చిత్రం-65 -గణేశ్వరరావు ఈ చిత్రం పేరు ‘పుష్పాలంకరణ’, 1923 లో సుప్రసిద్ధ చిత్రకారుడు దామెర్ల రామారావు – తన భార్య సత్యవాణి సీమంతం చూసాక – వేసిన చిత్రం ఇది. ప్రసిద్ధి చెందిన తన నవల ‘అతడు ఆమె’ లో డా. ఉప్పల లక్ష్మణరావు ఈ చిత్రం గురించి, చిత్రకారుడు దామెర్ల చిత్రకళ గురించి హీరో హీరోయిన్లు చర్చించటం దీర్ఘంగా రాసారు. అందమైన వేడుక కళ్ళకు కట్టే ఈ అద్భుతమైన వర్ణ […]
చిత్రం-64 -గణేశ్వరరావు కొన్ని శతాబ్దాల నుంచి Mona Llsa గమ్మత్తైన చిరు నవ్వు ..కాలాతీతమైన ఆమె ఆకర్షణ గురించి అధ్యయనం జరుగుతూనే వుంది. నిజానికి అందరినీ కలవర పరుస్తున్నది ఆమె చిత్రం కానే కాదు, ఆ చిత్రం వెనుక ఉన్న కథ! చిత్రకళా రంగాన్ని అది ఒక కుదుపు కుదుపినప్పటికీ , దాని పరిణామం 30 x 21″, బరువు 8 కిలోలే. మోనాలిసా అంటే అర్థం ‘నా లేడీ లిసా ‘ అని. ధనవంతుడైన ఆమె […]
చిత్రం-63 -గణేశ్వరరావు ఫోటో చూసారుగా? మాయా .. మంత్రమూ .. తంత్రమూ లాంటివి ఇందులో ఏమీ లేవు. ఈ టెక్నిక్ ను ‘Drostee” అంటారు. ఒక డచ్ కాఫీ ప్రకటనలో ఒకామె చేత్తో కాఫీ డబ్బా పట్టుకొని నిల్చొని వుంటుంది, ఆమె చేతిలో ఉన్న డబ్బా మీద ఉన్న చిన్న బొమ్మలో – అదే ఫోటో కనిపిస్తుంటుంది. అలా అప్పటి నుంచే ఒక ఫోటోలోని […]
చిత్రం-61 -గణేశ్వరరావు ఇటాలియన్ ఐశ్వర్య వంతురాలు, అందకత్తె Marchesa Casati చిత్రం ఇది. దీనిని 1914 లో చిత్రించిన Giovanni Boldini, ‘Master of Swish’ గా అప్పటికే ప్రసిద్ధి చెందాడు. రంగుల పళ్లెం లో కుంచెను ముంచి, దానితో కాన్వాస్ పైన ఝళిపించినట్లు, అతి వేగవంతంగా బొమ్మను గీయడం అతని ప్రత్యేకత. మిరుమిట్లు గోలిపే ఆమె అందం మన కళ్ళను చెదరగొడుతుంది. ఆత్మాశ్రయ ధోరణిలో చిత్రించిన ఈ చిత్రంలో ఆమె అధునా తన రూపాన్ని, ఆడంబరాన్ని […]
చిత్రం-60 -గణేశ్వరరావు టోనీ ప్రో, కాలిఫోర్నియాకు చెందిన చిత్రకారుడు. తండ్రి ప్రోత్సాహంతో చిన్న తనంలోనే ప్రముఖ చిత్రకారులను కలుసుకున్నాడు. స్టూడియోలను దర్శించాడు, గ్రాఫిక్ డిజైనర్ అవడం కోసం అకడమిక్ ఫిగర్ డ్రాయింగ్, పెయింటింగ్ లో శిక్షణ పొందారు. అతనివి కాల్పనిక చిత్రాలు కావు. ఊహాజనితం కావు. వాస్తవికత నిండినవి. అతను ఎప్పుడూ తన నిజ జీవితంలోని వ్యక్తులను చిత్రించాలని అనుకుంటాడు : తన అందమైన భార్య, పిల్లాడు, తన మిత్రులు, క్లబ్ […]
