాశం ఇవ్వను లేదు .ఆకలిని వెతికి వెతికి అలిసిన కన్నులు కునుకు కోసం దారి వెతుకుతున్నాయి . ఈ దేశం చేసిన సంతకాల చట్టాలు రోజూలాగే తన ఖాళీ సంచిలో నింపుకోవడానికి వెళితే చెత్త కుప్పలో విరివిగా దొరికాయి .అయిన తనకేం తెలుసు బడి లేదు బలపం లేదు . అలా ఆ కాగితాలను పరుపుగా ఇటుక పెళ్లను దిండుగా జేసుకున్నాడు .తన ఖాళీకడుపుపై […]

Continue Reading
Posted On :

సరికొత్తగా … (కవిత)

సరికొత్తగా ….. -రామ్ పెరుమాండ్ల అనగనగా ఓ ఉదయం కనులకు చూపులను అద్దుకొని పాదాలకు  అడుగులను తొడుక్కొని నిన్నటిదాకా చెల్లా చెదురుగా పడి ఉన్న హృదయం రాత్రి వచ్చిన పీడకలను చెరిపేస్తూ స్వేచ్ఛగా ,విశాలంగా మార్పుకు సిద్ధమైంది . కాలం మనస్సుకు అంటుకున్న గతకాలపు మాసిన చేదు జ్ఞాపకాలను ఊరవతలి కాలువ బండ కాడ ఉతికేసి శుభ్రంగా గాలికి ఆరవేసి ఓ చెట్టుకింద సేద తీరుతున్నది. అలా ఆకాశాన్ని గుండెల్లోకి ఒంపుకొని చూడగా అటు ఇటు కదలాడే […]

Continue Reading
Posted On :

లోచన …!! (కవిత)

లోచన …!! -రామ్ పెరుమాండ్ల కాలం పరిచే దారుల్లో వేసిన అడుగుల జాడలు భాష్పిభవిస్తున్నాయి.ఎడారిలో విరిసిన వెన్నెలలుచీకట్లను పులుముకున్నాయి.ఉష్ణపు దాడుల్లో దహనమైనఆశల అడవులన్నీచిగురించే మేఘాల కోసం తపిస్తున్నాయి . ఎక్కడో ఓ ఖాళీకడుపు అర్థనాధం చేస్తుంటే చెవుల్లో మోగే సంగీతపు స్వరాలు నిన్నటి కన్నీటి గాయాలకు మరుపుమందు రాస్తున్నాయి. జీవితం కూడా కాలపు వల కింద దాచిన గింజలకు ఎపుడో దరఖాస్తు చేసుకుంటది.మరిప్పుడు మరణవార్తమరణమంత మాట కాదు. నీకు గుర్తుండదు భీకరవర్షంలో తడిసి వణికినకుక్కపిల్లను తరిమేశావో,నీ మనసు వెంటిలేటర్లో కట్టిన పిచ్చుక గూడును విసిరేశావో ,ఏ పసివాని చిరునవ్వును కర్కశంగా నిలిపివేశావో గానీ నేడు మరణవార్త బోసిపోయింది. ఏదో ఒక […]

Continue Reading
Posted On :