మావారు డాక్టర్ జొన్నలగడ్డ రాజగోపాలరావు ప్రభావంతో కథారచనకు పూనుకున్నాను. మేమిద్దరం కలిసి వ్రాసినప్పుడు ‘వసుంధర’ మా కలం పేరు. ఎక్కువగా కలిసే వ్రాస్తుంటాం. మావారి జోక్యమున్న ప్రతి కథలోనూ ఎక్కడో అక్కడ కొన్ని సాంఘిక, రాజకీయ సంఘటనల పరమైన చురకలుంటాయి. అలా వద్దని నేననుకున్నప్పుడు వచ్చినవే కేవలం నా పేరుతో వచ్చిన కథలు. సంఖ్యలో తక్కువైనా- వాటిలోనూ చాలావరకూ పోటీల్లో బహుమతులు గెల్చుకోవడం నాకు లభిస్తున్న ప్రోత్సాహం.
ఏఐ ఏజి రాధ (నెచ్చెలి-2025 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ) -రామలక్ష్మి జొన్నలగడ్డ మనిషిలో మనీ ఉండొచ్చు, షి ఉండొచ్చు- కానీ మనిషి అంటే మగాడు. కేవలం మగాడు. మనిషిలో షి ఉండొచ్చు. కానీ మహిళ మనిషి కాదు. మనిషి అంటే కేవలం మగాడు. అంటే ఈ భూమ్మీద ఉంటున్నది మనుషులూ, మహిళలూ! వీళ్లతో స్టోన్ ఏజి దాటి, మరెన్నో ఏజిలను అధిగమిస్తూ ఇప్పుడు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు) ఏజిలోకొచ్చాం. ఏ ఏజి తరచి చూసినా- నారీజాతి […]
గ్యారంటీ (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో మొదటి బహుమతి రూ.2500/- పొందిన కథ) -రామలక్ష్మి జొన్నలగడ్డ అమ్మ అనుకున్నంతా అయింది. నేను ప్రేమలో పడ్డాను. అతడి పేరు ఉదయ్. ఆఫీసులో నా కొలీగ్. ఎక్కువగా ఎవరితో కలవడు- నాతో తప్ప. […]
స్వాభిమాని -రామలక్ష్మి జొన్నలగడ్డ ‘‘పోటీలో బహుమతికి మొదట ఎంపికైన వీణగారి కథని పక్కన పెట్టి, మరో కథని ఎంపిక చేసి పిడిఎఫ్ పంపాం. టైమెక్కువ లేదు. చదివి వెంటనే నీ అభిప్రాయం చెప్పమన్నారు సరళమ్మ. నీ ఫోనుకోసం ఎదురు చూస్తుంటాను’’ అంది పద్మజ ఫోన్లో. సరళ గవర్నమెంటు ఉద్యోగంలో రిటైరై వృద్ధాశ్రమంలో ఉంటోంది. కథలంటే ప్రాణం. ఏటా మూణ్ణెల్లకోసారి తాను గౌరవించేవారి పేరిట పోటీలు ప్రకటిస్తుంది. కథల ఎంపికకు లబ్దప్రతిష్ఠుల సహకారం తీసుకుంటుంది. వాటిలో బహుమతికి ఎంపికైన […]