డా.పి.విజయలక్ష్మిపండిట్ “ విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ “ (2021Feb.)వ్యవస్థాపక అధ్యక్షురాలు. వీరు దాదాపు 50 సంవత్సరాల నుండి తెలుగు సాహితీ రంగంలో వివిద ప్రక్రియల్లో- వచన కవితలు , గజళ్ళు,హైకూలు, కథలు, అనువాదాలు, విశ్లేషణ వ్యాసాలు రాస్తూ దాదాపు 32 ప్రచురణలు చేశారు. వీరి కలంపేరు “విశ్వపుత్రిక”. వీరి చదువు : Ph.D. in Education, M.A.in Distance Education , Diploma in Distance Edecation, M.Sc.Botany ,M.A. Women studies & Visharad in Hindi . వీరు డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ( హైదరాబాద్)నుండి ఫ్రొఫెసర్ గా రిటైర్ అయ్యారు . వీరి ముఖ్యమైన కవితా సంపుటాలు “మానవత్వమా ఏదీ నీచిరునామా”, “ఆకాశంలో అర్ధ భాగం”, , “నా ఆత్మ కళలు “ “ నా అక్షరాలు “. “ఏకత్వ జ్ఞానం “. దీర్ఘ కవితలు “ధరిత్త్రీ విలాపం”, “విశ్వపుత్రికను నేను విశ్వశాంతి నా ఆకాంక్ష“. వీరు “విశ్వపుత్రిక హైకూలు”, తెలుగు గజళ్ళు ‘యోగ రేఖలు , రాగరేఖలు , విశ్వరాగం, హృదయాంజలి అన్న శీర్షికలతో 4 గజళ్ళ సంపుటాలు ,”Wisdom Of Oneness “అన్న ఇంగ్లీషు ఆంథోలజి.(53 English poems) వెలువరించారు.వీరు రవీంద్రనాథ టాగోర్ “గీతాంజలి”ని తెలుగులోకి “అపూర్వ గానం” అన్న శీర్షికతో అనువదించి పలువురు ప్రముఖుల ప్రశంసలను అందుకున్నారు .”రమ్య ద రోబో “, “పేగు బంధం “అన్న కథల సంపుటాలు వెలువరించారు. వీరి 5 కవితా సంపుటాను హింది,ఇంగ్లీషు లోకి అనువదింపబడ్డాయి. వీరు అందుకున్న
ముఖ్యమైన పురస్కారాలు: పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంనుండి ఉత్తమ రచయిత్రి “కీర్తి పురస్కారం “(2021), -గీతాంజలి అనువాదం “ అపూర్వగానం”కు “గిడుగురామమూర్తి పంతులు భాషా సాహిత్య పురస్కారం (2018),-కాఫ్లా ఇంటర్నేషనల్ “సాహిత్యగౌరవ్ “ అవార్డ్ ( Oct.2016)“ India Inter Continental Cultural Association) నుండి,సి.నా.రె.పురస్కారం ( కళానిలయం సాహిత్య సేవా సంస్థ వారి (July 2024,)అమృతలత జీవన సాఫల్య పురస్కార( విద్యారంగం)May 2023, “ అరికపూడి పూర్ణచంద్రరావు “ మహిళా మణి “పురస్కారం (March 2019),-“ భారతీయ సాహిత్య అనువాద ఫౌన్డేషన్ వారి “అనువాద శిరోమణి పురస్కారం , Sep.2024,మొత్తం 20 కి పైన పురస్కారాలు అందుకున్నారు.
గజల్ సౌందర్య – 2 -డా||పి.విజయలక్ష్మిపండిట్ గజల్ సౌందర్యాన్ని ఇనుమడింప చేసేది హృదయ లోతుల్లో ఉండలేక పొంగి పొర్లి ఉప్పెనగా బయట పడే భావోద్వేగాల అక్షర స్వరూపం గజల్ . “గుండె గొంతుక తోన కొట్లాడుతాది కూర్చుండనీదురా కూసింతసేపు “.అని నండూరి సుబ్బారావు గారు ఎంకి పాటల్లో అంటారు. అదేభావం Robert Frost poem నిర్వచనంలో వినిపిస్తుంది.Robert Frost famous American poet “ A poem is “never a put-up job. … It […]
గజల్ సౌందర్యం (ఈ నెల నుండి ప్రారంభం) -డా||పి.విజయలక్ష్మిపండిట్ గజల్ అనేది ఉర్దూ భాషలో శతాబ్దాలుగా ఉనికిలో ఉన్న ఒక కవితా కళారూపం. ఇది భావోద్వేగాలు మరియు మనో భావాలను వ్యక్తీకరించడానికి ఉపయోగించే కవితా రూపం. గజల్ ప్రత్యేకమైన కవితా ప్రక్రియ ఎందుకంటే కవులు తమ తీవ్రమైన వ్యక్తిగతమైన సులభంగా వ్యక్తీకరించలేని భావోద్వేగాలను మరియు భావాలను గజల్ ప్రక్రియ ద్వారా వ్యక్తపరచగలరు. గజల్ లోని ఆ శక్తివంతమైన మరియు ఉత్తేజకరమైన గజలియత్ నిర్మాణ శైలి వల్ల గజల్ […]