అపోహలూ– నిజాలూ (శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం & నెచ్చెలి-2025 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ) -యశోదాకైలాస్ పులుగుర్త “రేపటి నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ ని ప్రకటించింది మా మేనేజ్ మెంట్!” ఆఫీస్ నుండి వస్తూనే ఇంట్లో అందరికీ వినబడేటట్లుగా చెప్పింది వైష్ణవి. “ఓ, నైస్వైషూ!” ఇకనుండి పొద్దుట పొద్దుటే ఆఫీస్ వేన్ ఎక్కడ మిస్ అవుతానో అనుకుంటూ పరుగులు పెట్టనక్కర్లేదు. ఎంత మంచి వార్త చెప్పావంటూ,” భర్త పవన్, వైష్ణవి వైపు […]
ఏంచెప్పను? (డా||కె.గీత ఉత్తమ కవితా పురస్కారం & నెచ్చెలి-2025 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కవిత) – పద్మావతి రాంభక్త ఏమని చెప్పను లోలోతుల్లో మనసుకు ఉరేసే దుఃఖముడులు ఎన్నని విప్పను గోడపై కదిలే ప్రతిముల్లూ లోపల దిగబడి అల్లకల్లోలం చేస్తుంటే ఏమని చెప్పను నా మౌనానికి గల కారణాలకు రంగురంగుల వస్త్రాలు తొడిగి గాలిలోకి ఎగరేస్తుంటే ఏంచేయను నా పెదవులపై తూలిన ప్రతి పలుకును మసిబూసి మారేడుకాయను చేసి పుకారులను వీధివీధిలో ఊరేగించి కృూరంగా ఉత్సవాలు […]
బంధం (నెచ్చెలి-2024 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ) -ఎస్. లలిత “అవమానం, ఆకలి, వేదన, నిస్సహాయత, దుఃఖం- పతనానికి ఇవన్నీ సోపానాలు. దిగితే క్రిందకు వెళతాం! ఎక్కితే పైకి వెళతాం… చిత్రం ఏమిటంటే దిగేవాళ్ళే ఎక్కువవు తున్నారు..” అన్నాను నేను మిత్రుడు విశ్వనాథంతో… “ఎవరి గురించి నీవు చెప్పేది… నీవు గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్ వి. తాత, తండ్రులు సంపాదించిన ఆస్తి ఉంది. మా చెల్లి కూడా ఎం.ఎస్సీ, బీఈడీ చేసింది. టీచర్ ఉద్యోగం వచ్చినా […]
ధీర (నెచ్చెలి-2023 పోటీలో ప్రథమ బహుమతి- శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం పొందిన కథ) – బ్రిస్బేన్ శారద ఆఫీసులో నా కేబిన్లో ఎప్పట్లానే పనిలో తల మునకలుగా వున్నాను. ఈ రిపోర్ట్ శుక్ర వారం కల్లా పంపాలి. వున్నట్టుండి మీటింగ్ అలర్ట్ మోగింది. పొద్దున్న తొమ్మిదింటికి ఏం మీటింగ్? చిరాగ్గా కంప్యూటర్ మీద కేలండర్ తెరిచి చూసాను. అంజనాతో మీటింగ్! అంజన నా టీంలో ఒక యేణ్ణర్థం కింద చేరింది. పర్సనల్ మీటింగ్ రిక్వెస్టు […]