తరలిపోయిన సంజ (కవిత)

తరలిపోయిన సంజ -ఉదయగిరి దస్తగిరి కాగుతున్న బెల్లంగోరింటాకు వాసనలా నేరేడి సెట్టుకింద నవ్వుతుంటే రాలుతున్న పండ్లన్నీ వేళ్ళకి నోటికి కొత్త రంగుమాటల్ని పూసేవి పొంతపొయ్యిలో కాల్చిన రొట్టెని బతుకుపాఠంలో ముంచి తినిపిస్తుంటే కాలిన మచ్చలన్నీ బెల్లమేసిన పెసరపప్పులా పచ్చగా మెరుస్తూ ఆకలిబానల్లోకి జారిపోయేవి సీకటయ్యాలకి రాత్రిని కోళ్లగంప కింద మూయాలని దంతె పట్టుకొని అరుగులెక్కి దుంకుతుంటే చెక్కభజనలో ఆడగురువులా కనిపించేది ఘల్లుమనే యెండికడియాల సందమామల్ని సూసి పూలచెట్టు జామచెట్టు కాళ్ళమ్మడి రంగు కోడిపిల్లల్లా తిరుగాడేవి ఉసిరికాయని ఉప్పుతోకలిపి […]

Continue Reading

పరాజితుణ్ణి (కవిత)

పరాజితుణ్ణి -ఉదయగిరి దస్తగిరి రంగుపూసల్లాంటి నవ్వుల్ని ఆమె పెదవుల నుండి లాక్కుంటాను మాటకత్తినిసిరి కళ్ళలో నిద్రని హత్య చేస్తాను ఏడాదంతా శిశిర ఋతువుని శరీరమంతా పండిస్తాను వాడిన పువ్వవుతుందనుకుంటే సీతాకొకచిలుకలా నన్ను స్పర్శిస్తూ పాత ప్రేమని మాగిన పండులా గుండెకు తినిపిస్తుంది నిద్రిస్తున్న పాప పసితనాన్నంత ఒంట్లోకి వొంపి తానో పాపవుతుంది నావొడిలో ఆక్షణం గతం నీటిబుడగై నేనో ప్రేమకొలనవుతా కలువ తానై రాత్రికి వెన్నెల చిత్రాల్ని గీయిస్తూ రోజుల పేజీలని తిప్పేస్తుంది దాయాదిరాళ్ళో పొరుగింటి కొప్పులో […]

Continue Reading