ఇంద్రగంటి జానకీబాల గారు ప్రముఖ రచయిత్రి, గాయని. వీరు ఆరు కథాసంపుటాలు, పన్నెండు నవలలు, ఒక కవితా సంపుటి ప్రచురించారు. సినీనేపథ్య గాయనుల జీవిత విశేషాలతో కూడిన పరిశోధన గ్రంథం "కొమ్మా కొమ్మా కోయిలమ్మా" వంటివెన్నో వెలువరించారు. జానకీబాల గారు డిసెంబరు 4, 1945న రాజమండ్రిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీ సూరి రామచంద్రశర్మ, శ్రీమతి లక్ష్మీనరసమాంబ. వీరు తణుకులోని సీతామహాలక్ష్మి జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తిచేశారు. 1966లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగంలో చేరారు. సాహితీ ప్రముఖులైన శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారి మూడో కుమారులు ప్రముఖ కవి, విమర్శకులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు వీరి భర్త. వీరి కుమారులు శ్రీ ఇంద్రగంటి మోహనకృష్ణ, కుమార్తె శ్రీమతి ఇంద్రగంటి కిరణ్మయి ప్రముఖ సినీదర్శకులు. ఉద్యోగరీత్యా విజయవాడలో పాతికేళ్లపాటు నివసించారు. 1991లో ఉద్యోగ విరమణ చేసి హైదరాబాద్లో స్థిరపడ్డారు. వీరు ప్రముఖ ఆకాశవాణి లలిత సంగీత కళాకారిణి. లలితగీతమాలిక , శివాక్షరమాల కేసెట్లు విడుదల చేశారు. ఈటీవీ-2లో "పాటలపాలవెల్లి" కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు సినిమా పాటలపై పదలహరి సంగీతకార్యక్రమాన్ని రేడియోస్పందనలో నిర్వహించారు. సంగీత, సాహిత్యరంగాల్లో విశేష కృషిచేసిన జానకీబాల గారిని పలు పురస్కారాలు వరించాయి. "కనిపించే గతం" నవలకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం, కథారచయిత్రిగా రంగా-జ్యోతి పురస్కారం, జ్యోత్స్నా పీఠం సంస్థ నుంచి కథారచయిత్రిగా జ్యోత్స్నాపీఠం పురస్కారం మొ.వి
వెనుకటి వెండితెర-7 కన్యాశుల్కం -ఇంద్రగంటి జానకీబాల ఆధునిక తెలుగు సాహిత్యంలో ‘కన్యాశుల్కం’ నాటకానికి ప్రత్యేక స్థానముంది. అది ఒక నాటకమే అయినా సాహిత్యం లోవున్న అన్ని ప్రక్రియల్ని తలదన్ని నిలబడటం అంటే సామాన్య విషయం కాదు. ఒకానొక సమయంలో ఆడ పిల్లల్ని కన్యాశుల్కం పేరు తో డబ్బులు తీసుకొని, పెళ్లి కొడుకు ముసలి వాడైనా మూర్ఖుడైనా ఆడ పిల్లల్ని అమ్మేయడం అనే దుష్టసంప్రదాయం వుండేది. అది కూడా ఆంధ్ర దేశానికి తూర్పున వెళ్తుంటే ఇలాంటి దుర్మార్గం – […]
వెనుకటి వెండితెర-9 చక్రపాణి (1954) -ఇంద్రగంటి జానకీబాల మనిషి జీవితంలో హాస్య రసానికి ఒక ప్రధానమైన పాత్ర ఉంది. రకరకాల సమస్యలతో బాధలతో, ఇబ్బందులతో విసిగి పోయినపుడు, కాస్తంత హాయిగా నవ్వుకుంటే బాగుండుననిపిస్తుంది ఎవరికైనా. కానీ అది తెచ్చి పెట్టుకుంటే వచ్చేది కాదు అలవోకగా వచ్చి, ఆనందంగా నవ్వుకునేలా చెయ్యాలి. అలా సహజంగా ఉన్నన్నప్పుడే అది మనసుల్ని తేలిక పరుస్తుంది. భరణీ వారి మొదటి చిత్రం రత్నమాల. తర్వాత లైలామజ్ను, ప్రేమ, చండీరాణీ లాంటి చిత్రాల నిర్మాణం […]
భారతదేశ సంగీత వినీలాకాశంలో నిలిచిన మహోన్నత ధృవతార లతామంగేష్కర్ -ఇంద్రగంటి జానకీబాల శ్రుతి లత – లత శ్రుతి అన్నారు బడేగులాం అలీఖాన్ – అంతటి గొప్ప సంగీత కారుడు – విద్వాంసుడు, గాయకుడు మహోన్నత వ్యక్తి లతా మంగేష్కర్ గురించి చెప్పిన మాటలు నిజంగా సరస్వతిదేవి నాలుక నుంచి జాలువారిన సంగీతాక్షరాలు. లతా మంగేష్కర్ కారణజన్మురాలు. అలాంటి మహా వ్యక్తులు, కళాకారులు మళ్ళీ మళ్ళీ పుట్టరు. ఏ దేశంలోనైనా అలాంటి జన్మ జీవితం అపురూప సందర్భాలే- […]
