రచనలు:పల్లె ముచ్చట్లతో ఇప్పడి వరకు 25వ్యాసాలు,(కరీంనగర్ జిల్లా మాండలికం లో) కవితలు,స్త్రీ వాద వ్యాసాలు, 10 సమీక్షలు. నా వ్యాసాలు అన్ని తెలంగాణ వాణి దినపత్రికలో, మొలక న్యూస్ పేజీ లో ప్రచురితం అయినాయి. నా సమీక్షలు శాతవాహన మాస పత్రికలో,తెలంగాణ వాణి దిన పత్రికలో ప్రచురితం అయినాయి. చలం గారి సాహిత్యం పై రెండు సమీక్షలు రాయడం జరిగింది. పుట్టిన ఊరు.నారాయణపూర్, మం౹౹సుల్తానాబాద్, జి౹౹పెద్దపల్లి.
మేలుకొలుపు( సమీక్ష) -సరోజన బోయిని జనజీవన జాగృతం ఈ మేలుకొలుపు కవనం.కారుణ్యం వీడిన కఠిన హృదయాలకు ఒక మేలుకొలుపు గీతం. మనిషి శాశ్వతంగా మహిని నిలువడని తెలిసికొనక, మానవత్వాన్ని మరిచిన మనుషులకు ఇదొక మేలుకొలుపు శ్లోకం. మానవీయ విలువల పెంపుకై, మానవతా వాద దృక్పథంతో కూకట్ల తిరుపతన్న రాసిన వచన కవితా సంపుటియే మేలుకొలుపు. ఈయన రాసిన ప్రతి కవితా సంపుటిలోను స్త్రీవాదాన్ని చాలా బలంగా వినిపించాడు. స్త్రీల ఆంతరంగిక ఆవేదనను అక్షరీకరిస్తూనే, సమానత్వ సాధన కొరకు అసువులు ధారవోసిన అబలల జీవితాన్ని గురించి ఆర్ద్రంగా […]
దళిత స్త్రీ ల శ్రమ జీవన దర్పణం “రాయక్క మాన్యం” -సరోజన బోయిని జూపాక సుభద్ర గారి కలం నుండి వెలువడిన ఆణి ముత్యాల లాంటి 17 కథల సంకలనం..ఈ “రాయక్క మాన్యం” పుస్తకం. జూపాక సుభద్ర గారు నాకు పెద్దగా పరిచయం లేకపోయిన..వారి ఇతరత్రా రచనల పై కూడ అవగాహన లేక పోయిన..మహిళలు రాసిన పుస్తకాలపై సమీక్ష రాయాలి అన్న నా తపనను చూసి..మా ఆత్మీయ సోదరి జ్వలిత గారు మహిళలు అన్నింటా ముందు ఉండాలి అని మహిళల ఆత్మాభిమానానికి పెద్ద పీట వేస్తూ..ఇప్పుడు,ఇప్పుడే […]