ఇంకెంత ఇష్టమో ఈ నిజానిది? (కవిత)

ఇంకెంత ఇష్టమో ఈ నిజానిది? -చందలూరి నారాయణరావు చీకటి బాగా కాసి మనసును పులిమినప్పుడు పాత కలే చిరిగిన గుడ్డల్లో మాసిన ముఖంతో కోరిక తలుపు కొడుతూనే ఉంది. రెండు క్షణాల వయసులోనే ఇష్టం ప్రేమగా పరవశమై తన నీడనే తనే తొడుక్కుని తలలో కంటికెదురుగా లోతు ప్రశ్నలతో యుద్ధనౌకలో పొలిమేర దాకా సాగే కలవరింత వేడుకలో పరిమళిస్తూ దిక్కు తెలియకుండానే దారితో పనిలేకుండా ఆశ సువాసనతో గెంతులేసుకుంటూ గాలితో కలసి లోపల చేసే ప్రయాణంలో ఇంకెంత […]

Continue Reading
Posted On :

మా తాతదీ గుండె కోతనే! (కవిత)

మా తాతదీ గుండె కోతనే! -బాలాజీ పోతుల నా రాతలు చూసీ, ఈనికో పెద్ద నౌకరీ అస్తే, మంచిగుండనీ, మా తాత దినాం దేవులడుతడు ఆరిన, నా బతుకు దివిటీ ఎల్గించన్కి. చేత్లకు పైసరాని పని అదేం పనిరా అని కసురుకుంటడే గానీ, ఉన్నకాడికి కడుపు నింపుతడు. ఒగని కడుపుగొట్టి గాదు బిడ్డ్యా! ఆ కొట్టినోళ్లని మొకం మీద కొట్టినట్టు బతుకాలంటడు. ఏం చెప్తవే రోజూ, అని నేనంటే – ఇయ్యాల మేమున్నం, రేపట్పొద్దు ఉంటమో లేమో […]

Continue Reading
Posted On :

ఋణం తీరేలా (కవిత)

ఋణం తీరేలా -చందలూరి నారాయణరావు కాస్త చూడు కళ్ళను తలుపు తట్టి లోపలికి.. రోజూ కలలో నీ గొంతు గుర్తులే నీ చూపు స్పర్శలే… ఎక్కడికి వెళ్ళినా ఏ దూరంలో ఉన్నా రాత్రి ఒడికి చేరక తప్పదు ఏదో కల చిటికిన వ్రేలితో వేకువ దాకా నీతోనేగా మనసు కలవరింత ఒక్కో కవిత రూపంలో ఋణం తీరేలా ***** పుట్టినది: ప్రకాశం జిల్లా జె. పంగులూరు. వృత్తి: హైస్కూల్ఉపాధ్యాయులు ప్రవృత్తి: వచన కవిత్వం రచనలు: మనం కాసేపు […]

Continue Reading
Posted On :

జవాబు జాడ చెప్పడం లేదు… (కవిత)

జవాబు జాడ చెప్పడం లేదు… -చందలూరి నారాయణరావు నా కథలో అడుగుదూరంలో ఓ కొత్త పాత్ర నడుస్తున్న చప్పుడును దగ్గరగా విన్న ఇష్టం కలకు ప్రాణంపోసి…. ప్రవహించే ఊహగా పరిగెత్తె ఆశగా ఎంత వెతికినా నడక ఎవరిదై  ఉందన్న ఒక్క ప్రశ్నకు ఏ క్షణం జవాబు జాడ చెప్పడం లేదు. నెర్రెలు బారిన మోముతో పొడిబారిన కళ్లతో ఏనాడో పుట్టి పెరిగిన ఈ రహస్యమో గుండెలో దాచుకున్న సత్యంగా ఏ గాలికి కొట్టుకురావాలో? ఏ వరదకు నెట్టుకురావాలో? […]

Continue Reading
Posted On :

వేయి మాటల ఉప్పెన (కవిత)