వెనుకటి వెండితెర-6 వెలుగు నీడలు -ఇంద్రగంటి జానకీబాల 1950 ల తర్వాత తెలుగులో మంచి సినిమాలు తీసిన సంస్థలలో అన్నపూర్ణా పిక్చర్స్ ఒకటి అప్పటికే విజయా, వాహిని, భరణి లాంటి సంస్థలు కొన్ని ప్రయోగాలు చేస్తూ, సహజ సిద్ధమైన కథలతో సినిమాని రూపొందిస్తూ ప్రేక్షకుల్లోనూ, పరిశ్రమలోనూ మంచి గుర్తింపు పొందుతూ, ఆర్థికంగా కూడా విజయాలు చే చిక్కించుకుంటున్న సమయం అది. ఒక మంచి కథ, అందులో ఆదర్శం సమాజానికి స్ఫూర్తి కలిగించే నీతి సహజత్వం వుండేలా చూస్తున్న […]
వెనుకటి వెండితెర-5 -ఇంద్రగంటి జానకీబాల అక్కినేని నాగేశ్వరరావు గారు నటుడిగా బాగా స్థిరపడి, ప్రేక్షకుల్లో అబిమానం సంపాదించి, అతను కనిపిస్తే సినిమా కోసం జనం ఉషారుగా పరుగులు పెట్టే స్థితికి చేరుకున్నాక, చిత్ర నిరామణంలోకి అడుగుపెట్టారు. 1944 లో సినీ రంగప్రవేశం చేసిన యన సుమారు పదేళ్ళు నటులుగానే కొనసాగారు. అప్పట్లో మంచి అభిరుచి, సినిమాపట్ల గొప్ప ఆరాధన, ఆదర్శం ర్పరచుకున్నారు. సినిమా అంటే దాని కొక అర్థం, సార్థకత వుండాలి. సమాజాన్ని ప్రతిఫలించేదిగా వుండాలని భావించి […]
వెనుకటి వెండితెర-3 పెళ్ళిచేసి చూడు (1952) -ఇంద్రగంటి జానకీబాల రకరకాల భావోద్వేగాలు, ఆదర్శాలు, కళారాధన, కాల్పనిక ఊహలూ గల మంచి మంచి దర్శకులు సినిమాపట్ల ఆకర్షితులై, తెలుగు సినిమాల్లోకి వచ్చారు. సినిమా తీయాలంటే ఆలోచనలు, అభిరుచీ వుంటే చాలదు. డబ్బు బాగా పెట్టుబడి పెట్టగల ధనవంతులు కూడా వుండాలి. సినిమా అనేది ఒక లాటరీలాంటిదే గ్యారంటీగా డబ్బు తిరిగి వస్తుందని ఎవ్వరూ చెప్పలేరు. సినిమా ప్రేక్షకుడికి నచ్చాలీ, డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని సినిమాహాల్లోకి రావాలి. అదీ […]
వెనుకటి వెండితెర-2 -ఇంద్రగంటి జానకీబాల స్ఫూర్తి పొందాల్సిన అవసరం నిజమైన మేధావులు-సంఘం పట్ల అవగాహన, సానునభూతి వున్నవారూ – తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చి పనిచేయడం మొదలుపెట్టిన కాలం 1950 నుంచి 1960. అప్పుడు వున్న సినిమా చరిత్రను పరిశీలిస్తే – ఎల్.వి. ప్రసాద్- పి. పుల్లయ్య- సి. పుల్లయ్య- కె.వి. రెడ్డి, బి.ఎన్. రెడ్డి లాంటి సుప్రసిద్ధ దర్శకులు కనిపిస్తారు. వారెప్పుడూ మంచి కథల కోసం వేట సాగించేవారు. కథలు ఇతర భాషలవైనా, అది సినిమాగా […]
వెనుకటి వెండితెర-1 -ఇంద్రగంటి జానకీబాల తెలుగువారు చాలా తెలివైన వారు, కార్యశూరులు, ఉత్సాహవంతులు, ధైర్యం కలవారు అని చెప్పడానికి మనకి చరిత్రలో చాలా సందర్భాలే స్ఫురణకొస్తాయి. ముఖ్యంగా సినిమా నిర్మాణం విషయంలో మన పెద్దలు చాలామందికంటే ముందు వున్నారని చెప్పుకోక తప్పదు. భారతీయ చలనిత్ర నిర్మాణంలో టాకీ (మాట్లాడే సినిమా) వచ్చిందనగానే తెలుగులోనూ టాకీలు తీయాలని ఉత్సాహపడి ప్రయత్నాలు మొదలుపెట్టినవారిలో దక్షిణాదిని తెలుగువారు మొదటివారు. 1931లోనే హెచ్.ఎమ్. రెడ్డిగారు తెలుగు సినిమా నిర్మాణ కార్యక్రమం మొదలుపెట్టారు. సినిమా […]