తరలిపోయిన సంజ (కవిత)
తరలిపోయిన సంజ -ఉదయగిరి దస్తగిరి కాగుతున్న బెల్లంగోరింటాకు వాసనలా నేరేడి సెట్టుకింద నవ్వుతుంటే రాలుతున్న పండ్లన్నీ వేళ్ళకి నోటికి కొత్త రంగుమాటల్ని పూసేవి పొంతపొయ్యిలో కాల్చిన రొట్టెని బతుకుపాఠంలో ముంచి తినిపిస్తుంటే కాలిన మచ్చలన్నీ బెల్లమేసిన పెసరపప్పులా పచ్చగా మెరుస్తూ ఆకలిబానల్లోకి జారిపోయేవి సీకటయ్యాలకి రాత్రిని కోళ్లగంప కింద మూయాలని దంతె పట్టుకొని అరుగులెక్కి దుంకుతుంటే చెక్కభజనలో ఆడగురువులా కనిపించేది ఘల్లుమనే యెండికడియాల సందమామల్ని సూసి పూలచెట్టు జామచెట్టు కాళ్ళమ్మడి రంగు కోడిపిల్లల్లా తిరుగాడేవి ఉసిరికాయని ఉప్పుతోకలిపి […]
Continue Reading