చిత్రం-59 -గణేశ్వరరావు మహాకాళి మాత్రమే పది కాళ్ళు, పది చేతులతో చిత్రించబడింది. మరి ఈ ఫోటోలో ఉన్నామె ఎవరు? ఆమె చేతులు ఎన్ని కనిపిస్తున్నాయి? ఏమిటి ఈ మాయాజాలం? ఈ అద్భుతాన్ని చూపిస్తున్న డాన్స్ ఫోటోగ్రాఫర్ లోయిస్ గ్రీన్ ఫీల్డ్ dance photographer గా సుప్రసిద్ధులు. సహజ సిద్ధమైన కదలికలను నిశ్చలన ప్రతిబింబాలుగా పట్టుకోవడంలో ఆమె నైపుణ్యం అపారం. నాట్యకారుల అద్భుతమైన నృత్య భంగిమల క్షణాలను […]
చిత్రం-58 -గణేశ్వరరావు స్విస్ చిత్రకారిణి ఎస్తర్ హ్యూసర్ Esther Huser) మానసిక రోగ నిపుణురాలు, Nature’s painter of photorealism. తన అభిరుచి మేరకు realistic painting వైపు దృష్టి మరలించి పేరు పొందింది, అంతర్జాతీయ బహుమతులు అందుకొంది. అత్యంత సూక్ష్మ వివరాలతో, దిగ్భ్రమ కలిగించే అందాలతో సాధారణ వస్తువులను అసాధారణంగా చిత్రిస్తుంది, ఆమె రంగుల పళ్ళెంలో మహా అయితే 5 రంగులు ఉంటాయి.. వాటి తోనే ప్రకృతి సంపదలోని .. పూలూ, మొక్కలూ, చెట్లూ, కూరల […]
చిత్రం-57 -గణేశ్వరరావు ఇది కథ చెప్పే బొమ్మ. ఈ ‘జాగరణ’ చిత్రాన్ని గీసింది యువ అలంకారిక చిత్ర కళాకారిణి జో ఫ్రాంక్. గతంలోని జ్ఞాపకాలని నెమరువేసుకుంటూ కాలంలోని ఒక క్షణాన్ని చిత్రిస్తుంది. ఆలోచన రేకెత్తించే దృశ్యాలవి ఆమె ఎంచుకున్న వస్తువులు కలుసుకుం టాయి, వాళ్ళ మథ్య మాటలు చోటు చేసుకుంటాయి. తన చిత్ర రచనలో జో ఫ్రాంక్ తాను పరిశీలించిన జీవితం గురించి కథలు చెబుతుంది. తనకు ప్రేరణ డానిష్ […]
చిత్రం-56 -గణేశ్వరరావు ఈ తైలవర్ణ చిత్రం పేరు ‘స్వప్న సౌందర్యం’, చిత్రకారుడు క్లైవ్ బ్రయంట్. వాల్ట్ విట్మన్ కవిత ‘అశాశ్వత అమరత్వం’ నుంచి స్ఫూర్తి చెంది దీన్ని గీసాడు: ఎల్ల కాలం ఏదీ వుండదు. ప్రతీదీ కాలగర్భంలో కలిసి పోవాల్సిందే. జరామరణాలు ఎవరూ తప్పించుకో లేరు. అయితే ఇక్కడో వైరుధ్యం ఉంది: కళాకారుడు మరణిస్తాడు, కాని అతను సృష్టిం చిన కళాకృతి అతని తర్వాత కూడా నిలుస్తూ అతనికి అమరత్వం కల్పిస్తుంది, తన చిత్రానికి పెట్టిన పేరులో […]
