కథా మధురం విడాకుల సమస్యకి కొత్త పరిష్కారం సూచించిన ఓ స్త్రీ కథ ‘జింబో’ (రాజేందర్) గారి ‘ఆమె కోరిక ‘ ! -ఆర్.దమయంతి ‘ If divorce is like death, then is not the perpetuation of divorce a kind of murder? ‘ ― Anthony Marais డైవోర్స్! వైవాహిక జీవితం లో సామాన్య స్త్రీల నుంచి సెలెబ్రెటీ వుమెన్ వరకు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలలో ఇప్పుడు ‘విడాకులు..’ […]
కథా మధురం సయ్యద్ సలీం ‘ యంత్రం లాంటి ఓ ఇల్లాలి గుండె చప్పుడు వినిపించిన కథ.. ‘ -ఆర్.దమయంతి సూర్యుడు లేకపోయినా పగలు గడుస్తుంది కానీ, ఇల్లాలు పడుకుంటే ఒక్క క్షణం కూడా ఇల్లు నడవదు. ఇది జగమెరిగిన సత్యం. ప్రతి స్త్రీ అనుభవించి మరీ తెలుసుకునే జీవన సత్యం. వివాహమైన క్షణం నించి..చివరి శ్వాస దాక ఎడతెరిపిలేని కుటుంబ బరువు బాధ్యతల ను మోసేది ఇల్లలే. చాలా మంది మగాళ్ళు అంటుంటే వింటాను. ‘ […]
కథా మధురం జొన్నలగడ్డ రామలక్ష్మి ‘ మహిళకి తన చదువే తనకు రక్ష …’ అని చాటి చెప్పిన కథ – ‘నారీసంధానం! ‘ -ఆర్.దమయంతి ఆడపిల్లకి చదువు చెప్పించడం కంటెనూ, పెళ్ళి చేసి పంపేయడమే అన్ని విధాలా శ్రేయస్కరమని భావించే తల్లు లు ఆ కాలం లోనే కాదు, ఈ కాలం లోనూ వున్నారు. గ్రామాలలో అయితే ఇలా తలబోసే వారి సంఖ్య అధిక శాతంలో వుంటుందని చెప్పాలి. అయిన సంబంధం సిద్ధం గా వుంటే […]
కథా మధురం రాధ మండువ ‘ప్రేమించడం స్త్రీ బలహీనత కాదు..’అని చాటి చెప్పిన కథ ‘అంతర్మధనం’ -ఆర్.దమయంతి స్త్రీ – మగాణ్ని ఎందుకు ప్రేమిస్తుంది? అనే ప్రశ్నకు జవాబు దొరకొచ్చేమో! కానీ, ప్రేమించి ఎందుకు మోసపోతుంది? అనే ప్రశ్నకు మాత్రం..ఊహు. జవాబు వుండదు. జీవితం లో తిరిగి కోలుకోలేని ఆ అగాథ వ్యధ ఏమిటో ఆమెకి మాత్రమే తెలుస్తుంది. ప్రేమ లో మోసపోవడం అనేది అన్నిరకాల బాధల్లాంటి బాధ కాదు. సన్నిహితుల ఓదార్పుతో ఊరడిల్లే నష్టం కాదిది. […]
కథా మధురం అల్లూరి గౌరీ లక్ష్మి మూడు తరాల స్త్రీల మనోభావాల ముప్పేట కలనేత ఈ కత! -ఆర్.దమయంతి వొంట్లో నలతగా వున్నా, మనసు లో కలతగా వున్నా, కాపురంలో కుదురు లేకున్నా..విషయాన్ని ముందుగా అమ్మకి చెబుతాం. అమ్మ అయితే అన్నీ అర్ధం చేసుకుంటుంది. ‘అయ్యో తల్లీ ‘ అని జాలి పడుతుంది. ఓదారుస్తుంది. వెంటనే రెక్కలు కట్టుకుని వాలుతుంది. ‘ఇక నీకేం భయం లేదు. నిశ్చింతగా వుండు.’ అంటూ కొండంత అండగా నిలుస్తుంది. కష్ట సమయం […]
“చిరునవ్వు” (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) -వురిమళ్ల సునంద “చిరునవ్వు వెల ఎంత.. మరుమల్లె పూవంత మరుమల్లె వెల యెంత? వెల లేని చిరునవ్వంత”.. ఎంత చక్కని పాట ఇది. ఎంత బాగా రాశాడో కదా కవి… అలాంటి వెలలేని చిరునవ్వు పంచడానికి ఎందుకో అంత ఇబ్బంది తనకు.. అంత అందమైన ముఖం మీద ఎప్పుడూ ముటముటలాడే భ్రుకుటి ముడులే. లేత గులాబీ లాంటి పెదాలకెప్పుడూ బిగింపుల తాళమే.. అదేమిటో తానెంత కసిరి విసిరినా […]
కథా మధురం బులుసు సరోజినీ దేవి పరకాంతలని వేటాడే మగాళ్ళ దుష్ట కన్నుకు సర్జరీ చేసిన కథ – కన్ను! -ఆర్.దమయంతి ఆరంభం : ఆమె భర్త – సంసార నావ నడుపుతున్నాడు. ఎలాటి ఒడిదుడుకులు లేకుండా, ప్రయాణం – ఎంతో సాఫీగా, హాపీ గా సాగిపోతోంది. ఆ సంతోషం లో ఆమె అలా ఆదమరచి ఓ కునుకు తీసిందో లేదో, పీడ కలకి మెలకువ వచ్చింది. కళ్ళ ముందు బీభత్సం..తుఫాను కి నావ కంపించిపోతోంది. ‘ఏమండీ’ […]