అంతర్జాతీయ స్థాయిలో స్త్రీలకు సంబంధించిన  సాహిత్యాన్నీ, అభ్యున్నతిని, గెలుపుల్ని, స్ఫూర్తిదాయకమైన అనేక అంశాల్ని పరిచయం చెయాలన్న ఆలోచనకి ప్రతిరూపమే 
‘నెచ్చెలి’ అంతర్జాల వనితా పత్రిక. 

ఇంగ్లీషు భాషలో రచనలు చేసేవారికి ప్రత్యేకంగా “Neccheli-English” శీర్షిక అవకాశం కల్పిస్తుంది.

‘నెచ్చెలి’ లో- 

  • స్త్రీలకు సంబంధించిన రచనలు (పురుషులు రాసినవైనా) 

  • లబ్ద ప్రతిష్టులతో బాటూ, మంచి వ్యక్తీకరణ ఉన్న కొత్త రచయిత(త్రు)ల రచనలు  

  • ప్రపంచంలోని ఏ భాష నించైనా తెలుగు, ఇంగ్లీషులలో అనువాదాలు  

  • సాహిత్యంతో బాటూ స్త్రీల ఔన్నత్యానికి సంబంధించిన ఏ అంశాన్ని గురించైనా వివరించే 

రచనలకు సదా ఆహ్వానం!

ఏ విషయంగానైనా ‘నెచ్చెలి’ ని సంప్రదించాలనుకుంటే నేరుగా editor.neccheli@gmail.com  కు ఈ -మెయిల్ పంపండి. 

సంస్థాపకులు & సంపాదకులు

నెచ్చెలి గీత  (డా||కె.గీత)

ఉప సంపాదకులు

నెచ్చెలి రత్నాకర్  (రత్నాకర్  అవసరాల)

సాంకేతిక సహాయకులు

నెచ్చెలి శాంతి 

నెచ్చెలి సాహితి 

17 thoughts on “నెచ్చెలి గురించి”

  1. డా.గీతగారూ నమస్తే.!
    జూన్. నెల నెచ్చలి . సంపాదకీయంలో మరుపు గురించి మరచి పోకూడనివాటిగురించి అద్భుతంగా వ్రాసారు .నిజమే !మరచిపోకూడని వారే ఆవిషయాలు మరచిపోతుంటే మనకర్తవ్యంగా ఏమిచెయ్యాలో చక్కగాచెప్పారు అభినందనలు .

    1. విశాలాక్షి గారూ! సంపాదకీయం మీకు నచ్చినందుకు, అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు.

  2. నెచ్చెలి పత్రిక ఆశయాలు స్త్రీల సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసే విధంగా ఉన్నాయి.

    1. అర్హమైనవి తప్పకుండా ప్రచురిస్తాం. ఈ-బుక్స్, వీడియోల లింకులు మాత్రమే పంపించాలి. వీటితో బాటూ రచయిత/త్రి ఫోటో, ఇక చిన్న పారాగ్రాఫులో వివరాలు, ఈ-మెయిల్ ఐడి కూడా తప్పనిసరిగా జతచెయ్యాలి. ప్రత్యేకించి ఈ-బుక్ తో బాటూ రచన కవర్ పేజీ ఇమేజ్ కూడా పంపాలి. ఈ-బుక్ లింక్ గానీ, వీడియో గానీ పరిశీలనకు ఒక్కటి మాత్రమే పంపాలి. ప్రచురించేందుకు అర్హమైనవైతే తెలియపరుస్తాం.

  3. పుస్తక సమీక్షకు పిడిఎఫ్ ఫైలు పంపితే సరిపోతుందా…

  4. నెచ్చెలి పత్రికను ప్రతి నెలా ఎలా చూడవచ్చు. దయచేసి web address ఇవ్వగలరు.

    1. నమస్కారమండి.నేను భారతి. నేను నెచ్చెలి చదవాలనుకుంటున్నాను.నా email address ఇస్తున్నాను.

      1. ప్రతీనెలా నెచ్చెల చదవాలనుకుంటున్నాను. పంపగలరా

          1. అది కాదండీ, మీరు పత్రికను మా ఇంటికి పంపడానికి, మేం మీ పత్రికాఫీసుకు వచ్చి చదవడానికి తేడా ఉంది కదా?

            1. పార్వతి గారూ! నెచ్చెలి ఆన్ లైన్ పత్రిక మాత్రమే. మీకు నెలనెలా పత్రిక విడుదల కాగానే లింకు మీకు చేరాలంటే మీ ఈ- మెయిలుతో ఫ్రీగా “Subscribe” చేసుకోవచ్చు. ఒకసారి Subscribe చేసుకున్నదగ్గర్నించి మీకు నెచ్చెలి పత్రిక ఈ- మెయిలుకి వస్తుంది.

      2. భారతిగారూ! నెలనెలా పత్రిక విడుదల కాగానే లింకు మీకు చేరాలంటే మీ ఈ- మెయిలుతో ఫ్రీగా “Subscribe” చేసుకోవచ్చు. ఒకసారి Subscribe చేసుకున్నదగ్గర్నించి మీకు నెచ్చెలి పత్రిక ఈ- మెయిలుకి వస్తుంది.

    2. విజయగారూ! నెలనెలా పత్రిక విడుదల కాగానే లింకు మీకు చేరాలంటే మీ ఈ- మెయిలుతో ఫ్రీగా “Subscribe” చేసుకోవచ్చు. ఒకసారి Subscribe చేసుకున్నదగ్గర్నించి మీకు నెచ్చెలి పత్రిక ఈ- మెయిలుకి వస్తుంది.

Leave a Reply to mala kumar Cancel reply

Your email address will not be published.