చిత్రం-55 -గణేశ్వరరావు 62 ఏళ్ళ ఇటలీ దేశస్థుడు పీయర్ బాల్యం నుంచీ బొమ్మలు వేయడంలో ఆసక్తి కనబరిచే వాడు. తన ప్రతిభను పెంచుకోవలంటే పూర్తిగా కళకే అంకితం అవ్వాలని గ్రహించాడు. ప్రకృతి మధ్య గడపడానికి ఇష్టపడేవాడు, కొండాకోనలను చుట్టివచ్చేవాడు, గుహల్లోని రాళ్ళను పరిశోధించే వాడు. అది అతడి కళ పైన ప్రభావం చూపింది. నిజానికి అతడి చిత్రాల ఉపరితలాలు కొండ రాళ్ళ గరుకుతనాన్ని గుర్తు చేస్తాయి. దాని కోసం అతను తన కాన్వాస్ లపై పాల రాతి […]
చిత్రం-54 -గణేశ్వరరావు చూశారా ఈ చిత్రాన్ని? అగస్తీనా నిజంగా అందంగా ఉందా? మీలో సౌందర్య భావాన్ని కలుగజేస్తోందా? ఇది సుప్రసిద్ధ చిత్రకారుడు విన్సెంట్ వాంగో వేసిన చిత్రం అని తెలిసినప్పుడు మన అభిప్రాయం మారుతుందా? కళలకు స్థిరమైన విలువ ఉంటుందా? టిప్పు సుల్తాన్ ఆయుధాలు, నెపోలియన్ టోపీ కొన్నికోట్లకు అమ్ముడయ్యాయి; అభిమానులు కట్టిన ఆ వెల, వాటి అసలు విలువేనా? ఇలాటి అదనపు విలువలకు ప్రమాణాలు ఏమిటి? ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన […]
స్వయంసిద్ధ (ఒక అభినేత్రి జీవనరేఖ) – గణేశ్వరరావు ఉమ్రావ్ జాన్ లో రేఖని చూసిన వాళ్ళెవరూ ఆమెని మరిచిపోలేరు. (అన్నట్టు ‘ప్రేమ’ ‘పెళ్ళి’ నిర్వచనాలు రేఖ జీవితచరిత్ర చదివాక మారిపోతాయి!) శ్రీదేవీ మురళీధర్ – యాసిర్ ఉస్మాన్ నవల ‘రేఖ-ది అన్ టోల్డ్ స్టోరీ’ ఆధారంగా రాసిన ‘స్వయంసిద్ధ’ (ఒక అభినేత్రి జీవనరేఖ) పుస్తకంలోని కొన్ని వ్యాఖ్యానాలు ముందు చదవండి. యాసిర్ పాత్రికేయుడు, రేఖ జీవితచరిత్ర […]
చిత్రం-53 -గణేశ్వరరావు ఫోటోగ్రఫీ అంటే కేవలం ఫోటోలు తీయడం కాదు, ‘అదొక సృజనాత్మక ప్రక్రియ, అనుభూతి.. అనుభవం, ప్రేరణ, ఉద్వేగం.. ఇది కళ, ఇది జీవితం! ఈ రకం ఫొటోగ్రఫీలో – ఆలోచన నుంచి ఆచరణ వరకూ అన్నిటినీ ఆస్వాదిస్తాను’ అంటాడు. మైకేల్. మైకేల్ డేవిడ్ ఆడమ్స్ న్యూ యార్క్ లో పేరు పొందిన ఫ్యాషన్ & ప్రకటనల ఫోటోగ్రాఫర్. అండర్ వాటర్ ఫోటోగ్రఫీలో ఆయన తర్వాతే మరెవరినైనా చెప్పుకోవాలి. ఆయన […]