వేయి మాటల ఉప్పెన -చందలూరి నారాయణరావు కోపానికి చీల్చుకొచ్చిన లోపలి మనిషి నోరు బయట పుట్టపలిగి వంద నాలుకల వేయి మాటల ఉప్పెన నాలుగు కళ్ళుగుండా వేలమైళ్ళ మీటవేసి మెదడును ఖాళీ చేసిన రక్తం పాదాలకి చేరి తలలో పాతపగను తాకి మొగ్గలేసిన సమస్య పచ్చని గాయమై ఎర్రగా నవ్వింది. ఆ నల్లని రోజు నిండా నిమిషానికో గాయానికి స్రవించే అరుపుల తరంగాలు చెవుల్లో పొంగి పొర్లి పక్కనున్న రోజుపై చింది పగలు చీకటి దుప్పటి కప్పుకుంటే […]

Continue Reading
Posted On :

అబద్ధమాడని నిజం (కవిత)

అబద్ధమాడని నిజం -చందలూరి నారాయణరావు నిత్యం వారిద్దరి విందులో రుచిగల మాటలు అబద్దమాడని నిజాలు ప్రియమైన వంటకాలు. ఎదుటపడని కలయికలో ఎదమాటున సంగతులు మధురంగా మైమరిపించే మనసూరించే ఇష్టాలు. నిద్రమంచానే చూపులు ముఖాల్లో ఏరులా ప్రవహించి సంతోషసారాన్ని ఇచ్చి పదునుగా ప్రవర్తించి రోజూ గుప్పెడు అనుభావాల్ని ఒకరిలో మరొకరు చల్లుకుని ముసురుపట్టి మెరుపులతో జోరుగా కురుసుకుంటారు తనివితీరా తడిసిన తలపులకు మన్ను వెన్నులో పదాల మొలకలు పుట్టపగిలి ఉదయించుకుంటారు వాక్యాల మెరుపులతో కౌగిలించుకుంటారు. కవితల విరుపులతో రెపరెపలాడతారు… […]

Continue Reading
Posted On :

చూపు చెంగున….. (కవిత)

  చూపు చెంగున….. -చందలూరి నారాయణరావు నేను అనుకోలేదు నా కవిత ఓ బంధానికి పెద్దమనిషి అవుతుందని… ఓ మనసుకు చుట్టరికంతో చిత్రాలు చేస్తుందని… ఓ సంతోషాన్ని వరంగా బలమై నిలుస్తోందని…. ఓ కదలికను పుట్టించి కలగా దగ్గరౌతుందని… ఓ కమ్మనిమాట సువాసనతో మనసు నింపుతుందని ఓ ఆనందాన్ని పంచే అందాన్ని మదికిస్తుందని…. ఎప్పుడు పుట్టిందో? ఎక్కడ పెరిగిందో? ఎలా ఎదురైందో మరి? ఇప్పుడు నాకై అనిపించేలా నాలో ఇష్టమై నా కవిత కొంగున ఆమె బంగారం. […]

Continue Reading
Posted On :

తెలియనిదే జీవితం (కవిత)

తెలియనిదే జీవితం -చందలూరి నారాయణరావు మనిషో పుస్తకం మనసో నిఘంటువు గుంపుగా చేరితే గ్రంధాలయమే. ఎప్పుడు తెరుచుండె సందడే. చదువుకుపోతుంటే కలిసేది ఎందరి ఆలోచనలనో! ఏరుకుపోతుంటే దాచుకునేది మరెందరి అనుభవాలనో! ఎంత చిన్న పుస్తకమైనా ఎంతో కొంత వెలుగే. ముద్రించిన అనుభావాలను చదువుతుంటే  సంతోషమే. కొన్ని గొప్ప గ్రంధాల్లో ప్రతి ఘట్టం ఆమోఘమే ప్రతి మలుపు ఆశ్చర్యమే అనుసరించాల్సిన యోగ్యాలే. కొన్ని దినపత్రికల్లో పొట్టి బాధలు, పొడుగు కన్నీళ్ళు ఊరిని అద్దంగా చేసి పచ్చి వింతలను వేడిగా […]

Continue Reading
Posted On :