1974 లో చిన్న చిన్న స్కెచెస్ ద్వారా ప్రారంభించిన నా రచనా వ్యాసంగం మధ్య, మధ్య అనేక కారణాలతో ఆగిపోతూ ఈ రోజు వరకు సాగుతున్నది. చందమామ అనే స్కెచ్ ద్వారా మొలకెత్తిన నా సాహిత్య వృక్షం కధలు, రేడియో నాటకాలు, రంగస్థల నాటకాలు టివి సీరియల్స్, టెలి ఫిలిమ్స్ నవలలు, కాలమ్స్ , కవితలు అనే వివిధ ప్రక్రియలు తో విస్తరించి అనేక బహుమతులు, పురస్కారాలతో ఫలమంతమైంది. సుమారు మూడు వందల కధలు, వంద పైగా నాటకాలు, 23 నవలలు, అనేక కాలమ్స్, నాలుగు టివి సీరియల్స్, ఐదు టెలి ఫిలిమ్స్ నా ఖాతాలో చేరాయి. అనేక కధలు, నవలలు కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లోకి అనువదించబడ్డాయి. జీవితాన్ని పరిశీలించి అనుభవించి రాయాలన్నది నా ఆశయం.. ఊహలకు దూరం ....
నేలరాలిన నక్షత్రం -అత్తలూరి విజయలక్ష్మి “ మేడమ్! ఆండ్రి అసలు పేరు, ఆమె జీవితం మొత్తం మీకు తెలుసు కదా! మీరు ఆమెకి మంచి ఫ్రెండ్ అని కూడా చెబుతున్నారు చాలా మంది. ప్లీజ్ ఆమె గురించి చెప్తారా! హాలీవుడ్ పోర్న్ స్టార్ ఇక్కడ మన హైదరాబాద్ లో ఇలా అవడం వెనుక కారణం ఏంటి? “ రాహుల్ సొల్యూషన్ సి.ఈ. వో మహిత ఛాంబర్లో ఆమె ముందు కూర్చున్న ప్రముఖ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ధ్వని అడిగింది. […]
జీవితమే సఫలమా! -అత్తలూరి విజయలక్ష్మి “ఇవాళ గోంగూర పప్పు చేయండి..” కాగితాలలోంచి తలెత్తకుండా చెప్పింది సుబ్బు అని ముద్దుగా పిలవబడే సుబ్బలక్ష్మి. ఆకుకూరల వాడి అరుపుతో వీధిలోకి వెళ్ళబోతున్న బాలకృష్ణ మండిపడుతూ చూసాడు భార్యవైపు. ఇది పెళ్ళామా! చచ్చి తనమీద పగ సాధించడానికి పిశాచిలా వచ్చిన ఆత్మా! కసిగా అనుకుంటూ విస, విసా వెళ్లి నాలుగు గోంగూర కట్టలు, నాలుగు పాలకూర కట్టలు, నాలుగు తోటకూర కట్టలు తెచ్చాడు. అన్నీ కలిపి ఓ బోకే లాగా పట్టుకుని […]