చిత్రం-52 -గణేశ్వరరావు ‘పుష్పాలంకరణ’ కోసం అన్ని ప్రదేశాల్లో ప్రత్యేకంగా కొన్ని సంస్థలు ఉన్నాయి. . మీరు కోరుకున్న పద్ధతిలో పూలతో వేదికను …పెళ్ళి కూతుర్ని అలంకరిస్తారు, సందర్భానుసారంగా పూలతో ఏ అలంకరణ అయినా ఏర్పాటు చేస్తారు. ఈ సంస్థల సృజనాత్మక శక్తికి పరిమితి లేదు, రక రకాల రంగు రంగుల పూలను ప్రత్యేకంగా ఏర్చి కూర్చి ఒక కొత్త అందాన్ని కళ్ళ ముందు నిలబెడతారు. నవ్యతతో అందరినీ అవి ఆకర్షిస్తాయి. పూలు చెట్టుకి అందాన్నిస్తాయి, కోసిన పూలను […]
చిత్రం-51 -గణేశ్వరరావు ఎనభైవ దశకంలో సావిత్రి అనే ఒక చిత్రకారిణి మద్రాస్ లో ఉండేది. ఆమె వృత్తి రీత్యా బ్యాంకు ఆఫీసర్. ఆమె హాబీ చిత్రకళ. ఆమె ప్రత్యేకత నగ్న చిత్రాలను గీయటం, ఆ నగ్న చిత్రాలు తనవే కావడం. కొంత కాలం క్రితం వార్తలలోకి ఎక్కిన వ్యక్తీ – ఇంద్రాణి ముఖర్జీ. ఆమె తన సొంత కూతురిని అందరికీ చెల్లెలిగా పరిచయం చేసేది. Tamara de Lempicka అనే సుప్రసిద్ధ చిత్రకారిణి సావిత్రి, ఇంద్రాణి చేసిన […]
చిత్రం-50 -గణేశ్వరరావు ఇది ఒక అపురూప నీటి రంగుల చిత్రమా? Iceland ఫోటో యా? ఫోటో అయితే, ఎక్కడ తీశారు? స్విట్జర్లాండా? ఇండియాలో ఇలాటి దృశ్యాలు ఉన్నట్టు లేవే! కంగారు పడకండి. ఇది అచ్చంగా ఫోటో యే! ఇండియాలో తీసిందే .. అంతే కాదు, మన కడపలో తీసిందే, తెలుగు గంగ ఫొటోయే! ఇంత అద్భుతమైన ఫోటో ఎవరు తీసారు? ఆగండి, ఆలోచించండి.. ప్రకృతి దృశ్యాలను కెమెరాలో బంధించడం ఒక పెద్ద […]
చిత్రం-49 -గణేశ్వరరావు ఒక దానిలో రెండు ఫోటోలు, ఒకటే భావం. దీన్ని ఒకసారి కాదు, ఎన్నోసార్లు చూడాలి. పరిశీలిస్తే అంతరార్థం అవగాహనవుతుంది. అమెరికాకు చెందిన డేనియల్ ఎగ్యూయా బృందం ఆర్ట్ స్కూల్ ఇలాటి ఫోటోలు తరచూ పోస్ట్ చేస్తుంటుంది.. దీనికి పెట్టిన పేరు ‘మాతృమూర్తి’. వాళ్ళ దృష్టిలో ఇది తల్లి ప్రేమే! ఒక తల్లి పాలివ్వడం కోసం పై దుస్తులను తొలగిస్తుండగా ఒక ఫోటో తీసారు, ఇక రెండో ఫోటో సముద్రాన్ని […]
చిత్రం-48 -గణేశ్వరరావు ఇంగ్లాండ్ లో స్థిరపడ్డ ఫోటోగ్రాఫర్ ఆడమ్ బర్డ్. కి నగర జీవితం అంటే విసుగు. వీలైనప్పుడల్లా అడవికి వెళ్తుంటాడు. ఒక కాల్పనిక ప్రపంచాన్ని సృష్టించడానికి అక్కడ అనువైన ప్రదేశాన్ని వెతుక్కుంటాడు. అప్పటికే తనకు తెలిసిన కథల పైన దృష్టి పెడతాడు. తాను ఎంపిక చేసిన మోడల్స్ ను అక్కడకు తీసుకెళ్తాడు. అవసరమైన సామగ్రిని చేరుస్తాడు. ఇంచు మించు ఒక సినిమా తీసినంత సందడి చేస్తాడు. కథా నేపథ్యం వివరించి తన మోడల్స్ చేత వాటిలోని […]
చిత్రం-47 -గణేశ్వరరావు అమెరికన్ చిత్రకారిణి ఐరిన్ (Irene Georgopoulon) వస్తువుల సమూహాన్ని, మూర్తి చిత్రాలను పాస్టెల్ రంగుల్లో చిత్రిస్తుంది. పాస్టెల్ రంగుల మాధ్యమంకు మాయాజాలం ఉంది, అది వెలుతురును ప్రతిబింబచేస్తూ, చిత్రం యొక్క ఉపరితల కాంతిని ప్రసరించే టట్లు చేయగలదు. తనకు నచ్చిన వస్తువులను ఐరిన్ సొంతంగా సేకరిస్తుంది, తన సృజనాత్మక శక్తి కి వాటి నుంచి స్ఫూర్తి పొందుతుంది. అత్యంత సామాన్యమైన వస్తువు లను ప్రకాశవంతమైన మూర్తి ( స్టిల్ లైఫ్) చిత్రాలుగా రూపొందిస్తుంది. వ్యక్తుల […]
చిత్రం-46 -గణేశ్వరరావు మనసులో మాట ముందు చెప్తాను. ఈ ఫోటో నా కెంతో నచ్చింది, దాని నేపథ్యం నచ్చింది, ఫోటోగ్రాఫర్ కనబరచిన సాంకేతిక నైపుణ్యం నచ్చింది. మెక్సికో నుంచి ఒక పత్రిక వస్తుంది. అందులో అలౌకికమైన డిజిటల్ ఫోటోలు ఉంటాయి, స్వాప్నిక జగత్తులోకి తీసుకెళ్తాయి. ఫోటోల క్రిందనిచ్చే వ్యాఖ్యలు ఆ ఫోటో లకు ఏ మాత్రం తీసిపోవు. ఉదాహరణకు దీన్ని తీసుకోండి… ‘నీటిలో అమ్మాయి… ఆమె మంచు గడ్డ […]
చిత్రం-45 -గణేశ్వరరావు ‘సంపూర్ణ రామాయణం’ సినిమాలో కుంభకర్ణుడిని నిద్రలోంచి భటులు లేపే దృశ్యానికి సహజ చిత్రకారుడు బాపు అద్భుతమైన రూప కల్పన చేశారు. ట్రిక్ ఫోటోగ్రఫీ స్పెషలిస్ట్ రవికాంత్ నగాయిచ్ కు ‘గలివర్స్ ట్రావెల్స్’ సినిమా స్ఫూర్తి కలిగించే ఉండవచ్చు. ఆ చిత్రీకరణ రహస్యాలను ఎవరైనా చెప్పాలనుకున్నా చెప్పలేరు, చేసి చూపించమంటే మాత్రం చూపించగలరు. ఇక పోతే ఇది ఫోటో యే, తైల వర్ణ చిత్రం కాదు. ఫోటోగ్రఫీ లో అనూహ్యమైన సాంకేతిక […]
చిత్రం-44 -గణేశ్వరరావు ఈ బొమ్మ 19 వ శతాబ్దంలో చార్లెస్ చాప్లిన్ వేసింది. విలాసవంతమైన జీవితాలు గడిపే అందమైన యువతుల జీవన విధానాన్ని చూపిస్తూ అతడు ఎన్నో బొమ్మలు వేసాడు. శృంగారం శృతి మించిందని న్యాయనిర్ణేతలు అతగాడి చిత్రాలని నిషేధిస్తే, అతని అభిమాని నెపోలియన్ చక్రవర్తి అడ్డుపడ్డాడు. ఈ బొమ్మ నేటి కాలానికి […]
చిత్రం-43 -గణేశ్వరరావు మాఁలీ క్రేబ్ఏపిల్ కోపం, కసి నిండిన మహిళా చిత్రకారిణి. 19వ శతాబ్దపు ఉద్యమ చిత్రకారుల్లా తాను నమ్మిన విశ్వాసాలకు ప్రాచుర్యం కలిగించేందుకు తన కళను వాడుతుంది. ఫోటో-పాత్రికేయురాలిగా వివాదాస్పద అంశాల మీద దృష్టి పెట్టి అధివాస్తవికత చిత్రాలు చిత్రీకరిస్తూ Wall street అక్రమణ వీధి పోరాటంలో పాల్గొని పలు ఉద్యమాలకి దృశ్య గీతంగా మారింది – Guantanamo ఖైదీలను, లిబియా పోరాట వీరుల ను, బైరూట్ శరణార్ధులను, ఫెర్గూసన్ పోలీసుల బాధితులను నల్లని రేఖా […]
చిత్రం-42 -గణేశ్వరరావు 11వ శతాబ్దానికి చెందిన రాజరాజ నరేంద్రుడు తన కుమారునికి కన్యను వెతుకుతూ కొడుకు చిత్రాన్ని పొరుగు రాజ్యాలకు పంపి అక్కడి కన్యల చిత్రాలు తెప్పించుకొని చూసేవారట, అలా ఒక రాచకన్య చిత్రాన్ని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెని తన కోడలుగా చేసుకోటానికి బదులుగా తానే చేసుకున్నట్టు వినే ఉంటారు. ‘చంద్రహారం’ సినిమాలో చందన రాజు తన ఊహా సుందరి చిత్రాన్ని గీయటం చూసే ఉంటారు. ‘ఇది నా […]
చిత్రం-41 -గణేశ్వరరావు ఈ బొమ్మ 19 వ శతాబ్దంలో చార్లెస్ చాప్లిన్ వేసింది. విలాసవంతమైన జీవితాలు గడిపే అందమైన యువతుల జీవన విధానాన్ని చూపిస్తూ అతడు ఎన్నో బొమ్మలు వేసాడు. శృంగారం శృతి మించిందని న్యాయనిర్ణేతలు అతగాడి చిత్రాలని నిషేదిస్తే, అతని అభిమాని నెపోలియన్ చక్రవర్తి అడ్డుపడ్డాడు. రెండో బొమ్మ నేటి కాలానికి సంబంధించినది, వేసింది: లారా కసెల్( కెనడా) ఆమె చిత్రాలలో ఒక ప్రత్యేకత ఉంది, అది: గతాన్ని వర్తమానంతో కలుపుతూ గీసిన అపురూపమైన చిత్రకళా […]
చిత్రం-40 -గణేశ్వరరావు కొందరికి చనిపోయిన తర్వాత గుర్తింపు వస్తుంది, అమెరికన్ ఫోటోగ్రాఫర్ డీయన్ ఏర్బస్ (Diane Arbus) 1971లో ఆత్మహత్య చేసుకున్నాక గుర్తింపు పొందింది. ఆమె ధనిక కుటుంబంలో పుట్టింది, వాళ్ళు ఫాషన్ వస్తువులు అమ్మే వారు, అయినా ఆమె మాత్రం ఎటువంటి మేక్ అప్ వేసుకునేది కాదు, సెంట్ వాడేది కాదు, మెడలో ఒక కెమెరా మాత్రం వేలాడుతూ వుండేది. భర్త ఎలాన్ తో ఫాషన్ యాడ్స్ ఫోటోలు తీసేది. స్టూడియో పని విసుగెత్తి, ఔట్ […]
చిత్రం-39 -గణేశ్వరరావు షెరాన్ రూథర్ ఫర్డ్ రూప చిత్రకళను అధ్యయనం చేశారు. ఈ తైలవర్ణ చిత్రంలోని వనిత, కెన్యా ప్రాంతంలోని ఒక తండా నాయకుడి భార్య, తన ఫోటో తీస్తున్నప్పుడు, చిత్రం గీస్తున్నప్పుడు ఆమె విరగబడి నవ్వుతూనే ఉందట. ఈ చిత్రంలో కూడా ఆమె నవ్వు మొహాన్ని చూడొచ్చు. తన ఫోటో తీసిన షెరాన్ కు ఆమె తన మెడలోని పూసల దండ బహూకరించింది. ఆ పూసల దండలోని రంగులనే వాడి షెరాన్ ఈ చిత్రాన్ని చిత్రించారు. […]
చిత్రం-38 -గణేశ్వరరావు కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ’ కాదేదీ కవితకు అనర్హం అని శ్రీ శ్రీ అంటే, ‘రాయి, సీసా, గాడిద, చెప్పులు’ మీద కూడా కవితలను ఇస్మాయిల్ వినిపిస్తే, ‘ ఏం కథ మట్టుకు వెనకబడిందా?’ అంటూ వాటి మీద రావి. శాస్త్రి కథలు రాసి పారేశారు. ‘కథలు ఇలా ఉండాలి’ అనీ ఒకరంటే ‘కథలు ఇలా కూడా రాయొచ్చు’ అని మరొకరంటారు.ఎవరి జీవితాలు వారివి, ఎవరి అనుభవాలు వారివి అన్నట్లు కళలు కూడా ఏదో […]
చిత్రం-37 -గణేశ్వరరావు 19 వ శతాబ్దానికి చెందిన జేమ్స్ మెక్నీల్ విజ్లర్ వేసిన ఈ సమస్యాత్మక తైలవర్ణ (నలుపు-బూడిద రంగు) చిత్రం ‘చిత్రకారుడి తల్లి’ మోనాలిసా లాంటి చిత్రాల్లా ప్రపంచ ప్రసిద్ధి గాంచిoది.. సీదా సాదాగా కనిపిస్తున్న ఈ చిత్రం విలువ 700 కోట్ల రూపాయలు. అమెరికా అధ్యక్షుడు ఈ చిత్రం చూడడం కోసం ప్రత్యేకంగా ఒక ప్రదర్శనకు వెళ్ళాడు, అమెరికా ప్రభుత్వం దీన్ని సంస్కృతి సంపద గా భావించి ఒక […]
చిత్రం-36 -గణేశ్వరరావు ఇది తైలవర్ణ చిత్రం అనుకుంటున్నారా? నేను అలాగే అనుకున్నాను. మిమ్మల్ని తప్పు పట్టను. తర్వాత తెలిసింది. ఇది ఫోటో అని. ఈ ఫోటో నా కంట పడగానే ఆశ్చర్యంతో ఒక్క క్షణం నోట మాట రాలేదు. ఒకటి రెండు.. . ఫోటోలను బ్లెండ్ చేస్తుంటారని తెలుసు. ఈ ఫోటోలో మాత్రం కొన్ని ఫోటోలు కలిసిపోయి, ఒక అధివాస్తవికత తైల వర్ణ చిత్రంలా అయింది ! దీన్ని ఎన్నో కోణాల నుంచి చూసినప్పుడు గాని, అది […]
చిత్రం-35 -గణేశ్వరరావు కలలు నిజమౌతాయా? కల ఆధారంగా పరిశోధన జరిపి ఓ హత్య కేసుని ఛేదించ వచ్చా? దర్శకుడు తాను కన్న కల ‘118’ తో కలలపై కొత్త అవగాహన కలిగించే ప్రయత్నం చేశాడు. . సినిమావాళ్ళకి కలలు అవసరమేమో కానీ జనం పనులు మానేసి పగటి కలలు కంటూ కూర్చుంటారా? మహా అయితే దీపూ పాడిన ‘కళ్ళకు ఒత్తులు వెలిగించి కలలకు రెక్కలు తొడిగించి గాలిలో తేలుతూ ఉంటున్నానే’ పాట వినమంటే వింటారు. కలలు మనస్తత్వంతో […]